← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్రిపుటి tripuṭi

Original — తెలుగు
  1. మూడు కలిసి యుండుట.

  2. “వ. ద్రష్టయు దృక్కును, దృశ్యంబుననందగు నీమూటియందు నొకటి లేకున్న నొకటి గానరాదు. ఈ త్రిత్రయం బెవ్వండెఱుంగు నతండు సర్వలోకాశ్రయుండై యుండు, అతండె పరమాత్మ”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 10 - 268)

  3. దృశ్యము, ద్రష్ట, దృక్ అనునవి మూడు త్రిపుటి - దృశ్యమనగా కనబడునది - జగత్తు, ద్రష్టయనగా చూచువాడు - ఈ జగత్తును చూచువాడు - జీవుడు, పరమాత్మ. ఈ రెండింటికి సంబంధము కలుగచేయునది దృక్ లేక, దృష్టి

  4. కొన్ని త్రిపుటులు ఈ క్రింద చెప్పబడినవి : -

జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము - ఇదం = ఇది అని తెలియుట జ్ఞానము. అహం = నేను అనుట జ్ఞాత, తత్ = ‘అది’ అని చెప్పబడునది జ్ఞేయము.

దేహత్రయము (స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము), అవస్థా త్రయము (జాగ్రదవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ), కాలత్రయము (భూత భవిష్యద్వర్తమానములు), గుణత్రయము (సత్వగుణము, రజోగుణము, తమోగుణము), మూర్తిత్రయము (బ్రహ్మ విష్ణు మహేశ్వరులు), శక్తి త్రయము (ఇచ్ఛ, జ్ఞాన, క్రియా శక్తులు, ఉత్సా హ ప్రభు మంత్రశక్తులు), తాపత్రయము (ఆధ్యాత్మిక, ఆధి దైవిక, ఆధి భౌతిక తాపములు), లోకత్రయము (ఊర్ధ్వలోకములు, మధ్యలోకము, (భూలోకము), అధోలోకములు(పాతాళములు), వేదత్రయము (ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము), కాండ త్రయము (కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ), నేత్ర త్రయము (మనసుతో కలిపి మూడునేత్రములు), ముక్తి త్రయము (సాలోక్య, సామీప్య, సాయుజ్య ముక్తులు), అగ్నిత్రయము (గార్హపత్యము, దక్షిణాగ్ని, ఆవహనీయము), ఋణత్రయము (పితృ ఋణము, దేవ ఋణము, గురు ఋణము), ఈషణ త్రయము (ధనేషణ, దారేషణ, పుత్రేషణ), తత్వత్రయము (జీవుడు, ప్రకౄతి, పరమాత్మ), నాడీ త్రయము (వాత, పిత్త కఫములు), - మొదలగునవి.

Transliteration
  1. mūḍu kalisi yuṃḍuṭa.

  2. “va. draṣṭayu dṛkkunu, dṛśyaṃbunanaṃdagu nīmūṭiyaṃdu nokaṭi lēkunna nokaṭi gānarādu. ī tritrayaṃ bevvaṃḍeṟuṃgu nataṃḍu sarvalōkāśrayuṃḍai yuṃḍu, ataṃḍe paramātma”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 10 - 268)

  3. dṛśyamu, draṣṭa, dṛk anunavi mūḍu tripuṭi - dṛśyamanagā kanabaḍunadi - jagattu, draṣṭayanagā cūcuvāḍu - ī jagattunu cūcuvāḍu - jīvuḍu, paramātma. ī reṃḍiṃṭiki saṃbaṃdhamu kalugacēyunadi dṛk lēka, dṛṣṭi

  4. konni tripuṭulu ī kriṃda ceppabaḍinavi : -

jñāta, jñānamu, jñēyamu - idaṃ = idi ani teliyuṭa jñānamu. ahaṃ = nēnu anuṭa jñāta, tat = ‘adi’ ani ceppabaḍunadi jñēyamu.

dēhatrayamu (sthūladēhamu, sūkṣmadēhamu, kāraṇadēhamu), avasthā trayamu (jāgradavastha, svapnāvastha, suṣuptyavastha), kālatrayamu (bhūta bhaviṣyadvartamānamulu), guṇatrayamu (satvaguṇamu, rajōguṇamu, tamōguṇamu), mūrtitrayamu (brahma viṣṇu mahēśvarulu), śakti trayamu (iccha, jñāna, kriyā śaktulu, utsā ha prabhu maṃtraśaktulu), tāpatrayamu (ādhyātmika, ādhi daivika, ādhi bhautika tāpamulu), lōkatrayamu (ūrdhvalōkamulu, madhyalōkamu, (bhūlōkamu), adhōlōkamulu(pātāḷamulu), vēdatrayamu (ṛgvēdamu, yajurvēdamu, sāmavēdamu), kāṃḍa trayamu (karmakāṃḍa, upāsanākāṃḍa, jñānakāṃḍa), nētra trayamu (manasutō kalipi mūḍunētramulu), mukti trayamu (sālōkya, sāmīpya, sāyujya muktulu), agnitrayamu (gārhapatyamu, dakṣiṇāgni, āvahanīyamu), ṛṇatrayamu (pitṛ ṛṇamu, dēva ṛṇamu, guru ṛṇamu), īṣaṇa trayamu (dhanēṣaṇa, dārēṣaṇa, putrēṣaṇa), tatvatrayamu (jīvuḍu, prakṝti, paramātma), nāḍī trayamu (vāta, pitta kaphamulu), - modalagunavi.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.