← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్రైవిద్యాః traividyāḥ

Original — తెలుగు
  1. కేవలం త్రివిద్య నిష్టాః త్రైవిద్యాః - ఋగ్య జస్సామ విదః.

(కేవలము ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అను మూడు వేదములందు చెప్పబడిన విషయములందు నిష్ట గలవారు - ఈ మూడువేదములు తెలిసినవారు).

  1. ” త్రైవిద్యా మాం సోమపాః పూతపాపా యజ్ఞై రిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే |

తేపుణ్య మాసాద్య సురేంద్రలోకమశ్నంతి దివ్యాన్దివి దేవభోగాన్ ||

తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షణే పుణ్యే మర్త్యలోకం విశంతి |

ఏవం త్రయీధర్మమనుప్రసన్నా గతాగతం కామ కామా లభంతే ||” (శ్రీమద్భగవద్గీత - 9 - 20, 21)

“తిస్రోవిద్యా ఋగాద్యాహి - - -|

సంతి, యేషాం త్రివిద్యాస్తే త్రైవిద్యాః స్వార్థతథితాత్|

తిస్రో విద్యా విదం తీత్యాజ్ఞికాః - - - |

అగ్నిష్టోమాదిభిస్తేమాం వస్వాద్యాత్మానమీశ్వరం |

తథాత్మేనాప్యజానంతః పూజయిత్వా హివస్తుతః |

అభిమత్య హుత్వా సోమం పిబంతీతి చ సోమపాః |

తేనైవ ధ్వస్త స్వర్గాప్తి ప్రతిబంధక కల్మషాః |

స్వర్గతిం ప్రాప్తయంతే తేనతు ధీశుద్ధీ మాకులాః |

తే స్వపుణ్య ఫలం ప్రాప్య లబ్ధ్వాస్థానం శతక్రతోః |

దేవదేహోప భోగ్యాం శ్చ కామానశ్నంతి నాకగాన్ ||

విస్తీర్ణం స్వర్గలోకం తే భుక్త్వా రభామృతాదినా |

స్వప్నాభేనైవ భోగేన క్షణే పుణ్యే సతీషదే |

తద్దేహనాశతో భూయా దేహ గ్రహణ సిద్ధయే |

పునర్గర్భనివాసాది యాతనాం కౌ విశంతి చ |

ఏవం తే వైదికం కర్మజ్యోతిష్టామాదికం పునః |

కౄత్వాతేన పునః స్వర్గం మర్త్యలోకం పునశ్చతే |

ఇత్థం గతా గతం భోగకాముకాస్తే నిరంతరం లభంతే |

సంసృతౌ దుం ఖం లభంతే నైవ నిర్వృతిం||.

(ఋగ్వేదము మొదలగు మూడువిద్యలుగలవారు త్రైవిద్యులు - ఈ మూడువిద్యలు తెలిసినవారు త్రైవిద్యులు - వసువు రుద్రుడు మొదలగువారిరూపుడనైన నన్ను (భగవంతుని) యదార్ధముగా తెలియక అగ్నిష్టోమము మొదలగు హోమములు చేసి, సోమపానము చేసినందువల్ల స్వర్గమును పొందుటకు ప్రతిబంధకములైన పాపములను పోగొట్టుకొనినవారై స్వర్గమును పొందుచున్నారు. వారు పుణ్యఫలమును పొంది ఇంద్రపదవిని పొంది, దేవలోకములోని పొందవలసిన భోగములను అనుభవించి - కోరికలను పొంది - అచట రంభాసంభోగము మొదలగువాటిని అనుభవించి, వారు చేసిన పుణ్యకర్మలఫలము వాటితో తరగిపోవగనే మరల భూలోకములో జన్మించెదరు. అట్లు మరల పుట్టి మరల జ్యోతిష్టోమాది యజ్ఞములు చేసి మరల స్వర్గము చేరి, ఆ అనుభవము తీరగానే మరల భూలోకములో జన్మించెదరు. ఇట్లు భోగములననుభవించవలెనను కోరిక గలవారు, స్వర్గమునకు పోవుచు మరల భూలోకములో జన్మించెదరు - అంతేకాని నిర్వృతిని పొందరు - జనన, మరణరూపమైన సంసారములో మునుగుతూ తేలుచు నుందురు - శాశ్వతసుఖరూపమైన ముక్తిని పొందలేరు).

Transliteration
  1. kēvalaṃ trividya niṣṭāḥ traividyāḥ - ṛgya jassāma vidaḥ.

(kēvalamu ṛgvēdamu, yajurvēdamu, sāmavēdamu anu mūḍu vēdamulaṃdu ceppabaḍina viṣayamulaṃdu niṣṭa galavāru - ī mūḍuvēdamulu telisinavāru).

  1. ” traividyā māṃ sōmapāḥ pūtapāpā yajñai riṣṭvā svargatiṃ prārthayaṃtē |

tēpuṇya māsādya surēṃdralōkamaśnaṃti divyāndivi dēvabhōgān ||

tētaṃ bhuktvā svargalōkaṃ viśālaṃ kṣaṇē puṇyē martyalōkaṃ viśaṃti |

ēvaṃ trayīdharmamanuprasannā gatāgataṃ kāma kāmā labhaṃtē ||” (śrīmadbhagavadgīta - 9 - 20, 21)

“tisrōvidyā ṛgādyāhi - - -|

saṃti, yēṣāṃ trividyāstē traividyāḥ svārthatathitāt|

tisrō vidyā vidaṃ tītyājñikāḥ - - - |

agniṣṭōmādibhistēmāṃ vasvādyātmānamīśvaraṃ |

tathātmēnāpyajānaṃtaḥ pūjayitvā hivastutaḥ |

abhimatya hutvā sōmaṃ pibaṃtīti ca sōmapāḥ |

tēnaiva dhvasta svargāpti pratibaṃdhaka kalmaṣāḥ |

svargatiṃ prāptayaṃtē tēnatu dhīśuddhī mākulāḥ |

tē svapuṇya phalaṃ prāpya labdhvāsthānaṃ śatakratōḥ |

dēvadēhōpa bhōgyāṃ śca kāmānaśnaṃti nākagān ||

vistīrṇaṃ svargalōkaṃ tē bhuktvā rabhāmṛtādinā |

svapnābhēnaiva bhōgēna kṣaṇē puṇyē satīṣadē |

taddēhanāśatō bhūyā dēha grahaṇa siddhayē |

punargarbhanivāsādi yātanāṃ kau viśaṃti ca |

ēvaṃ tē vaidikaṃ karmajyōtiṣṭāmādikaṃ punaḥ |

kṝtvātēna punaḥ svargaṃ martyalōkaṃ punaścatē |

itthaṃ gatā gataṃ bhōgakāmukāstē niraṃtaraṃ labhaṃtē |

saṃsṛtau duṃ khaṃ labhaṃtē naiva nirvṛtiṃ||.

(ṛgvēdamu modalagu mūḍuvidyalugalavāru traividyulu - ī mūḍuvidyalu telisinavāru traividyulu - vasuvu rudruḍu modalaguvārirūpuḍanaina nannu (bhagavaṃtuni) yadārdhamugā teliyaka agniṣṭōmamu modalagu hōmamulu cēsi, sōmapānamu cēsinaṃduvalla svargamunu poṃduṭaku pratibaṃdhakamulaina pāpamulanu pōgoṭṭukoninavārai svargamunu poṃducunnāru. vāru puṇyaphalamunu poṃdi iṃdrapadavini poṃdi, dēvalōkamulōni poṃdavalasina bhōgamulanu anubhaviṃci - kōrikalanu poṃdi - acaṭa raṃbhāsaṃbhōgamu modalaguvāṭini anubhaviṃci, vāru cēsina puṇyakarmalaphalamu vāṭitō taragipōvaganē marala bhūlōkamulō janmiṃcedaru. aṭlu marala puṭṭi marala jyōtiṣṭōmādi yajñamulu cēsi marala svargamu cēri, ā anubhavamu tīragānē marala bhūlōkamulō janmiṃcedaru. iṭlu bhōgamulananubhaviṃcavalenanu kōrika galavāru, svargamunaku pōvucu marala bhūlōkamulō janmiṃcedaru - aṃtēkāni nirvṛtini poṃdaru - janana, maraṇarūpamaina saṃsāramulō munugutū tēlucu nuṃduru - śāśvatasukharūpamaina muktini poṃdalēru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.