← Back to త · Booklets 21–30 (digitized file 3)

తీర్థము tīrthamu

Original — తెలుగు
  1. తారకత్వాత్ తీర్థః. (తరింపచేయునది కనుక తీర్థమని చెప్పబడినది).

  2. మహత్వప్రాప్తి స్థానం. (మహత్వమును పొందిన స్థానము - మహత్వమును పొందింపచేయు స్థానము).

  3. పుణ్యక్షేత్రము, పుణ్యస్థలము.

  4. అవతరణస్థానం. (మహానుభావులు, అవతారపురుషులు, అవతరించు, పుట్టు స్థానము).

  5. నిర్గమమార్గం. (బైటకువచ్చుమార్గము - సంసారప్రవాహమునుండి - బైటపడుటకు ముక్తినిపొందుటకు - మార్గము).

  6. మహర్షులు స్నానము చేయు జలాశయము.

    1. “యదధ్యాసిత మర్హద్భిః తత్తీర్థం ప్రచక్షతే” (కాళిదాసు). (పెద్దలు వసించునదే తీర్థము)

    2. “భక్తాః యస్మిన్ స్థానే నివసంతి, యస్మిన్ సరోవరే |

నద్యాం నాస్నానం కుర్వంతి తాన్యేవ తీర్థాని సంపద్యంతే||.

(భక్తులు ఏ స్థలమందు నివసింతురో, యే సరస్సులో లేక ఏ నదిలో స్నానము చేయుదురో అవియే తీర్థములు).

  1. “భవద్విధాః భాగవతాః తీర్థీ భూతస్స్వయం ప్రభో |

తీర్థీ కుర్వంతి తీర్థాని స్వాంతస్థేన గదాభృతా || “. (శ్రీమద్భాగవతం - 1 - 13 - 10)

(మీవంటి భక్తులే స్వయముగా తీర్థములు. మీహృదయమునందు గదాధరుడైన శ్రీమహావిష్ణువు ఉండుటచేత, తీర్థములలో మీరుస్నానముచేసి మీద్వారా వాటికి శ్రీమహావిష్ణువుయొక్క శక్తినిచ్చి వాటిని మహాత్మ్యముగల తీర్థములుగా చేయుదురు. “మీవంటి భాగవతులు తీర్థసంఘంబుల ధిక్కరింతురు గదా|మీయందు విష్ణుండు మెఱయుకతన మీరు తీర్థంబులు.” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 1 - 264)

“హే ప్రభో! భవద్విదాః భగవద్భక్తాః స్వయం తీర్థభూతాస్సంతి - పాపభిః కలుషితాని తీర్థాని భవంతః స్వహృదయే విరాజమానస్య భగవతః శ్రీగదాధరస్య ప్రభావేణ తీర్థీకుర్వంతి. తేభ్యః తీర్థేభ్యః పునస్తీర్థత్వం ప్రదాయం తీత్యర్థం”.

  1. “... ఉదకమయంబులైన తీర్థంబులును మృచ్ఛిలామయంబులైన దేవగణంబులును దీర్థ దేవతారూపంబులు గాకుండుట లేదైన నవి చిరకాల సేవార్చనలంగాని పావనంబులు సేయవు.. సత్పురుషులు దర్శనమాత్రంబునం బావనంబు సేయుదురు -”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా. 1119, 1120)

  1. “ఉ. ఈ విధిమాత్మలం దెలిసి యెప్పుడు సజ్జన సంఘముల్ జగ

త్పావనమైన నీ గుణకథామృతమాత్మలగ్రోలి సర్వతీ

ర్ధానలి గ్రుంకినట్టి ఫలమందుదురంచు సమస్తవేదముల్

వా విరిబల్కు గావునను వారలు ధన్యులు, మాన్యులుత్తముల్ ” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 33 - 1035)

  1. “నహ్యమ్మయాని తీర్థాని, నదేవాః మృచ్ఛిలామయాః |

తేపునంత్యురుకాలేన దర్శనా దేవ సాధవః||” (శ్రీమద్భాగవతం - 10 - 48)

(జలరూపములైనవి తీర్థములు కావు. మట్టితోను, కఱ్ఱతోను, ఱాయితోను చేసినవి దేవతలు కారు. ఎందుకనగా ఆ తీర్థములును దేవతులును మనుష్యుల పాపములను పోగొట్టుటకు కొంతకాలము పట్టును. సాధువులు దర్శనమాత్రముననే పాపములను పోగొట్టుదురు).

  1. గంగాది పవిత్రజలము.

(శ్రీమహావిష్ణువు వామనావతారములో బ్రహ్మలోకమునకంటిన అతని పాదమును చతుర్ముఖబ్రహ్మ తన కమండలోదకములతో కడుగగా అది గంగ యను పేరున పవిత్ర జలమైనది - ఈ ప్రకారముగానే భగవంతుని ప్రతిమల అభిషేకించిన జలమును తీర్థముగా స్వీకరింతురు).

“మ. తనపుట్టిల్లిదె పొమ్మటంచు నజుడుం దన్నాభి పంకేరుహం

బు నిరీక్షించి, నటించి, యున్నతపదంబుం జూచి తత్పాదసే

చనముం జేసి గమండలూదకములం జల్లించి, తత్తోయముల్

వినువీధిం బ్రవహించె దేవనదినా (గంగానదియను పేరుతో) విశ్వాత్ముకీర్తి ప్రభన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 21 - 630)

(“శ్రీవిష్ణు పాదోదకం పావనం శుభం”).

  1. “వ. శబలాశ్వులు - - - యేతీర్థంబు తీర్థరాజంబై సకల తీర్థ ఫలంబు నాలోకనమాత్రంబున ననుగ్రహించుచు సకల పాపంబుల నిగ్రహించు, నేతీర్థ ప్రభావంబున నగ్రజన్ములు ఫలసిద్ధిం బొందుదురట్టి నారాయణ సరస్సను పుణ్యతీర్థంబునకుం జని తదుప స్పర్సమాత్రంబున నిర్థూతమలాశయులై - - - ||” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 243)

  2. “శ్లో||. నదీనాం జాహ్నవీ శ్రేష్టా యమునా చ సరస్వతి |

నర్మదా గండకీ సింధుర్గోమతి తమసా తథా |

కావేరీ చంద్రభాగా చ పుణ్యావేత్రవతీ శుభా |

చర్మణ్వతీ చ సరయూస్తాపిసాబ్రమతీ తథా |

ఏతాశ్చ కధితా రాజన్ అన్యాశ్చ శతశః పునః |

తేషాం సముద్రగాః పుణ్యాః స్వల్ప పుణ్యా హ్య సముద్రగాః |

సముద్రగానాం తాః పుణ్యాః సర్వదౌఘవహాస్తు యాః |

మాసద్వయం శ్రావణాదౌ తాశ్చ తాశ్చ సర్వా రజస్వలాః |

భవంతి వృష్టియోగేన గ్రామ్య వారిహాస్తధా||” (దేవీభాగవతము)

(నదులలో శ్రేష్టమైనవి - గంగ, యమున, సరస్వతి, నర్మదా, గండకీ, సింధు, గోమతి, తమసా, కావేరీ, చంద్రభాగా, వేత్రవతీ, చర్మణ్వతీ, సరయూనది - ఇంకను ఎన్నో నదులున్నవి. వాటిలో సాగర సంగమముచేయునవి పుణ్యమైనవి. సముద్రములోకలియనివి స్వల్ప పుణ్యమైనవి. సాగర సంగమము చేయు వాటిలో నిత్యము పారు నదులు పుణ్యమైనవి. శ్రావణము మొదలు రెండు నెలలు అవన్నియు రజస్వల లగును - వర్షములు కురియుటచేత).

  1. “చిత్తశుద్ధి మ యం తీర్థం గంగాదిభ్యో (అ)తిపావనం”

చిత్త శుద్ధి కలిగియుండుట గంగ మొదలగు నదులకంటె హెచ్చుగ పావనమైనది.

  1. “అహింసా సత్యమిస్తే యం శౌచమింద్రియనిగ్రహం |

స్వధర్మపాలనం రాజన్ సర్వతీర్థ ఫలప్రదం ||” (దేవీభాగవతము)

(అహింస - ఏ జీవికి హింస చేయకపోవుట, సత్యం, దొంగతనము చేయకపోవుట, శుచిగానుండుట, ఇంద్రియములను తనస్వాధీనములో నుంచుట, తన ధర్మమును పాటించుట - ఇవి సమస్తతీర్థముల ఫలమునిచ్చును).

  1. శుచిమనో యద్యస్తి తీర్థేన కిం?

(చిత్తశుద్ధి కలిగియున్నయెడల తీర్థములెందుకు - తీర్థముల ప్రయోజనము లేదు)

  1. “తేయాంతి తీర్థేషు బుథా యే శంభోర్దూర వర్తినః |

యస్య గౌరీ శ్వరుశ్చిత్తే తీర్థం, భోజ, పరం హి సః ||’ (భోజరాజచరిత్రము)

(శివునకు దూరముగానున్నవారే - శివుడు తమకు దూరముగా ఎక్కడో కాశీలోనో మరెక్కడో ఉన్నాడని తలచువారే బుధులు తీర్థములకు వెళ్ళుదురు. ఎవనికి శివుడు తనమనస్సులోనే ఉన్నాడో అదియే గొప్ప తీర్థము).

“సదా భోగ భాజాం సుదూరే విభాతం |

ముదా యోగ భాజామ దూరే విభాతం |

చిదానందకందం సదా రాఘవేశం |

విదేహాత్మ జానందకందం ప్రవద్యే ||” (శ్రీరామకర్ణామౄతం - 4 - 107)

(ఎల్లపుడు భోగములయందే అనుభవము కలవారికి దూరముగా నుండువాడున్నూ, సంతోషముతో యోగము చేయువారికి దగ్గరగానున్నూ, ఉన్నట్టి, ఆనందమునకు దుంపయైన వాడున్నూ, సీతయొక్క ఆనందమునకు దుంప - మూలము - అయిన వాడు అగు శ్రీరామచంద్రుని పొందుచున్నాను).

  1. “శ్రీ పర్వతం శిరః స్తానే, కేదారం తు లలాటకే |

వారణాశీ, మహాప్రాజ్ఞ, భ్వవోర్ఘ్రాణ స్య మధ్యమే |

కురుక్షేత్రం కుచస్తానే ప్రయాగ హృత్సరో రుహే |

చిదంబరం తుహృన్మధ్యే ఆధారే కమలాలయః |

ఆత్మతీర్థం సముత్సృజ్య బహిస్తీర్థాని యోవ్రజేత్ |

కరస్థం సమహారత్నం త్యక్త్వా కా చం విమార్గతే ||” (దర్శనోపనిషత్)

(సకల తీర్థములు దేహమునందేయున్నవి. అందుచేత అవి ఆత్మ తీర్థములని చెప్పబడుచున్నవి. శ్రీశైలము శిరస్సు నందున్నది - లలాటమందు కేదారము, కనుబొమలకు ముక్కుకు మధ్యను వారణాసి యున్నది. కుచస్థానమందు కురుక్షేత్రము, హృదయమందు ప్రయాగ, హృదయమధ్యమందు చిదంబరము, మూలాధారమునందు కమలాలయమున్నది. ఇట్లున్న ఈ ఆత్మ తీర్థములను వదలి, పైగా దూరములోనున్న తీర్థములను సేవించువారు చేతిలోనున్న మహారత్నమును వదలి కాచును (గాజు పెంకును) వెతుకువాడగును).

  1. “తీర్థంబులు బాహ్యాభ్యంతర భేదంబున ద్వివిధంబులైయుండు :-

తే. ఎల్లవియు బాహ్య తీర్థంబులిందువదన

యరయ బాహ్యంబు లయ్యు నాభ్యంతరములు

కాశికా తీర్థ మాదిగా గలవు కొన్ని

వాని వినిపింతు పరిపాటి వనిత వినుము.”

సీ. శీర్షంబునందలి శ్రీశైలతీర్థంబు మల్లికార్జుదేవుని మనికి పట్టు

ఫాలభాగమునందు ప్రాలేయమయమైన విమలకేదారతీర్థము వసించు

కుచ చుంచుకములందు గురుజాంగలమ్ముల తీర్థరాజము సంప్రతిష్టనొందు

భ్రూవల్లరీ యుగ్మమునకు మధ్యంబున నానందతీర్థమధివసించు

నంతరంగమున ప్రయాగమాశ్ర యించు

నిమ్మహాతీర్థము పార్వతీశ్వరునకు

విహరణస్థానములు వేద విశ్రుతములు

వెలుపలను లోపలను నుండు, దలిరు బోడి.

వ. బాహ్యాభంతర తీర్థములందున అవిముక్త తీర్థంబుత్తమోత్తమంబు - - - సంసార సాగరంబు తరింప సాధనంబగుట తీర్థంబయ్యె - “.

(శ్రీనాధుడు - కాశీఖండము - 2 - అశ్వాసము)

“తే. తీర్థములు మానసములు ముక్తిప్రదములు

తరుణి ఇవి మేలు బాహ్య తీర్థంబులకంటె. (శ్రీనాధుడు - కాశీఖండము - 2)

  1. బలరాముడు తీర్థయాత్రలు చేసినవాటిని శ్రీమదాంధ్రమహాభాగవతములో స్కం - 10 - ఉత్తరభాగములో 927 to 959) వర్ణించబడినవి.
Transliteration
  1. tārakatvāt tīrthaḥ. (tariṃpacēyunadi kanuka tīrthamani ceppabaḍinadi).

  2. mahatvaprāpti sthānaṃ. (mahatvamunu poṃdina sthānamu - mahatvamunu poṃdiṃpacēyu sthānamu).

  3. puṇyakṣētramu, puṇyasthalamu.

  4. avataraṇasthānaṃ. (mahānubhāvulu, avatārapuruṣulu, avatariṃcu, puṭṭu sthānamu).

  5. nirgamamārgaṃ. (baiṭakuvaccumārgamu - saṃsārapravāhamunuṃḍi - baiṭapaḍuṭaku muktinipoṃduṭaku - mārgamu).

  6. maharṣulu snānamu cēyu jalāśayamu.

    1. “yadadhyāsita marhadbhiḥ tattīrthaṃ pracakṣatē” (kāḷidāsu). (peddalu vasiṃcunadē tīrthamu)

    2. “bhaktāḥ yasmin sthānē nivasaṃti, yasmin sarōvarē |

nadyāṃ nāsnānaṃ kurvaṃti tānyēva tīrthāni saṃpadyaṃtē||.

(bhaktulu ē sthalamaṃdu nivasiṃturō, yē sarassulō lēka ē nadilō snānamu cēyudurō aviyē tīrthamulu).

  1. “bhavadvidhāḥ bhāgavatāḥ tīrthī bhūtassvayaṃ prabhō |

tīrthī kurvaṃti tīrthāni svāṃtasthēna gadābhṛtā || “. (śrīmadbhāgavataṃ - 1 - 13 - 10)

(mīvaṃṭi bhaktulē svayamugā tīrthamulu. mīhṛdayamunaṃdu gadādharuḍaina śrīmahāviṣṇuvu uṃḍuṭacēta, tīrthamulalō mīrusnānamucēsi mīdvārā vāṭiki śrīmahāviṣṇuvuyokka śaktinicci vāṭini mahātmyamugala tīrthamulugā cēyuduru. “mīvaṃṭi bhāgavatulu tīrthasaṃghaṃbula dhikkariṃturu gadā|mīyaṃdu viṣṇuṃḍu meṟayukatana mīru tīrthaṃbulu.” (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 1 - 264)

“hē prabhō! bhavadvidāḥ bhagavadbhaktāḥ svayaṃ tīrthabhūtāssaṃti - pāpabhiḥ kaluṣitāni tīrthāni bhavaṃtaḥ svahṛdayē virājamānasya bhagavataḥ śrīgadādharasya prabhāvēṇa tīrthīkurvaṃti. tēbhyaḥ tīrthēbhyaḥ punastīrthatvaṃ pradāyaṃ tītyarthaṃ”.

  1. “... udakamayaṃbulaina tīrthaṃbulunu mṛcchilāmayaṃbulaina dēvagaṇaṃbulunu dīrtha dēvatārūpaṃbulu gākuṃḍuṭa lēdaina navi cirakāla sēvārcanalaṃgāni pāvanaṃbulu sēyavu.. satpuruṣulu darśanamātraṃbunaṃ bāvanaṃbu sēyuduru -”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā. 1119, 1120)

  1. “u. ī vidhimātmalaṃ delisi yeppuḍu sajjana saṃghamul jaga

tpāvanamaina nī guṇakathāmṛtamātmalagrōli sarvatī

rdhānali gruṃkinaṭṭi phalamaṃduduraṃcu samastavēdamul

vā viribalku gāvunanu vāralu dhanyulu, mānyuluttamul ” (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 33 - 1035)

  1. “nahyammayāni tīrthāni, nadēvāḥ mṛcchilāmayāḥ |

tēpunaṃtyurukālēna darśanā dēva sādhavaḥ||” (śrīmadbhāgavataṃ - 10 - 48)

(jalarūpamulainavi tīrthamulu kāvu. maṭṭitōnu, kaṟṟatōnu, ṟāyitōnu cēsinavi dēvatalu kāru. eṃdukanagā ā tīrthamulunu dēvatulunu manuṣyula pāpamulanu pōgoṭṭuṭaku koṃtakālamu paṭṭunu. sādhuvulu darśanamātramunanē pāpamulanu pōgoṭṭuduru).

  1. gaṃgādi pavitrajalamu.

(śrīmahāviṣṇuvu vāmanāvatāramulō brahmalōkamunakaṃṭina atani pādamunu caturmukhabrahma tana kamaṃḍalōdakamulatō kaḍugagā adi gaṃga yanu pēruna pavitra jalamainadi - ī prakāramugānē bhagavaṃtuni pratimala abhiṣēkiṃcina jalamunu tīrthamugā svīkariṃturu).

“ma. tanapuṭṭillide pommaṭaṃcu najuḍuṃ dannābhi paṃkēruhaṃ

bu nirīkṣiṃci, naṭiṃci, yunnatapadaṃbuṃ jūci tatpādasē

canamuṃ jēsi gamaṃḍalūdakamulaṃ jalliṃci, tattōyamul

vinuvīdhiṃ bravahiṃce dēvanadinā (gaṃgānadiyanu pērutō) viśvātmukīrti prabhan”. (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 21 - 630)

(“śrīviṣṇu pādōdakaṃ pāvanaṃ śubhaṃ”).

  1. “va. śabalāśvulu - - - yētīrthaṃbu tīrtharājaṃbai sakala tīrtha phalaṃbu nālōkanamātraṃbuna nanugrahiṃcucu sakala pāpaṃbula nigrahiṃcu, nētīrtha prabhāvaṃbuna nagrajanmulu phalasiddhiṃ boṃduduraṭṭi nārāyaṇa sarassanu puṇyatīrthaṃbunakuṃ jani tadupa sparsamātraṃbuna nirthūtamalāśayulai - - - ||” (śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 243)

  2. “ślō||. nadīnāṃ jāhnavī śrēṣṭā yamunā ca sarasvati |

narmadā gaṃḍakī siṃdhurgōmati tamasā tathā |

kāvērī caṃdrabhāgā ca puṇyāvētravatī śubhā |

carmaṇvatī ca sarayūstāpisābramatī tathā |

ētāśca kadhitā rājan anyāśca śataśaḥ punaḥ |

tēṣāṃ samudragāḥ puṇyāḥ svalpa puṇyā hya samudragāḥ |

samudragānāṃ tāḥ puṇyāḥ sarvadaughavahāstu yāḥ |

māsadvayaṃ śrāvaṇādau tāśca tāśca sarvā rajasvalāḥ |

bhavaṃti vṛṣṭiyōgēna grāmya vārihāstadhā||” (dēvībhāgavatamu)

(nadulalō śrēṣṭamainavi - gaṃga, yamuna, sarasvati, narmadā, gaṃḍakī, siṃdhu, gōmati, tamasā, kāvērī, caṃdrabhāgā, vētravatī, carmaṇvatī, sarayūnadi - iṃkanu ennō nadulunnavi. vāṭilō sāgara saṃgamamucēyunavi puṇyamainavi. samudramulōkaliyanivi svalpa puṇyamainavi. sāgara saṃgamamu cēyu vāṭilō nityamu pāru nadulu puṇyamainavi. śrāvaṇamu modalu reṃḍu nelalu avanniyu rajasvala lagunu - varṣamulu kuriyuṭacēta).

  1. “cittaśuddhi ma yaṃ tīrthaṃ gaṃgādibhyō (a)tipāvanaṃ”

citta śuddhi kaligiyuṃḍuṭa gaṃga modalagu nadulakaṃṭe heccuga pāvanamainadi.

  1. “ahiṃsā satyamistē yaṃ śaucamiṃdriyanigrahaṃ |

svadharmapālanaṃ rājan sarvatīrtha phalapradaṃ ||” (dēvībhāgavatamu)

(ahiṃsa - ē jīviki hiṃsa cēyakapōvuṭa, satyaṃ, doṃgatanamu cēyakapōvuṭa, śucigānuṃḍuṭa, iṃdriyamulanu tanasvādhīnamulō nuṃcuṭa, tana dharmamunu pāṭiṃcuṭa - ivi samastatīrthamula phalamuniccunu).

  1. śucimanō yadyasti tīrthēna kiṃ?

(cittaśuddhi kaligiyunnayeḍala tīrthamuleṃduku - tīrthamula prayōjanamu lēdu)

  1. “tēyāṃti tīrthēṣu buthā yē śaṃbhōrdūra vartinaḥ |

yasya gaurī śvaruścittē tīrthaṃ, bhōja, paraṃ hi saḥ ||’ (bhōjarājacaritramu)

(śivunaku dūramugānunnavārē - śivuḍu tamaku dūramugā ekkaḍō kāśīlōnō marekkaḍō unnāḍani talacuvārē budhulu tīrthamulaku veḷḷuduru. evaniki śivuḍu tanamanassulōnē unnāḍō adiyē goppa tīrthamu).

“sadā bhōga bhājāṃ sudūrē vibhātaṃ |

mudā yōga bhājāma dūrē vibhātaṃ |

cidānaṃdakaṃdaṃ sadā rāghavēśaṃ |

vidēhātma jānaṃdakaṃdaṃ pravadyē ||” (śrīrāmakarṇāmṝtaṃ - 4 - 107)

(ellapuḍu bhōgamulayaṃdē anubhavamu kalavāriki dūramugā nuṃḍuvāḍunnū, saṃtōṣamutō yōgamu cēyuvāriki daggaragānunnū, unnaṭṭi, ānaṃdamunaku duṃpayaina vāḍunnū, sītayokka ānaṃdamunaku duṃpa - mūlamu - ayina vāḍu agu śrīrāmacaṃdruni poṃducunnānu).

  1. “śrī parvataṃ śiraḥ stānē, kēdāraṃ tu lalāṭakē |

vāraṇāśī, mahāprājña, bhvavōrghrāṇa sya madhyamē |

kurukṣētraṃ kucastānē prayāga hṛtsarō ruhē |

cidaṃbaraṃ tuhṛnmadhyē ādhārē kamalālayaḥ |

ātmatīrthaṃ samutsṛjya bahistīrthāni yōvrajēt |

karasthaṃ samahāratnaṃ tyaktvā kā caṃ vimārgatē ||” (darśanōpaniṣat)

(sakala tīrthamulu dēhamunaṃdēyunnavi. aṃducēta avi ātma tīrthamulani ceppabaḍucunnavi. śrīśailamu śirassu naṃdunnadi - lalāṭamaṃdu kēdāramu, kanubomalaku mukkuku madhyanu vāraṇāsi yunnadi. kucasthānamaṃdu kurukṣētramu, hṛdayamaṃdu prayāga, hṛdayamadhyamaṃdu cidaṃbaramu, mūlādhāramunaṃdu kamalālayamunnadi. iṭlunna ī ātma tīrthamulanu vadali, paigā dūramulōnunna tīrthamulanu sēviṃcuvāru cētilōnunna mahāratnamunu vadali kācunu (gāju peṃkunu) vetukuvāḍagunu).

  1. “tīrthaṃbulu bāhyābhyaṃtara bhēdaṃbuna dvividhaṃbulaiyuṃḍu :-

tē. ellaviyu bāhya tīrthaṃbuliṃduvadana

yaraya bāhyaṃbu layyu nābhyaṃtaramulu

kāśikā tīrtha mādigā galavu konni

vāni vinipiṃtu paripāṭi vanita vinumu.”

sī. śīrṣaṃbunaṃdali śrīśailatīrthaṃbu mallikārjudēvuni maniki paṭṭu

phālabhāgamunaṃdu prālēyamayamaina vimalakēdāratīrthamu vasiṃcu

kuca cuṃcukamulaṃdu gurujāṃgalammula tīrtharājamu saṃpratiṣṭanoṃdu

bhrūvallarī yugmamunaku madhyaṃbuna nānaṃdatīrthamadhivasiṃcu

naṃtaraṃgamuna prayāgamāśra yiṃcu

nimmahātīrthamu pārvatīśvarunaku

viharaṇasthānamulu vēda viśrutamulu

velupalanu lōpalanu nuṃḍu, daliru bōḍi.

va. bāhyābhaṃtara tīrthamulaṃduna avimukta tīrthaṃbuttamōttamaṃbu - - - saṃsāra sāgaraṃbu tariṃpa sādhanaṃbaguṭa tīrthaṃbayye - “.

(śrīnādhuḍu - kāśīkhaṃḍamu - 2 - aśvāsamu)

“tē. tīrthamulu mānasamulu muktipradamulu

taruṇi ivi mēlu bāhya tīrthaṃbulakaṃṭe. (śrīnādhuḍu - kāśīkhaṃḍamu - 2)

  1. balarāmuḍu tīrthayātralu cēsinavāṭini śrīmadāṃdhramahābhāgavatamulō skaṃ - 10 - uttarabhāgamulō 927 to 959) varṇiṃcabaḍinavi.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.