← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బలి bali

Original — తెలుగు
  1. భోగం; ఉపహారం ; ఉపాయనం.

(దేవునకు భోగము చేసినది - ఆరగించుటకు అయినది, ఉపహారము - కానుక).

  1. నమః ప్రథానకం భక్త్యాసహ ఉపాస్తిం -

(నమస్కరించి భక్తితో ఉపాసించునపుడు అర్పించునది).

  1. పుష్పహారాది సమర్పణం. (పుష్పములు, ఉపహారము మొదలగునవి సమర్పించుట).

  2. దేవతా ప్రసాద జనన సమర్థం పూజోపకరణం.

(ఉపాసించు దేవతులయొక్క కరుణకలుగ చేయుటకు సమర్థమైన పూజకు ఉపకరించునది).

  1. స్వస్వాధికారాను వర్తనాత్మికాం పూజాం; మనుషైర్దత్తం వాద్య కవ్యాదిలక్షణం.

(వారి వారి అధికారమును బట్టి - అర్హతనుబట్టి - చేయు పూజ, మనుష్యులు సమర్పించు వాక్యము, కవ్యము మొదలగునవి)..

  1. "బ్రహ్మణో నియతః శుద్ధః సాత్వికం బలిమాహరేత్" తథాహింసా యుక్తో బలిః తు ఆద్యవర్ణం హిత్వా (త్యక్త్వా) -.

" ఆవశ్యం విహితో యత్ర బలిస్తత్ర ద్విజః పునః |

పిష్టే నాపి ఘృతేనాపి నిర్మితంతు సమర్పయేత్ |

నను దేవ్య తిరిక్త దేవతాసు శాస్త్రే బలిదానం అనుక్త్వా

దేవ్యుపాస నాయాం ఏవ కిమితి బలిదానం శాస్త్రేషు ఉక్తం

ఇతి చేత్ అత్ర సమాహితం దుర్గా ప్రదీపే యామలే -"

బ్రహ్మ విద్యా జీవదశా నిహం త్రీతి శ్రుతౌ శ్రుతం తత్తస్మాత్ కారణాత్ దేవ్యాః బలిదానం ప్రియం మతం ఇతి యతః కారణాత్ దేవీ బ్రహ్మవిద్యా ధిష్టాత్రీ భవతి బ్రహ్మ విద్యా యాశ్చ స్వభావో జీవదశా నాశయితవ్యా ఇతి తస్మాత్ దేవ్యాః ప్రియో బలిర్భవతి.

("నియతుడు, శుద్ధుడు అయిన బ్రాహ్మణుడు సాత్వికమైన బలిని తినవలెను." ఆ ప్రకారముగానే "హింసతోగూడిన బలిని బ్రాహ్మణుడు విడిచిపెట్టి -" "బ్రాహ్మణుడు శాస్త్రములో చెప్పిన ప్రకారము పిండితో గాని, నేయితోగాని చేయబడిన బలిని సమర్పించవలెను" అని చెప్పబడినది. దేవీ ఉపాసనయందు కాక మిగిలిన దేవతల ఉపాసన చేయుటలో బలియిచ్చుట చెప్పక శాస్త్రములో దేవీ ఉపాసనలోనే ఎందుకు చెప్పబడినదనగా - "బ్రహ్మ విద్య జీవదశను - అనగా - జీవుడుగా జననమరణములను పొందుటను - లేకుండ చేయును" అని శ్రుతి చెప్పుచున్నందువలన దేవికి బలి యిచ్చుటకు ప్రీతి - బ్రహ్మ విద్యకు దేవి అధిష్టాత్రి కనుక బ్రహ్మ విద్య స్వభావము జీవదశను నశింపచేయుట కనుక దేవికి బలి ప్రియమగుచున్నది).

Transliteration
  1. bhōgaṃ; upahāraṃ ; upāyanaṃ.

(dēvunaku bhōgamu cēsinadi - āragiṃcuṭaku ayinadi, upahāramu - kānuka).

  1. namaḥ prathānakaṃ bhaktyāsaha upāstiṃ -

(namaskariṃci bhaktitō upāsiṃcunapuḍu arpiṃcunadi).

  1. puṣpahārādi samarpaṇaṃ. (puṣpamulu, upahāramu modalagunavi samarpiṃcuṭa).

  2. dēvatā prasāda janana samarthaṃ pūjōpakaraṇaṃ.

(upāsiṃcu dēvatulayokka karuṇakaluga cēyuṭaku samarthamaina pūjaku upakariṃcunadi).

  1. svasvādhikārānu vartanātmikāṃ pūjāṃ; manuṣairdattaṃ vādya kavyādilakṣaṇaṃ.

(vāri vāri adhikāramunu baṭṭi - arhatanubaṭṭi - cēyu pūja, manuṣyulu samarpiṃcu vākyamu, kavyamu modalagunavi)..

  1. "brahmaṇō niyataḥ śuddhaḥ sātvikaṃ balimāharēt" tathāhiṃsā yuktō baliḥ tu ādyavarṇaṃ hitvā (tyaktvā) -.

" āvaśyaṃ vihitō yatra balistatra dvijaḥ punaḥ |

piṣṭē nāpi ghṛtēnāpi nirmitaṃtu samarpayēt |

nanu dēvya tirikta dēvatāsu śāstrē balidānaṃ anuktvā

dēvyupāsa nāyāṃ ēva kimiti balidānaṃ śāstrēṣu uktaṃ

iti cēt atra samāhitaṃ durgā pradīpē yāmalē -"

brahma vidyā jīvadaśā nihaṃ trīti śrutau śrutaṃ tattasmāt kāraṇāt dēvyāḥ balidānaṃ priyaṃ mataṃ iti yataḥ kāraṇāt dēvī brahmavidyā dhiṣṭātrī bhavati brahma vidyā yāśca svabhāvō jīvadaśā nāśayitavyā iti tasmāt dēvyāḥ priyō balirbhavati.

("niyatuḍu, śuddhuḍu ayina brāhmaṇuḍu sātvikamaina balini tinavalenu." ā prakāramugānē "hiṃsatōgūḍina balini brāhmaṇuḍu viḍicipeṭṭi -" "brāhmaṇuḍu śāstramulō ceppina prakāramu piṃḍitō gāni, nēyitōgāni cēyabaḍina balini samarpiṃcavalenu" ani ceppabaḍinadi. dēvī upāsanayaṃdu kāka migilina dēvatala upāsana cēyuṭalō baliyiccuṭa ceppaka śāstramulō dēvī upāsanalōnē eṃduku ceppabaḍinadanagā - "brahma vidya jīvadaśanu - anagā - jīvuḍugā jananamaraṇamulanu poṃduṭanu - lēkuṃḍa cēyunu" ani śruti ceppucunnaṃduvalana dēviki bali yiccuṭaku prīti - brahma vidyaku dēvi adhiṣṭātri kanuka brahma vidya svabhāvamu jīvadaśanu naśiṃpacēyuṭa kanuka dēviki bali priyamagucunnadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.