యాధార్థ్యం; యథార్థత్వం - (నిజస్థితి; స్వస్వరూపము, యదార్థస్వరూపము).
బ్రహ్మతత్వం.
(పరబ్రహ్మయొక్క స్వస్వరూపము , యథార్థస్థితి - ప్రకృతితో కలియక కేవలుడైయుండు పరబ్రహ్మ స్వరూపము, లేక స్థితి).
బ్రహ్మణః భావః; యధార్థ్యం తత్వం. (పరబ్రహ్మయొక్క నిజమైన భావము, బ్రహ్మతత్వము -).
“తత్ ఇతి సర్వనామ, సర్వంచ బ్రహ్మ తస్య నామతత్ ఇతి, తద్భావః తత్వం, బ్రహ్మణః యాధాత్మ్యం.
(తత్ అనగా అది యని అర్థము - ‘అది’ అనినది సర్వనామము - నామవాచకమునకు బదులుగా వాడుక చేయబడునది. ప్రపంచమంతయు, ప్రపంచములోని వస్తువులన్నియు భగవంతునిలోనుండి పుట్టుట చేత, ప్రపంచమంతయు, దానిలోని వస్తువులన్నియు భగవంతుడే - వాటి నామములన్నియు భగవన్నామములే. అందుచేత ‘తత్’ అనగా భగవంతుడు; లేక, అతని నామములను నామవాచకములకు బదులుగా వాడబడుచున్నది. ఇది పరబ్రహ్మమును సూచించునది గావున ఇది పరబ్రహ్మనామము - ఆ పరబ్రహ్మ యొక్క భావము - యధార్థ స్థితి -, తత్వము).
(సమస్త ప్రపంచములోను - ఆ ప్రపంచములోని సమస్తవస్తువులలోను - అంతర్భావముగా (అంతరాత్మగా) నుండు శక్తి (చిచ్ఛక్తి, చైతన్య శక్తి) యే తత్వము అని చెప్పబడుచున్నది).
తత్వ శబ్దః స్వరూప పరః. (తత్వమనగా స్వరూపము. అన్నింటి యొక్క స్వరూపము భగవంతుడే. అందుచేత తత్వమనగా భగవంతుడు).
ఆత్మ యాధార్థ్యం. (ఆత్మయొక్క నిజస్థితి - స్వస్వరూపము).
పరమార్థసత్.
“తధ్యమమృతం సత్యం పరపార్థతః సతత్వ మిత్యతే ఏకార్థవాచినం | పరమార్థ సతో బ్రహ్మణః వాచకాః శబ్దః”.
(పరమార్థ సత్యము - తధ్యమ్ను, అమృతము, సత్యము ఇది సద్రూపుడు. పరమార్థము (పరమ పురుషార్థరూపము) అయిన పరబ్రహ్మయొక్క వాచకములు, శబ్దములు, పేర్లు).
(సమస్త జగత్ సృష్టికి కారణమైనదిన్నీ, చాతుర్విధ పురుషార్థములచేత పొందతగినదిన్నీ అయినపదము, స్థానము - పరమపదము అయిన తత్వము. అట్టి పరపదమే పరబ్రహ్మ - అందుచేత ‘తత్వం’ అనగా పరబ్రహ్మమే).
మయ్యేవ సంస్థితిం నష్టం మత్సమో నాధికస్సదా |
తస్మా దజ్ఞాన మూలస్య సంసారస్య క్షయో, హరే |
ఆత్మనస్తత్వ విజ్ఞానాత్ తత్వం బ్రహ్మైవ కేవలం ||“. (సూతసమ్హితాయాం)
(ఈ జగత్తు నావలననే పుట్టినది, నాలోనే ఉన్నది, నాలోనే లీనమైపోవుచున్నది. అందుచేత నేనే పరమతత్వము - అజ్ఞానమే (జ్ఞానము లేకపోవుటయే) కారణమైన సంసారమును భేదించుట ఆత్మతత్వజ్ఞానము వలననే కలుగును - కేవల నిరాకార, నిర్గుణ పరబ్రహ్మమే తత్వము.
సూక్ష్మాత్ సూక్ష్మతరం నిత్యం తత్వమేవ, త్వమేవ తత్ ||“. (కైవల్యోపనిషత్)
సమస్తమునకు ఆత్మ అయినది, ప్రపంచమునకు ఆయతనం (ఉండుచోటు) అయినదిన్నీ, చిన్నదాని కన్న చిన్నది అయినదిన్నీ, ఎల్లకాలమునందుండునదున్నీ, అయినది పరబ్రహ్మ. అది నీవే, (ఆత్మతత్వము నీవే) (ప్రతి వస్తువులోమ్నూండునది ఒకే తత్వము - అదే పరబ్రహ్మ).
యత్ సర్వం సర్వగం వస్తు యత్ తత్వం తదసౌస్థితః ||“. (వాసిష్టే)
(ఏది అందఱి హృదయములను పొందియున్నదో, ఏది సమస్త వస్తువులు తానే అయియున్నదో, ఏది సమస్త వస్తువులలోను అంతరాత్మగానున్నదో, ఏది సమస్త శాస్త్రములలోను సిద్ధాంతము చేయబడినదో, అదియేతత్వము - ఆ తత్వము నీవే).
యత్సర్వం చాప్య సర్వంచ యత్ తత్వం. తదసౌ స్థితః ||“.
(ఏది ఓకటే అయినదో, జగద్రూపములో, జగత్తులోని వస్తువులుగా అనేకముగానున్నదో, అంతా తానే అయి యున్నప్పటికీ, అంతా తాను కానట్లుండునో అట్టి తత్వము నీవే అయి యున్నావు (భగవంతుడే).
ఉత్పత్యాదినిర్ముక్తం స్వతంత్రం పూర్ణమ ద్వయం |
ప్రకృతి ప్రాకృతాతీతం లక్ష్య లక్షణ వర్జితం |
బంధమోక్ష వినిర్ముక్త,ం బంధమోక్షవిధాయకం |
కాలాతీత కళాతీతం కారకగ్రామవర్జితం |
అనంతమఖిలాధారమ పరిచ్ఛిన్న వైభవం ||“. (పరాశరో పురాణము)
(స్వభావముచేత నిర్మలమైనదిన్నీ, జననమరణములు లేనిదిన్నీ, స్వతంత్రమైనదిన్నీ, ప్రపంచమంతటను పూర్తిగా నిండియున్నదిన్నీ, తనకన్న వేరు వస్తువు లేనిదిన్నీ, ప్రకృతిని, ప్రకృతి కార్యములైనవాటికిన్నీ అతీతమైనదిన్నీ, లక్ష్యము లక్షణము అనునవి లేనిదిన్నీ, బంధమోక్షములు లేనిదిన్నీ, అయినను బంధమోక్షములను విధించునదిన్నీ, కాలమునకు అతీతమైనదిన్నీ, కళలు లేనిదిన్నీ, కారణము (జన్మ) లేనిదిన్నీ,త్రివిధపరిచ్ఛేద రహితమైనదిన్నీ, సమస్త ప్రపంచమునకు ఆధారమైనదిన్నీ, అయిన వస్తువు పరబ్రహ్మము - అదియే తత్వము, పరతత్వము).
బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ద్యతే ||
తచ్ఛ్రధ్ధధానామనయో జ్ఞాన వైరాగ్య యుక్తయా |
పశ్యంత్యాత్మని చాత్మానం భక్త్యా శ్రుత గృహీతయా ||“. (శ్రీమద్భాగవతం - 1 - 2 - 11, 12)
“వ. - - - తత్వవిదులు జ్ఞానంబనుపేర నద్వయంబైన యది తత్వంబని యెఱుంగుదురు. ఆ తత్వంబౌపనిషధులచేత బ్రహ్మమనియు, హైరణ్యగర్భులచేత పరమాత్మయనియు, సాత్వతులచేత భగవంతుడనియు బలుకంబడు - - -” (శ్రీమహాభాగవతము - 1 - 2 - 56)
సమంతత్వం సవిందంతి ద్వైతా ద్వైత వివర్జితం ||. (అవధూతగీత)
(పరబ్రహ్మకన్న వేరే మరియొకవస్తువు లేనే లేదని కొందరు, ఉన్నదని కొందఱు నమ్మి ఉపాసించుచున్నారు - (పరబ్రహ్మ అవ్యయమని, వేరు బ్వేరుగా అభిప్రాయపడుచున్నారు. ద్వైతముకానిది, అద్వైతముకానిది యగు తత్వమును తెలియలేక యున్నారు),.
పన్నగపతిశాయి తత్వభావము, మేనం
గన్నుల వేల్పును, డాపల
జన్నమరిన వేల్పు, ముదుక చదువుల వేల్పున్ ||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 3 - 175)
(శరీరమునిండ కన్నులుగల ఇంద్రుడుగాని, అర్థనారీశ్వరుడైన శివుడుగాని, వేదములు చేసిన చతుర్ముఖ బ్రహ్మకాని శేషశాయి అయిన శ్రీమహావిష్ణువు (పరబ్రహ్మ) యొక్క తత్వమును తెలియలేరు).
(“- - - మీపావన తత్వలక్షణము పావకమిత్రసుతుండెఱుంగు).
(పరబ్రహ్మమైన శ్రీరామచంద్రుని తత్వము - పరబ్రహ్మతత్వము - హనుమంతునికి తెలుసును).
వాయుపుత్ర మహాబాహో కిం తత్వం బ్రహ్మవాదినాం |
పురాణేష్పష్టదిస సుస్మృతి ష్వష్టా దిశస్వపి |
చతుర్వేదేషు శాస్త్రేషు విద్యా స్వాధ్యాత్మికేవచ |
సర్వేషు విద్యా దానేషు విఘ్న సూర్య శక్తిషు |
ఏతేషు మధ్యే కింతత్వం కథయత్వం మహా బల -”
“హనుమానువాచ -” భో !
యోగీంద్రాశ్చ ఋష యో విష్ణు భక్తా స్త దైవచ |
శృణుధ్వం మామకం వాచం భవబంధ చినాశినీం |
ఏతేషు చైవ సర్వేషు తత్వం చ బ్రహ్మ తారకం |
రామ ఏవ పరబ్రహ్మ రామ ఏవ పరం తపః |
రామ ఏవ పరం తత్వం శ్రీరామో బ్రహ్మతారకం ||“. (రామరహస్యోపనిషత్)
(ప్రహ్లాదుడు మొదలగు విష్ణుభక్తులు హనుమంతుని యి ట్లడిగిరి - “వాయు పుత్రుడైన హనుమంతా ! బ్రహ్మ వాదులకు - బ్రహ్మతత్వము గుఱించి తర్జన భర్జన చేయువారలకు - తత్వమనునది ఏది? అష్టాదశ పురాణములలోను, నాలుగు వేదములందు, ఆధ్యాత్మిక విద్యలందు తత్వమని చెప్పబడినదేది? విఘ్నేశ్వరుడు, సూర్యుడు, శక్తి (దేవి), ఉపాసనాదేవతులు - వీటిలో ఏది తత్వమని చెప్ప బడినది - ఈ విషయము చెప్పుము”).
(పై ప్రశ్నకు హనుమంతుడు ఈ రీతిగా ఉత్తరమిచ్చెను -“యోగీశ్వరులారా ! ఋషులారా ! విష్ణుభక్తులారా ! సంసారమను బంధమునుండి మిమ్ములను విముక్తులుగ చేయు నా యీ మాట వినుడు - మీరు చెప్పిన వాటి అన్నింటిలోను చెప్పబడిన తత్వము పరబ్రహ్మమే. ఆ పరబ్రహ్మ శ్రీరాముదే. అతనే పరమ అతనే పరమ తపస్సు (ప్రతి వస్తువులోనుండి దానిని తపింపచేసి, దానికి చైతన్యము కలిగించి దానిలోనుండి మఱియొక వస్తువును సృష్టింపచేయువాడు. ఈ ప్రకారముగా సృష్టినంతటిని నడుపువాడు. అందుచేత శ్రీరాముడే పరతత్వము - అతనే సంసారమునుండి తపింపచేయువాడు - తారకము).
(ప్రపంచమంతటి యొక్క వాస్తవరూపము తత్వమనబడును - ప్రపంచమంతయు, దానిలోని వస్తువులన్నియు భగవంతునిలోనుండి పుట్టినవే. అందుచేత అవన్నియు భగవంతుని రూపములే. వేరు వేరు వస్తువులుగా కనబడుట భ్రమ. అందుచేత ఈ కనబడు ప్రపంచము వాస్తవముగా - యథార్థముగా - భగవంతుడే - ప్రపంచము యొక్క వాస్తవరూపము భగవంతుడే - అదియే తత్వము - ఈ భగవంతునిదైన ఒకే తత్వము అన్ని వస్తువులుగా వ్యాపించి వాటి అన్నింటిలోను ఆ తత్వమే పూర్తిగా నిండియున్నది. అందుచేత ప్రపంచము యొక్క వాస్తవరూపము భగవంతుడే - తత్వమే - భగవత్తత్త్వమే).
“వ. - - - వాగ్బుద్ధీంద్రియ మానసంబులచేతం జెప్పను నిట్టిదని నిరూపింపను నలవిగాక యెవ్వని గుణరూపంబులు వర్తించు, నెవ్వండు నిర్గుణుండు, సర్వంబు నెవ్వనివలన లయంబగు నట్టి పరాపరంబులకుం బరమంబై యనన్యంబై ప్రాక్ప్రసిద్ధంబై, సర్వ వ్యాపకంబై యాది కారణంబై యున్న తత్వంబు నాశ్రయింతు - - -”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 4 - 218)
తత్వం నారాయణః పరః” (మంత్రపుష్పం)
(ఉత్కృష్టుడైన నారాయణుడే తత్వము - పరతత్వము. ప్రపంచమంతయు - ప్రపంచములోని వస్తువులన్నియు భగవంతునిలోనుండి పుట్టినవి. అట్లు పుట్టినవాటన్నింటిలోను భగవంతుడు ప్రవేశించియున్నాడు, అవన్నియు అతనిలోనే అతనిలోనే లయమగుచున్నవి - అనగా, ప్రపంచమునకు సౄష్టి స్థితిలయములు చేయువాడు భగవంతుడు కనుక నారాయణుడను చెప్పబడుచున్నాడు. అట్టి నారాయణుడే తత్వము - అన్నింటిలోను ఉండి వాటికి చైతన్యము కలిగించి వాటిచేత పనులు చేయించువాడు - ఇది ఇంకొకరు చేయువారు లేరు - అందుచేత సృష్టి అంతటిలోను ఉన్నతత్వము - శక్తి - ఒకటే. అదే పరబ్రహ్మ, నారాయణుడని చెప్పబడుచున్నాడు).
తత్ + త్వం = తత్వం - (తత్ = అది, త్వం = నీవు ఉండుట - అదిగానుండుట, దానిగా నుండుట - దాని స్థితి అని అర్థము - ఉదాహరణ _ అంధత్వము; మూఢత్వము; మూకత్వము; జడత్వము. అందుచేత ‘తత్ + త్వం’ అనగా దానివలె నుండు స్థితి; ‘తత్ ’అనగా పరబ్రహ్మ - ’ఓం తత్సత్’ అనునవి పరబ్రహ్మను నిర్దేశించునవి. అందుచేయ్త ‘తత్ త్వం’ అనగా బ్రహ్మమే అయి యుండుట - పరబ్రహ్మ తన చిచ్ఛక్తి తో ప్రకృతితో కలియగా ప్రకృతి పరబ్రహ్మమే అయినది - పరబ్రహ్మ ప్రకృతిగా మారినది, అందుచేత అది పరబ్రహ్మ తత్వమే. ప్రకృతి పరబ్రహ్మ శక్తి కలిగి ఈ పరపంచముగను, దానిలోని అన్ని వస్తువులుగనుమారినది. అందుచేత ప్రపంచములోని వస్తువులన్నియు పరబ్రహ్మ తత్వమే - “తత్ సృష్ట్వా తదేవాను ప్రావిశత్, తదను ప్రవిశ్యసచ్చ, త్యచ్చ అభవత్” (పరబ్రహ్మ - భగవంతుడు ప్రపంచమును సృష్టించి,దానిలోనే ప్రవేశించెను, అట్లు పరవేశించి దానిలోని ప్రతి వస్తువుగా - ‘సత్ , అసత్’ వస్తువులుగా - తానే ఆయెను). అందుచేత ప్రపంచములో ప్రతి వస్తువు, ప్రపంచమంతా పరబ్రహ్మ తత్వమే - “తత్వమసి” (తత్ + త్వం + అసి = ‘ఆ పరబ్రహ్మ నీవే అయితివి’ అను మహావాక్యములోని అర్థము బ్రహ్మజ్ఞానము కలిగిన నరులకేకాక ప్రతి వస్తువునకు వర్తించును. నరులు జ్ఞానము గలవారుకనుక తానే పరబ్రహ్మ, పరతత్వమైన పరబ్రహ్మ అని తెలుసుకో గల్గుచున్నారు - ప్రపంచములోని ఇతర జీవులు - వస్తువులు - ఇట్టి జ్ఞానములేనివారైనను వాస్తవముగా వారందరు - అవి అన్నియు బ్రహ్మతత్వమే - ప్రపంచములో పరబ్రహ్మకాని వస్తువు లేదు - బ్రహ్మజ్ఞానులుకాని ఇతర నరులు, ఇతర జీవులు, ఇతర వస్తువులు వాటి యదార్థతత్వమును తెలియకపోయినను - పరబ్రహ్మతత్వమే - ఆత్మ, అనాత్మ వస్తువులు, రెండునూ పరబ్రహ్మమే యగుతవలన - పరబ్రహ్మ తనచిచ్ఛక్తి రూపములో ప్రకృతితో కలియుటవలన మహత్తత్వము, అహంకారము, తన్మాత్రలు, పంచభూతములు, వాటి సమ్మేళనమువలన జీవులు మొదలగు వస్తువులుగా ప్రకృతియే మారెను - ఇవన్నియు సృష్టి ప్రకారములో (in the process of creation) ముఖ్యమైన ఘట్టములుగా - తత్వములుగా చెప్పబడినవి - ఇవి చతుర్వింశతి తత్వములు (ఇరువదినాలుగు తత్వములు. వీటి సమ్మేళనమువలన ప్రపంచములోని వస్తువులేర్పడినవి. చైతన్య శక్తితోకూడిన పరబ్రహ్మ వీటిలో లేనిదే ఈ తత్వములేవియు వాటిలోనుండి మఱియొక వస్తువును పుట్టింపనేరవు - అందుచేత - ప్రతి తత్వములోను పరబ్రహ్మ చిచ్ఛక్తి సహితుడై యుండుటచేతనే - ఇవన్నియు తత్వములే - భగవమంతుని చిచ్ఛక్తికలిగియున్నదే. వీటి కలియికలో భేదముండుటవలన వాటి సమ్మేళనము వలన కలుగు వస్తువులలో భేదములేర్పడుచున్నవి. కాని, అవన్నియు ఒకే తత్వము - పరబ్రహ్మతత్వము - పరబ్రహ్మ, తన చిచ్ఛక్తి, తన జడశక్తి అయిన ప్రకృతి ఒకటే కనుక - పరబ్రహ్మమే కనుక).
“యథాసా పరమాశక్తిః స్వేచ్ఛయా విశ్వరూపిణీ |
న శివేనవినా దేవి న దేవ్యా చవినా శివః |
శివశక్తి రితిహ్యేకం తత్వ మాహుర్మనీషిణః ||“.
(శివుడు లేని పార్వతి ఉండడు, పార్వతిలేనిదే శివుడు ఉండడు. అతని శక్తియే పార్వతి. శివునినుండి శివుని శక్తిని విడదీయలేము. (ఒక మనిషి శక్తి అతనినుండి వేరు చేయలేము). కనుక శివుడు పార్వతికలిసి శివశక్తి యనునది ఒకే తత్వము - అందుచేతనే శివుని అర్థశరీరము పార్వతి - (అర్థ నారీశ్వరుడు - ఆ రూపములోని శివరూపమునుండి పార్వతి రూపము వేరు చేయలేము. అందుచేతనే శివుడు సాంబుడు లేక సాంబశివుడు - ‘అంబయా సహితః సాంబః’ అంబతో - పార్వతితో కలిసియున్నవాడుసాంబుడు - అని చెప్పబడుచున్నాడు. అందుచేత ఈ రెండు కలిసి ఒకే తత్వము - శివతత్వము - అట్లే పరబ్రహ్మ శక్తులు అపరాశక్తి (ప్రకౄతి) , పరాశక్తి (చైతన్య శక్తి - ఈ రెండు శక్తులు పరబ్రహ్మకంటె వేరుకావు - ఆ రెండు శక్తులు తానే - అందుచేత ఉన్నదంతా ఒకటే తత్వము (పరబ్రహ్మత త్వము). ఇందుచేతనే సృష్టిలో ఏ పెద్దవస్తువులైనను, ఎంత చిన్న వస్తువులైనను పరబ్రహ్మ అతని శక్తి కలిసి యున్నదే. సృష్టిలో ఎక్కడైనను పరబ్రహ్మ వేరుగాను, అతని శక్తి (ప్రకృతి) వేరుగాను లేదు).
yādhārthyaṃ; yathārthatvaṃ - (nijasthiti; svasvarūpamu, yadārthasvarūpamu).
brahmatatvaṃ.
(parabrahmayokka svasvarūpamu , yathārthasthiti - prakṛtitō kaliyaka kēvaluḍaiyuṃḍu parabrahma svarūpamu, lēka sthiti).
brahmaṇaḥ bhāvaḥ; yadhārthyaṃ tatvaṃ. (parabrahmayokka nijamaina bhāvamu, brahmatatvamu -).
“tat iti sarvanāma, sarvaṃca brahma tasya nāmatat iti, tadbhāvaḥ tatvaṃ, brahmaṇaḥ yādhātmyaṃ.
(tat anagā adi yani arthamu - ‘adi’ aninadi sarvanāmamu - nāmavācakamunaku badulugā vāḍuka cēyabaḍunadi. prapaṃcamaṃtayu, prapaṃcamulōni vastuvulanniyu bhagavaṃtunilōnuṃḍi puṭṭuṭa cēta, prapaṃcamaṃtayu, dānilōni vastuvulanniyu bhagavaṃtuḍē - vāṭi nāmamulanniyu bhagavannāmamulē. aṃducēta ‘tat’ anagā bhagavaṃtuḍu; lēka, atani nāmamulanu nāmavācakamulaku badulugā vāḍabaḍucunnadi. idi parabrahmamunu sūciṃcunadi gāvuna idi parabrahmanāmamu - ā parabrahma yokka bhāvamu - yadhārtha sthiti -, tatvamu).
(samasta prapaṃcamulōnu - ā prapaṃcamulōni samastavastuvulalōnu - aṃtarbhāvamugā (aṃtarātmagā) nuṃḍu śakti (cicchakti, caitanya śakti) yē tatvamu ani ceppabaḍucunnadi).
tatva śabdaḥ svarūpa paraḥ. (tatvamanagā svarūpamu. anniṃṭi yokka svarūpamu bhagavaṃtuḍē. aṃducēta tatvamanagā bhagavaṃtuḍu).
ātma yādhārthyaṃ. (ātmayokka nijasthiti - svasvarūpamu).
paramārthasat.
“tadhyamamṛtaṃ satyaṃ parapārthataḥ satatva mityatē ēkārthavācinaṃ | paramārtha satō brahmaṇaḥ vācakāḥ śabdaḥ”.
(paramārtha satyamu - tadhyamnu, amṛtamu, satyamu idi sadrūpuḍu. paramārthamu (parama puruṣārtharūpamu) ayina parabrahmayokka vācakamulu, śabdamulu, pērlu).
(samasta jagat sṛṣṭiki kāraṇamainadinnī, cāturvidha puruṣārthamulacēta poṃdataginadinnī ayinapadamu, sthānamu - paramapadamu ayina tatvamu. aṭṭi parapadamē parabrahma - aṃducēta ‘tatvaṃ’ anagā parabrahmamē).
mayyēva saṃsthitiṃ naṣṭaṃ matsamō nādhikassadā |
tasmā dajñāna mūlasya saṃsārasya kṣayō, harē |
ātmanastatva vijñānāt tatvaṃ brahmaiva kēvalaṃ ||“. (sūtasamhitāyāṃ)
(ī jagattu nāvalananē puṭṭinadi, nālōnē unnadi, nālōnē līnamaipōvucunnadi. aṃducēta nēnē paramatatvamu - ajñānamē (jñānamu lēkapōvuṭayē) kāraṇamaina saṃsāramunu bhēdiṃcuṭa ātmatatvajñānamu valananē kalugunu - kēvala nirākāra, nirguṇa parabrahmamē tatvamu.
sūkṣmāt sūkṣmataraṃ nityaṃ tatvamēva, tvamēva tat ||“. (kaivalyōpaniṣat)
samastamunaku ātma ayinadi, prapaṃcamunaku āyatanaṃ (uṃḍucōṭu) ayinadinnī, cinnadāni kanna cinnadi ayinadinnī, ellakālamunaṃduṃḍunadunnī, ayinadi parabrahma. adi nīvē, (ātmatatvamu nīvē) (prati vastuvulōmnūṃḍunadi okē tatvamu - adē parabrahma).
yat sarvaṃ sarvagaṃ vastu yat tatvaṃ tadasausthitaḥ ||“. (vāsiṣṭē)
(ēdi aṃdaṟi hṛdayamulanu poṃdiyunnadō, ēdi samasta vastuvulu tānē ayiyunnadō, ēdi samasta vastuvulalōnu aṃtarātmagānunnadō, ēdi samasta śāstramulalōnu siddhāṃtamu cēyabaḍinadō, adiyētatvamu - ā tatvamu nīvē).
yatsarvaṃ cāpya sarvaṃca yat tatvaṃ. tadasau sthitaḥ ||“.
(ēdi ōkaṭē ayinadō, jagadrūpamulō, jagattulōni vastuvulugā anēkamugānunnadō, aṃtā tānē ayi yunnappaṭikī, aṃtā tānu kānaṭluṃḍunō aṭṭi tatvamu nīvē ayi yunnāvu (bhagavaṃtuḍē).
utpatyādinirmuktaṃ svataṃtraṃ pūrṇama dvayaṃ |
prakṛti prākṛtātītaṃ lakṣya lakṣaṇa varjitaṃ |
baṃdhamōkṣa vinirmukta,ṃ baṃdhamōkṣavidhāyakaṃ |
kālātīta kaḷātītaṃ kārakagrāmavarjitaṃ |
anaṃtamakhilādhārama paricchinna vaibhavaṃ ||“. (parāśarō purāṇamu)
(svabhāvamucēta nirmalamainadinnī, jananamaraṇamulu lēnidinnī, svataṃtramainadinnī, prapaṃcamaṃtaṭanu pūrtigā niṃḍiyunnadinnī, tanakanna vēru vastuvu lēnidinnī, prakṛtini, prakṛti kāryamulainavāṭikinnī atītamainadinnī, lakṣyamu lakṣaṇamu anunavi lēnidinnī, baṃdhamōkṣamulu lēnidinnī, ayinanu baṃdhamōkṣamulanu vidhiṃcunadinnī, kālamunaku atītamainadinnī, kaḷalu lēnidinnī, kāraṇamu (janma) lēnidinnī,trividhaparicchēda rahitamainadinnī, samasta prapaṃcamunaku ādhāramainadinnī, ayina vastuvu parabrahmamu - adiyē tatvamu, paratatvamu).
brahmēti paramātmēti bhagavāniti śabdyatē ||
tacchradhdhadhānāmanayō jñāna vairāgya yuktayā |
paśyaṃtyātmani cātmānaṃ bhaktyā śruta gṛhītayā ||“. (śrīmadbhāgavataṃ - 1 - 2 - 11, 12)
“va. - - - tatvavidulu jñānaṃbanupēra nadvayaṃbaina yadi tatvaṃbani yeṟuṃguduru. ā tatvaṃbaupaniṣadhulacēta brahmamaniyu, hairaṇyagarbhulacēta paramātmayaniyu, sātvatulacēta bhagavaṃtuḍaniyu balukaṃbaḍu - - -” (śrīmahābhāgavatamu - 1 - 2 - 56)
samaṃtatvaṃ saviṃdaṃti dvaitā dvaita vivarjitaṃ ||. (avadhūtagīta)
(parabrahmakanna vērē mariyokavastuvu lēnē lēdani koṃdaru, unnadani koṃdaṟu nammi upāsiṃcucunnāru - (parabrahma avyayamani, vēru bvērugā abhiprāyapaḍucunnāru. dvaitamukānidi, advaitamukānidi yagu tatvamunu teliyalēka yunnāru),.
pannagapatiśāyi tatvabhāvamu, mēnaṃ
gannula vēlpunu, ḍāpala
jannamarina vēlpu, muduka caduvula vēlpun ||“. (śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 3 - 175)
(śarīramuniṃḍa kannulugala iṃdruḍugāni, arthanārīśvaruḍaina śivuḍugāni, vēdamulu cēsina caturmukha brahmakāni śēṣaśāyi ayina śrīmahāviṣṇuvu (parabrahma) yokka tatvamunu teliyalēru).
(“- - - mīpāvana tatvalakṣaṇamu pāvakamitrasutuṃḍeṟuṃgu).
(parabrahmamaina śrīrāmacaṃdruni tatvamu - parabrahmatatvamu - hanumaṃtuniki telusunu).
vāyuputra mahābāhō kiṃ tatvaṃ brahmavādināṃ |
purāṇēṣpaṣṭadisa susmṛti ṣvaṣṭā diśasvapi |
caturvēdēṣu śāstrēṣu vidyā svādhyātmikēvaca |
sarvēṣu vidyā dānēṣu vighna sūrya śaktiṣu |
ētēṣu madhyē kiṃtatvaṃ kathayatvaṃ mahā bala -”
“hanumānuvāca -” bhō !
yōgīṃdrāśca ṛṣa yō viṣṇu bhaktā sta daivaca |
śṛṇudhvaṃ māmakaṃ vācaṃ bhavabaṃdha cināśinīṃ |
ētēṣu caiva sarvēṣu tatvaṃ ca brahma tārakaṃ |
rāma ēva parabrahma rāma ēva paraṃ tapaḥ |
rāma ēva paraṃ tatvaṃ śrīrāmō brahmatārakaṃ ||“. (rāmarahasyōpaniṣat)
(prahlāduḍu modalagu viṣṇubhaktulu hanumaṃtuni yi ṭlaḍigiri - “vāyu putruḍaina hanumaṃtā ! brahma vādulaku - brahmatatvamu guṟiṃci tarjana bharjana cēyuvāralaku - tatvamanunadi ēdi? aṣṭādaśa purāṇamulalōnu, nālugu vēdamulaṃdu, ādhyātmika vidyalaṃdu tatvamani ceppabaḍinadēdi? vighnēśvaruḍu, sūryuḍu, śakti (dēvi), upāsanādēvatulu - vīṭilō ēdi tatvamani ceppa baḍinadi - ī viṣayamu ceppumu”).
(pai praśnaku hanumaṃtuḍu ī rītigā uttaramiccenu -“yōgīśvarulārā ! ṛṣulārā ! viṣṇubhaktulārā ! saṃsāramanu baṃdhamunuṃḍi mimmulanu vimuktuluga cēyu nā yī māṭa vinuḍu - mīru ceppina vāṭi anniṃṭilōnu ceppabaḍina tatvamu parabrahmamē. ā parabrahma śrīrāmudē. atanē parama atanē parama tapassu (prati vastuvulōnuṃḍi dānini tapiṃpacēsi, dāniki caitanyamu kaligiṃci dānilōnuṃḍi maṟiyoka vastuvunu sṛṣṭiṃpacēyuvāḍu. ī prakāramugā sṛṣṭinaṃtaṭini naḍupuvāḍu. aṃducēta śrīrāmuḍē paratatvamu - atanē saṃsāramunuṃḍi tapiṃpacēyuvāḍu - tārakamu).
(prapaṃcamaṃtaṭi yokka vāstavarūpamu tatvamanabaḍunu - prapaṃcamaṃtayu, dānilōni vastuvulanniyu bhagavaṃtunilōnuṃḍi puṭṭinavē. aṃducēta avanniyu bhagavaṃtuni rūpamulē. vēru vēru vastuvulugā kanabaḍuṭa bhrama. aṃducēta ī kanabaḍu prapaṃcamu vāstavamugā - yathārthamugā - bhagavaṃtuḍē - prapaṃcamu yokka vāstavarūpamu bhagavaṃtuḍē - adiyē tatvamu - ī bhagavaṃtunidaina okē tatvamu anni vastuvulugā vyāpiṃci vāṭi anniṃṭilōnu ā tatvamē pūrtigā niṃḍiyunnadi. aṃducēta prapaṃcamu yokka vāstavarūpamu bhagavaṃtuḍē - tatvamē - bhagavattattvamē).
“va. - - - vāgbuddhīṃdriya mānasaṃbulacētaṃ jeppanu niṭṭidani nirūpiṃpanu nalavigāka yevvani guṇarūpaṃbulu vartiṃcu, nevvaṃḍu nirguṇuṃḍu, sarvaṃbu nevvanivalana layaṃbagu naṭṭi parāparaṃbulakuṃ baramaṃbai yananyaṃbai prākprasiddhaṃbai, sarva vyāpakaṃbai yādi kāraṇaṃbai yunna tatvaṃbu nāśrayiṃtu - - -”. (śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 4 - 218)
tatvaṃ nārāyaṇaḥ paraḥ” (maṃtrapuṣpaṃ)
(utkṛṣṭuḍaina nārāyaṇuḍē tatvamu - paratatvamu. prapaṃcamaṃtayu - prapaṃcamulōni vastuvulanniyu bhagavaṃtunilōnuṃḍi puṭṭinavi. aṭlu puṭṭinavāṭanniṃṭilōnu bhagavaṃtuḍu pravēśiṃciyunnāḍu, avanniyu atanilōnē atanilōnē layamagucunnavi - anagā, prapaṃcamunaku sṝṣṭi sthitilayamulu cēyuvāḍu bhagavaṃtuḍu kanuka nārāyaṇuḍanu ceppabaḍucunnāḍu. aṭṭi nārāyaṇuḍē tatvamu - anniṃṭilōnu uṃḍi vāṭiki caitanyamu kaligiṃci vāṭicēta panulu cēyiṃcuvāḍu - idi iṃkokaru cēyuvāru lēru - aṃducēta sṛṣṭi aṃtaṭilōnu unnatatvamu - śakti - okaṭē. adē parabrahma, nārāyaṇuḍani ceppabaḍucunnāḍu).
tat + tvaṃ = tatvaṃ - (tat = adi, tvaṃ = nīvu uṃḍuṭa - adigānuṃḍuṭa, dānigā nuṃḍuṭa - dāni sthiti ani arthamu - udāharaṇa _ aṃdhatvamu; mūḍhatvamu; mūkatvamu; jaḍatvamu. aṃducēta ‘tat + tvaṃ’ anagā dānivale nuṃḍu sthiti; ‘tat ’anagā parabrahma - ’ōṃ tatsat’ anunavi parabrahmanu nirdēśiṃcunavi. aṃducēyta ‘tat tvaṃ’ anagā brahmamē ayi yuṃḍuṭa - parabrahma tana cicchakti tō prakṛtitō kaliyagā prakṛti parabrahmamē ayinadi - parabrahma prakṛtigā mārinadi, aṃducēta adi parabrahma tatvamē. prakṛti parabrahma śakti kaligi ī parapaṃcamuganu, dānilōni anni vastuvuluganumārinadi. aṃducēta prapaṃcamulōni vastuvulanniyu parabrahma tatvamē - “tat sṛṣṭvā tadēvānu prāviśat, tadanu praviśyasacca, tyacca abhavat” (parabrahma - bhagavaṃtuḍu prapaṃcamunu sṛṣṭiṃci,dānilōnē pravēśiṃcenu, aṭlu paravēśiṃci dānilōni prati vastuvugā - ‘sat , asat’ vastuvulugā - tānē āyenu). aṃducēta prapaṃcamulō prati vastuvu, prapaṃcamaṃtā parabrahma tatvamē - “tatvamasi” (tat + tvaṃ + asi = ‘ā parabrahma nīvē ayitivi’ anu mahāvākyamulōni arthamu brahmajñānamu kaligina narulakēkāka prati vastuvunaku vartiṃcunu. narulu jñānamu galavārukanuka tānē parabrahma, paratatvamaina parabrahma ani telusukō galgucunnāru - prapaṃcamulōni itara jīvulu - vastuvulu - iṭṭi jñānamulēnivārainanu vāstavamugā vāraṃdaru - avi anniyu brahmatatvamē - prapaṃcamulō parabrahmakāni vastuvu lēdu - brahmajñānulukāni itara narulu, itara jīvulu, itara vastuvulu vāṭi yadārthatatvamunu teliyakapōyinanu - parabrahmatatvamē - ātma, anātma vastuvulu, reṃḍunū parabrahmamē yagutavalana - parabrahma tanacicchakti rūpamulō prakṛtitō kaliyuṭavalana mahattatvamu, ahaṃkāramu, tanmātralu, paṃcabhūtamulu, vāṭi sammēḷanamuvalana jīvulu modalagu vastuvulugā prakṛtiyē mārenu - ivanniyu sṛṣṭi prakāramulō (in the process of creation) mukhyamaina ghaṭṭamulugā - tatvamulugā ceppabaḍinavi - ivi caturviṃśati tatvamulu (iruvadinālugu tatvamulu. vīṭi sammēḷanamuvalana prapaṃcamulōni vastuvulērpaḍinavi. caitanya śaktitōkūḍina parabrahma vīṭilō lēnidē ī tatvamulēviyu vāṭilōnuṃḍi maṟiyoka vastuvunu puṭṭiṃpanēravu - aṃducēta - prati tatvamulōnu parabrahma cicchakti sahituḍai yuṃḍuṭacētanē - ivanniyu tatvamulē - bhagavamaṃtuni cicchaktikaligiyunnadē. vīṭi kaliyikalō bhēdamuṃḍuṭavalana vāṭi sammēḷanamu valana kalugu vastuvulalō bhēdamulērpaḍucunnavi. kāni, avanniyu okē tatvamu - parabrahmatatvamu - parabrahma, tana cicchakti, tana jaḍaśakti ayina prakṛti okaṭē kanuka - parabrahmamē kanuka).
“yathāsā paramāśaktiḥ svēcchayā viśvarūpiṇī |
na śivēnavinā dēvi na dēvyā cavinā śivaḥ |
śivaśakti ritihyēkaṃ tatva māhurmanīṣiṇaḥ ||“.
(śivuḍu lēni pārvati uṃḍaḍu, pārvatilēnidē śivuḍu uṃḍaḍu. atani śaktiyē pārvati. śivuninuṃḍi śivuni śaktini viḍadīyalēmu. (oka maniṣi śakti ataninuṃḍi vēru cēyalēmu). kanuka śivuḍu pārvatikalisi śivaśakti yanunadi okē tatvamu - aṃducētanē śivuni arthaśarīramu pārvati - (artha nārīśvaruḍu - ā rūpamulōni śivarūpamunuṃḍi pārvati rūpamu vēru cēyalēmu. aṃducētanē śivuḍu sāṃbuḍu lēka sāṃbaśivuḍu - ‘aṃbayā sahitaḥ sāṃbaḥ’ aṃbatō - pārvatitō kalisiyunnavāḍusāṃbuḍu - ani ceppabaḍucunnāḍu. aṃducēta ī reṃḍu kalisi okē tatvamu - śivatatvamu - aṭlē parabrahma śaktulu aparāśakti (prakṝti) , parāśakti (caitanya śakti - ī reṃḍu śaktulu parabrahmakaṃṭe vērukāvu - ā reṃḍu śaktulu tānē - aṃducēta unnadaṃtā okaṭē tatvamu (parabrahmata tvamu). iṃducētanē sṛṣṭilō ē peddavastuvulainanu, eṃta cinna vastuvulainanu parabrahma atani śakti kalisi yunnadē. sṛṣṭilō ekkaḍainanu parabrahma vērugānu, atani śakti (prakṛti) vērugānu lēdu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.