(తల్లి గర్భములో ప్రవేశించుట, పుట్టుట, పెరిగి, పెరిగి ముసలియగుట, చనిపోవుట, మరల పుట్టుట, మరల చనిపోవుట - ఈ ప్రకారముగా జరుగు సంసారమనుపేరుగల గొప్ప భయమునుండి తరింపచేయునది - దాటించునది, అందుచేత షడక్షరమంత్రము తారకమని చెప్పబడుచున్నది).
(ఉచ్చరించినంత మాత్రమున గర్భ జన్మ జరామరణ రూపమైన సంసారమను మహాభయమునుండి తరింప చేయునది కనుక తారకము. తారము అనినను తారకము అనినను ఒకటే).
(యాజ్ఞవల్క్య మహాఋషిని భరద్వాజుడు ఈ విధముగా అడిగెను - “తారకమనగా ఏది? అది దేనిని తరింపచేయును?”. యాజ్ఞవల్క్యుడు ఇట్లు సమాధానము చెప్పెను - “తారకమనగా దీర్ఘవాయు బిందు పూర్వకముగా దీర్ఘాగ్ని బీజమును తదుపరి”రామాయనమః” (రాముని కొఱకు నమస్కారము) అను సచ్చిదానంద బ్రహ్మ స్వరూపము అని ఉపాసింపవలసినది - అని. అందుచేత శ్రీరామ షడక్షరమంత్రము తారకము” - (ఓం రామాయనమః)
(శ్రీరాముడే ప్రణవము - ఓంకారము - అగుటవలనను, దాని స్వరూపమే శ్రీరాముడగుటవలనను, ప్రణవముయొక్క అవయవములైన అకార, ఉకార, మకారము మొదలగునవి పరివారముతో కూడిన శ్రీరాముడే యగుటవలన (సీతా లక్ష్మణ భరత శతృఘ్న హనుమత్సమేతుడైన శ్రీరాముడే యగుటవలన) శ్రీరాముడే సగుణ బ్రహ్మరూపుడు. అందుచేత ప్రణవమువలనే అతని నామము - అతని నామమంత్రము - తరింపచేయునదిగాన తారకమని చెప్పబడినది ప్రణవ ప్రణవమే అయిన శ్రీరాముడు తారకము - తరింపచేయువాడు).
(జననమరణరూపమైన సంసారమనుమహాసముద్రమును తరింపచేయునది తారకము - లేక ప్రణవము - ఓంకారము).
(ప్రణవము - ఓంకారము - అకార, ఉకార, మకార, అర్ధమాత్ర, బిందువు, నాదము అను ఆరు భాగములు గలది :- ఆ ప్రణవమే - ఓంకారమే - తారకమని చెప్పబడినది. దానినే ఉపాసింపవలెను. గర్భ జన్మ జరామరణరూపమగు సంసారమను మహాభయమునుండి తరింపచేయునది కనుక - పునర్జన్మ లేకుండ చేయునది కనుక - అదియే తారకమని చెప్పబడినది).
(కనుబొమల మధ్యనుండు సచ్చిదానంద పరబ్రహ్మతేజస్సు కూటరూపముగనున్నది తారకము).
“నాసాగ్రదర్శినో భ్రూమధ్యే జ్యోతిర్దృశ్యతే. సచ్చిదానందస్య సర్వ వ్యాపకత్వేన చక్షుర్మనో వికల్పిత తేజః కూటరూపత్వేన స్వ భజత్భక్తి పటల స్వాతిరిక్తా స్తిత్వ లక్షణ సంసార సాగర సంతారణాత్ తారకత్వం, వస్తుతః స్వమాత్రతయా బృంహణాత్ తారకం బ్రహ్మ ఇతివ్యప దిశ్యతే”.
(నాసాగ్రమును జూచు యోగులు కనుబొమల మధ్యమందు జ్యోతీరూపమును చూతురు. అన్నింటియందును వ్యాపించి యుండువాడు అగుటచేత సచ్చిదానందరూపుడైన పరబ్రహ్మ కండ్లలోను మనసులోను తేజోరూపముగానుండును. ఆ పరబ్రహ్మయే - కూటస్థ చైతన్యము - సంసారమను సముద్రమును తరింపచేయుటవలన తారకము. పరబ్రహ్మ బృంహిణ శక్తి కలిగియుండుట చేత తానే ప్రపంచమంతయుగా వృద్ధిపొందుటవలన తారకబ్రహ్మ - బృం హిణాత్ బ్రహ్మ” - అని చెప్పబడుచున్నాడు).
ఓంకారప్రకృతిం షడక్షరహితం హ్యాంకార కందాంకురం |
ఓంకారస్ఫుట భూర్భువస్సు వరితం త్యోఘ త్రయా రాధితం |
ఓంకారోజ్వర సింహపీఠ నిలయం రామం భజే తారకం||” (శ్రీరామకర్ణామృతం - 2 - 50)
(బట్టలోని నిలువుగాను అడ్డుగాను నేయబడి బట్ట అవే అయిన దారములువలె ప్రపంచములోని సమస్తవస్తువులు తానే అయి వాటిలోన, పైన పూర్తిగా వ్యాపించియున్నవాడున్నూ, మంత్రములకు ఓంకారమను బీజాక్షరమైనటువంటిన్నీ- ‘ఓం’ అను మంత్రమునకు బీజాక్షరమైనటువంటివాడున్నూ, ఓం రామాయనమః అను షడక్షర రూపకమైన తారకమంత్రము ఇష్టమైనవాడున్నూ, ఓంకారమను దుంపకు అంకురమైనవాడున్నూ, ఓంకారముచేత స్ఫుటము చేయబడిన ‘ఓం భూః, ఓం భువః, ఓం సువః’ అను మంత్రమూర్తియైనవాడున్నూ, దేవమానవ తిర్యక్ సంఘములచేత త్రివేణులచేత ఆరాధింపబడుచున్నవాడున్నూ, ఓంకారరూపములో ప్రజ్వలించుచున్న సిమ్హాసనమందాసీనుడై యున్నటువంటిన్నీ తారకుడైనటువంటిన్నీ భక్తులను సంసారమను మహాసముద్రమును దాటించువాడగుటచే తారకమైనటువంటిన్నీ శ్రీరామచంద్రుని భజించుచున్నాను).
(తారకము రెండు విధములు - మొదటిది తారకము, రెండవది అమనస్కం).
(talli garbhamulō pravēśiṃcuṭa, puṭṭuṭa, perigi, perigi musaliyaguṭa, canipōvuṭa, marala puṭṭuṭa, marala canipōvuṭa - ī prakāramugā jarugu saṃsāramanupērugala goppa bhayamunuṃḍi tariṃpacēyunadi - dāṭiṃcunadi, aṃducēta ṣaḍakṣaramaṃtramu tārakamani ceppabaḍucunnadi).
(uccariṃcinaṃta mātramuna garbha janma jarāmaraṇa rūpamaina saṃsāramanu mahābhayamunuṃḍi tariṃpa cēyunadi kanuka tārakamu. tāramu aninanu tārakamu aninanu okaṭē).
(yājñavalkya mahāṛṣini bharadvājuḍu ī vidhamugā aḍigenu - “tārakamanagā ēdi? adi dēnini tariṃpacēyunu?”. yājñavalkyuḍu iṭlu samādhānamu ceppenu - “tārakamanagā dīrghavāyu biṃdu pūrvakamugā dīrghāgni bījamunu tadupari”rāmāyanamaḥ” (rāmuni koṟaku namaskāramu) anu saccidānaṃda brahma svarūpamu ani upāsiṃpavalasinadi - ani. aṃducēta śrīrāma ṣaḍakṣaramaṃtramu tārakamu” - (ōṃ rāmāyanamaḥ)
(śrīrāmuḍē praṇavamu - ōṃkāramu - aguṭavalananu, dāni svarūpamē śrīrāmuḍaguṭavalananu, praṇavamuyokka avayavamulaina akāra, ukāra, makāramu modalagunavi parivāramutō kūḍina śrīrāmuḍē yaguṭavalana (sītā lakṣmaṇa bharata śatṛghna hanumatsamētuḍaina śrīrāmuḍē yaguṭavalana) śrīrāmuḍē saguṇa brahmarūpuḍu. aṃducēta praṇavamuvalanē atani nāmamu - atani nāmamaṃtramu - tariṃpacēyunadigāna tārakamani ceppabaḍinadi praṇava praṇavamē ayina śrīrāmuḍu tārakamu - tariṃpacēyuvāḍu).
(jananamaraṇarūpamaina saṃsāramanumahāsamudramunu tariṃpacēyunadi tārakamu - lēka praṇavamu - ōṃkāramu).
(praṇavamu - ōṃkāramu - akāra, ukāra, makāra, ardhamātra, biṃduvu, nādamu anu āru bhāgamulu galadi :- ā praṇavamē - ōṃkāramē - tārakamani ceppabaḍinadi. dāninē upāsiṃpavalenu. garbha janma jarāmaraṇarūpamagu saṃsāramanu mahābhayamunuṃḍi tariṃpacēyunadi kanuka - punarjanma lēkuṃḍa cēyunadi kanuka - adiyē tārakamani ceppabaḍinadi).
(kanubomala madhyanuṃḍu saccidānaṃda parabrahmatējassu kūṭarūpamuganunnadi tārakamu).
“nāsāgradarśinō bhrūmadhyē jyōtirdṛśyatē. saccidānaṃdasya sarva vyāpakatvēna cakṣurmanō vikalpita tējaḥ kūṭarūpatvēna sva bhajatbhakti paṭala svātiriktā stitva lakṣaṇa saṃsāra sāgara saṃtāraṇāt tārakatvaṃ, vastutaḥ svamātratayā bṛṃhaṇāt tārakaṃ brahma itivyapa diśyatē”.
(nāsāgramunu jūcu yōgulu kanubomala madhyamaṃdu jyōtīrūpamunu cūturu. anniṃṭiyaṃdunu vyāpiṃci yuṃḍuvāḍu aguṭacēta saccidānaṃdarūpuḍaina parabrahma kaṃḍlalōnu manasulōnu tējōrūpamugānuṃḍunu. ā parabrahmayē - kūṭastha caitanyamu - saṃsāramanu samudramunu tariṃpacēyuṭavalana tārakamu. parabrahma bṛṃhiṇa śakti kaligiyuṃḍuṭa cēta tānē prapaṃcamaṃtayugā vṛddhipoṃduṭavalana tārakabrahma - bṛṃ hiṇāt brahma” - ani ceppabaḍucunnāḍu).
ōṃkāraprakṛtiṃ ṣaḍakṣarahitaṃ hyāṃkāra kaṃdāṃkuraṃ |
ōṃkārasphuṭa bhūrbhuvassu varitaṃ tyōgha trayā rādhitaṃ |
ōṃkārōjvara siṃhapīṭha nilayaṃ rāmaṃ bhajē tārakaṃ||” (śrīrāmakarṇāmṛtaṃ - 2 - 50)
(baṭṭalōni niluvugānu aḍḍugānu nēyabaḍi baṭṭa avē ayina dāramuluvale prapaṃcamulōni samastavastuvulu tānē ayi vāṭilōna, paina pūrtigā vyāpiṃciyunnavāḍunnū, maṃtramulaku ōṃkāramanu bījākṣaramainaṭuvaṃṭinnī- ‘ōṃ’ anu maṃtramunaku bījākṣaramainaṭuvaṃṭivāḍunnū, ōṃ rāmāyanamaḥ anu ṣaḍakṣara rūpakamaina tārakamaṃtramu iṣṭamainavāḍunnū, ōṃkāramanu duṃpaku aṃkuramainavāḍunnū, ōṃkāramucēta sphuṭamu cēyabaḍina ‘ōṃ bhūḥ, ōṃ bhuvaḥ, ōṃ suvaḥ’ anu maṃtramūrtiyainavāḍunnū, dēvamānava tiryak saṃghamulacēta trivēṇulacēta ārādhiṃpabaḍucunnavāḍunnū, ōṃkārarūpamulō prajvaliṃcucunna simhāsanamaṃdāsīnuḍai yunnaṭuvaṃṭinnī tārakuḍainaṭuvaṃṭinnī bhaktulanu saṃsāramanu mahāsamudramunu dāṭiṃcuvāḍaguṭacē tārakamainaṭuvaṃṭinnī śrīrāmacaṃdruni bhajiṃcucunnānu).
(tārakamu reṃḍu vidhamulu - modaṭidi tārakamu, reṃḍavadi amanaskaṃ).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.