బ్రహ్మజ్ఞానము; అపరోక్షజ్ఞానము.
దేహాది సమస్త పదార్థములకన్న ఆత్మ వేఱు అను జ్ఞానము.
న హి స్తాణౌ ఏకస్మిన్ స్థాణుత్వా పురుషో అన్యోహ ఇతి తత్వజ్ఞ్మానం భవతి - - తత్ర పురుషో అన్యోవా ఇతి మిధ్యాజ్ఞానం, స్థాణురేవ ఇతి అత్వజ్ఞానం - వస్తు తంత్రత్వాత్ -.
(చీకటిలో స్థాణువును చూచి ఇది స్థాణువా, పురుషుడా అనుకొనుట తత్వజ్ఞానం కాదు - అది పురుషుడా, ఇతరమైనదా యను జ్ఞానము మిథ్యాజ్ఞానము - అది స్థాణువే యని తెలుసుకొను జ్ఞానము తత్వజ్ఞానము - యథార్థజ్ఞానము - యథార్థమును తెలుసుకొను జ్ఞానము).
(“- - - ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తియోగతః |
భగవత్తత్త్వవిజ్ఞానం ముక్తసంగస్య జాయతే | - - -) (శ్రీమద్భాగవతం 1 - 2 - 20, 21)
యస్యైతే నియతా దండాః సత్రిదండీతి కథ్యతే |
ఈ దృశస్య భవేఫ్దేవ తత్వ జ్ఞానమీతీర్యతే |
యస్యాత్మా సర్వ భూతానామాత్మ భూతస్స ఈ దృశః ||“. (గీతాభావప్రకాశము - 5 - 71 to 73)
(వాగ్దండము, మనోదండము, కాయదండము అను ఈ మూడును కలవాడు త్రిదండి అని చెప్పబడును - ఈ - త్రిదండికే తత్వజ్ఞానము కలుగును అని చెప్పబడినది. మఱియును - ఎవనియొక్క ఆత్మ సమస్త భూతముల యొక్క ఆత్మయని ఎవడు తలచునో, సమస్త ప్రాణులు ఒకదానునుండి మఱియొకటి భేదముగా ఉన్నదను భేదదృష్టిని విడిచి అన్ని ఒకటే ఒక పరమాత్మతత్వముగలవి అను అభిప్రాయము ఎవనికి కలదో అతనికే - అఖండాద్వైత బుద్ధి కలవానికే - తత్వజ్ఞానము కలుగును).
యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః” (శ్రీమద్భగవద్గీత - 7 - 3)
(వేన వేలు మనుష్యులలో ఏ ఒకడో సిద్ధిని పొందుటకు యోచించును - చిత్త శుద్ధికొఱకు యోగ మును ప్రారంభించును. ఇట్లు ప్రయత్నము చేయువారిలో - సిద్ధిని పొందినవారిలో ఏ ఒకడో నన్ను - నా తత్వమును - తెలుసుకొనును).
(గాంధార దేశస్తులైన కొందరు చోరులు ఒకనిని మఱియొక దేశములోని అడవిలో కళ్ళు కట్టి విడిచి వెళ్ళి పోయిరి. వాని కళ్ళు కట్టు విప్పి ఒకడు వాని దేశమునకు పోవుమార్గము చెప్పగా అతను తన దేశమును చేరుకో గలిగెను - ఆ ప్రకారముగానే అవిద్యా కామములచేత తన స్వరూపానందమును - తానే పరమానంద స్వరూపుడైన పరబ్రహ్మము అను జ్ఞానమును - కోల్పోయి సంసారమను మహారణ్యములో పడియున్నవానికి ఒకానొక దయాపరుడైన ఆచార్యుని - గురువు - చేత “నీవు సంసారివి కావు, ఆ పరబ్రహ్మవు నీవే” అని తత్వజ్ఞానము బోధించగా దానివలన తన స్వ స్వరూపమును - తానే పరబ్రహ్మ, అని తెలుసుకొనును - తత్వజ్ఞానము కలుగును - ఇట్లు ఆచార్యుని ద్వారా కాక ఇతరవిధముగ తత్వజ్ఞానము కలుగనేరదు).
brahmajñānamu; aparōkṣajñānamu.
dēhādi samasta padārthamulakanna ātma vēṟu anu jñānamu.
na hi stāṇau ēkasmin sthāṇutvā puruṣō anyōha iti tatvajñmānaṃ bhavati - - tatra puruṣō anyōvā iti midhyājñānaṃ, sthāṇurēva iti atvajñānaṃ - vastu taṃtratvāt -.
(cīkaṭilō sthāṇuvunu cūci idi sthāṇuvā, puruṣuḍā anukonuṭa tatvajñānaṃ kādu - adi puruṣuḍā, itaramainadā yanu jñānamu mithyājñānamu - adi sthāṇuvē yani telusukonu jñānamu tatvajñānamu - yathārthajñānamu - yathārthamunu telusukonu jñānamu).
(“- - - ēvaṃ prasanna manasō bhagavadbhaktiyōgataḥ |
bhagavattattvavijñānaṃ muktasaṃgasya jāyatē | - - -) (śrīmadbhāgavataṃ 1 - 2 - 20, 21)
yasyaitē niyatā daṃḍāḥ satridaṃḍīti kathyatē |
ī dṛśasya bhavēphdēva tatva jñānamītīryatē |
yasyātmā sarva bhūtānāmātma bhūtassa ī dṛśaḥ ||“. (gītābhāvaprakāśamu - 5 - 71 to 73)
(vāgdaṃḍamu, manōdaṃḍamu, kāyadaṃḍamu anu ī mūḍunu kalavāḍu tridaṃḍi ani ceppabaḍunu - ī - tridaṃḍikē tatvajñānamu kalugunu ani ceppabaḍinadi. maṟiyunu - evaniyokka ātma samasta bhūtamula yokka ātmayani evaḍu talacunō, samasta prāṇulu okadānunuṃḍi maṟiyokaṭi bhēdamugā unnadanu bhēdadṛṣṭini viḍici anni okaṭē oka paramātmatatvamugalavi anu abhiprāyamu evaniki kaladō atanikē - akhaṃḍādvaita buddhi kalavānikē - tatvajñānamu kalugunu).
yatatāmapi siddhānāṃ kaścinmāṃ vētti tatvataḥ” (śrīmadbhagavadgīta - 7 - 3)
(vēna vēlu manuṣyulalō ē okaḍō siddhini poṃduṭaku yōciṃcunu - citta śuddhikoṟaku yōga munu prāraṃbhiṃcunu. iṭlu prayatnamu cēyuvārilō - siddhini poṃdinavārilō ē okaḍō nannu - nā tatvamunu - telusukonunu).
(gāṃdhāra dēśastulaina koṃdaru cōrulu okanini maṟiyoka dēśamulōni aḍavilō kaḷḷu kaṭṭi viḍici veḷḷi pōyiri. vāni kaḷḷu kaṭṭu vippi okaḍu vāni dēśamunaku pōvumārgamu ceppagā atanu tana dēśamunu cērukō galigenu - ā prakāramugānē avidyā kāmamulacēta tana svarūpānaṃdamunu - tānē paramānaṃda svarūpuḍaina parabrahmamu anu jñānamunu - kōlpōyi saṃsāramanu mahāraṇyamulō paḍiyunnavāniki okānoka dayāparuḍaina ācāryuni - guruvu - cēta “nīvu saṃsārivi kāvu, ā parabrahmavu nīvē” ani tatvajñānamu bōdhiṃcagā dānivalana tana sva svarūpamunu - tānē parabrahma, ani telusukonunu - tatvajñānamu kalugunu - iṭlu ācāryuni dvārā kāka itaravidhamuga tatvajñānamu kaluganēradu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.