← Back to త · Booklets 21–30 (digitized file 3)

తత్పదవాచ్యార్థము tatpadavācyārthamu

Original — తెలుగు
  1. సర్వ శక్తిమాన్, సర్వజ్ఞః, విభుః, ఈశ్వరః, స్వతంత్రః, పరోక్షః, మాయీ, బంధమోక్షరహితశ్చ ఇతి సర్వ శక్తి మత్వాది ధర్మ విశిష్టం ఈశ్వర చైతన్యం తత్పదవాచ్యార్థః’“.

(సమస్త శక్తులు గలవాడు, సర్వజ్ఞుడు (అన్నియు తెలిసినవాడు), విభుడు * ప్రభువు, వైభవము గలవాడు వ్యాపకుడు), ఈశుడు (లోపలనుండి ప్రేరేపించువాడు), స్వతంత్రుడు (పరతంత్రుడు కానివాడు - మాయకు లోనుగానివాడు), కర్మఫలమునకు స్వాధీనుడు కానివాడు, పరోక్షుడు (సామాన్యజీవునకు ప్రత్యక్షముకానివాడు), మాయావి (మాయగలవాడు, మాయను తన స్వాధీనములో నుంచుకొనినవాడు), ఏ విధమైన బంధము లేనివాడు, మోక్షము లేనివాడు - ఈ ధర్మములుగల ఈశ్వర చైతన్యము తత్పదమునకు వాచ్యార్థము)

  1. అజ్ఞానాద్రిసమష్టిః ఏ తదుపహితం సర్వజ్ఞత్వాది విశిష్టం చైతన్యం ఏ తదనుపహితం చ ఏ తత్త్రయం తప్త అయః పిండవర్ ఏజత్వేన అవభాసమానం తత్పదవాక్యార్థో భవతి“.

(అజ్ఞానాది సమష్టి , దానితో సంబంధించిన సర్వజ్ఞత్వాది విశిష్ట చైతన్యం , శుద్ధ చైతన్యము , అను ఈ మూడింటిని తప్త అయః పిండమువలె కలిసిచెప్పిన తత్పదమునకు వాచ్యార్థమగుచున్నది - అనగా, ఎఱ్ఱగా కాలిన ఇనుప గుండులోని అగ్నిని ఇనుమును ఒకటిగా గ్రహించినట్లు పై మూడింటిని ఒకటిగాగ్రహించిన తత్పదమునకు వాక్యార్థమగుచున్నది).

  1. “సర్వ సామర్థ్య విశిష్టః సర్వ వస్తు విషయక విజ్ఞానవాన్, వ్యాపకః , సర్వ ప్రేరకః , కర్మావశః, జీవ ప్రత్యక్షస్యా విషయః , స్వాధీనమాయః, బంధరహితత్వాత్ మోక్షరహితోపి - ఊఎతాదృశేశ్వరః తత్పదవాచ్యార్థః -”.

(అన్ని విధములైన సామర్థ్యము గలవాడు, సమస్త విషయములగుఱించి అయిన జ్ఞానము గలవాడు (సర్వజ్ఞుడు) వ్యాపకుడు (అన్ని వస్తువులలోను లోపల పైన పూర్తిగా వ్యాపించియుండువాడు), అన్నింటినీ వాటి వాటి వ్యాపారములలో - పనులలో - ప్రేరేపించువాడు , కర్మకు స్వాధీనము కానివాడు, జీవునకు ప్రత్యక్షముగా కనబడనివాడు, మాయను తవ స్వాధీనములో నుంచుకొనినవాడు, బంధములేనివాడగుటచేత మోక్షములేనివాడు - (రెండునూ లేనివాడగుటచేత నిత్యుడు అయినవాడు) - ఈ లక్షణములు గల ఈశ్వరుడు తత్పదమునకు వాచ్యార్థము).

  1. పారోక్ష్యశబళస్సర్వజ్ఞత్వాది లక్షణో, మాయోపాధి సచ్చిదానందలక్షణో జగద్యోనిః తత్పదవాచ్యోభవతి.

(పరోక్షమందుండి - ఎవరికిని కనబడకయుండి - సర్వజ్ఞుడు అను మొదలగు లక్షణములు గలవాడున్నూ, జగత్తు పుట్టుటకు కారణమైన వాడున్నూ, ‘తత్’ పదమునకు వాచ్యార్థము).

  1. “జీవేనాత్మనాను ప్రవిశ్యనామ రూపే వ్యాకరవాణి, నాయరూపయోర్నిర్వహితాత్ యదంతః తద్భ్రహ్మ”

“తత్సృష్టా తదేవాను ప్రావిశత్, తదను ప్రవిశ్య సచ్చత్యచ్చా భవత్” ఇత్యాది శ్రుతయః నామ రూప వ్యాకరణేన తత్తచిద చిద్వస్తు శరీరకతయా తత్తచ్చబ్ద వాచ్యో అభూత్ ఇతి ప్రతిపాదయంతి అయం అభిప్రాయః - స్వయమంతరాత్మ తయా నామరూపయోః నిర్వాహకో భవితుం బుద్ధ్యాది శబ్దోప లక్షితసమష్టి పరం పరయా మహాభూత పర్యంతం ఆత్మానం తత్తచ్ఛరీరకం పరిణమయ్య తన్మయః పునః సదసచ్చబ్దవాచ్య చిదచిన్మశ్ర దేవాది సథావరాంత జగద్రూప తత్తచ్ఛబ్ద వాచ్యశ్చ అభవత్“.

(జీవరూపములో ఆత్మగా వస్తువులలో ప్రవేశించి వాటిని నామరూపములుగలవిగా చేయుదును ! నామరూపములు కలవిగాచేయుటచేత వాటిలోపల నున్నది పరబ్రహ్మ “దానిని సృష్టించి దానిలోనే ప్రవేశించెను, దానిలో ప్రవేశించి తానే ‘సత్’ , ;త్యత్ ‘కూడ ఆయెను” అను మొదలుగా శ్రుతులు చెప్పుచున్నవి. ఇట్లు నామరూపములు కలుగచేయుటవలన ఆయా చిద్వస్తువులు అచిద్వస్తువుల యొక్క రూపములు - తానే అయి ఆయా వస్తువులుగా తానే చెప్పబడిచున్నాడు అని శ్రుతులు ప్రతిపాదించుచున్నవి - దీని అభిప్రాయమేమనగా - తానే అంతరాత్మగానుండి నామరూపములు కలుగునట్లు చేయుటకు బుద్ధి మొదలగు మాటలద్వారా ఉపలక్షితమగు సర్వ జగద్వస్తు సమష్టిలోను తానే ఆయా శరీరములుగా - ఆయా వస్తువులుగామారి, వాటిలో పూర్తిగా తానే వ్యాపించి సత్, అసత్ అని చెప్పబడుచున్న చిత్, అచిత్ వీటి మిశ్రములూగు దేవతలు మొదలు స్థావరములవరకు గల జగత్తే రూపముగా గలవాడు’ తత్’ అను శబ్దముచే చెప్పబడు చున్నాడు - అతనే తచ్ఛబ్ద వాచ్యార్థము).

Transliteration
  1. sarva śaktimān, sarvajñaḥ, vibhuḥ, īśvaraḥ, svataṃtraḥ, parōkṣaḥ, māyī, baṃdhamōkṣarahitaśca iti sarva śakti matvādi dharma viśiṣṭaṃ īśvara caitanyaṃ tatpadavācyārthaḥ’“.

(samasta śaktulu galavāḍu, sarvajñuḍu (anniyu telisinavāḍu), vibhuḍu * prabhuvu, vaibhavamu galavāḍu vyāpakuḍu), īśuḍu (lōpalanuṃḍi prērēpiṃcuvāḍu), svataṃtruḍu (parataṃtruḍu kānivāḍu - māyaku lōnugānivāḍu), karmaphalamunaku svādhīnuḍu kānivāḍu, parōkṣuḍu (sāmānyajīvunaku pratyakṣamukānivāḍu), māyāvi (māyagalavāḍu, māyanu tana svādhīnamulō nuṃcukoninavāḍu), ē vidhamaina baṃdhamu lēnivāḍu, mōkṣamu lēnivāḍu - ī dharmamulugala īśvara caitanyamu tatpadamunaku vācyārthamu)

  1. ajñānādrisamaṣṭiḥ ē tadupahitaṃ sarvajñatvādi viśiṣṭaṃ caitanyaṃ ē tadanupahitaṃ ca ē tattrayaṃ tapta ayaḥ piṃḍavar ējatvēna avabhāsamānaṃ tatpadavākyārthō bhavati”.

(ajñānādi samaṣṭi , dānitō saṃbaṃdhiṃcina sarvajñatvādi viśiṣṭa caitanyaṃ , śuddha caitanyamu , anu ī mūḍiṃṭini tapta ayaḥ piṃḍamuvale kalisiceppina tatpadamunaku vācyārthamagucunnadi - anagā, eṟṟagā kālina inupa guṃḍulōni agnini inumunu okaṭigā grahiṃcinaṭlu pai mūḍiṃṭini okaṭigāgrahiṃcina tatpadamunaku vākyārthamagucunnadi).

  1. “sarva sāmarthya viśiṣṭaḥ sarva vastu viṣayaka vijñānavān, vyāpakaḥ , sarva prērakaḥ , karmāvaśaḥ, jīva pratyakṣasyā viṣayaḥ , svādhīnamāyaḥ, baṃdharahitatvāt mōkṣarahitōpi - ūetādṛśēśvaraḥ tatpadavācyārthaḥ -”.

(anni vidhamulaina sāmarthyamu galavāḍu, samasta viṣayamulaguṟiṃci ayina jñānamu galavāḍu (sarvajñuḍu) vyāpakuḍu (anni vastuvulalōnu lōpala paina pūrtigā vyāpiṃciyuṃḍuvāḍu), anniṃṭinī vāṭi vāṭi vyāpāramulalō - panulalō - prērēpiṃcuvāḍu , karmaku svādhīnamu kānivāḍu, jīvunaku pratyakṣamugā kanabaḍanivāḍu, māyanu tava svādhīnamulō nuṃcukoninavāḍu, baṃdhamulēnivāḍaguṭacēta mōkṣamulēnivāḍu - (reṃḍunū lēnivāḍaguṭacēta nityuḍu ayinavāḍu) - ī lakṣaṇamulu gala īśvaruḍu tatpadamunaku vācyārthamu).

  1. pārōkṣyaśabaḷassarvajñatvādi lakṣaṇō, māyōpādhi saccidānaṃdalakṣaṇō jagadyōniḥ tatpadavācyōbhavati.

(parōkṣamaṃduṃḍi - evarikini kanabaḍakayuṃḍi - sarvajñuḍu anu modalagu lakṣaṇamulu galavāḍunnū, jagattu puṭṭuṭaku kāraṇamaina vāḍunnū, ‘tat’ padamunaku vācyārthamu).

  1. “jīvēnātmanānu praviśyanāma rūpē vyākaravāṇi, nāyarūpayōrnirvahitāt yadaṃtaḥ tadbhrahma”

“tatsṛṣṭā tadēvānu prāviśat, tadanu praviśya saccatyaccā bhavat” ityādi śrutayaḥ nāma rūpa vyākaraṇēna tattacida cidvastu śarīrakatayā tattaccabda vācyō abhūt iti pratipādayaṃti ayaṃ abhiprāyaḥ - svayamaṃtarātma tayā nāmarūpayōḥ nirvāhakō bhavituṃ buddhyādi śabdōpa lakṣitasamaṣṭi paraṃ parayā mahābhūta paryaṃtaṃ ātmānaṃ tattaccharīrakaṃ pariṇamayya tanmayaḥ punaḥ sadasaccabdavācya cidacinmaśra dēvādi sathāvarāṃta jagadrūpa tattacchabda vācyaśca abhavat”.

(jīvarūpamulō ātmagā vastuvulalō pravēśiṃci vāṭini nāmarūpamulugalavigā cēyudunu ! nāmarūpamulu kalavigācēyuṭacēta vāṭilōpala nunnadi parabrahma “dānini sṛṣṭiṃci dānilōnē pravēśiṃcenu, dānilō pravēśiṃci tānē ‘sat’ , ;tyat ‘kūḍa āyenu” anu modalugā śrutulu ceppucunnavi. iṭlu nāmarūpamulu kalugacēyuṭavalana āyā cidvastuvulu acidvastuvula yokka rūpamulu - tānē ayi āyā vastuvulugā tānē ceppabaḍicunnāḍu ani śrutulu pratipādiṃcucunnavi - dīni abhiprāyamēmanagā - tānē aṃtarātmagānuṃḍi nāmarūpamulu kalugunaṭlu cēyuṭaku buddhi modalagu māṭaladvārā upalakṣitamagu sarva jagadvastu samaṣṭilōnu tānē āyā śarīramulugā - āyā vastuvulugāmāri, vāṭilō pūrtigā tānē vyāpiṃci sat, asat ani ceppabaḍucunna cit, acit vīṭi miśramulūgu dēvatalu modalu sthāvaramulavaraku gala jagattē rūpamugā galavāḍu’ tat’ anu śabdamucē ceppabaḍu cunnāḍu - atanē tacchabda vācyārthamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.