‘త్వం’ అనుపదమునకు నీవు అని అర్ధము - తనుగాక ఎదురుగానుండు మఱియొకడు.
“తత్వమసి”(అదే - ఆ పరబ్రహ్మమమే - నీవు అయితివి - అయియున్నావు) అను మహావాక్యములోని ‘తత్’ అను పదము పరోక్షముగానున్న (కనబడకుండానున్న) భగవంతుని చెప్పును - ఆ వాక్యములోని ‘త్వం’ అను పదము జీవుడు అనిచెప్పును. అందుచేత భగవంతుడే జీవుడు;పరమాత్మయే జీవాత్మ - ఇద్దరికి భేదములేదు - ఇద్దరూ ఒకటే).
“ఈశ్వర ధర్మ విపరీత ధర్మాః యత్ర వర్తంతే తాదృశజీవ చేతనః త్వం పదవాచ్యార్ధః అయమభిప్రాయః - జీవో అల్పశక్తిమాన్, అల్పజ్ఞః, పరిచ్ఛిన్నః, అలీశః, కర్మాధీనః, అవిద్యామోహితః, బంధమోక్షభాక్, నిత్యా పరోక్షః-”.
(ఈశ్వరుని ధర్మములకు విపరీతమైన ధర్మములు గలవాడు జీవుడు. ఈ జీవుడు ‘తత్వమసి’ అను మహావాక్యములోని ‘త్వం’ పదమునకు వాచ్యార్ధము, అనగా, ‘త్వం’ అను మాటచేత చెప్పబడువాడు జీవుడు. దీని అభిప్రాయమేమనగా - జీవుడు అల్ప శక్తిగలవాడు (పరమాత్మ సర్వ శక్తులు గలవాడు) ; జీవుడు అల్పజ్ఞుడు (కొంచెము తెలిసినవాడు) - పరమాత్మ సర్వజ్ఞుడు - “య సర్వజ్ఞః సర్వ విద్”.జీవుడు పరిచ్ఛిన్నుడు (కాలముచేతను,దేశముచేతను,వస్తువుచేతను పరిమితి గలవాడు. ఒకే కాలమందు, ఒకే స్థలమందు, ఒకే వస్తువునందుండువాడు - పరమాత్మ అన్ని కాలములందుండువాడు - నిత్యుడు. అంతట నుండువాడు ; అన్ని వస్తువులలో నుండువాడు - త్రివిధ పరిచ్ఛేదరహితుడు). జీవుడు అన్నింటినీ శాసించువాడు కాడు - పరమాత్మ ఈశ్వరుడు అన్నింటినీ శాసించువాడు - జగత్తునకు దానిలోని సమస్తవస్తువులకు సృష్టి స్థితిలయములు చేయువాడు - జీవుడు కర్మలు చేసి, వాటి ఫలముననుభవించువాడు - పరమాత్మ అకర్త. జీవుడు మాయచేత మోహితుడైనవాడు. పరమాత్మ మాయకు అతీతుడు - మాయను తన స్వాధీనములోనుంచుకొనినవాడు). జీవుడు బంధమోక్షములు గలవాడు (పరమాత్మ అకర్త కనుక కర్మవలనకలుగు బంధము అతనికి లేదు - మోక్షమునిచ్చువాడు అతనే - మోక్షరూపుడైనవాడు). జీవుడు కనబడుచుండువాడు (అపరోక్షుడు). (పరమాత్మ పరోక్షుడు - కనబడనివాడు). పైన చెప్పిన ధర్మములు కలవాడు జీవుడు త్వం పదమునకు వాచ్యార్థము. ఈ జీవధర్మములకు విపరీత ధర్మములు (పైన చెప్పబడినవి) కలవాడు పరమాత్మ ‘తత్’ పదమునకు వాచ్యార్థము).
‘tvaṃ’ anupadamunaku nīvu ani ardhamu - tanugāka edurugānuṃḍu maṟiyokaḍu.
“tatvamasi”(adē - ā parabrahmamamē - nīvu ayitivi - ayiyunnāvu) anu mahāvākyamulōni ‘tat’ anu padamu parōkṣamugānunna (kanabaḍakuṃḍānunna) bhagavaṃtuni ceppunu - ā vākyamulōni ‘tvaṃ’ anu padamu jīvuḍu aniceppunu. aṃducēta bhagavaṃtuḍē jīvuḍu;paramātmayē jīvātma - iddariki bhēdamulēdu - iddarū okaṭē).
“īśvara dharma viparīta dharmāḥ yatra vartaṃtē tādṛśajīva cētanaḥ tvaṃ padavācyārdhaḥ ayamabhiprāyaḥ - jīvō alpaśaktimān, alpajñaḥ, paricchinnaḥ, alīśaḥ, karmādhīnaḥ, avidyāmōhitaḥ, baṃdhamōkṣabhāk, nityā parōkṣaḥ-”.
(īśvaruni dharmamulaku viparītamaina dharmamulu galavāḍu jīvuḍu. ī jīvuḍu ‘tatvamasi’ anu mahāvākyamulōni ‘tvaṃ’ padamunaku vācyārdhamu, anagā, ‘tvaṃ’ anu māṭacēta ceppabaḍuvāḍu jīvuḍu. dīni abhiprāyamēmanagā - jīvuḍu alpa śaktigalavāḍu (paramātma sarva śaktulu galavāḍu) ; jīvuḍu alpajñuḍu (koṃcemu telisinavāḍu) - paramātma sarvajñuḍu - “ya sarvajñaḥ sarva vid”.jīvuḍu paricchinnuḍu (kālamucētanu,dēśamucētanu,vastuvucētanu parimiti galavāḍu. okē kālamaṃdu, okē sthalamaṃdu, okē vastuvunaṃduṃḍuvāḍu - paramātma anni kālamulaṃduṃḍuvāḍu - nityuḍu. aṃtaṭa nuṃḍuvāḍu ; anni vastuvulalō nuṃḍuvāḍu - trividha paricchēdarahituḍu). jīvuḍu anniṃṭinī śāsiṃcuvāḍu kāḍu - paramātma īśvaruḍu anniṃṭinī śāsiṃcuvāḍu - jagattunaku dānilōni samastavastuvulaku sṛṣṭi sthitilayamulu cēyuvāḍu - jīvuḍu karmalu cēsi, vāṭi phalamunanubhaviṃcuvāḍu - paramātma akarta. jīvuḍu māyacēta mōhituḍainavāḍu. paramātma māyaku atītuḍu - māyanu tana svādhīnamulōnuṃcukoninavāḍu). jīvuḍu baṃdhamōkṣamulu galavāḍu (paramātma akarta kanuka karmavalanakalugu baṃdhamu ataniki lēdu - mōkṣamuniccuvāḍu atanē - mōkṣarūpuḍainavāḍu). jīvuḍu kanabaḍucuṃḍuvāḍu (aparōkṣuḍu). (paramātma parōkṣuḍu - kanabaḍanivāḍu). paina ceppina dharmamulu kalavāḍu jīvuḍu tvaṃ padamunaku vācyārthamu. ī jīvadharmamulaku viparīta dharmamulu (paina ceppabaḍinavi) kalavāḍu paramātma ‘tat’ padamunaku vācyārthamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.