(ఉపాసకులకు అర్చిరాదిమార్గమున్నూ, కర్మయోగులకు ధూమాదిమార్గమున్నూమరణానంతరము వారు వెళ్ళుమార్గములని శ్రుతులలోను, స్మృతులలోను చెప్పబడినది. ఈ రెండుమార్గములద్వారా వెళ్ళనటువంటి పాపాత్ములకు మూడవమార్గము చెప్పబడినది. వారికి చంద్రలోకము మార్గముగా చెప్పబడియుండలేదు).
(జ్ఞానయోగము నవలంబింపకుండుటచేత దేవయానము ద్వారా వెళ్ళలేనివారు కర్మయోగము అయినను చేయకుండుటచేత పితౄయానముద్వారా వెళ్ళలేనివారు అయిన ఈ మూడవరకము మనుష్యులకు క్షుద్రజంతువులుగా పుట్టుట యను మూడవమార్గము చెప్పబడినది).
(జ్ఞానయోగము, కర్మయోగము అను ఈ రెండు సాధనములద్వారా కాక ఇతరసాధన ద్వారా అయినను, యోగాభ్యాసము లేనివారు జననమరణరూపమైన సంసారమను మూడవమార్గములోనుందురు).
(శాస్త్రములో నిషేధింపబడిన కర్మలు చేయువారికి రౌరవము మొదలగు నరకములందు వారి వారి తత్వములకు (స్వభావములకు) అనుకూలమైన కుక్క, పంది మొదలగు జంతువులుగాను, చెట్లు చేమలు మొదలగు స్థావరములుగాను జన్మ కలుగును).
(upāsakulaku arcirādimārgamunnū, karmayōgulaku dhūmādimārgamunnūmaraṇānaṃtaramu vāru veḷḷumārgamulani śrutulalōnu, smṛtulalōnu ceppabaḍinadi. ī reṃḍumārgamuladvārā veḷḷanaṭuvaṃṭi pāpātmulaku mūḍavamārgamu ceppabaḍinadi. vāriki caṃdralōkamu mārgamugā ceppabaḍiyuṃḍalēdu).
(jñānayōgamu navalaṃbiṃpakuṃḍuṭacēta dēvayānamu dvārā veḷḷalēnivāru karmayōgamu ayinanu cēyakuṃḍuṭacēta pitṝyānamudvārā veḷḷalēnivāru ayina ī mūḍavarakamu manuṣyulaku kṣudrajaṃtuvulugā puṭṭuṭa yanu mūḍavamārgamu ceppabaḍinadi).
(jñānayōgamu, karmayōgamu anu ī reṃḍu sādhanamuladvārā kāka itarasādhana dvārā ayinanu, yōgābhyāsamu lēnivāru jananamaraṇarūpamaina saṃsāramanu mūḍavamārgamulōnuṃduru).
(śāstramulō niṣēdhiṃpabaḍina karmalu cēyuvāriki rauravamu modalagu narakamulaṃdu vāri vāri tatvamulaku (svabhāvamulaku) anukūlamaina kukka, paṃdi modalagu jaṃtuvulugānu, ceṭlu cēmalu modalagu sthāvaramulugānu janma kalugunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.