అన్యత్ర అలం బుద్ధిః (ఇక మరి అవసరములేదు - ఇందుతో చాలును అను బుద్ధి కలిగియుండుట).
విషయ విశేష సంపర్క జం సుఖం.
(విషయములతోడ విశేషమైన సంపర్కము కలిగియుండుట వలన కలుగు సుఖము).
(కోరినవస్తువు లభించుటవలన కలిగెడునది, ఇంక మరి అవసరములేదు, అను ఒక విధమగు సుఖము -).
(ఈశ్వరుని లీలవలన ఈ జగత్తులోని పదార్ధముల యడల ఎంత కాలము వేరు వేరుగా ఉన్నట్లు కనబడునో అంతకాలము వాటియందు సుఖమును కలిగించునవి యని ఆ సుఖమిచ్చు విషయములగుఱించి క్రొత్త క్రొత్త వాటిని గుఱించి కోరుచూ వాటియందు తృప్తిని పొందకయుండును. ఎప్పుడైతే ఈ సమస్తమైన వస్తువుల యధార్ధమును - అవన్నియు భగవంతుడేకాని వేరుకాదు - వాటి అన్నింటిలోను పూర్తిగా నిండియున్నవాడు భగవంతుడే అని తెలియునో అప్పుడు అట్టి పూర్తి గాలిపదార్ధములందు - వేరు వేరుగా, వ్యష్టిగా - నున్న వాటియందు అతనికి మనసు తగలదు - అట్టివాడు అప్పుడు భగవంతునివలె పూర్ణత్వము పొందినవాడై ఇంక కావలసినదేదియు లేనివాడై తృప్తిని పొందును).
నాంతకః సర్వభూతానాం - - ||“.
(ఎన్ని కట్టెలు వేసినను అగ్ని తృప్తిని పొందదు - న+ అలం = చాలును అనదు. అందుచేత అగ్నికి ‘అనల’ అని పేరు వచ్చినది -సర్వభక్షకుడు. ఎన్ని నదులు సముద్రములో కలిసినను చాలును మరి ఏ నదులు నాలో కలియ నక్కరలేదు - నాలో నున్న నీరు చాలును అని సముద్రము అనదు. సమస్త భూతములను సంహరించినను యముడు తృప్తిని పొందడు - ఇంకెవ్వరిని సంహరింపననడు).
anyatra alaṃ buddhiḥ (ika mari avasaramulēdu - iṃdutō cālunu anu buddhi kaligiyuṃḍuṭa).
viṣaya viśēṣa saṃparka jaṃ sukhaṃ.
(viṣayamulatōḍa viśēṣamaina saṃparkamu kaligiyuṃḍuṭa valana kalugu sukhamu).
(kōrinavastuvu labhiṃcuṭavalana kaligeḍunadi, iṃka mari avasaramulēdu, anu oka vidhamagu sukhamu -).
(īśvaruni līlavalana ī jagattulōni padārdhamula yaḍala eṃta kālamu vēru vērugā unnaṭlu kanabaḍunō aṃtakālamu vāṭiyaṃdu sukhamunu kaligiṃcunavi yani ā sukhamiccu viṣayamulaguṟiṃci krotta krotta vāṭini guṟiṃci kōrucū vāṭiyaṃdu tṛptini poṃdakayuṃḍunu. eppuḍaitē ī samastamaina vastuvula yadhārdhamunu - avanniyu bhagavaṃtuḍēkāni vērukādu - vāṭi anniṃṭilōnu pūrtigā niṃḍiyunnavāḍu bhagavaṃtuḍē ani teliyunō appuḍu aṭṭi pūrti gālipadārdhamulaṃdu - vēru vērugā, vyaṣṭigā - nunna vāṭiyaṃdu ataniki manasu tagaladu - aṭṭivāḍu appuḍu bhagavaṃtunivale pūrṇatvamu poṃdinavāḍai iṃka kāvalasinadēdiyu lēnivāḍai tṛptini poṃdunu).
nāṃtakaḥ sarvabhūtānāṃ - - ||“.
(enni kaṭṭelu vēsinanu agni tṛptini poṃdadu - na+ alaṃ = cālunu anadu. aṃducēta agniki ‘anala’ ani pēru vaccinadi -sarvabhakṣakuḍu. enni nadulu samudramulō kalisinanu cālunu mari ē nadulu nālō kaliya nakkaralēdu - nālō nunna nīru cālunu ani samudramu anadu. samasta bhūtamulanu saṃhariṃcinanu yamuḍu tṛptini poṃdaḍu - iṃkevvarini saṃhariṃpananaḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.