← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్రివిధపరిచ్ఛేదము trividhaparicchēdamu

Original — తెలుగు
  1. స్వజాతీయ పరిచ్ఛేదము, విజాతీయ పరిచ్ఛేదము, స్వగత పరిచ్ఛేదము అని పరిచ్ఛేదము మూడు విధములు – వృక్షస్య స్వగతో భేదో పత్ర పుష్ప ఫలాదిభిః ; వృక్షాంతరాత్ సజాతీయో, వి జాతీయః శిలాదిభిః -

(చెట్టులోని వేరు వేరు భాగములు, అనగా ఆకులు పువ్వులు పండు మొదలగు వాటిలో ఒకదానికి, ఇంకొకదానికి ఉండు భేదము స్వగతభేదము - దానిలో నేనుండు భేదము - ఒక చెట్టునకును ఇంకొకచెట్టునకును ఉండు భేదము సజాతీయ భేదము. చెట్టునకును ఱాయినకును నుండు భేదము విజాతీయ భేదము - ఆ రెండింటికిని జాతి భేదము ఉన్నది కనుక భగవంతుడు ఈ మూడువిధములైన పరిచ్ఛేదము లేనివాడు - త్యాగరాజు - “స్వజాతీయ, విజాతీయ, స్వగత భేదమేమి లేక - అఖిలరూపుడైనవాని”

  1. పరిచ్ఛేదము మూడువిధములు - దేశపరిచ్ఛేదము, వస్తుపరిచ్ఛేదము, కాలపరిచ్ఛేదము - ఒకచోటనున్నది ఇంకొక చోట లేకుండుట దేశపరిచ్ఛేదము - ఒకకాలమందుండి ఇంకొకకాలమందు లేకుండుట కాలపరిచ్ఛేదము - ఒకవస్తువులోనుండి ఇంకొక వస్తువులో లేకుండుట వస్తు పరిచ్ఛేదము. ఈ మూడు విధముల పరిచ్ఛేదము లేనివాడు భగవంతుడు - త్రివిధపరిచ్ఛేదరహితుడు - అనగా, అన్నిస్థలములందు, అన్ని కాలములందు, అన్ని వస్తువులందుండువాడు.
Transliteration
  1. svajātīya paricchēdamu, vijātīya paricchēdamu, svagata paricchēdamu ani paricchēdamu mūḍu vidhamulu – vṛkṣasya svagatō bhēdō patra puṣpa phalādibhiḥ ; vṛkṣāṃtarāt sajātīyō, vi jātīyaḥ śilādibhiḥ -

(ceṭṭulōni vēru vēru bhāgamulu, anagā ākulu puvvulu paṃḍu modalagu vāṭilō okadāniki, iṃkokadāniki uṃḍu bhēdamu svagatabhēdamu - dānilō nēnuṃḍu bhēdamu - oka ceṭṭunakunu iṃkokaceṭṭunakunu uṃḍu bhēdamu sajātīya bhēdamu. ceṭṭunakunu ṟāyinakunu nuṃḍu bhēdamu vijātīya bhēdamu - ā reṃḍiṃṭikini jāti bhēdamu unnadi kanuka bhagavaṃtuḍu ī mūḍuvidhamulaina paricchēdamu lēnivāḍu - tyāgarāju - “svajātīya, vijātīya, svagata bhēdamēmi lēka - akhilarūpuḍainavāni”

  1. paricchēdamu mūḍuvidhamulu - dēśaparicchēdamu, vastuparicchēdamu, kālaparicchēdamu - okacōṭanunnadi iṃkoka cōṭa lēkuṃḍuṭa dēśaparicchēdamu - okakālamaṃduṃḍi iṃkokakālamaṃdu lēkuṃḍuṭa kālaparicchēdamu - okavastuvulōnuṃḍi iṃkoka vastuvulō lēkuṃḍuṭa vastu paricchēdamu. ī mūḍu vidhamula paricchēdamu lēnivāḍu bhagavaṃtuḍu - trividhaparicchēdarahituḍu - anagā, annisthalamulaṃdu, anni kālamulaṃdu, anni vastuvulaṃduṃḍuvāḍu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.