← Back to త · Booklets 21–30 (digitized file 3)

తత్వవిత్ tatvavit

Original — తెలుగు
  1. “తత్వం యధార్థ్యం వేత్తీతి తత్వవిత్” (ఆనందగిరి).” ఆత్మనః యధాత్మ్యం తత్వం వేత్తీతితత్వవిత్.

(తత్వమనగా భగవంతుని యధార్థరూపము; స్వస్వభావము - దానిని తెలిసినవాడు).

  1. ఆత్మనః స్వభావం జానన్ బ్రహ్మవిత్ ; ఆత్మ విజ్ఞానవాన్.

(ఆత్మస్వభావము నెఱింగినవాడు ఆత్మజ్ఞానము కలవాడు).

  1. తత్వం స్వరూపం యథావత్ వేత్తీతి తత్వవిత్. (శ్రీశంకరః)

(భగవంతుని స్వరూపము యధార్థముగా - ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకొనినవాడు).

  1. శివరూపతయా సర్వం యో వేద సహితత్వ విత్.

(సర్వ ప్రపంచమును శివునియొక్క రూపమే యని తెలుసుకొనినవాడు).

  1. “సర్వ కార్యకరణచేష్టా సు కర్మసు అకర్మైవ పశ్యతః తత్వ విదః, సమ్యక్ దర్శనః”.

(తాని చేయు సమస్త కార్యములను అవి కర్మలుకావని, తాను వాటిని చేయలేదని, భగవంతుని కొఱకే, భగవంతుని సేవకుడుగా ఆ పనులు చేయుచున్నానని అభిప్రాయముతో చేయువాడు - చేసిన కర్మలను భగవంతుని కర్పించువాడు).

  1. “నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వ విత్ |

పశ్యన్, శ్రుణ్వన్, స్పృశన్, జిఘ్రన్, అశ్నన్, గచ్ఛన్ స్వపన్ శ్వనన్ |

ప్రలవన్ విశ్రుజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి |

ఇంద్రియాణీంద్రీయార్థేషు వర్తంత ఇతి ధారయన్ ||“. (శ్రీమద్భగవద్గీత - 5 - 7, 8)

(తత్వ విదుడైనవాడు చిత్త శుద్ధి కలిగియుండుత చేత ఏ పని చేయుచున్నను తను ఆ పను చేయలేదని తలచును. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు అను పదింటి చేత కర్మ చేయుచున్నను తాని వాటిని చేయుట లేదను బుద్ధి కలిగియుండుటచేత తాను అక్రియుడుగానే - ఏ పని చేయనివానివలె తలచును. పంచప్రాణములను లోనికి పీల్చుచు, వదలుచునున్నను, ఉపప్రాణములతో కంటి రెప్పలు మూయుచున్నను, విప్పుచున్నను, ఇవన్నియు వాటి వాటి పనులు చేయుచున్నవి, ఆ పనులు నేను చేయుటలేదనితలచును. అందుచేత ఆ క్రియలు అతనిని బంధించవు, (వాటి ఫలము ననుభచింపచేయవు). ఇంద్రియములు విషయములందు వర్తించుచున్నవని తలచును).

  1. “సాక్షాత్ కృత నిజానందో ద్వైత దృష్టే రభావతః |

అతి తుచ్ఛ తయా భోగ్యసుఖ,ం నేచ్ఛతి తత్వ విత్ ||“. (గీతాభావప్రకాశము - 3 - 107, 108)

(తన నిజరూపమైన పరమానందమయమైన మోక్షమని చెప్పబడు పరబ్రహ్మయొక్క సాక్షాత్కారము పొందిన తన నిజతత్వమును - పరమాత్మతత్వమును - తెలిసినవాడు పరమాత్మ తప్ప మఱియొక వస్తువు లేదను అభిప్రాయము కలిగియుండుటవలన భోగ్యవిషయములవలన కలిగెడు సుఖమును కోరడు).

Transliteration
  1. “tatvaṃ yadhārthyaṃ vēttīti tatvavit” (ānaṃdagiri).” ātmanaḥ yadhātmyaṃ tatvaṃ vēttītitatvavit.

(tatvamanagā bhagavaṃtuni yadhārtharūpamu; svasvabhāvamu - dānini telisinavāḍu).

  1. ātmanaḥ svabhāvaṃ jānan brahmavit ; ātma vijñānavān.

(ātmasvabhāvamu neṟiṃginavāḍu ātmajñānamu kalavāḍu).

  1. tatvaṃ svarūpaṃ yathāvat vēttīti tatvavit. (śrīśaṃkaraḥ)

(bhagavaṃtuni svarūpamu yadhārthamugā - unnadi unnaṭlugā telusukoninavāḍu).

  1. śivarūpatayā sarvaṃ yō vēda sahitatva vit.

(sarva prapaṃcamunu śivuniyokka rūpamē yani telusukoninavāḍu).

  1. “sarva kāryakaraṇacēṣṭā su karmasu akarmaiva paśyataḥ tatva vidaḥ, samyak darśanaḥ”.

(tāni cēyu samasta kāryamulanu avi karmalukāvani, tānu vāṭini cēyalēdani, bhagavaṃtuni koṟakē, bhagavaṃtuni sēvakuḍugā ā panulu cēyucunnānani abhiprāyamutō cēyuvāḍu - cēsina karmalanu bhagavaṃtuni karpiṃcuvāḍu).

  1. “naiva kiṃcit karōmīti yuktō manyēta tatva vit |

paśyan, śruṇvan, spṛśan, jighran, aśnan, gacchan svapan śvanan |

pralavan viśrujan gṛhṇan unmiṣan nimiṣannapi |

iṃdriyāṇīṃdrīyārthēṣu vartaṃta iti dhārayan ||“. (śrīmadbhagavadgīta - 5 - 7, 8)

(tatva viduḍainavāḍu citta śuddhi kaligiyuṃḍuta cēta ē pani cēyucunnanu tanu ā panu cēyalēdani talacunu. jñānēṃdriyamulu, karmēṃdriyamulu anu padiṃṭi cēta karma cēyucunnanu tāni vāṭini cēyuṭa lēdanu buddhi kaligiyuṃḍuṭacēta tānu akriyuḍugānē - ē pani cēyanivānivale talacunu. paṃcaprāṇamulanu lōniki pīlcucu, vadalucununnanu, upaprāṇamulatō kaṃṭi reppalu mūyucunnanu, vippucunnanu, ivanniyu vāṭi vāṭi panulu cēyucunnavi, ā panulu nēnu cēyuṭalēdanitalacunu. aṃducēta ā kriyalu atanini baṃdhiṃcavu, (vāṭi phalamu nanubhaciṃpacēyavu). iṃdriyamulu viṣayamulaṃdu vartiṃcucunnavani talacunu).

  1. “sākṣāt kṛta nijānaṃdō dvaita dṛṣṭē rabhāvataḥ |

ati tuccha tayā bhōgyasukha,ṃ nēcchati tatva vit ||“. (gītābhāvaprakāśamu - 3 - 107, 108)

(tana nijarūpamaina paramānaṃdamayamaina mōkṣamani ceppabaḍu parabrahmayokka sākṣātkāramu poṃdina tana nijatatvamunu - paramātmatatvamunu - telisinavāḍu paramātma tappa maṟiyoka vastuvu lēdanu abhiprāyamu kaligiyuṃḍuṭavalana bhōgyaviṣayamulavalana kaligeḍu sukhamunu kōraḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.