(మనస్సును ఇంద్రియములను ఒకే లక్ష్యమందుంచుట పరమ తపస్సు).
(కర్మేంద్రియములను, జ్ఞానేంద్రియములను, మనస్సును ఒకే లక్ష్యమునందు కేద్రీకరించుట పరమ తపస్సు అని స్మృతి చెప్పుచున్నది).
(శరీరమును, ఇంద్రియములను మనస్సును ఒకే దానియందు లక్ష్యము చేసి యుంచుట)
(ఇంద్రియములను స్వాధీనములో నుంచుకొనుటచే ఉపశమింపచేయుట - శాంతి9ని పొందించుట - అగ్నిహోత్రము మొదలగు కర్మలు -
చిత్తైకాగ్ర్యం = (మనస్సును ఒకే లక్ష్యమందు స్థిరముగా నుంచుట).
“తపో ద్వంద్వ సహిష్ణుతా”.
(తపస్సు అనగా శీతోష్ణములను, సుఖదుఃఖములను మొదలగు ద్వంద్వములను సహించుట).
“తపోద్వంద్వ సహిష్ణుత్వం అహమస్మి తపస్వినాం” (శ్రీమద్భగవద్గీత - 7 - 15)
కాయక్లేశాది లక్షణం. (శరీరమునకు క్లేశము - బాధ - మొదలగువాటిని కలిగించు లక్షణములుకలది).
వ్రతోపవాసాది పుణ్యం - ఏకాదశ్యుపవాసాది.
(వ్రతములు, ఉపవాసములు మొదలగు పుణ్య కర్మలు). (ఏకాదశి మొదలగు పుణ్య తిధులందు ఉపవాసము చేయుట).
(శాస్త్రములో నియమించిన ప్రకారము భోగములను అనుభవించుటలో కలుగు శరీర క్లేశము).
(తపస్సు అనగా శాస్త్రములో విధించబడిన ప్రకారముగా కృభ్రచాంద్రాయణము మొదలగు వ్రతములచేత శరీరమును శుష్కింపచేయుట).
(వేదములో చెప్పిన ప్రకారము కృభ్రచాంద్రాయణాదులచేత శరీరమును శుష్కింపచేయుట).
(తపము అనగా బ్రహ్మ చర్యము మొదలగునవి).
(వానప్రస్థాశ్రమములోనున్న వాని ధర్మము - అట్లున్నవాడు చేయవలసిన పని).
(స్వధర్మమునాచరించుట - నిత్యకర్మలు మొదలగినవి చేయుటయే తపస్సు).
(శాస్త్రములో విధించినప్రకారము అనుష్టించుట - కృచ్ఛ్ర చాంద్రాది వ్రతములవలన శరీరమును కష్ట పెట్టుటచేత యోగమునకు అవి ఉపకరించనందున అవి తపస్సుకాదు).
(కర్మలకు అంగము అగుటవలన పురుషుని సంస్కారలక్షణమే తపస్సు - స్వతంత్రముగా ఫలమును సాధించునది - లేక ఆలోచన). “తపో ఆలోచనే” (తపస్సు అనగా ఆలోచన) - భగవంతుని గుఱించి ఆలోచించుట).
(ఎల్లపుడు ఎడతెగని ధ్యానమే - భగవంతుని గుఱించి అయిన ధ్యానమే తపస్సు అని పండితులు - జ్ఞానులు - చెప్పుదురు).
(తపమనగా ఏ విధమైన దోషము లేనటువంటిన్నీ, తనంతట తానే ప్రకాశించునది అయిన పరబ్రహ్మయని యర్థము - తన ప్రకాశముచే - వేడిమిచే - ప్రపంచకమును శక్తివంతముగా చేయువాడు).
(సమస్త లోకములకు ఈశ్వరుడైన పరబ్రహ్మయొక్క రూపమే తపస్సు అని చెప్పబడుచున్నది).
(తపస్సు చేయువారి తపస్సు నేనే - భగవంతుడే. తపస్సు చేయువారిలో తపస్సు చేయు శక్తిని నేనే) (తపస్సు పరబ్రహ్మరూపమే).
తపమను తరువునకు ఫలవితానము నేనా
తపమునకో జననస్థి
త్యుపసంహరణము లొనర్చుచుండుదు, దనయా.
క. కావున, మద్భక్తికి దప
మే విధమున మూలధనము - - - “. (శ్రీమదాంధ్రమహభాగవతము - 9 - 245, 246)
(సత్యము తపస్సు - మూడుకాలములందు ఉండునది పరబ్రహ్మ - అదియే తపస్సు).
(ఈ సమస్త జగత్తును దాని లోపలనుండి తపింప చేసి, ఒకే వస్తువులోనుండి ఇంకొక వస్తువు ప్రకాశమగునట్లు - పుట్టునట్లు చేయువాడగు భగవంతుడు).
(తపింప చేయు రూపములైన - ప్రకాశించుచు వేడిమిని (శక్తిని) కలిగించు రూపములైన - అగ్ని, సూర్యుడు మొదలగు రూపములలో తానుండి తన సత్తాస్ఫూర్తిని వాటికిచ్చి వాటిని వాటి వాటి పనులు చేయునట్లు ఆజ్ఞాపించువాడు - ప్రేరేపించువాడు).
(ఈ లోకమును, పరలోకమును సమస్త భూతములను తాను వాటిలో నుండి ప్రేరేపించువాడు).
(ప్రజాపతికి కోరిక కలిగెను - నేనే అనేకముగ - అనేకవస్తువులుగా అగుదును ” అని. అందుకొఱకు అతను తపస్సు చేసెను. ఆ తపస్సు చేసి ఈ లోకములను పుట్టించెను - పృధివిని, అంతరిక్షమును, దివమును - ఆ లోకములను ప్రజాపతి తపింపచేసెను - అట్లు తపింప చేయబడిన వాటినుండి మూడు వేదములు పుట్టినవి. ఆ వేదములను ప్రజాపతి తపింపచేసెను - అట్లు తపింప చేయబడినవాటినుండి మూడు శుక్రములు - భూః, భువః, సువః -పుట్టెను - ఆ మూడు శుక్రములను ప్రజాపతి తపింపచేసెను. అట్లు తపింప చేయబడినవాటినుండి మూడు వర్ణములు - అక్షరములు - అకార, ఉకార, మకారములు పుట్టెను - ఈ మూడింటిని ప్రజాపతి కలిపెను - అట్లు కలపగా అవి ఒకే అక్షరమైనది - అది ‘ఓం’).
(బ్రహ్మతత్వ జ్ఞానమునకు తపస్సే సాధనము).
(లోకములో సాధ్యవిషయములకుగల సాధనములలో అన్నింటికన్న తపస్సు గొప్పది. తపస్సు బాహ్యేంద్రియములను, అంతఃకరణమును సమాధానపఱచునది. బ్రహ్మయొక్క స్వస్వరూప సాక్షాత్కారమగునంతవఱకు తపస్సు చేయవలసినదే - అదియే సాధనము).
“వేదయాగ యోగ క్రియా జ్ఞాన తపోగతి ధర్మంబులు వాసుదేవ పరంబులు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 2 - 24)
బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా |
తస్మా దోమిత్యుదాహృత్య యజ్ఞదాన తపః క్రియాః |
ప్రవర్థంతే విధానోక్తాః సంతతం బ్రహ్మవాదినాం ||“. (శ్రీమద్భగవద్గీత - 17 - 23, 24)
(ఓం, తత్, సత్ అను మూడువిధములుగా పరబ్రహ్మ నిర్దేశింపబడుచున్నాడు - అందుచేత యజ్ఞము, దానము, తపస్సు అను మూడు క్రియలు ఓం అని ముందు చెప్పి చేయబడుచున్నవి).
తత్సర్వం తపసా ప్రాప్యం తపసోపి దురతి క్రమం ||”
ఇతి మనుః.
(ఏది చేయుటకు కష్టమైనదో, ఏది పొందశక్యముకానిదో, ఏది దాటశక్యముకానిదో (తరింప శక్యముకానిదో) అవన్నియు తపస్సు చేత సాధింపవచ్చును - తపస్సు మాత్రము అతిక్రమింపరానిది).
తపస్సు రెండువిధములు - బాహ్యము, ఆంతరము -
తపస్సు మూడువిధములు - శరీరవాజ్మనో నిష్పాద్యతయా స్వరూపభేదం శారీర తపః, వాఙ్మయ తపః, మానస తపః - శారీరవాచక మానస రూపేణ త్రివిధస్యాపి తపనః సత్వాదిగుణ భేదేన త్రైవిధ్యం ఆహారాదీనాం సాత్వికత్వాది త్రైవిద్యే ప్రక్రాంతే తపనః. కరణభేదేన త్రైవిద్యోక్తిః -
(శారీరక తపస్సు, వాజ్మయ తపస్సు, మానసిక తపస్సు అని తపస్సు మూడువిధములు. సత్వరజస్తమోగుణముల ననుసరించి ఈ మూడువిధముల తపస్సు జరుగుచుండును - ఆహారము సాత్వికము, రాజసికము, తామసము అను మూడువిధములుగానుండుటచేత వాటిని బట్టి తపస్సు కూడా మూడు విధములు). (వీటిని వేరు వేరుగా చూడుము).
తపోలోకము.
జ్ఞానము, ఆలోచన, వేడిమి.
“స్వామి పుష్కరిణీ స్నానం శ్రీనివాసస్య దర్శనం, సహస్రనామ పఠనం జన్మాంతర తపః ఫలం||”
(శ్రీవేంకటేశ్వరస్వామివారి పుష్కరిణిలో స్నానము, శ్రీవేంకటేశ్వరుని దర్శనము, సహస్రనామములను పఠించుట, అనునవి పూర్వజన్మములలో చేసిన తపస్సుయొక్క ఫలము –
ఉ. ఏమి తపంబు సేసెనొకొ ఈ ధరణీ దివిజోత్తముండు తొల్
జామున యోగివిస్ఫుర దుపాస్యకుడై తనరారు నీ జగ
త్స్వామి రమాధినాధు నిజతల్పమునన్ వసియించి యున్నవాడు
- --” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా. - 985)
జేయక కేవలము బోధసిద్ధికి దపముం
జేయుట విఫలము, పొల్లున
నాయము సేకూరునె తలప నధికంబైనన్” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 -పూ.భా. - 552)
(manassunu iṃdriyamulanu okē lakṣyamaṃduṃcuṭa parama tapassu).
(karmēṃdriyamulanu, jñānēṃdriyamulanu, manassunu okē lakṣyamunaṃdu kēdrīkariṃcuṭa parama tapassu ani smṛti ceppucunnadi).
(śarīramunu, iṃdriyamulanu manassunu okē dāniyaṃdu lakṣyamu cēsi yuṃcuṭa)
(iṃdriyamulanu svādhīnamulō nuṃcukonuṭacē upaśamiṃpacēyuṭa - śāṃti9ni poṃdiṃcuṭa - agnihōtramu modalagu karmalu -
cittaikāgryaṃ = (manassunu okē lakṣyamaṃdu sthiramugā nuṃcuṭa).
“tapō dvaṃdva sahiṣṇutā”.
(tapassu anagā śītōṣṇamulanu, sukhaduḥkhamulanu modalagu dvaṃdvamulanu sahiṃcuṭa).
“tapōdvaṃdva sahiṣṇutvaṃ ahamasmi tapasvināṃ” (śrīmadbhagavadgīta - 7 - 15)
kāyaklēśādi lakṣaṇaṃ. (śarīramunaku klēśamu - bādha - modalaguvāṭini kaligiṃcu lakṣaṇamulukaladi).
vratōpavāsādi puṇyaṃ - ēkādaśyupavāsādi.
(vratamulu, upavāsamulu modalagu puṇya karmalu). (ēkādaśi modalagu puṇya tidhulaṃdu upavāsamu cēyuṭa).
(śāstramulō niyamiṃcina prakāramu bhōgamulanu anubhaviṃcuṭalō kalugu śarīra klēśamu).
(tapassu anagā śāstramulō vidhiṃcabaḍina prakāramugā kṛbhracāṃdrāyaṇamu modalagu vratamulacēta śarīramunu śuṣkiṃpacēyuṭa).
(vēdamulō ceppina prakāramu kṛbhracāṃdrāyaṇādulacēta śarīramunu śuṣkiṃpacēyuṭa).
(tapamu anagā brahma caryamu modalagunavi).
(vānaprasthāśramamulōnunna vāni dharmamu - aṭlunnavāḍu cēyavalasina pani).
(svadharmamunācariṃcuṭa - nityakarmalu modalaginavi cēyuṭayē tapassu).
(śāstramulō vidhiṃcinaprakāramu anuṣṭiṃcuṭa - kṛcchra cāṃdrādi vratamulavalana śarīramunu kaṣṭa peṭṭuṭacēta yōgamunaku avi upakariṃcanaṃduna avi tapassukādu).
(karmalaku aṃgamu aguṭavalana puruṣuni saṃskāralakṣaṇamē tapassu - svataṃtramugā phalamunu sādhiṃcunadi - lēka ālōcana). “tapō ālōcanē” (tapassu anagā ālōcana) - bhagavaṃtuni guṟiṃci ālōciṃcuṭa).
(ellapuḍu eḍategani dhyānamē - bhagavaṃtuni guṟiṃci ayina dhyānamē tapassu ani paṃḍitulu - jñānulu - ceppuduru).
(tapamanagā ē vidhamaina dōṣamu lēnaṭuvaṃṭinnī, tanaṃtaṭa tānē prakāśiṃcunadi ayina parabrahmayani yarthamu - tana prakāśamucē - vēḍimicē - prapaṃcakamunu śaktivaṃtamugā cēyuvāḍu).
(samasta lōkamulaku īśvaruḍaina parabrahmayokka rūpamē tapassu ani ceppabaḍucunnadi).
(tapassu cēyuvāri tapassu nēnē - bhagavaṃtuḍē. tapassu cēyuvārilō tapassu cēyu śaktini nēnē) (tapassu parabrahmarūpamē).
tapamanu taruvunaku phalavitānamu nēnā
tapamunakō jananasthi
tyupasaṃharaṇamu lonarcucuṃḍudu, danayā.
ka. kāvuna, madbhaktiki dapa
mē vidhamuna mūladhanamu - - - “. (śrīmadāṃdhramahabhāgavatamu - 9 - 245, 246)
(satyamu tapassu - mūḍukālamulaṃdu uṃḍunadi parabrahma - adiyē tapassu).
(ī samasta jagattunu dāni lōpalanuṃḍi tapiṃpa cēsi, okē vastuvulōnuṃḍi iṃkoka vastuvu prakāśamagunaṭlu - puṭṭunaṭlu cēyuvāḍagu bhagavaṃtuḍu).
(tapiṃpa cēyu rūpamulaina - prakāśiṃcucu vēḍimini (śaktini) kaligiṃcu rūpamulaina - agni, sūryuḍu modalagu rūpamulalō tānuṃḍi tana sattāsphūrtini vāṭikicci vāṭini vāṭi vāṭi panulu cēyunaṭlu ājñāpiṃcuvāḍu - prērēpiṃcuvāḍu).
(ī lōkamunu, paralōkamunu samasta bhūtamulanu tānu vāṭilō nuṃḍi prērēpiṃcuvāḍu).
(prajāpatiki kōrika kaligenu - nēnē anēkamuga - anēkavastuvulugā agudunu ” ani. aṃdukoṟaku atanu tapassu cēsenu. ā tapassu cēsi ī lōkamulanu puṭṭiṃcenu - pṛdhivini, aṃtarikṣamunu, divamunu - ā lōkamulanu prajāpati tapiṃpacēsenu - aṭlu tapiṃpa cēyabaḍina vāṭinuṃḍi mūḍu vēdamulu puṭṭinavi. ā vēdamulanu prajāpati tapiṃpacēsenu - aṭlu tapiṃpa cēyabaḍinavāṭinuṃḍi mūḍu śukramulu - bhūḥ, bhuvaḥ, suvaḥ -puṭṭenu - ā mūḍu śukramulanu prajāpati tapiṃpacēsenu. aṭlu tapiṃpa cēyabaḍinavāṭinuṃḍi mūḍu varṇamulu - akṣaramulu - akāra, ukāra, makāramulu puṭṭenu - ī mūḍiṃṭini prajāpati kalipenu - aṭlu kalapagā avi okē akṣaramainadi - adi ‘ōṃ’).
(brahmatatva jñānamunaku tapassē sādhanamu).
(lōkamulō sādhyaviṣayamulakugala sādhanamulalō anniṃṭikanna tapassu goppadi. tapassu bāhyēṃdriyamulanu, aṃtaḥkaraṇamunu samādhānapaṟacunadi. brahmayokka svasvarūpa sākṣātkāramagunaṃtavaṟaku tapassu cēyavalasinadē - adiyē sādhanamu).
“vēdayāga yōga kriyā jñāna tapōgati dharmaṃbulu vāsudēva paraṃbulu” (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 2 - 24)
brāhmaṇāstēna vēdāśca yajñāśca vihitāḥ purā |
tasmā dōmityudāhṛtya yajñadāna tapaḥ kriyāḥ |
pravarthaṃtē vidhānōktāḥ saṃtataṃ brahmavādināṃ ||“. (śrīmadbhagavadgīta - 17 - 23, 24)
(ōṃ, tat, sat anu mūḍuvidhamulugā parabrahma nirdēśiṃpabaḍucunnāḍu - aṃducēta yajñamu, dānamu, tapassu anu mūḍu kriyalu ōṃ ani muṃdu ceppi cēyabaḍucunnavi).
tatsarvaṃ tapasā prāpyaṃ tapasōpi durati kramaṃ ||”
iti manuḥ.
(ēdi cēyuṭaku kaṣṭamainadō, ēdi poṃdaśakyamukānidō, ēdi dāṭaśakyamukānidō (tariṃpa śakyamukānidō) avanniyu tapassu cēta sādhiṃpavaccunu - tapassu mātramu atikramiṃparānidi).
tapassu reṃḍuvidhamulu - bāhyamu, āṃtaramu -
tapassu mūḍuvidhamulu - śarīravājmanō niṣpādyatayā svarūpabhēdaṃ śārīra tapaḥ, vāṅmaya tapaḥ, mānasa tapaḥ - śārīravācaka mānasa rūpēṇa trividhasyāpi tapanaḥ satvādiguṇa bhēdēna traividhyaṃ āhārādīnāṃ sātvikatvādi traividyē prakrāṃtē tapanaḥ. karaṇabhēdēna traividyōktiḥ -
(śārīraka tapassu, vājmaya tapassu, mānasika tapassu ani tapassu mūḍuvidhamulu. satvarajastamōguṇamula nanusariṃci ī mūḍuvidhamula tapassu jarugucuṃḍunu - āhāramu sātvikamu, rājasikamu, tāmasamu anu mūḍuvidhamulugānuṃḍuṭacēta vāṭini baṭṭi tapassu kūḍā mūḍu vidhamulu). (vīṭini vēru vērugā cūḍumu).
tapōlōkamu.
jñānamu, ālōcana, vēḍimi.
“svāmi puṣkariṇī snānaṃ śrīnivāsasya darśanaṃ, sahasranāma paṭhanaṃ janmāṃtara tapaḥ phalaṃ||”
(śrīvēṃkaṭēśvarasvāmivāri puṣkariṇilō snānamu, śrīvēṃkaṭēśvaruni darśanamu, sahasranāmamulanu paṭhiṃcuṭa, anunavi pūrvajanmamulalō cēsina tapassuyokka phalamu –
- ēmi tapaṃbu sēsenoko ī dharaṇī divijōttamuṃḍu tol
jāmuna yōgivisphura dupāsyakuḍai tanarāru nī jaga
tsvāmi ramādhinādhu nijatalpamunan vasiyiṃci yunnavāḍu
- --” (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā. - 985)
jēyaka kēvalamu bōdhasiddhiki dapamuṃ
jēyuṭa viphalamu, polluna
nāyamu sēkūrune talapa nadhikaṃbainan” (śrīmadāṃdhramahābhāgavatamu - 10 -pū.bhā. - 552)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.