(వస్తువు యొక్క యధార్ధస్థితికి విపరీతమైన జ్ఞానముండుటవలనకలుగునది తమోగుణము. పపర్య యజ్ఞానము కలుగుటకు కారణమైనది - ప్రమాదము, ఆలస్యము, నిద్ర - వీటికి కారణమైనదగుటవలన వాటి ద్వారా మనుష్యుని బంధించును).
(వస్తువుయొక్క యధార్ధజ్ఞానము నావరించి విపరీతజ్ఞానము కలుగుటకు కారణమగుటవలన తమము కర్తవ్యవిషయముకన్న విపరీతమైన పనిలో ప్రవృత్తి కలుగచేయును).
(జ్ఞానము సత్వగుణము వలనకలుగు వివేకము - దానిని కప్పిపుచ్చి తమోగుణము తన ఆవరణశక్తిచేత ప్రమాదము కలిగించును).
ప్రమాదాలస్య నిద్రాభిస్తన్నిబధ్నాతి భారత|
జ్ఞానమావృత్యతు తమః ప్రమాదే సంజయత్యుత |
రజస్తమశ్చాభి భూయ సత్వం భవతి భారత |
రజః సత్త్వం తమశ్చైవతమః సత్వం రజస్తదా |
అప్రకాశో (అ)ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవచ |
తమస్యే తాని జాయంతే వివృద్ధే కురునందన |
రజసి ప్రలయం గత్వా కర్మసంగిషు జాయతే |
తధా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే ||“. (శ్రీమద్భగవద్గీత - 14 - 8, 10. 13,15)
(తమోగుణము అజ్ఞానమువలన కలిగి జనులను మోహింపచేయును. ప్రమాదము, ఆలస్యము, నిద్ర కలుగచేసి దేహిని బంధించుచున్నది, జ్ఞానమునావరించి ప్రమాదమును (పొరపాటును) కలుగచేయుచున్నది. సత్వగుణమును, రజోగుణమును తిరస్కరించి తమోగుణము వృద్ధిపొందును. తమోగుణము మిగిలిన రెండు గుణములకన్న వృద్ధిపొందినయడల అవివేకము, అప్రయత్నము, ప్రమాదము (తప్పులుచేయుట), మోహము వృద్ధి పొందును. తమోగుణము వృద్ధిపొందియుండగ మరణించిన పశువు మొదలగు మూఢజన్మములనొందును).
తమసి ప్రవృద్ధౌమృతః మూఢయోనిషు సూకరాది యోనిషు, పశ్వాది యోనిషు జాయతే|.(తమోగుణము వృద్ధిపొందగా చనిపోయినవాడు మూఢ జన్మలను (పంది, కుక్క మొదలగు పశుజన్మలను పొందును).
“తామసాః - జఘన్యగుణ వృత్తిస్థాః ఉత్తరోత్తర నికృష్ట తమోగుణవృత్తిషు స్థితా అధోగచ్ఛంతి - అంత్యత్వం, తతః తిర్యక్త్వ్యం, తతః క్రిమికీటాది జన్మ, స్థావరత్వం తతోపి గుల్మలతాత్వం, తతశ్చ శిలాకాష్ట లోష్ట తృణాదిత్వం గచ్ఛంతి” (శ్రీరామానుజః)
(తామసగుణముకలవారు - ఇతరులను చంపెడి గుణముగలవారు - ఒకదానికన్న ఇంకొకటి అధికమగు తామస గుణములుకలవారు - నీచజన్మలనెత్తుదురు. అనగా, అంత్యజాతిలో పుట్టుట, జంతువులుగాను, తర్వాత పురుగు మొదలగునవిగాను, చెట్లు చాములుగాను, లతలుగాను, ఱాయి, కర్రగాను, గడ్డిపోచగాను పుట్టుదురు).
“తమోగుణంబువలన ఆకాశాది భూత పంచకము పుట్టు” (వివేకచింతామణి - పరమానందతీర్థ)
ప్రకృతియొక్క సత్వరజస్తమోగుణములను త్రిగుణములలో నొకటి.
(vastuvu yokka yadhārdhasthitiki viparītamaina jñānamuṃḍuṭavalanakalugunadi tamōguṇamu. paparya yajñānamu kaluguṭaku kāraṇamainadi - pramādamu, ālasyamu, nidra - vīṭiki kāraṇamainadaguṭavalana vāṭi dvārā manuṣyuni baṃdhiṃcunu).
(vastuvuyokka yadhārdhajñānamu nāvariṃci viparītajñānamu kaluguṭaku kāraṇamaguṭavalana tamamu kartavyaviṣayamukanna viparītamaina panilō pravṛtti kalugacēyunu).
(jñānamu satvaguṇamu valanakalugu vivēkamu - dānini kappipucci tamōguṇamu tana āvaraṇaśakticēta pramādamu kaligiṃcunu).
pramādālasya nidrābhistannibadhnāti bhārata|
jñānamāvṛtyatu tamaḥ pramādē saṃjayatyuta |
rajastamaścābhi bhūya satvaṃ bhavati bhārata |
rajaḥ sattvaṃ tamaścaivatamaḥ satvaṃ rajastadā |
aprakāśō (a)pravṛttiśca pramādō mōha ēvaca |
tamasyē tāni jāyaṃtē vivṛddhē kurunaṃdana |
rajasi pralayaṃ gatvā karmasaṃgiṣu jāyatē |
tadhā pralīnastamasi mūḍhayōniṣu jāyatē ||“. (śrīmadbhagavadgīta - 14 - 8, 10. 13,15)
(tamōguṇamu ajñānamuvalana kaligi janulanu mōhiṃpacēyunu. pramādamu, ālasyamu, nidra kalugacēsi dēhini baṃdhiṃcucunnadi, jñānamunāvariṃci pramādamunu (porapāṭunu) kalugacēyucunnadi. satvaguṇamunu, rajōguṇamunu tiraskariṃci tamōguṇamu vṛddhipoṃdunu. tamōguṇamu migilina reṃḍu guṇamulakanna vṛddhipoṃdinayaḍala avivēkamu, aprayatnamu, pramādamu (tappulucēyuṭa), mōhamu vṛddhi poṃdunu. tamōguṇamu vṛddhipoṃdiyuṃḍaga maraṇiṃcina paśuvu modalagu mūḍhajanmamulanoṃdunu).
tamasi pravṛddhaumṛtaḥ mūḍhayōniṣu sūkarādi yōniṣu, paśvādi yōniṣu jāyatē|.(tamōguṇamu vṛddhipoṃdagā canipōyinavāḍu mūḍha janmalanu (paṃdi, kukka modalagu paśujanmalanu poṃdunu).
“tāmasāḥ - jaghanyaguṇa vṛttisthāḥ uttarōttara nikṛṣṭa tamōguṇavṛttiṣu sthitā adhōgacchaṃti - aṃtyatvaṃ, tataḥ tiryaktvyaṃ, tataḥ krimikīṭādi janma, sthāvaratvaṃ tatōpi gulmalatātvaṃ, tataśca śilākāṣṭa lōṣṭa tṛṇāditvaṃ gacchaṃti” (śrīrāmānujaḥ)
(tāmasaguṇamukalavāru - itarulanu caṃpeḍi guṇamugalavāru - okadānikanna iṃkokaṭi adhikamagu tāmasa guṇamulukalavāru - nīcajanmalanettuduru. anagā, aṃtyajātilō puṭṭuṭa, jaṃtuvulugānu, tarvāta purugu modalagunavigānu, ceṭlu cāmulugānu, latalugānu, ṟāyi, karragānu, gaḍḍipōcagānu puṭṭuduru).
“tamōguṇaṃbuvalana ākāśādi bhūta paṃcakamu puṭṭu” (vivēkaciṃtāmaṇi - paramānaṃdatīrtha)
prakṛtiyokka satvarajastamōguṇamulanu triguṇamulalō nokaṭi.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.