← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బాహ్యసుఖము bāhyasukhamu

Original — తెలుగు

శబ్ద స్పర్సరూపరస గంధములవలన కలుగు సుఖము బాహ్యసుఖము - ఇది ప్రతిబింబ సుఖము బాహ్య సుఖమునందు ముఖ్యమైన దోషములు రెండు కలవు - ఈ సుఖము క్షీణించునది; దుఃఖముతో కలిసియున్నది - అందువలన మొదట కొంత సుఖమువలె కనుపించినను క్రమముగా దుఃఖమే కలుగును. సుఖమనునది బాహ్యమున లేదు. పదార్థములందు సుఖమున్నదనుకొనుట భ్రాంతియే. మనస్సు శమించుటయే, సంకల్పము లేకపోవుటయే సుఖము - సుఖము పదార్థమందున్నయడల అది అందఱికి అన్నివేళలందు సుఖముగా తోచవలెను - అట్లగుటలేదు - ఒకే వస్తువు కొందఱికి ప్రీతికరముగాను, మఱికొందఱికి అప్రీతికరముగా నుండును, ఒకే కాలమున సుఖకరముగను ఇంకొక కాలమున దుఃఖకరముగా నుండును. వస్తువునందే ఆనందమున్నచో ఇట్లు కనబడదు. జీవుని అవిద్యయే ఆ ప్రకారముగ వస్తువునందు భ్రాంతిని కలుగచేయుచున్నది).

Transliteration

śabda sparsarūparasa gaṃdhamulavalana kalugu sukhamu bāhyasukhamu - idi pratibiṃba sukhamu bāhya sukhamunaṃdu mukhyamaina dōṣamulu reṃḍu kalavu - ī sukhamu kṣīṇiṃcunadi; duḥkhamutō kalisiyunnadi - aṃduvalana modaṭa koṃta sukhamuvale kanupiṃcinanu kramamugā duḥkhamē kalugunu. sukhamanunadi bāhyamuna lēdu. padārthamulaṃdu sukhamunnadanukonuṭa bhrāṃtiyē. manassu śamiṃcuṭayē, saṃkalpamu lēkapōvuṭayē sukhamu - sukhamu padārthamaṃdunnayaḍala adi aṃdaṟiki annivēḷalaṃdu sukhamugā tōcavalenu - aṭlaguṭalēdu - okē vastuvu koṃdaṟiki prītikaramugānu, maṟikoṃdaṟiki aprītikaramugā nuṃḍunu, okē kālamuna sukhakaramuganu iṃkoka kālamuna duḥkhakaramugā nuṃḍunu. vastuvunaṃdē ānaṃdamunnacō iṭlu kanabaḍadu. jīvuni avidyayē ā prakāramuga vastuvunaṃdu bhrāṃtini kalugacēyucunnadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.