← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్రిశక్తులు triśaktulu

Original — తెలుగు
  1. ద్రవ్యజ్ఞాన క్రియాశక్తయః - ద్రవ్యాణాం క్షిత్యాది పంచమహాభూతానాం జ్ఞానానాం చక్షురాది జ్ఞానేంద్రియాణాం క్రియాణాం వాగాది కర్మేంద్రియాణాం జనన శక్తిః

(దివ్యశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అను మూడుశక్తులు - ద్రవ్యశక్తియనగా భూమి మొదలగు పంచమహాభూతములను పుట్టించు శక్తి. జ్ఞానశక్తియనగా కండ్లు మొదలగు జ్ఞానేంద్రియములను కలిగించుశక్తి, క్రియాశక్తియనగా వాక్కు మొదలగు కర్మేంద్రియములను కలిగించు శక్తి).

  1. సృష్టి స్థితి సంహార శక్తులు.

  2. సత్వరజస్తమో గుణములు - ఈ గుణములుగల ప్రకృతి,

  3. ఉత్సాహ ప్రభు మంత్ర శక్తులు.

  4. ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులు -

  5. “రజస్సత్వంబుల చేత నుప బృమ్హితంబై వికారంబునొందినమహత్తత్వంబువలనం తనుః ప్రధానంబై ద్రవ్యజ్ఞాన క్రియాత్మకంబగు నహంకారంబు గలిగె అదియు రూపాంతరంబు లొందుచు ద్రవ్యశక్తియైన రాజసంబును, గ్రియాశక్తీయిన తామసంబును, జ్ఞానశక్తి అయిన సాత్వికంబును నన మూడు విధంబులయ్యె - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 5 - 86)

  6. “వాగీశ్వరీ జ్ఞానశక్తిః వాగ్భావే మోక్షరూపిణీ |

కామరాజే క్రియాశక్తిః కామేశౌ కామ రూపిణీ |

శక్తి బీజే పరాశక్తిః ఇచ్ఛైవశివరూపిణీ |

ఏవం దేవీ త్ర్యక్షరీతు మహా త్రిపురసుందరీ||”

(వాగ్భవకూటమందు వాగీశ్వరిజ్ఞానశక్తి,కామరాజకూటమందుక్రియాశక్తి,శివరూపమే అయినశక్తి బీజము ఇచ్ఛాశక్తి).

  1. (భగవంతునికి సృష్టిచేయవలెనను ఇచ్ఛ (కోరిక, సంకల్పము) కలిగెను - (“సైక్షిత”) “స అకారుయత” మొదలగు శ్రుతివాక్యములు ఈ ఇచ్ఛకలుగుటవలననే సృష్టి చేయడమైనది. ఇది ఇచ్ఛాశక్తి - సృష్టిలోని సమస్త వస్తువులను చిత్ర విచిత్రమైనరీతిలో పుట్టించుట జ్ఞానశక్తి. “యః సర్వజ్ఞః సర్వవిద్”.

(భగవంతుడు సర్వజ్ఞుడు. ఆ జ్ఞానము కలిగియుండుటచేత ఒక వస్తువులోనుండి మఱియొక వస్తువును దానినుండి పుట్టింపచేయుట క్రియాశక్తి).

  1. “చ. అతని నియుక్తి జెంది సచరాచరభూత సమేత సృష్టి నే

వి తతముగాగ సృజింతు, బ్రభవిష్ణుడు విష్ణుడుప్రోచు, బార్వతీ

పతి లయమొందజేయు; హరి పంకరుహాదురుడాది మూర్తి య

చ్యుతుడు త్రిశక్తియుక్తుడగుచుండును నింతకు దానమూలమై” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 6 - 101)

Transliteration
  1. dravyajñāna kriyāśaktayaḥ - dravyāṇāṃ kṣityādi paṃcamahābhūtānāṃ jñānānāṃ cakṣurādi jñānēṃdriyāṇāṃ kriyāṇāṃ vāgādi karmēṃdriyāṇāṃ janana śaktiḥ

(divyaśakti, jñānaśakti, kriyāśakti anu mūḍuśaktulu - dravyaśaktiyanagā bhūmi modalagu paṃcamahābhūtamulanu puṭṭiṃcu śakti. jñānaśaktiyanagā kaṃḍlu modalagu jñānēṃdriyamulanu kaligiṃcuśakti, kriyāśaktiyanagā vākku modalagu karmēṃdriyamulanu kaligiṃcu śakti).

  1. sṛṣṭi sthiti saṃhāra śaktulu.

  2. satvarajastamō guṇamulu - ī guṇamulugala prakṛti,

  3. utsāha prabhu maṃtra śaktulu.

  4. icchā jñāna kriyā śaktulu -

  5. “rajassatvaṃbula cēta nupa bṛmhitaṃbai vikāraṃbunoṃdinamahattatvaṃbuvalanaṃ tanuḥ pradhānaṃbai dravyajñāna kriyātmakaṃbagu nahaṃkāraṃbu galige adiyu rūpāṃtaraṃbu loṃducu dravyaśaktiyaina rājasaṃbunu, griyāśaktīyina tāmasaṃbunu, jñānaśakti ayina sātvikaṃbunu nana mūḍu vidhaṃbulayye - (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 5 - 86)

  6. “vāgīśvarī jñānaśaktiḥ vāgbhāvē mōkṣarūpiṇī |

kāmarājē kriyāśaktiḥ kāmēśau kāma rūpiṇī |

śakti bījē parāśaktiḥ icchaivaśivarūpiṇī |

ēvaṃ dēvī tryakṣarītu mahā tripurasuṃdarī||”

(vāgbhavakūṭamaṃdu vāgīśvarijñānaśakti,kāmarājakūṭamaṃdukriyāśakti,śivarūpamē ayinaśakti bījamu icchāśakti).

  1. (bhagavaṃtuniki sṛṣṭicēyavalenanu iccha (kōrika, saṃkalpamu) kaligenu - (“saikṣita”) “sa akāruyata” modalagu śrutivākyamulu ī icchakaluguṭavalananē sṛṣṭi cēyaḍamainadi. idi icchāśakti - sṛṣṭilōni samasta vastuvulanu citra vicitramainarītilō puṭṭiṃcuṭa jñānaśakti. “yaḥ sarvajñaḥ sarvavid”.

(bhagavaṃtuḍu sarvajñuḍu. ā jñānamu kaligiyuṃḍuṭacēta oka vastuvulōnuṃḍi maṟiyoka vastuvunu dāninuṃḍi puṭṭiṃpacēyuṭa kriyāśakti).

  1. “ca. atani niyukti jeṃdi sacarācarabhūta samēta sṛṣṭi nē

vi tatamugāga sṛjiṃtu, brabhaviṣṇuḍu viṣṇuḍuprōcu, bārvatī

pati layamoṃdajēyu; hari paṃkaruhāduruḍādi mūrti ya

cyutuḍu triśaktiyuktuḍagucuṃḍunu niṃtaku dānamūlamai” (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 6 - 101)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.