← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్రిగుణములు triguṇamulu

Original — తెలుగు
  1. “సత్వం రజస్తమ ఇతి ప్రకృతేర్గుణాః”. (శ్రీమద్భాగవతం 1 - 2 - 23)

(సత్వము, రజస్సు, తమస్సు అనునవి మూడు ప్రకృతి యొక్క గుణములు).

  1. “సుఖ దుఃఖ మోహాత్మకాః త్రిగుణాః”.

(సత్వ, రజస్తమో గుణములు వరుసగా సుఖమును, దుఃఖమును, మోహమును కలుగచేయును).

  1. “రజస్తమశ్చాభి భూయ సత్వం భవతి భారత |

రజస్సత్వం తమశ్చైవ, తమస్సత్వం రజస్తథా ||“. (శ్రీమద్భగవద్గీత - 14 - 10)

(సత్వగుణము,రజోగుణమును,తమోగుణమును అణచివేసి తన స్వభావగుణములను కలుగచేయును - రజోగుణము సత్వగుణమును తమోగుణమును అణచి తన స్వభావగుణములుగల కార్యములందు ప్రేరేపించును. తమోగుణము సత్వగుణమును, రజోగుణమును అణచి తనస్వభావగుణము గలకర్మలలో ప్రేరేపించును).

  1. “కాష్టంబుకంటె ధూమంబు, ధూమంబుకంటె త్రయీమయంబయిన వహ్నియు ఎట్లు విశేషంబగు నట్లు తమోగుణంబుకంటె రజోగుణంబు, రజోగుణంబుకంటె బ్రహ్మ ప్రకాశంబగు సత్వగుణంబు విశిష్టంబగు -”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 2 - 24)

  2. “సత్వం రజస్తవశ్చేతి త్రయః ప్రోక్తా మహాగుణాః |

సాత్వికం శౌచమాస్తిక్యం ధర్మస్సత్వం శుచిర్మతిః |

రాజసం బహిభాషిత్వం మానకృద్దంఛ మత్సరం |

తామసం భయమజ్ఞానం నిద్రాలస్యం నిషాదితా |

ఇతి భూతమ యో దేహ స్త్రిగుణైర్లక్షయంతి చ ||“. (చికిత్సా సారసంగ్రహము - )

(సత్వము, రజస్సు, తమస్సు అని మూడుగుణములు చెప్పబడినవి. సత్వగుణములక్షణములు :- శౌచము, ఆస్తిక్యము, ధర్మము, మంచి బుద్ధి. రాజసగుణముల లక్షణములు :- బహు భాషిత్వము, అభిమానము, దంభము, మత్సరము. తామసగుణ లక్షణములు :- భయము, అజ్ఞానము, నిద్ర, ఆలస్యము. పంచభూతమయమైన దేహము ఈ త్రిగుణములచేతను తెలియబడుచున్నవి).

  1. “ప్రజ్ఞాంతు సాత్వికం ప్రాహుస్తామసీం తు వి చిత్త తాం |

క్రియంతు రాజసీ ప్రాహుర్గుణ తత్వ విదోబుధాః ||“.

(ప్రజ్ఞ సత్వ గుణ లక్షణము, చిత్తవిభ్రమము తమోగుణలక్షణము - క్రియ రజోగుణలక్షణము. ఈ ప్రకారముగాత్రిగుణముల తత్వములు తెలిసినవారు చెప్పుదురు).

  1. “సత్వాది గుణ పరిణామంబుల నమరులైరి. ఊర్జితసత్వగుణంబున నద్దేవతలు త్రివంబునొందిరి. రజోగుణంబున మనుజులును గవాదులును ధరిణిం బొందిరి. తామసంబున భూతాదులైన రుద్రపారిషదులు ద్వాదా పృథివ్యంతరంబగు వియత్తలంబునుం బొందిరి”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 6 - 215)

  1. “యధా ప్రాగ్వ్యాపకః క్షేత్రీ సర్గాదిషు గుణైర్యుతః |

తధాన సం జ్ఞా మాయాతి బ్రహ్మ విష్ణు శివాత్మికాం |

బ్రహ్మతే సృజతే లోకాన్ రుద్రత్వే సంహారత్యపి |

విష్ణుత్వే పి చోదాసీనస్తిస్తో అవస్థాః స్వయం భువః |

రజోబ్రహ్మ తమో రుద్రో విష్ణుః సత్వం జగత్పతిః |

అత ఏవ త్రయో దేవా ఏ తే ఏవ త్రయోగుణాః |

అన్యోన్య మిధునా హ్యేతా అన్యోన్యాశ్రయ స్తథా |

క్షణం వియోగో నహ్యేషాం నత్యజంతి పరస్పరం ||“.

(సృష్టి ప్రారంభమున వ్యాపకుడు - అన్నింటిలోను వ్యాపించియుండువాడు - అగు పరమాత్మ సత్వ రజస్తమోగుణములు కలిగియుండెను. ప్రకృతిలో ప్రవేశించియుండుటవలన ప్రకృతి గుణములైన సత్వరజస్తమములు కలిగి యుండెను. ఇట్లు త్రిగుణములను కలిగియుండుటవలన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను త్రిమూర్తులుగా తానే ఆయెను. బ్రహ్మ అయి - చతుర్ముఖ బ్రహ్మ అయి - లోకములను సృజించును. శివుడు అయి సంహారము చేయును. విష్ణువై ఉదాసీనుడుగానుండును, ఈ మూడును పరబ్రహ్మకు మూడు అవస్థలు. రజోగుణము బ్రహ్మ, తమోగుణము రుద్రుడు, సత్వగుణము విష్ణువు. ఈ ప్రకారముగా ఈ మూడు గుణములుతో త్రిమూర్తులైనవి. ఈ మూడుగుణములు ఒకదానినొకటి ఆకర్షించి యుండును, ఒకదానితోనొకటి కలిసియుండును, ఒక్కక్షణమైనను విడిపోయి యుండవు, ఒకదానినొకటి వదలియుండవు).

తరలము. “పరమ పురుషుడొక్కడాఢ్యుడు పాలనోద్భవ నాశముల్

నొందిజేయుముకుంద పద్మజ శూలి సంజ్ఞల బ్రాకృత

స్ఫురిత సత్వ రజస్తమంబుల బొందు; నందు శుభస్థితుల్

హరి చరాచరకోటికిచ్చు ననంత సత్వ నిరూఢుడై “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 2 - 23)

  1. “మాయావచ్ఛిన్నేశ్వర చైతన్యమేవో ద్భూత సత్వగుణమాయావచ్ఛిన్నం పాల యితృ విష్ణునారాయణాది శబ్దవాచ్యతాం భవతి; తదైవోద్భూత రజోగుణ మాయావచ్ఛిన్నం స్రష్టృ విధా త్రాది శబ్ద ప్రపాద్యతాం లభతే; తదైవోద్భూత తమోగుణమాయావచ్ఛిన్నం సమ్హర్తృ మహేశ్వర రుద్రాది శబ్దాభిదేయతాం మధి గచ్ఛతి, అధియో హఖలు వావాస్య రాజసో(అ)oసో అసౌయో (అ)యం బ్రహ్మ, అధయో వాఖలు వావాస్య తామసో (అ)oసో(అ)సౌ నసోయం రుద్రః; అధ యోహఖలు వావాస్య సాత్వికో (అ)oసో (అ)సౌ నయో (అ)యం విష్ణుః ఇతి మైత్రే యోపనిషధి తధైవావ గతేరిత్యర్థః. ఉపాస్యంతు త్రిగుణమాయా వచ్ఛిన్న మేవ విష్ణు మహేశ, గణేశ. దినేశ దుర్గా రూపేణ స్థితం, న త్వైక గుణప్రధాన మాయావిశిష్ట ముపాస్యం - తస్య నిరంకుశైశ్వర్య వత్త్వా శ్రవణా దితి ద్రష్టవ్యం” (శివదత్తః)

(మాయచేత ఆవరించబడిన ఈశ్వర చైతన్యమే మాయ యొక్క సత్వగుణముచేత ఆవరించబడి జగత్పాలకుడగు విష్ణువు, నారాయణుడు అను మొదలగు పేర్లతో వెలిగెను. ఆ ప్రకారముగానే మాయ యొక్క రజోగుణముచేత ఆవరించబడిన ఈశ్వరచైతన్యమే సృష్టికర్త, విధాత యను పేర్లు గలదాయెను. ఆ ప్రకారముగానే మాయ యొక్క తమోగుణముచేత ఆవరించబడిన ఈశ్వర చైతన్యమే జగత్సమ్హారకర్తయగు మహేశ్వరుడు, రుద్రుడు మొదలగు పేర్లచేత చెప్పబడుచున్నది. అందుచేత ఈశ్వరునియొక్క చైతన్యముతోగూడిన రాజస అంసయే బ్రహ్మ (చతుర్ముఖ బ్రహ్మ) తామసాంసయే రుద్రుడు, సాత్వికాంసయే విష్ణువు - అని మైత్రేయోపైనిషత్తు చెప్పుచున్నది. సత్వ, రజస్తమోగుణములు అను మూడు గుణములచే ఆవరించిన బడిన విష్ణువు, మహేశ్వరుడు, గణేశుడు, సూర్యుడు, దుర్గ అను పరమేశ్వర రూపములను త్రిగుణములచేత ఆవరించినబడిన పరబ్రహ్మ చైతన్యముగానే ఉపాసించవలెను - ఆ రూపములు అడ్డులేని ఐశ్వర్యము (ఈశ్వరత్వము) గలవని చెప్పబడి యుండుటచేత. (దీనిని బట్టి సగుణబ్రహ్మనే ఉపాసించవలెనని తెలియుచున్నది).

  1. “యే చైవ సాత్వికాభవా రాజసాస్తావసాశ్చయే |

మత్త ఏవేతితాన్ విద్ధి, నత్వహం తేషు, తేమయి ||

త్రిభిర్గుణమ యైర్భావై రేభిః సర్వమిదం జగత్ |

మోహితం నాభిజానాతి మామేభ్యః పరమ వ్యయః ||” (శ్రీమద్భగవద్గీత - 7 - 12, 13)

“భావశ్చిత్త పరిణామాః సాత్వికా యేశమాదయః |

రాజసా హర్షదర్పాద్యామోహా ద్యాస్తా మసాశ్చయే |

విద్యాకర్మాదివశతో జాయంతే దేహినాం హితాన్ |

మత్తః సర్వేశ్వరా త్సర్వాన్జాయమానాని వేహిభోః || (గీతాభావప్రకాశము - 7 - 65 to 67)

(భావములు అనగా చిత్త పరిణామములు. ఇవి మూడురకములు - త్రిగుణములనుబట్టి సాత్వికభావములు, రాజసభావములు, తామసభావములు. సాత్వికభాములనగా శమము, దమము, మొదలగునవి. రాజసభావములనగా హర్షము, దర్పము మొదలగునవు. తామసభావములనగా మోహము మొదలగునవి. ఈ భావములన్నియు నావలననే - భగవంతునివలననే కలుగుచున్నవి. మనుష్యుల చిత్తములలో నా చైతన్యశక్తి యుండుటవలననే వారివారి చిత్తములు పరిణమించును. అవి ఎట్లు పరిణమించుననగా సత్వ రజస్తమోగుణముల ననుసరించి శమదమాది రూపములుగా పరిణమించును. ఈ త్రిగుణములచేతను ప్రోత్సహింపబడిన భావములు జగత్తునంతటిని మోహింప చేయుచున్నవి. వీటివలన ఈ మోహములో పడి ఈ జగత్తు - జగత్తులోనుండు మనుష్యులు పరమేశ్వరుడనైన నన్ను తెలియ జాలకున్నారు).

  1. న తదస్తి పృధివ్యాం దివి దేవేషు వా పునాః |

సత్త్వం ప్రకృతిజైర్ముక్తం యధేభ్యః స్యాత్ త్రిభుర్గుణైః |

బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణాం చ పరంతప |

కర్మాణి ప్రవిభాక్తాని స్వభావ ప్రభా వైర్గుణైః || “. (శ్రీమద్భగవద్గీత - 18 - 40, 41)

(ఈ భూమిమీద గాని,, దేవలోకములోగాని ఏ వస్తువైనను ప్రకృతివలన పుట్టిన యీ సత్వరజస్తమో గుణములు లేనిదిలేదు. బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులకు కర్మలు ఈ త్రిగుణములవలన కలిగిన వారి వారి స్వభావమును బట్టి విభజించబడినవి).

  1. “సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః |

నిబద్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం |

నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి |

గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సో(అ) ధిగచ్ఛతి |

గుణానేతానతీత్య త్రీన్ దేహీ దేహసముద్భవాన్ |

జన్మమృత్యు జరాదుఃఖైర్విముక్తో (అ)మృతమశ్నుతే||“. (శ్రీమద్భగవద్గీత - 14 - 5; 19, 20)

(సత్వము, రజస్సు, తమస్సు అను గుణములు ప్రకృతినుండినుండి కలిగినవి. ఇవి జీవుని దేహముతో బంధించును. వాటి ప్రభావము వలన కర్మలు చేయించి, కర్మఫలమునను భవించుటకు జన్మమునెత్తునట్లు చేయును. ఇందుకు ఈ త్రిగుణములే కారణములు, ఇతరములు కారణములు కావని తెలుసుకొనినవాడు భగవత్సాన్నిధ్యము పొందును. ఈ మూడుగుణములను అతిక్రమించిన వాడు - వాటికి లొంగనివాడు - జననమరణములు, దుఃఖము,ముసలితనము అనునవి లేనివాడై ముక్తిని పొందును).

  1. “ఊర్ధ్వం గచ్ఛంతి సత్వస్థాః మధ్యే తిష్టంతి రాజసాః |

జఘన్య గుణ వౄత్తిస్థా అధోగతామసాః ||.

(సత్వగుణములుకలవారు ఊర్ధ్వలోకములకేగుదురు. రజోగుణములుకలవారు మధ్యలోకమైన భూలోకములోనుందురు - హింస (చంపుట మొదలగు) కర్మలు చేయు తామసగుణములుకలవారు అధోలోకములకు వెళ్ళుదురు - నీచ జన్మలను పొందుదురు).

Transliteration
  1. “satvaṃ rajastama iti prakṛtērguṇāḥ”. (śrīmadbhāgavataṃ 1 - 2 - 23)

(satvamu, rajassu, tamassu anunavi mūḍu prakṛti yokka guṇamulu).

  1. “sukha duḥkha mōhātmakāḥ triguṇāḥ”.

(satva, rajastamō guṇamulu varusagā sukhamunu, duḥkhamunu, mōhamunu kalugacēyunu).

  1. “rajastamaścābhi bhūya satvaṃ bhavati bhārata |

rajassatvaṃ tamaścaiva, tamassatvaṃ rajastathā ||“. (śrīmadbhagavadgīta - 14 - 10)

(satvaguṇamu,rajōguṇamunu,tamōguṇamunu aṇacivēsi tana svabhāvaguṇamulanu kalugacēyunu - rajōguṇamu satvaguṇamunu tamōguṇamunu aṇaci tana svabhāvaguṇamulugala kāryamulaṃdu prērēpiṃcunu. tamōguṇamu satvaguṇamunu, rajōguṇamunu aṇaci tanasvabhāvaguṇamu galakarmalalō prērēpiṃcunu).

  1. “kāṣṭaṃbukaṃṭe dhūmaṃbu, dhūmaṃbukaṃṭe trayīmayaṃbayina vahniyu eṭlu viśēṣaṃbagu naṭlu tamōguṇaṃbukaṃṭe rajōguṇaṃbu, rajōguṇaṃbukaṃṭe brahma prakāśaṃbagu satvaguṇaṃbu viśiṣṭaṃbagu -”. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 2 - 24)

  2. “satvaṃ rajastavaścēti trayaḥ prōktā mahāguṇāḥ |

sātvikaṃ śaucamāstikyaṃ dharmassatvaṃ śucirmatiḥ |

rājasaṃ bahibhāṣitvaṃ mānakṛddaṃcha matsaraṃ |

tāmasaṃ bhayamajñānaṃ nidrālasyaṃ niṣāditā |

iti bhūtama yō dēha striguṇairlakṣayaṃti ca ||“. (cikitsā sārasaṃgrahamu - )

(satvamu, rajassu, tamassu ani mūḍuguṇamulu ceppabaḍinavi. satvaguṇamulakṣaṇamulu :- śaucamu, āstikyamu, dharmamu, maṃci buddhi. rājasaguṇamula lakṣaṇamulu :- bahu bhāṣitvamu, abhimānamu, daṃbhamu, matsaramu. tāmasaguṇa lakṣaṇamulu :- bhayamu, ajñānamu, nidra, ālasyamu. paṃcabhūtamayamaina dēhamu ī triguṇamulacētanu teliyabaḍucunnavi).

  1. “prajñāṃtu sātvikaṃ prāhustāmasīṃ tu vi citta tāṃ |

kriyaṃtu rājasī prāhurguṇa tatva vidōbudhāḥ ||“.

(prajña satva guṇa lakṣaṇamu, cittavibhramamu tamōguṇalakṣaṇamu - kriya rajōguṇalakṣaṇamu. ī prakāramugātriguṇamula tatvamulu telisinavāru ceppuduru).

  1. “satvādi guṇa pariṇāmaṃbula namarulairi. ūrjitasatvaguṇaṃbuna naddēvatalu trivaṃbunoṃdiri. rajōguṇaṃbuna manujulunu gavādulunu dhariṇiṃ boṃdiri. tāmasaṃbuna bhūtādulaina rudrapāriṣadulu dvādā pṛthivyaṃtaraṃbagu viyattalaṃbunuṃ boṃdiri”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 6 - 215)

  1. “yadhā prāgvyāpakaḥ kṣētrī sargādiṣu guṇairyutaḥ |

tadhāna saṃ jñā māyāti brahma viṣṇu śivātmikāṃ |

brahmatē sṛjatē lōkān rudratvē saṃhāratyapi |

viṣṇutvē pi cōdāsīnastistō avasthāḥ svayaṃ bhuvaḥ |

rajōbrahma tamō rudrō viṣṇuḥ satvaṃ jagatpatiḥ |

ata ēva trayō dēvā ē tē ēva trayōguṇāḥ |

anyōnya midhunā hyētā anyōnyāśraya stathā |

kṣaṇaṃ viyōgō nahyēṣāṃ natyajaṃti parasparaṃ ||“.

(sṛṣṭi prāraṃbhamuna vyāpakuḍu - anniṃṭilōnu vyāpiṃciyuṃḍuvāḍu - agu paramātma satva rajastamōguṇamulu kaligiyuṃḍenu. prakṛtilō pravēśiṃciyuṃḍuṭavalana prakṛti guṇamulaina satvarajastamamulu kaligi yuṃḍenu. iṭlu triguṇamulanu kaligiyuṃḍuṭavalana brahma viṣṇu mahēśvarulanu trimūrtulugā tānē āyenu. brahma ayi - caturmukha brahma ayi - lōkamulanu sṛjiṃcunu. śivuḍu ayi saṃhāramu cēyunu. viṣṇuvai udāsīnuḍugānuṃḍunu, ī mūḍunu parabrahmaku mūḍu avasthalu. rajōguṇamu brahma, tamōguṇamu rudruḍu, satvaguṇamu viṣṇuvu. ī prakāramugā ī mūḍu guṇamulutō trimūrtulainavi. ī mūḍuguṇamulu okadāninokaṭi ākarṣiṃci yuṃḍunu, okadānitōnokaṭi kalisiyuṃḍunu, okkakṣaṇamainanu viḍipōyi yuṃḍavu, okadāninokaṭi vadaliyuṃḍavu).

taralamu. “parama puruṣuḍokkaḍāḍhyuḍu pālanōdbhava nāśamul

noṃdijēyumukuṃda padmaja śūli saṃjñala brākṛta

sphurita satva rajastamaṃbula boṃdu; naṃdu śubhasthitul

hari carācarakōṭikiccu nanaṃta satva nirūḍhuḍai “. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 2 - 23)

  1. “māyāvacchinnēśvara caitanyamēvō dbhūta satvaguṇamāyāvacchinnaṃ pāla yitṛ viṣṇunārāyaṇādi śabdavācyatāṃ bhavati; tadaivōdbhūta rajōguṇa māyāvacchinnaṃ sraṣṭṛ vidhā trādi śabda prapādyatāṃ labhatē; tadaivōdbhūta tamōguṇamāyāvacchinnaṃ samhartṛ mahēśvara rudrādi śabdābhidēyatāṃ madhi gacchati, adhiyō hakhalu vāvāsya rājasō(a)osō asauyō (a)yaṃ brahma, adhayō vākhalu vāvāsya tāmasō (a)osō(a)sau nasōyaṃ rudraḥ; adha yōhakhalu vāvāsya sātvikō (a)osō (a)sau nayō (a)yaṃ viṣṇuḥ iti maitrē yōpaniṣadhi tadhaivāva gatērityarthaḥ. upāsyaṃtu triguṇamāyā vacchinna mēva viṣṇu mahēśa, gaṇēśa. dinēśa durgā rūpēṇa sthitaṃ, na tvaika guṇapradhāna māyāviśiṣṭa mupāsyaṃ - tasya niraṃkuśaiśvarya vattvā śravaṇā diti draṣṭavyaṃ” (śivadattaḥ)

(māyacēta āvariṃcabaḍina īśvara caitanyamē māya yokka satvaguṇamucēta āvariṃcabaḍi jagatpālakuḍagu viṣṇuvu, nārāyaṇuḍu anu modalagu pērlatō veligenu. ā prakāramugānē māya yokka rajōguṇamucēta āvariṃcabaḍina īśvaracaitanyamē sṛṣṭikarta, vidhāta yanu pērlu galadāyenu. ā prakāramugānē māya yokka tamōguṇamucēta āvariṃcabaḍina īśvara caitanyamē jagatsamhārakartayagu mahēśvaruḍu, rudruḍu modalagu pērlacēta ceppabaḍucunnadi. aṃducēta īśvaruniyokka caitanyamutōgūḍina rājasa aṃsayē brahma (caturmukha brahma) tāmasāṃsayē rudruḍu, sātvikāṃsayē viṣṇuvu - ani maitrēyōpainiṣattu ceppucunnadi. satva, rajastamōguṇamulu anu mūḍu guṇamulacē āvariṃcina baḍina viṣṇuvu, mahēśvaruḍu, gaṇēśuḍu, sūryuḍu, durga anu paramēśvara rūpamulanu triguṇamulacēta āvariṃcinabaḍina parabrahma caitanyamugānē upāsiṃcavalenu - ā rūpamulu aḍḍulēni aiśvaryamu (īśvaratvamu) galavani ceppabaḍi yuṃḍuṭacēta. (dīnini baṭṭi saguṇabrahmanē upāsiṃcavalenani teliyucunnadi).

  1. “yē caiva sātvikābhavā rājasāstāvasāścayē |

matta ēvētitān viddhi, natvahaṃ tēṣu, tēmayi ||

tribhirguṇama yairbhāvai rēbhiḥ sarvamidaṃ jagat |

mōhitaṃ nābhijānāti māmēbhyaḥ parama vyayaḥ ||” (śrīmadbhagavadgīta - 7 - 12, 13)

“bhāvaścitta pariṇāmāḥ sātvikā yēśamādayaḥ |

rājasā harṣadarpādyāmōhā dyāstā masāścayē |

vidyākarmādivaśatō jāyaṃtē dēhināṃ hitān |

mattaḥ sarvēśvarā tsarvānjāyamānāni vēhibhōḥ || (gītābhāvaprakāśamu - 7 - 65 to 67)

(bhāvamulu anagā citta pariṇāmamulu. ivi mūḍurakamulu - triguṇamulanubaṭṭi sātvikabhāvamulu, rājasabhāvamulu, tāmasabhāvamulu. sātvikabhāmulanagā śamamu, damamu, modalagunavi. rājasabhāvamulanagā harṣamu, darpamu modalagunavu. tāmasabhāvamulanagā mōhamu modalagunavi. ī bhāvamulanniyu nāvalananē - bhagavaṃtunivalananē kalugucunnavi. manuṣyula cittamulalō nā caitanyaśakti yuṃḍuṭavalananē vārivāri cittamulu pariṇamiṃcunu. avi eṭlu pariṇamiṃcunanagā satva rajastamōguṇamula nanusariṃci śamadamādi rūpamulugā pariṇamiṃcunu. ī triguṇamulacētanu prōtsahiṃpabaḍina bhāvamulu jagattunaṃtaṭini mōhiṃpa cēyucunnavi. vīṭivalana ī mōhamulō paḍi ī jagattu - jagattulōnuṃḍu manuṣyulu paramēśvaruḍanaina nannu teliya jālakunnāru).

  1. na tadasti pṛdhivyāṃ divi dēvēṣu vā punāḥ |

sattvaṃ prakṛtijairmuktaṃ yadhēbhyaḥ syāt tribhurguṇaiḥ |

brāhmaṇa kṣatriya viśāṃ śūdrāṇāṃ ca paraṃtapa |

karmāṇi pravibhāktāni svabhāva prabhā vairguṇaiḥ || “. (śrīmadbhagavadgīta - 18 - 40, 41)

(ī bhūmimīda gāni,, dēvalōkamulōgāni ē vastuvainanu prakṛtivalana puṭṭina yī satvarajastamō guṇamulu lēnidilēdu. brahma kṣatriya vaiśya śūdrulaku karmalu ī triguṇamulavalana kaligina vāri vāri svabhāvamunu baṭṭi vibhajiṃcabaḍinavi).

  1. “satvaṃ rajastama iti guṇāḥ prakṛti saṃbhavāḥ |

nibadnaṃti mahābāhō dēhē dēhinamavyayaṃ |

nānyaṃ guṇēbhyaḥ kartāraṃ yadā draṣṭānupaśyati |

guṇēbhyaśca paraṃ vētti madbhāvaṃ sō(a) dhigacchati |

guṇānētānatītya trīn dēhī dēhasamudbhavān |

janmamṛtyu jarāduḥkhairvimuktō (a)mṛtamaśnutē||“. (śrīmadbhagavadgīta - 14 - 5; 19, 20)

(satvamu, rajassu, tamassu anu guṇamulu prakṛtinuṃḍinuṃḍi kaliginavi. ivi jīvuni dēhamutō baṃdhiṃcunu. vāṭi prabhāvamu valana karmalu cēyiṃci, karmaphalamunanu bhaviṃcuṭaku janmamunettunaṭlu cēyunu. iṃduku ī triguṇamulē kāraṇamulu, itaramulu kāraṇamulu kāvani telusukoninavāḍu bhagavatsānnidhyamu poṃdunu. ī mūḍuguṇamulanu atikramiṃcina vāḍu - vāṭiki loṃganivāḍu - jananamaraṇamulu, duḥkhamu,musalitanamu anunavi lēnivāḍai muktini poṃdunu).

  1. “ūrdhvaṃ gacchaṃti satvasthāḥ madhyē tiṣṭaṃti rājasāḥ |

jaghanya guṇa vṝttisthā adhōgatāmasāḥ ||.

(satvaguṇamulukalavāru ūrdhvalōkamulakēguduru. rajōguṇamulukalavāru madhyalōkamaina bhūlōkamulōnuṃduru - hiṃsa (caṃpuṭa modalagu) karmalu cēyu tāmasaguṇamulukalavāru adhōlōkamulaku veḷḷuduru - nīca janmalanu poṃduduru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.