← Back to త · Booklets 21–30 (digitized file 3)

తేజః tējaḥ

Original — తెలుగు
  1. కాంతిః దీప్తిః (కాంతి, వెలుగు), శక్తి, బలము, చైతన్యము

  2. స్వకీయమండల దీప్తిః; భాస్కర రూపేణవా దీప్తిః.

(సూర్యునివలె మండలములో ప్రకాశించుటవలన కలుగు వెలుగు; లేక ప్రకాశించుటవలన కలుగు వెలుగు).

  1. శుక్రం (తెల్లని కాంతి).

  2. ప్రకాశ స్వరూపం బ్రహ్మ. (ప్రకాశమే స్వరూపముగాగల బ్రహ్మ).

  3. చైతన్య లక్షణం సర్వావభాసకం.

(అన్నింటినీ ప్రకాశింపచేయునది ; చైతన్యలక్షణము గలది. చైతన్యము శక్తిని కలుగచేయును. చైతన్యమే భగవంతుని చిచ్ఛక్తి. భగవంతుడు తన చిచ్ఛక్తి రూపములో అన్నింటిలోను ప్రవేశించి వాటికి చైతన్యము కలుగ చేయుచున్నాడు).

  1. “యదా దిత్యగతం తేజో జగద్భాసయతే (అ)ఖిలం |

యచ్చంద్రమసి, యచ్చాగ్నే తత్తేజోవిద్ధి మామకం ||“. (శ్రీమద్భగవద్గీత - 15 - 12)

(ప్రంచమును ప్రకాశింపచేయు సూర్యునిలో గల తేజస్సు, అట్లే ప్రకాశించు రూపములైన నక్షత్రములలోని తేజస్సు, అగ్నిలోనుండు తేజస్సు, చంద్రునిలోనుండు తేజస్సు నాదే (భగవంతునిదే) వాటిలో తేజోరూపములో భగవంతుడుండి వాటికి తన తేజస్సునిచ్చి వాటిని ప్రకాశింప చేయుచున్నాడు).

(సూర్యుడు స్వయంప్రకాశము కాదు - సూర్యమండలములో నున్న Helium (హీలియం) అను element దానిలో నుండుటవలన సూర్యునికి ఆ కాంతి, వేడిమి, శక్తి (energy) కలుగుచున్నవి). (Heat, Light and Energy) “తేజశ్చాస్మి విభావసౌ”

(శ్రీమద్భగవద్గీత - 7 - 9)

(సూర్యునిలోని తేజస్సు నేనే); “తేజస్తేజస్వి నామహం” (శ్రీమద్భగవద్గీత - 10 - 36)

(తేజోవంతములైనవాటిలోని తేజస్సు నేనే). “యస్య భాసా సర్వమిదం భాతి” (దేని కాంతివలన ఈ ప్రంచమంతయు వెలుగుచున్నదో - శక్తి కలిగి నడచుచున్నదో -).

“ఉ. ఏ పరమేశుతేజమున నీ చరాచరమైన లోకము

ద్దీపితమయ్యె ---“. (శ్రీమదాంధ్రమహాభాగవతము -10 - పూ.భా. 541)

  1. “యద్యద్విభూతిమత్సత్త్వం శ్రీమదూర్జితమేవ వా |

తత్త దేవావగచ్ఛ త్వం యమ తేజోంస సంభవం ||” (శ్రీమద్భగవద్గీత - 10 - 41)

(సృష్టిలో యే వస్తువైనను సత్వముతో (శక్తితో) కూడినదియగు నావిభూతి యున్నను అది నాతేజస్సుయొక్క (చిచ్ఛక్తి యొక్క) అంసవలననే కలిగినదని తెలియుము. భగవంతుడు తేజోరూపుడు. ఆ తేజస్సే అనేకవిధములైన ఉపాధులలోనుండి అనేక రూపములుగా అగునట్లు చేయును. అదియే ప్రపంచములోనున్న సమస్త వస్తువులకు శక్తిగా మారి వాటిచేత వాటి వాటి పనులు చేయించుచుండును).

  1. “ఆత్మనః ఆకాశస్సంభూతః” అను శ్రుతి ప్రమాణానంజేసి ఆ భూతాత్మయొక్క అస్తిత్వమే ఆకాశము. ఆ ఆకాశం యొక్క విస్తీర్ణమే వాయువు. ఆ వాయువే చుట్టి మధించగాను అగ్ని (తేజస్సు), ఆ అగ్నియొక్క ఉరుమే జలము ” (బ్రహ్మవిద్యాసుధావర్ణము -1)

  2. దైవ ప్రేరితంబై స్పర్శతన్మాత్ర గుణకంబగు వాయువు వలన రూపంబును, దాని వలన దేజంబునుం బుట్టె - - - తైజసంబునకు సాధారణంబులగు ధర్మంబులు ద్యోతనంబనం బ్రకాశంబు, పచనంబునం దండులాదుల పాకంబు, పిపాసా నిమిత్తంబైన, క్షున్నిమిత్తకంబైన యోదనంబు, హిమమర్థనంబగు శోషణంబున నివిదృత్తులై యుండు. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 26 - 893)

  3. “ఉష్ణ స్పర్స విత్తేజః - తత్ ద్వివిధం - నిత్యమనిత్యం చేత - నిత్యం పరమాణురూపం, అనిత్యం కార్యరూపం. పునః త్రివిధం - శరీరేంద్రియ విషయ భేదాత్ - శరీరమాదిత్యలోకే, ఇంద్రియం రూపగ్రాహకం చక్షుః, తచ్చ కృష్ణ తారాగ్రవృత్తి. విషయశ్చతుర్విధః - భౌమ దిద్యౌదర్యాకరజ భేదాత్. భౌమంవహ్న్యాది; దివ్యమచింధనం విద్యుదాది; భుక్తస్య పరిణామహేతు రౌదర్యం; ఆకరణం సువర్ణాదిః”

(తర్కసంగ్రహే)

(తేజస్సు ఉష్ణగుణము - అది రెండు విధములు - నిత్యమని, అనిత్యమని. నిత్యము పరమాణురూపము, అనిత్యము పరమాణువుల కార్య రూపము - మరల మూడువిధములు - శరీరము, ఇంద్రియము, విషయము - ఈ మూడింటికి సంబంధించిన మూడు విధములు. శరీరము ఆదిత్యలోకమందు. ఇంద్రియము రూపమును గ్రహించునది - కన్ను. విషయమునకు సంబంధించినది నాలుగు విధములు - భౌమము, దివ్యము, ఔదర్యము, ఆకరజము. భౌమము భూమికి సంబంధించినది, అగ్ని మొదలగునవి; దివ్యము విద్యుత్కాంతి మొదలగునవి, ఔదర్యమనగా తినినది కడుపులో పరిణామము చెందుట (పచనము). అకరిజం బంగారం మొదలగునవి.

  1. “అన్నమయంహి, సౌమ్య ; మనః; ఆపోమయః ప్రాణః; తేజోమ యీవాక్”

(మనస్సు అన్నమయం - తినిన ఆహారమును బట్టి ఉండును; ప్రాణము ఆపోమయము - నీటిలో ప్రాణవాయువు కలిసియున్నది, అగ్నిమయము వాక్కు).

  1. ప్రాగల్భ్యం, ప్రభావః. (ప్రతాపము, ప్రతిభ).
  1. దాహకత్వ శక్తిః (అగ్ని పరః). (అగ్నివిషయములో) (దహించు శక్తి గలది).

  2. శౌర్యా దయో గుణాః. (శ్రీశంకరః)

  3. దుర్జనైః (అన్యెః) అవిభివనీయత్వం -

(ఇతరులచేత - దుర్మార్గులచేత - అవమానింపబడకుండుట, వారికి లొంగకుండుట).

Transliteration
  1. kāṃtiḥ dīptiḥ (kāṃti, velugu), śakti, balamu, caitanyamu

  2. svakīyamaṃḍala dīptiḥ; bhāskara rūpēṇavā dīptiḥ.

(sūryunivale maṃḍalamulō prakāśiṃcuṭavalana kalugu velugu; lēka prakāśiṃcuṭavalana kalugu velugu).

  1. śukraṃ (tellani kāṃti).

  2. prakāśa svarūpaṃ brahma. (prakāśamē svarūpamugāgala brahma).

  3. caitanya lakṣaṇaṃ sarvāvabhāsakaṃ.

(anniṃṭinī prakāśiṃpacēyunadi ; caitanyalakṣaṇamu galadi. caitanyamu śaktini kalugacēyunu. caitanyamē bhagavaṃtuni cicchakti. bhagavaṃtuḍu tana cicchakti rūpamulō anniṃṭilōnu pravēśiṃci vāṭiki caitanyamu kaluga cēyucunnāḍu).

  1. “yadā dityagataṃ tējō jagadbhāsayatē (a)khilaṃ |

yaccaṃdramasi, yaccāgnē tattējōviddhi māmakaṃ ||“. (śrīmadbhagavadgīta - 15 - 12)

(praṃcamunu prakāśiṃpacēyu sūryunilō gala tējassu, aṭlē prakāśiṃcu rūpamulaina nakṣatramulalōni tējassu, agnilōnuṃḍu tējassu, caṃdrunilōnuṃḍu tējassu nādē (bhagavaṃtunidē) vāṭilō tējōrūpamulō bhagavaṃtuḍuṃḍi vāṭiki tana tējassunicci vāṭini prakāśiṃpa cēyucunnāḍu).

(sūryuḍu svayaṃprakāśamu kādu - sūryamaṃḍalamulō nunna Helium (hīliyaṃ) anu element dānilō nuṃḍuṭavalana sūryuniki ā kāṃti, vēḍimi, śakti (energy) kalugucunnavi). (Heat, Light and Energy) “tējaścāsmi vibhāvasau”

(śrīmadbhagavadgīta - 7 - 9)

(sūryunilōni tējassu nēnē); “tējastējasvi nāmahaṃ” (śrīmadbhagavadgīta - 10 - 36)

(tējōvaṃtamulainavāṭilōni tējassu nēnē). “yasya bhāsā sarvamidaṃ bhāti” (dēni kāṃtivalana ī praṃcamaṃtayu velugucunnadō - śakti kaligi naḍacucunnadō -).

“u. ē paramēśutējamuna nī carācaramaina lōkamu

ddīpitamayye ---“. (śrīmadāṃdhramahābhāgavatamu -10 - pū.bhā. 541)

  1. “yadyadvibhūtimatsattvaṃ śrīmadūrjitamēva vā |

tatta dēvāvagaccha tvaṃ yama tējōṃsa saṃbhavaṃ ||” (śrīmadbhagavadgīta - 10 - 41)

(sṛṣṭilō yē vastuvainanu satvamutō (śaktitō) kūḍinadiyagu nāvibhūti yunnanu adi nātējassuyokka (cicchakti yokka) aṃsavalananē kaliginadani teliyumu. bhagavaṃtuḍu tējōrūpuḍu. ā tējassē anēkavidhamulaina upādhulalōnuṃḍi anēka rūpamulugā agunaṭlu cēyunu. adiyē prapaṃcamulōnunna samasta vastuvulaku śaktigā māri vāṭicēta vāṭi vāṭi panulu cēyiṃcucuṃḍunu).

  1. “ātmanaḥ ākāśassaṃbhūtaḥ” anu śruti pramāṇānaṃjēsi ā bhūtātmayokka astitvamē ākāśamu. ā ākāśaṃ yokka vistīrṇamē vāyuvu. ā vāyuvē cuṭṭi madhiṃcagānu agni (tējassu), ā agniyokka urumē jalamu ” (brahmavidyāsudhāvarṇamu -1)

  2. daiva prēritaṃbai sparśatanmātra guṇakaṃbagu vāyuvu valana rūpaṃbunu, dāni valana dējaṃbunuṃ buṭṭe - - - taijasaṃbunaku sādhāraṇaṃbulagu dharmaṃbulu dyōtanaṃbanaṃ brakāśaṃbu, pacanaṃbunaṃ daṃḍulādula pākaṃbu, pipāsā nimittaṃbaina, kṣunnimittakaṃbaina yōdanaṃbu, himamarthanaṃbagu śōṣaṇaṃbuna nividṛttulai yuṃḍu. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 26 - 893)

  3. “uṣṇa sparsa vittējaḥ - tat dvividhaṃ - nityamanityaṃ cēta - nityaṃ paramāṇurūpaṃ, anityaṃ kāryarūpaṃ. punaḥ trividhaṃ - śarīrēṃdriya viṣaya bhēdāt - śarīramādityalōkē, iṃdriyaṃ rūpagrāhakaṃ cakṣuḥ, tacca kṛṣṇa tārāgravṛtti. viṣayaścaturvidhaḥ - bhauma didyaudaryākaraja bhēdāt. bhaumaṃvahnyādi; divyamaciṃdhanaṃ vidyudādi; bhuktasya pariṇāmahētu raudaryaṃ; ākaraṇaṃ suvarṇādiḥ”

(tarkasaṃgrahē)

(tējassu uṣṇaguṇamu - adi reṃḍu vidhamulu - nityamani, anityamani. nityamu paramāṇurūpamu, anityamu paramāṇuvula kārya rūpamu - marala mūḍuvidhamulu - śarīramu, iṃdriyamu, viṣayamu - ī mūḍiṃṭiki saṃbaṃdhiṃcina mūḍu vidhamulu. śarīramu ādityalōkamaṃdu. iṃdriyamu rūpamunu grahiṃcunadi - kannu. viṣayamunaku saṃbaṃdhiṃcinadi nālugu vidhamulu - bhaumamu, divyamu, audaryamu, ākarajamu. bhaumamu bhūmiki saṃbaṃdhiṃcinadi, agni modalagunavi; divyamu vidyutkāṃti modalagunavi, audaryamanagā tininadi kaḍupulō pariṇāmamu ceṃduṭa (pacanamu). akarijaṃ baṃgāraṃ modalagunavi.

  1. “annamayaṃhi, saumya ; manaḥ; āpōmayaḥ prāṇaḥ; tējōma yīvāk”

(manassu annamayaṃ - tinina āhāramunu baṭṭi uṃḍunu; prāṇamu āpōmayamu - nīṭilō prāṇavāyuvu kalisiyunnadi, agnimayamu vākku).

  1. prāgalbhyaṃ, prabhāvaḥ. (pratāpamu, pratibha).
  1. dāhakatva śaktiḥ (agni paraḥ). (agniviṣayamulō) (dahiṃcu śakti galadi).

  2. śauryā dayō guṇāḥ. (śrīśaṃkaraḥ)

  3. durjanaiḥ (anyeḥ) avibhivanīyatvaṃ -

(itarulacēta - durmārgulacēta - avamāniṃpabaḍakuṃḍuṭa, vāriki loṃgakuṃḍuṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.