వేదహిత ధర్మము - ఋగ్యజస్సామవేదములందు చెప్పబడిన యజ్ఞధర్మము - వైదిక కర్మ.
తేపుణ్యమాసాద్య సురేంద్రలోకమశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్ |
తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ||.
ఏవంత్ర యీధర్మమను ప్రపన్నా గతాగతం కామ కామా లభంతే ||“. (శ్రీమద్భగవద్గీత - 9 - 20, 21)
(ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము - ఈ మూడింటిలోను చెప్పబడిన విద్యలు త్రైవిద్యలు - ఇవి తెలిసిన వారు త్రైవిద్యులు - లేక వేదత్రయవిదులు - వీరు యజ్ఞములు చేసి సోమపానము చేయుదురు, అందువలన స్వర్గమునకు వెళ్ళి, అక్కడ స్వర్గలోకములోని భోగములననుభవించి వారు చేసిన పుణ్యము - పుణ్యఫలము - క్షీణించగనే ఆ దేహమువదలి తిరిగి మానవజన్మ ఎత్తుటకు భూలోకమునకు వచ్చి మానవజన్మకు సంబంధించిన పుణ్యపాపముల ననుభవింతురు. మరల యజ్ఞములుచేసి, మరల స్వర్గలోకమునకు వెళ్ళి, అక్కడ భోగములనుభవించి, తిరిగి భూలోకమునకు వచ్చెదరు. ఈ ప్రకారముగా త్రైవిద్యులు సంసారములో పడి, మరల, మరల జననమరణములను, వాటికి సంబంధించిన కష్టసుఖములనుభవించెదరు - కాని, జననమరణములు కలుగు సంసారము వదలిపోయి మోక్షము గుఱించి ప్రయత్నము చేయరు).
vēdahita dharmamu - ṛgyajassāmavēdamulaṃdu ceppabaḍina yajñadharmamu - vaidika karma.
tēpuṇyamāsādya surēṃdralōkamaśnaṃti divyān divi dēva bhōgān |
tētaṃ bhuktvā svargalōkaṃ viśālaṃ kṣīṇē puṇyē martyalōkaṃ viśaṃti ||.
ēvaṃtra yīdharmamanu prapannā gatāgataṃ kāma kāmā labhaṃtē ||“. (śrīmadbhagavadgīta - 9 - 20, 21)
(ṛgvēdamu, yajurvēdamu, sāmavēdamu - ī mūḍiṃṭilōnu ceppabaḍina vidyalu traividyalu - ivi telisina vāru traividyulu - lēka vēdatrayavidulu - vīru yajñamulu cēsi sōmapānamu cēyuduru, aṃduvalana svargamunaku veḷḷi, akkaḍa svargalōkamulōni bhōgamulananubhaviṃci vāru cēsina puṇyamu - puṇyaphalamu - kṣīṇiṃcaganē ā dēhamuvadali tirigi mānavajanma ettuṭaku bhūlōkamunaku vacci mānavajanmaku saṃbaṃdhiṃcina puṇyapāpamula nanubhaviṃturu. marala yajñamulucēsi, marala svargalōkamunaku veḷḷi, akkaḍa bhōgamulanubhaviṃci, tirigi bhūlōkamunaku vaccedaru. ī prakāramugā traividyulu saṃsāramulō paḍi, marala, marala jananamaraṇamulanu, vāṭiki saṃbaṃdhiṃcina kaṣṭasukhamulanubhaviṃcedaru - kāni, jananamaraṇamulu kalugu saṃsāramu vadalipōyi mōkṣamu guṟiṃci prayatnamu cēyaru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.