(అపరోక్ష వస్తువు యొక్క మిధ్యాత్వమును నిశ్చయించుట. అది నిజముకానిది, మిధ్య యని నిశ్చయము చేయుట).
(త్రాడు, ముత్యపుచిప్ప, ఎండమావులు అజ్ఞానమువల్ల పాము అని. వెండి అని, జలము అని అగపడుచుండును. చీకటిలో త్రాడును చూచి పాము అనుకొనుట, ముత్యపు చిప్పనిచూచి వెండి అనుకొనుట, ఎండమావులను చూచి జలము అనుకొనుట వాటి నిజరూపమును తెలియగనే ఇది పాము కాదు త్రాడు, ఇది వెండికాదు ముచ్చపుచిప్ప, ఇవి నీరు కాదు ఎండమావులు అని వాటి వాటి యధార్థరూపము యొక్క జ్ఞానము కలుగగనే ఆ అజ్ఞానము తొలగి పోవును. అట్లు ఆ అజ్ఞానము తొలగిపోవుటకు వాటి యధార్థ జ్ఞానమే కారణము. అట్టి అజ్ఞానమునకు జ్ఞానము బాధకము - అజ్ఞానము లేకుండ చేయునది, పోగొట్టు నది. ఆ ప్రకారముగానే అంతా బ్రహ్మమే అయినను అజ్ఞానము వలన జననమరణములు మొదలగు భరించలేని దుఃఖములుగల ఈ కనబడునది సంసారముగ కనబడుచున్నది - బ్రహ్మ కంటె వేఱుగా కనబడు చున్నది. బ్రహ్మ కంటె వేరు వస్తువు లేదు - బ్రహ్మకాని వస్తువు లేదు - ఇదంతయు బ్రహ్మమేయను జ్ఞానము కలిగిన తర్వాత ఆ అజ్ఞానము తొలగిపోవును - బాధింపబడును. లేకుండ పోవును).
(aparōkṣa vastuvu yokka midhyātvamunu niścayiṃcuṭa. adi nijamukānidi, midhya yani niścayamu cēyuṭa).
(trāḍu, mutyapucippa, eṃḍamāvulu ajñānamuvalla pāmu ani. veṃḍi ani, jalamu ani agapaḍucuṃḍunu. cīkaṭilō trāḍunu cūci pāmu anukonuṭa, mutyapu cippanicūci veṃḍi anukonuṭa, eṃḍamāvulanu cūci jalamu anukonuṭa vāṭi nijarūpamunu teliyaganē idi pāmu kādu trāḍu, idi veṃḍikādu muccapucippa, ivi nīru kādu eṃḍamāvulu ani vāṭi vāṭi yadhārtharūpamu yokka jñānamu kalugaganē ā ajñānamu tolagi pōvunu. aṭlu ā ajñānamu tolagipōvuṭaku vāṭi yadhārtha jñānamē kāraṇamu. aṭṭi ajñānamunaku jñānamu bādhakamu - ajñānamu lēkuṃḍa cēyunadi, pōgoṭṭu nadi. ā prakāramugānē aṃtā brahmamē ayinanu ajñānamu valana jananamaraṇamulu modalagu bhariṃcalēni duḥkhamulugala ī kanabaḍunadi saṃsāramuga kanabaḍucunnadi - brahma kaṃṭe vēṟugā kanabaḍu cunnadi. brahma kaṃṭe vēru vastuvu lēdu - brahmakāni vastuvu lēdu - idaṃtayu brahmamēyanu jñānamu kaligina tarvāta ā ajñānamu tolagipōvunu - bādhiṃpabaḍunu. lēkuṃḍa pōvunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.