← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్రిమూర్తి trimūrti

Original — తెలుగు
  1. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అను మూడు మూర్తులు (రూపములు) తానే అయినవాడు - మూడు మూర్తులు ధరించినవాడు.

  2. “నేను రజస్సత్వతమో గుణ సమేతుండనై త్రిమూర్తులు వహించి జగదుత్పత్తి స్థితి లయ కారణుండనై వర్ధిల్లుదు”

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 113)

  1. నమో రజో జుషే సౄష్టౌ స్థితౌ సత్వమయాయ చ తమో రూపాయ సంహారే త్రిరూపాయ స్వయంభువే ||“.

(సృష్టి కాలమందు రజోగుణరూపముతోను, స్థితికాలములో సత్వగుణముతోను, సంహారకాలమందు తమోగుణముతోను కలిగి మూడుమూర్తులు గల స్వయంభువునకు నమస్కారము).

  1. మ. “చేయువుల్ సేయు తఱిన్ విథాత కరుణిం జెన్నొందు, సంతోషదృ

ష్టియుతుండై నగుచున్ జనార్దనుని నూడ్కింబొల్చు, రోషించియు

న్న యెడన్ రుద్రుని భంగి నొప్పును సుఖానందంబు నంబొంది త

న్మయుడై బ్రహ్మము భాతి బాలుడమరున్ బాహుళ్య బాల్యంబునన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. - 195)

  1. విద్యాచ తేజశ్చ, తపశ్చ యస్య సః-

(విద్యా, తేజస్సు, తపము గలవాడు, - విద్యారూపము, తేజోరూపము, తపోరూపము అయినవాడు - ఈ మూడు శక్తులు గలవాడు).

Transliteration
  1. brahma, viṣṇu, mahēśvarulu anu mūḍu mūrtulu (rūpamulu) tānē ayinavāḍu - mūḍu mūrtulu dhariṃcinavāḍu.

  2. “nēnu rajassatvatamō guṇa samētuṃḍanai trimūrtulu vahiṃci jagadutpatti sthiti laya kāraṇuṃḍanai vardhilludu”

(śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 113)

  1. namō rajō juṣē sṝṣṭau sthitau satvamayāya ca tamō rūpāya saṃhārē trirūpāya svayaṃbhuvē ||“.

(sṛṣṭi kālamaṃdu rajōguṇarūpamutōnu, sthitikālamulō satvaguṇamutōnu, saṃhārakālamaṃdu tamōguṇamutōnu kaligi mūḍumūrtulu gala svayaṃbhuvunaku namaskāramu).

  1. ma. “cēyuvul sēyu taṟin vithāta karuṇiṃ jennoṃdu, saṃtōṣadṛ

ṣṭiyutuṃḍai nagucun janārdanuni nūḍkiṃbolcu, rōṣiṃciyu

nna yeḍan rudruni bhaṃgi noppunu sukhānaṃdaṃbu naṃboṃdi ta

nmayuḍai brahmamu bhāti bāluḍamarun bāhuḷya bālyaṃbunan”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. - 195)

  1. vidyāca tējaśca, tapaśca yasya saḥ-

(vidyā, tējassu, tapamu galavāḍu, - vidyārūpamu, tējōrūpamu, tapōrūpamu ayinavāḍu - ī mūḍu śaktulu galavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.