← Back to త · Booklets 21–30 (digitized file 3)

తన్మాత్రం tanmātraṃ

Original — తెలుగు
  1. తత్ + మాత్రం = అది మాత్రమే, తత్ = పరబ్రహ్మ మాత్రమే - ప్రకృతితో కాని, దాని విలారములతోగాని కలియక - అనగా నిరుపాధికమైన - నిర్గుణ, నిరాకార పరబ్రహ్మ - పరబ్రహ్మ ఏ విధమైన రూపము లేని చైతన్యమాత్రుడు - చిన్మాత్రుడు - పరమాత్మ చైతన్యమే అయినవాడు. ఆ చైతన్యముతో మఱి ఏదియు కలిసియుండలేదు - అతను చిద్ఘనము - చైతన్యఘనమని చెప్పబడుచున్నాడు. చైతన్యము ఘనీభవించియున్నదే పరమాత్మ. ఒకే చోట కేంద్రీకృతమై, కరడుగట్టినట్లుండి అనంతరము విస్తరించివిడిపోయి ప్రపంచరూపములో వృద్ధిపొందుటకు వీలగునది).

  2. ‘ఆహ చ తన్మాత్రం’ (బ్రహ్మసూత్రాలు - 3 - 2 - 16)

(అందుచేతనే - అనగా, నిర్విశేష, నిర్గు8న, నిరాకారుడగుటచేతనే పరబ్రహ్మ ‘తన్మాత్రం’ (చైతన్య మాత్రుడు) అని చెప్పబడినాడు).

  1. చైతన్యమాత్రం - “యథా సైంధవ ఘనో(అ)నంతరో (అ) బాహ్యః కృత్స్నోరసఘన ఏవ” ఏవం వా అరే (అ)యమాత్మానంతరో (అ)బాహ్యః కృతన్నః ప్రజ్ఞాన ఘన ఏవ”. (బృహదారణ్యకోపనిషత్)

(ఉప్పుగల్లు - ఒప్పుకణిక - లోపల పైన ఇతరమేదియు లేక అంతా ఉప్పే, అది ఉప్పు మయమే యగునట్లు ఈ ఆత్మలోపలగాని, పైనగాని ఇతరమేమియులేక, ఉన్నదంతా ప్రజ్ఞానమే - ప్రజ్ఞానఘనమే). (చిత్ = అనగా చైతన్యము, జ్ఞానము).

Transliteration
  1. tat + mātraṃ = adi mātramē, tat = parabrahma mātramē - prakṛtitō kāni, dāni vilāramulatōgāni kaliyaka - anagā nirupādhikamaina - nirguṇa, nirākāra parabrahma - parabrahma ē vidhamaina rūpamu lēni caitanyamātruḍu - cinmātruḍu - paramātma caitanyamē ayinavāḍu. ā caitanyamutō maṟi ēdiyu kalisiyuṃḍalēdu - atanu cidghanamu - caitanyaghanamani ceppabaḍucunnāḍu. caitanyamu ghanībhaviṃciyunnadē paramātma. okē cōṭa kēṃdrīkṛtamai, karaḍugaṭṭinaṭluṃḍi anaṃtaramu vistariṃciviḍipōyi prapaṃcarūpamulō vṛddhipoṃduṭaku vīlagunadi).

  2. ‘āha ca tanmātraṃ’ (brahmasūtrālu - 3 - 2 - 16)

(aṃducētanē - anagā, nirviśēṣa, nirgu8na, nirākāruḍaguṭacētanē parabrahma ‘tanmātraṃ’ (caitanya mātruḍu) ani ceppabaḍināḍu).

  1. caitanyamātraṃ - “yathā saiṃdhava ghanō(a)naṃtarō (a) bāhyaḥ kṛtsnōrasaghana ēva” ēvaṃ vā arē (a)yamātmānaṃtarō (a)bāhyaḥ kṛtannaḥ prajñāna ghana ēva”. (bṛhadāraṇyakōpaniṣat)

(uppugallu - oppukaṇika - lōpala paina itaramēdiyu lēka aṃtā uppē, adi uppu mayamē yagunaṭlu ī ātmalōpalagāni, painagāni itaramēmiyulēka, unnadaṃtā prajñānamē - prajñānaghanamē). (cit = anagā caitanyamu, jñānamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.