‘తత్’ అనగా అది యని అర్థము. ఇది యనగా యీ ప్రపంచము - ప్రపంచములోని వస్తువులన్నియు. ఇది కానిది అది, అనగా పరబ్రహ్మ, ఇది యనగా దగ్గరగా నున్నది యని, అది యనగా దూరముగానున్నది యని వాడుక.
తత్ శబ్దేన పరబ్రహ్మ ఉచ్యతే - ’ఓం తత్సత్ ఇతి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతిః“ఇతి భగవద్వచనాత్” (శ్రీమద్భగవద్గీత - 17 - 23)
(‘ఓం’, ‘తత్’, ‘సత్’ అని మూడు విధముల పరబ్రహ్మమే చెప్పబడుచున్నాడు అని శ్రీకృష్ణభగవానుడు శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నాడు).
అప్రత్యక్షం. (ప్రత్యక్షముగా కనబడనివి - అజ్ఞానులకు కనబడనివి).
తదితి పరోక్షే విజానీ యాత్. (తత్ అనుమాట పరోక్షమునే తెలియచేయును).
“తదితి ఏతస్య మహతో భూతస్య నామ భవతి”. (ఐతరేయోపనిషత్)
(‘తత్’ అనుమాట మహద్భూతమైన పరబ్రహ్మయొక్క నామము).
శృష్టేః పురా అథనాప్యస్యతా దృక్త్వం తత్ ఇతీర్యతే ||“.
(ఒకడే అయినటువంటిన్నీ - తనుకాక రెండవవస్తువు లేనటువంటివాడైన - నామరూపములు లేనటువంటిన్నీ, సృష్టికి ముందు, ఇప్పుడుకూడా ఇట్లున్నటువంటి పరబ్రహ్మ ‘తత్’ అని చెప్పబడుచున్నాడు).
“తత్ ఇతి సర్వనామ, సర్వం బ్రహ్మ, తస్యనామ ‘తత్’ ఇతి -”. (శ్రీశంకరః)
‘తత్’ (అది) అను పదము సర్వనామము - అన్నింటిపేరు - ప్రతిదానిని ‘అది’ అందురుకదా - అన్నీ ప్రతీది పరబ్రహ్మమే - అన్నీ పరబ్రహ్మరూపములే. అందుచేత సమస్తవస్తువులు రూపముగాగల, అన్ని వస్తువులు తనే అయిన పరబ్రహ్మనామము ‘తత్’
“స దేవేత్యాది నైవక్తో మ ద్వయం సర్వ కారణం |
ఏకమేవ పరబ్రహ్మ తచ్ఛబ్దేనోప లక్షితః -“.
(“సదేవ, సోమ్యా ఇదమగ్ర అసీత్ (ఇప్పుడు కనబడు ఈ ప్రపంచమంతయు, అది సృష్టింప బడకముందు ‘సత్’ పదార్థముగనే యుండెను - అని శ్రుతి చెప్పుచున్నది. అట్లు చెప్పిన శ్రుతివాక్యములోని సమస్తము నకు కారణమైనది యగు పరబ్రహ్మమే ‘తత్’ అను మాటకు లక్ష్యము - ‘తత్’ అనగా అట్టి పరబ్రహ్మమే -).
(తత్ - అని; త్వం = నీవు; అసి = అయితివి - అదే నీవు - ఆ పరబ్రహ్మమే నీవు అని శ్రుతి చెప్పుచున్నది. ఇదియే మహావాక్యము - ఆ పరబ్రహ్మ నీవే అని జీవబ్రహ్మల ఐక్యమును తెలియచేయు సర్వవేదాంతసారము -అందుచేత ‘తత్’ అనగా ఆ పరబ్రహ్మమే యని యర్థము).
(ఉపనిషత్తులన్నింటిలోను; తత్ ‘అనగా పరబ్రహ్మ ప్రసిద్ధి. ’తత్వమసి’అను మహావాక్యములోని ’తత్’ అనుమాట పరబ్రహ్మకు లక్ష్యార్థము - అను మాహావాక్యము గుఱించి చేసిన వ్యాఖ్యానము ఇట్లున్నదికనుక).
పారోక్ష్య శబలః సత్యాద్యాత్మకః తత్సదాభిధిః ||“. (ఆధ్యాత్మోపనిషత్)
(మాయ ఉపాధిగా గలదిన్నీ, జగత్తునకు కారణమైనటువంటిదిన్నీ, పరోక్షమైనదిన్నీ,“సత్యం జ్ఞానమనంతం” అని చెప్పబడు లక్షణములు గలదిన్నీ అయిన పరబ్రహ్మ ‘తత్’ అనుమాటచేత చెప్పబడుచున్నది).
(తత్ అనగా విస్తరింపచేయునది, వ్యాపింపచేయునది. “తతం’వ్యాపన శీలః విష్ణుః - వ్యాపించు స్వభావము కలవాడు, వ్యాపింపచేయు స్వభావము గలవాడు కనుక విష్ణువు - పరబ్రహ్మ).
“యేనసర్వమిదం”జగత్ తతం” వ్యాప్తం సదాఖ్వ్యేన బ్రహ్మణాసాకాశం, ఆకాశేనేవఘటాదయః, తత్ - (ఘటము మొదలగు సమస్తవస్తువులలోను ఆకాశమ్య్ వ్యాపించి యున్నట్లు, సత్పదార్థమని చెప్పబడు (సర్వకాలములందు ఉండునది అని చెప్పబడు).పరబ్రమచేత ఈ సమస్త జగత్తు వ్యాపించబడియున్నది - ఆ పరబ్రమ ‘తత్’ అని చెప్పబడుచున్నది).
‘తత్’ ఇతి వాఞ్మనో (అ)గమ్యం ధ్యేయమ్యత్సూర్యమండలే“.
(వాక్కుచేత చెప్పూటకుగాని, మనస్సులో ఇటువంటివాడు అని నిర్ణయించుకొనుటకుగాని వీలుగానటువంటిన్నీ, ధ్యానింప తగిన వస్తువైన పరబ్రహ్మ తత్ అని చెప్పబడుచున్నది) –
“ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తీ నారాయణః - - - ప్రోద్యజాతిత్యవర్గా భః సూర్యమండల మధ్యగః - - - దోః ద్వయోః ధ్యేయ యేవచ ||”.
‘tat’ anagā adi yani arthamu. idi yanagā yī prapaṃcamu - prapaṃcamulōni vastuvulanniyu. idi kānidi adi, anagā parabrahma, idi yanagā daggaragā nunnadi yani, adi yanagā dūramugānunnadi yani vāḍuka.
tat śabdēna parabrahma ucyatē - ’ōṃ tatsat iti nirdēśō brahmaṇastrividhaḥ smṛtiḥ”iti bhagavadvacanāt” (śrīmadbhagavadgīta - 17 - 23)
(‘ōṃ’, ‘tat’, ‘sat’ ani mūḍu vidhamula parabrahmamē ceppabaḍucunnāḍu ani śrīkṛṣṇabhagavānuḍu śrīmadbhagavadgītalō ceppiyunnāḍu).
apratyakṣaṃ. (pratyakṣamugā kanabaḍanivi - ajñānulaku kanabaḍanivi).
taditi parōkṣē vijānī yāt. (tat anumāṭa parōkṣamunē teliyacēyunu).
“taditi ētasya mahatō bhūtasya nāma bhavati”. (aitarēyōpaniṣat)
(‘tat’ anumāṭa mahadbhūtamaina parabrahmayokka nāmamu).
śṛṣṭēḥ purā athanāpyasyatā dṛktvaṃ tat itīryatē ||“.
(okaḍē ayinaṭuvaṃṭinnī - tanukāka reṃḍavavastuvu lēnaṭuvaṃṭivāḍaina - nāmarūpamulu lēnaṭuvaṃṭinnī, sṛṣṭiki muṃdu, ippuḍukūḍā iṭlunnaṭuvaṃṭi parabrahma ‘tat’ ani ceppabaḍucunnāḍu).
“tat iti sarvanāma, sarvaṃ brahma, tasyanāma ‘tat’ iti -”. (śrīśaṃkaraḥ)
‘tat’ (adi) anu padamu sarvanāmamu - anniṃṭipēru - pratidānini ‘adi’ aṃdurukadā - annī pratīdi parabrahmamē - annī parabrahmarūpamulē. aṃducēta samastavastuvulu rūpamugāgala, anni vastuvulu tanē ayina parabrahmanāmamu ‘tat’
“sa dēvētyādi naivaktō ma dvayaṃ sarva kāraṇaṃ |
ēkamēva parabrahma tacchabdēnōpa lakṣitaḥ -“.
(“sadēva, sōmyā idamagra asīt (ippuḍu kanabaḍu ī prapaṃcamaṃtayu, adi sṛṣṭiṃpa baḍakamuṃdu ‘sat’ padārthamuganē yuṃḍenu - ani śruti ceppucunnadi. aṭlu ceppina śrutivākyamulōni samastamu naku kāraṇamainadi yagu parabrahmamē ‘tat’ anu māṭaku lakṣyamu - ‘tat’ anagā aṭṭi parabrahmamē -).
(tat - ani; tvaṃ = nīvu; asi = ayitivi - adē nīvu - ā parabrahmamē nīvu ani śruti ceppucunnadi. idiyē mahāvākyamu - ā parabrahma nīvē ani jīvabrahmala aikyamunu teliyacēyu sarvavēdāṃtasāramu -aṃducēta ‘tat’ anagā ā parabrahmamē yani yarthamu).
(upaniṣattulanniṃṭilōnu; tat ‘anagā parabrahma prasiddhi. ’tatvamasi’anu mahāvākyamulōni ’tat’ anumāṭa parabrahmaku lakṣyārthamu - anu māhāvākyamu guṟiṃci cēsina vyākhyānamu iṭlunnadikanuka).
pārōkṣya śabalaḥ satyādyātmakaḥ tatsadābhidhiḥ ||“. (ādhyātmōpaniṣat)
(māya upādhigā galadinnī, jagattunaku kāraṇamainaṭuvaṃṭidinnī, parōkṣamainadinnī,“satyaṃ jñānamanaṃtaṃ” ani ceppabaḍu lakṣaṇamulu galadinnī ayina parabrahma ‘tat’ anumāṭacēta ceppabaḍucunnadi).
(tat anagā vistariṃpacēyunadi, vyāpiṃpacēyunadi. “tataṃ’vyāpana śīlaḥ viṣṇuḥ - vyāpiṃcu svabhāvamu kalavāḍu, vyāpiṃpacēyu svabhāvamu galavāḍu kanuka viṣṇuvu - parabrahma).
“yēnasarvamidaṃ”jagat tataṃ” vyāptaṃ sadākhvyēna brahmaṇāsākāśaṃ, ākāśēnēvaghaṭādayaḥ, tat - (ghaṭamu modalagu samastavastuvulalōnu ākāśamy vyāpiṃci yunnaṭlu, satpadārthamani ceppabaḍu (sarvakālamulaṃdu uṃḍunadi ani ceppabaḍu).parabramacēta ī samasta jagattu vyāpiṃcabaḍiyunnadi - ā parabrama ‘tat’ ani ceppabaḍucunnadi).
‘tat’ iti vāñmanō (a)gamyaṃ dhyēyamyatsūryamaṃḍalē”.
(vākkucēta ceppūṭakugāni, manassulō iṭuvaṃṭivāḍu ani nirṇayiṃcukonuṭakugāni vīlugānaṭuvaṃṭinnī, dhyāniṃpa tagina vastuvaina parabrahma tat ani ceppabaḍucunnadi) –
“dhyēyassadā savitṛmaṃḍala madhyavartī nārāyaṇaḥ - - - prōdyajātityavargā bhaḥ sūryamaṃḍala madhyagaḥ - - - dōḥ dvayōḥ dhyēya yēvaca ||”.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.