← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బంధమోక్షములు baṃdhamōkṣamulu

Original — తెలుగు
  1. "సీ. సవితృకహో రాత్రంబులు లేని తెఱంగున బరిపూర్ణ జ్ఞాన మూర్తియగు నాత్మయందు నజ్ఞానంబును లేమిని బంధంబును, సుజ్ఞానంబు లేమిని మోక్షంబును లేవు ". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా, - 569)

  2. "సీ. సంసారియై యున్న జనునకు నీశ్వర నీ కృప యెప్పుడు నెరయగల్గు

నప్పుడ బంధంబులన్నియు దెగిపోవు; బంధమోక్షంబైన బ్రాప్తమగును

సత్సంగమంబు ; సత్సంగంబున నీదు భక్తి సిద్ధించు; నీ భక్తివలన

సన్ముక్తి యగు - - ". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. - 1665)

  1. "క. తమ తమ ధర్మము తప్పక

సములై నను నమ్మి తిరుగు సభ్యులకును బం

ధము నను జూచిన విరియును

గమలాప్తుడు వొడమ విరియు ఘనతమము క్రియన్". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. 411)

  1. "అజ్ఞానాదేవ సంసారో జ్ఞానాదేవ విముచ్యతే" (యోగతత్వోపనిషత్)

(బ్రహ్మజ్ఞానము లేకుండుటవలననే కర్మలనాసక్తితో చేయుట, వాటి ఫలమనుభవించుటకు తిరిగి జన్మించుట కలుగుచున్నది. ఇదియే సంసారము. కర్మలు చేయుటచే ఫలమనుభవించవలెను అను బంధము కలుగుచున్నది. ఇందువలననే జనమరణములు కలుగుచున్నవి).

  1. "పదార్థ భావనా దార్ఢ్యం బంధ ఇత్యభిధీయతే |

వాసనా తానవం, బ్రహ్మన్, మోక్ష ఇత్యభి ధీయతే ||". (మహోపనిషత్)

(విషయముల గుఱించి ధృఢమైన భావన - ఆలోచన బంధమని చెప్పబడుచున్నది).

  1. "బంధోహి వాసనా బంధో, మోక్షస్యాత్ వాసనా క్షయః“. (యోగవాశిష్టము)

(ఇదివరకు జన్మలలో చేసిన కర్మలు ఫలము నిచ్చుటకు సూక్ష్మరూపములో వాసనలుగా నుండునవియే బంధము - ఆవాసనలు క్షీణించుటయే మోక్షము)

  1. "యథానాహం తథా మోక్షో యదాహం బంధనం తదా |". (అష్టావక్రగీత - 8 - 4)

('నేను కాను' అనుభావన ఉన్నంతకాలము - అహంకారము - లేనంతకాలము మోక్షము - 'నేను' అను అహంభావమున్నంతకాలము బంధము).

  1. "తృష్ణా మాత్రాత్మకా బంధస్తన్నాశో మోక్ష ఉచ్యతే” (అష్టావక్రగీత - 10 - 4)

(విషయములందు కలుగు తృష్ణయే - అధిక ఆశయే - బంధము. ఆ తృష్ణ నశించుటయే మోక్షము).

  1. "దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీ మతా" (శ్రీమద్భగవద్గీత - 16 - 3)

(దైవీ సంపదవలన మోక్షముకలుగును, ఆసురీ సంపదవలన బంధము కలుగును).

  1. "ఈశ్వరస్య రూపా పరిజ్ఞానా ద్బంధః, తత్వరూప పరిజ్ఞానాత్ మోక్షః - తథా చ శ్రుతిః - జ్ఞాత్వా దేవం సర్వ పాశాపహానిః, క్షీణైర్క్లేశై జన్మ మృత్యు ప్రహాణిః. తస్యాభిధ్యానాత్ తృతీయం దేవ భేదే విశ్వైశ్వర్యం కేవల ఆప్తకామః" ఇత్యేవమాద్యాః.

(భగవంతుని స్వస్వరూపము తెలియనందువలననే బంధము, అతని స్వస్వరూపజ్ఞానము కలుగుటవలననే మోక్షము - ఈ విషయము శ్రుతి యీ ప్రకారముగా చెప్పుచున్నది - బ్రహ్మ జ్ఞానము కలుగగనే సమస్తమైన పాపములు నశించును. క్లేశములు క్షీణించుటచేతనే జననమరణములు లేకుండ పోవును - అనగా జననమరణరూపమగు సంసారము అను బంధము లేకపోవును).

  1. “స్వాతిరిక్తాస్తితా రూపే యా సంసృతిః, తదస్తీతి ప్రవృత్తిమార్గో బంధః తన్నాస్తీతి నివృత్తిమార్గో మోక్షః".

(అంతయు ఆత్మకానిది లేదు - అది అంతయు భగవంతుడే యను నివృత్తి మార్గమే మోక్షము).

  1. "బ్రహ్మస్వరూపాచ్ఛాదికా విద్యామూల మ పరమార్థికం, భేద దర్శన మేవ బంధమూలం బంధశ్చ అసరమార్థికః సచ సమూలో అసరిమార్థ కత్వాత్ ఏవ జ్ఞానే నైవ నివర్తతే నివర్తకం చ జ్ఞానం తత్వమస్తాది సాక్ష్యజన్యం".

(బ్రహ్మస్వరూపమును కప్పివేయు అవిద్యామూలము అపరిమార్థికము అయిన భేదదర్శనమే. (భగవంతుడు వేరు, ప్రపంచము వేరు అనుట) బంధమునకు మూలము (కారణము). అది పరమార్థమునకు సంబంధించినది కాదు. కనుక పరమార్థ జ్ఞానము (బ్రహ్మజ్ఞానము) కలుగగనే నివర్తించును - బ్రహ్మజ్ఞానమనగా " తత్వమసి " (నీవే ఆ బ్రహ్మవు అయి తివి) అను మహావాక్యము వలన కలుగు జ్ఞానము)..

  1. "చతుర్వింశతి తత్వాని మాయా కర్మగుణా ఇతి |

విషయా అపి కీర్త్యంతే పాశాః జీవ నిబంధనాత్ తైర్బద్ధాశ్శివ భక్త్యైవ ముచ్యంతే సర్వ దేహినః ||".

(ఇరువది నాలుగు తత్వములు మాయాకర్మగుణములు, విషయములు. ఇవి జీవుని బంధించుచున్నవి కనుక పాశములని చెప్పబడుచున్నవి. ఈ పాశములచేత బంధింపబడిన సమస్త జీవులు శివభక్తివలననే ఆ బంధమునుండి విముక్తి చెందుచున్నారు).

  1. "కర్మణా బధ్యతే జంతుః విద్యయాచ విముచ్యతే |

తస్మాత్ కర్మ న కుర్వంతి యతయః పారదర్శనః ||".

(జీవుడు తాను చేయు కర్మచేత బంధింపబడుచున్నాడు. ఏ కర్మ చేసినను దాని ఫలమనుభవింపవలసియే యున్నది. బ్రహ్మజ్ఞానము కలుగుటచేత బంధమునుండి విడువబడుచున్నాడు (Every action has its reaction) - చేసిన కర్మవలన కలుగు reaction దాని ఫలితము - చేసిన ప్రతికర్మ బంధమును కలిగించును కనుక, యీ సంసారసముద్రము యొక్క పారము - ఒడ్డు - (సంసారము లేకుండునట్లు చేసుకొనుట) తెలిసినవారు కర్మచేయరు. కాని "నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతి జైర్గుణైః". (శ్రీమద్భగవద్గీత - 3 - 5)

(ఎవడైనను ఒక నిమిషమైనను కర్మ చేయక ఉండలేడు. ప్రకృతివలన తన స్వభావముగా మారిన ప్రకృతిచేత ప్రేరేపించబడినవాడై, స్వతంత్రముగా పని చేయుటకు శక్తి లేనివాడై, జీవుడు కర్మ చేయుచున్నాడు. అందుచేత తాని చేసిన కర్మఫలము అనుభవించవలసియున్నది అని చెప్పబడియున్నది కదా, కర్మ చేయక నరుడె ట్లుండగలడు? అను విషయము గుఱించి శ్రీకృష్ణ భగవానుడు శ్రీమద్భగవద్గీతలో ఈ క్రిందవిధగముగా చెప్పెను : -

"యజ్ఞార్థాత్ కర్మణో (అ)వ్యత్ర లోకోయం కర్మ బంధనః |

తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర ||". (శ్రీమద్భగవద్గీత - 3 - 9)

(చేసిన కర్మనంతను ఫలము కోరక భగవంతునికర్పించుట యజ్ఞమని చెప్పబడినది. ఇట్లు చేయని కర్మయే బంధము కలుగచేయును - అందుచేత కర్మఫలమందాశ లేక భగవదర్పణ బుద్ధితో కర్మ చేసిన అట్టికర్మ బంధము కానేరదు).

పైనవ్రాసిన శ్రీమద్భగవద్గీతాశ్లోకమునకు వ్యాఖ్యానము ఈ క్రిందవిధముగా నున్నది : -

"కర్మణా బధ్యతే జంతురితి స్మృత్యా ముముక్షుణా |

బంధకత్వాత్కధం కర్మ కర్తవ్య మితిచేచ్ఛృణు |

"యజ్ఞో వై విష్ణుః" రిత్యుక్తస్తధారాధన హేతుకం |

యత్కర్మ క్రియతే తస్మాత్ప్రవృత్తో (అ)న్యత్ర కర్మణే |

కర్మాధి కార్యయం లోకః కర్మణా బద్ధ్యతే తథా |

నీశ్వరారాధనార్థేన బద్ధ్యతే (అ)తస్త దర్థకం |

కర్మణ్యధికృతః సంస్త్వం ఫలసంగ వివర్జితః |

సమ్యక్ శ్రద్ధాదినా కర్మ కౌంతేయ కురు శాస్త్రతః ||". (గీతాభావప్రకాశము - 3 - 64 to 67)

(కర్మ చేయుటవలన జన్మ కలవాడగును - బద్ధుడగును అని శ్రుతిలో చెప్పబడినది - అయిన యడల మోక్షము కోరువాడు కర్మ నెట్లు చేయవలయును? - యజ్ఞమనగా విష్ణువే యని చెప్పబడినది. యజ్ఞమనగా కర్మ. విష్ణుని ఆరాధించుటకే యీ కర్మ చేయుచున్నాను అను భావముతో యజ్ఞము చేసిన అది బంధముకాదు - అట్లుకాక ఇంకొక బుద్ధితో చేసిన యడల బద్ధుడగును - ఆ కర్మ వానిని బంధించును - దాని ఫలము ననుభవింపచేయును. అందుచేత కర్మను ఫలమును కోరక శ్రద్ధతో శాస్త్రములో చెప్పబడిన ప్రకారము విష్ణువు నారాధించుచున్నానను మనసుతోనే చేయుము).

  1. "అనాత్మన్యాత్మ తాధ్యాసాత్ బంధైవ కల్పితః |

తన్నివృత్తైక్య విజ్ఞానాన్ముక్త ఇత్యుపచర్యతే |

వస్తుతో బంధమోక్షాది నాస్త్యేవాద్వైత వస్తుని |

స్వాభావికత్వే బంధస్య ముక్తిర్నస్యాత్తతో విభోః |

న స్వభావ విపర్యాసః ప్రమాణానాం శతైరపి |

తస్మాత్ బంధస్య మిధ్యాత్వం తదుక్తం వార్తికే స్ఫుటం ||".

(ఆత్మ కానిదానియందు ఆత్మయని భావించుట అధ్యాసము. ఈ అధ్యాస వలన బంధము కలుగును - అధ్యాస తొలగిపోయిననే జీవాత్మలు ఒకటే యను జ్ఞానము కలుగును -అప్పుడు ముక్తుడగును - బంధము అధ్యాసవలన కలుగుటచేతను, అధ్యాస తొలగిపోగా ముక్తి కలుగుటచేతను, ఈ రెండునూ కల్పితములే. అధ్వైత వస్తువైన పరమాత్మయందు యధార్థముగా బంధమోక్షములు లేవు - :

"మిధ్యాజ్ఞాన ప్రయుక్తోయం బంధో అధ్యస్తస్చ్యేదాత్మని |

సమ్య ఖధ్వైత బోధేన తన్నివృత్త్యాస్య ముక్తతా ||". (గీతాభావప్రకాశము - 2 - 177)

(చిదాత్మ అయిన భగవంతునియందు మిధ్యాజ్ఞానమువలన చెప్పబడిన బంధము అధ్యాసమాత్రమే. అద్వైత తత్వజ్ఞానముచేత ఈ అధ్యాస తొలగిన అదే ముక్తి).

  1. "యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతి మాప్నొతి నైష్ఠికీం |

అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబద్ధ్యతే ||". (శ్రీమద్భగవద్గీత - 5 - 11)

"శృణు ఈశా యైవ కర్మాణి నైతాని ఫలాయమే |

ఇత్యభిప్రాయవాన్ యుక్తః, త్యక్త్వా కర్మఫలం సుధీః |

కుర్వన్ కర్మాణి మోక్షాఖ్యాం శాంత్రి మాప్నోతి నైష్టికీం |

- - - యస్త్వ యుక్తోస్తి పూర్వస్మాద్విపరీతః. సకాయతః |

ప్రవృత్యా మే ఫలాయే దం కరోమీతి ఫలేస్సుకః |

కర్మ భిర్నితరాం బంధం సంసారాఖ్యం ప్రయాత్యసౌ |

దేహాభిమాన సామ్యేపి కృతం భగవదర్పణం |

కర్మ శ్రౌతం తథాస్మార్తం లౌకికం చ ముముక్షుభిః |

చిత్త శుద్ధ్యాప్త వైరాగ్య జ్ఞానద్వారా విముక్తిదం |

తదేవ కామకారణ కృతం సత్ఫలకామిభిః |

ధృఢబంధాయ మూఢానాం భవతీత్యాశయో హరేః ||".

(నేను చేయు ఈ కర్మలు భగవంతుని కొఱకే, నాకు ఫలము కలుగుటకుకాదు అని అభిప్రాయము గలవాడు యుక్తుడు. కర్మవలన కలుగు ఫలమును విడిచిపెట్టి కర్మలు చేయువాడు మోక్షమను పేరుగల నైష్టికశాంతిని పొందును. ఇందుకు విపరీతముగా కర్మలు చేయువాడు, కర్మఫలమందు కోరిక కలిగియుండుటచేత, అయుక్తుడు - ఇట్టివాడు ప్రవృత్తి ధర్మముననుసరించి నేను ఫలము కొఱకు ఈ కర్మ (ఫలమును కోరియే) చేయుచున్నాను అనుకొని చేయువాడు సంసారమను పేరుగల బంధమును ఎల్లపుడు పొందుతాడు. భగవదర్పణగా ముముక్షువులు చేయు కర్మ శ్రౌతముకాని, స్మార్తముకాని, లౌకికముగాని చిత్తశుద్ధి వలన పొందిన వైరాగ్య జ్ఞానముద్వారా ముక్తినిచ్చును. ఆ కర్మయే ఫలాపేక్ష గలిగి ఫలాసక్తితో చేయువారికి ధృఢమైన బంధమును కలిగించును - అని శ్రీకృష్ణుని ఆశయము).

  1. "యత్కరోషి యదశ్నాసి యజ్జు హోషి దదాసి యత్ |

యత్త పస్యసి కౌంతేయ, తత్కురుష్వమదర్పణం |

శుభాశుభ ఫలై రేవం మోక్ష్యసే కర్మబంధనైః - (శ్రీమద్భగవద్గీత - 9 - 27, 28)

"యత్కరోషి స్వతః ప్రాప్తం యదశ్నాసి స్వతృప్తయే |

శ్రౌతం వాధి స్మార్త మధవా యజ్జుహోషి విదేర్భలాత్ |

అతిధి బ్రాహ్మణాదిభ్యో హేమాన్నాది దదాసియత్ |

చాంద్రాయణాదికం దోషశాంత్యై చరసి యత్తపః |

ఉచ్ఛృంకల ప్రవృత్తేర్వా నిరాసాయాత్మసంశయః |

లౌకికం వైదికం ప్రాణిస్వభావద్వా కరోషియత్ |

మయ్యర్పితం యధా తత్స్యాత్ కురుష్వ త్వం తథా సదా |

సమర్పకగతం సర్వం సమర్పణ ఫలం యతః ||". (గీతాభావప్రకాశము - 9 - 178 to 181)

ఏది చెసినను, ఏది వినినను, ఏది హవనము చేసినను, ఏది ఎవరికిచ్చినను, ఎట్టి తపస్సు చేసినను దానినంతయు నాకు (భగవంతునికి) అర్పించుము - అనగా - దానంతట అది యేది నీకు ప్రాప్తించినను, నీ తృప్తి కొఱకు - నీ ఆకలి తీర్చుకొనుటకు మాత్రము - నీవేది తినినను, ఏది హోమము చేసినను - అనగా, అతిధులు, బ్రాహ్మణులు మొదలగువారికి బంగారము కాని, అన్నముకాని, యేది ఇచ్చినను, చేసిన దోషముల శాంతి కొఱకు, చాంద్రాయణము మొదలగునవి యేవి చేసినను, లౌకిక కర్మగాని, వైదికకర్మకాని నీవు నీ స్వభావము వలన ఏది చేసినను, దాని నంతయు నాకు (భగవంతునికి) అర్పించుము. (శ్రీకృష్ణార్పణమనుము). ఇట్లు నీవేది సమర్పించినను నాకు దాని ఫలము కలుగును - ఆ కర్మ ఫలము నీకు కలుగదు. అందుచేత అది నిన్ను బంధించదు - వాటి ఫలమునీవు అనుభవించనక్కర్లేదు - చిత్తశుద్ధి కలిగి నీవు చేయు కర్మలను ఇట్లు నాకు అర్పించుటయే యోగము. దీనివలన నీవు జీవించి యుండగనే ముక్తుడవగుదువు. ప్రారబ్దకర్మవలన ఈ జన్మాంతము వఱకు ఉండి మరణానంతరము బ్రహ్మరూపుడవై యే విధమైన ఉపాధి లేక కైవల్యరూపుడగు నాలో ఐక్యమగుదువు).

  1. యథా ఏకస్యాపి చంద్రాదేః జలాద్యుపాధినా బింబ ప్రతిబింబ రూపో భేదః, యథా చ తత్ర జలకృతాః కంపాదయః ప్రతిబింబస్యవ, యథాచ తత్ర ప్రతిబింబనా మపి ఉపాధి భేదేన భేదాత్ ఏకస్మిన్నుదక కుంభే భగ్నే తద్గత ప్రతిబింబస్యైవ బింబైక్యం నాన్య గతస్య, తథా అవిద్యాయాం ప్రతిబింబితస్య మదంశస్య జీవస్యేవ తత్కృతో బంధః, తస్యచ ఉపాధితో భేదా న్నా వ్యవస్థా.

(చంద్రుడు ఒకడే అయినను జలము మొదలగు ఉపాధులవలన చంద్రబింబమునకు నీటిలోని చంద్రుని ప్రతిబింబములకు భేదమున్నది. ఎట్లనగా, - నీటిలోని అలలువల అందులో ప్రతిబింబించిన చంద్రుడు కదలినట్లుండును. ఆ కదలుట చంద్రబింబమునకు ఉపాధియైన నీరు కదులుటవలన కలిగినది కాని చంద్రునకు - చంద్రుని బింబమునకు - కలిగినదికాది. ఆ ప్రకారముగానే ఒక కుండలోని ప్రతిబింబము (చంద్ర ప్రతిబింబము) ఆ కుండ పగిలిపోగా కనబడకుండ పోవును - దాని ఉపాధి పోవుటవలన పోవును కాని చంద్రబింబము పోదు - ఆ రీతిగానే అవిద్యయందు ప్రతిబింబించిన నా అంశ అయిన జీవునికే బంధము).

  1. యథాకోశస్కృత్ - (కోశకారీకీటః) - గృహం కోశాత్మకం కుర్వన్ ఆత్మనః నిర్గమాయ ద్వారమపి న అవశేష యతి, తథా స్వబంధకాది కర్మాణి కుర్వాణః (యీహమానః) జైహ్వ సుఖమధికం మన్యమానః దురంత మోహః అతృప్త కామః దోషదర్శనేన విరక్తః సన్ త్యజేత్.

(పట్టుపురుగు తాను నివసించుటకు ఒక కోశము అను గృహము - కోషణకాయడొక్క - నిర్మించుకొనుచు తాను దానిలోనుండి పైకి వచ్చుటకు మార్గమును వదలక దానిలో బంధింపబడినట్లు, కోరికలతో తనను బంధించు కర్మలను చేయువాడు, జిహ్వ చాపల్యమువలన కలుగు సుఖమే గొప్పదియని తలచుచు, దానియందు గొప్ప మోహమును చెందినవాడై, కోరిక తనివి తీరకయుండి కొన్ని నాళ్ళకు వాటివలన కలుగు దోషమును తెలుసుకొని - అది బంధమును కలుగచేయునవి యని తెలుసుకొని వాటిని విడిచిపెట్టును).

  1. అనీశో జీవస్తు కర్మఫల భోక్యత్వాత్ బధ్యతే. పరమాత్మనస్తు అవాప్త సమస్తకామతయా కర్త్తృఫలస్పృహా భావాత్ కర్మవేపో నాస్తి అతో న బంధ ప్రసక్తిః - - -

"నమే కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహా |". (శ్రీమద్భగవద్గీత - 4 - 14)

దేవమీశం ఇత్థం చిదచిద్విలక్షణేన యో జానాతి స సర్వపాశైః ప్రముచ్యతే |

పరమాత్మ విశ్వ శరీరకోపి సత్యకామానంత గుణాశ్రయః.

అత ఏవ నిరపేక్షః, అతో జీవవత్ న ఫలాభిసంధిపూర్వక కర్తృత్వవాన్.

(జీవుడు ఈశ్వరుడు కానందున, స్వతంత్రుడు కానందున, చేసిన కర్మల వలన కలుగు ఫలముననుభవించవలసినవాడు కనుక, ఆ కర్మల వలన బంధము కలుగుచున్నది. పరమాత్మకు ఏ విధమైన కోరికలు లేనందున - అన్నికోరికలు తీరినవాడైనందున - చేసిన కర్మలయందు (సృష్టి మొదలగు వాటియందు) స్పృహలేనివాడు (ఫలమందాసక్తి లేనివాడు) కనుక, కర్మలు అతనిని బంధింపవు, అంటవు. అందుచేత అవి బంధించునను ప్రసక్తి లేదు - నాకు కర్మలు అంటవు - ఎందుచేతననగా నాకు కర్మలయందు స్పృహలేదు." (శ్రీమద్భగవద్గీత - 4 - 14). భగవంతుడు ఈ ప్రకారము కర్మలు చేసినను అవి అతనిని బంధించవు అని తెలుసుకొనినవాడు సమస్త పాశములచేత (బంధ ములచేతను) విడువబడును - ప్రపంచమంతయు అతని శరీరమే అయినను సత్యకాముడు అనంతగుణములకు ఆశ్రయుడగుట వలన దేనియందును అపేక్ష లేనివాడు, అందుచేత జీవునివలె కర్తృత్వము లేనివాడు).

  1. "యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వందాతీతో విమత్సరః |

సమః సిద్ధావ సిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే ||". (శ్రీమద్భగవద్గీత - 4 - 22)

(తాను ఒకరిని అడగకుండగనే, తాను ప్రయత్నము చేయకుండగనే లభించిన దానితోనే సంతోషముచెంది శీతోష్ణములు మొదలగు ద్వంద్వముల వలన కల్గు బాధలను తొలగించు ప్రయత్నము చేయక వాటిని సహించగలిగి, సమస్త జంతువులందు వైరము లేకనుండువాడు; ఏది లభించినను లభించక పోయినను చలింపని మనస్సు కలవాడు ఇతరుల దృష్టిలో కర్త యనిపించుకొన్నను, తన అనుభూతివలన అకర్తయే యగును. అతను కర్మ చేసినను అది అతనిని బంధించదు).

  1. "తదేవ మఖిలం యజ్ఞ క్రియా కారకవస్తుయత్ |

బ్రహ్మ జ్ఞానేన తత్రై వాధ్యస్తం రజ్జౌస్రగాదివత్ |

బ్రహ్మ జ్ఞానేన బాధేతు భాసమాన మపి స్ఫుటం |

కల్పతే నైవ బంధాయ యథా స్వాప్నం ప్రజాగరే. |

బ్రహ్మ దృష్టే రియం సర్వ యజ్ఞరూప తయాధునా |

స్తూయతే హరిణా సమ్యగ్దృష్టి ధార్ఢ్యాయ తద్విదాం ||". (గీతాభావప్రకాశము - 4 - 161 to 164)

(యజ్ఞక్రియ అంతయు బ్రహ్మజ్ఞానము లేకుండుటవలన త్రాడును చూచి పూలమాల అను కొనినట్లు అధ్యస్తము యజ్ఞక్రియ యంతయు బ్రహ్మమే, యజ్ఞము చేయు అగ్ని బ్రహ్మము, యజ్ఞము చేయు యజమాని బ్రహ్మ, చేయుంచువాడు హోతబ్రహ్మము, యాగాగ్నిలో హుతము చేయునది బ్రహ్మ; దీని ఫలితము బ్రహ్మ ప్రాప్తి. ఈ ప్రకారముగా అంతా బ్రహ్మమే అయినప్పటికీ వేరు వేరు పేర్లతో వాటిని వ్యవహరించుట అధ్యాసము. ఇదంతా బ్రహ్మమే అను జ్ఞానము కలుగ గానే ఈ అధ్యాస తొలగును - త్రాడు, త్రాడే అను జ్ఞానము కలుగగానే పూలమాల అను భావము - ఉండనట్లు. స్వప్నములో ఉన్న వస్తువు తెలివి వచ్చి నపుడు ఉండనట్లు. ఇట్లు అంతా బ్రహ్మమే అను భావముతో చేసిన కర్మ యేదియు బంధింపదు).

  1. "యోగ సన్య స్తకర్మాణం జ్ఞానం సంఛిన్న సంశయం |

ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి, ధనంజయ" (శ్రీమద్భగవద్గీత - 4 - 4)

(సిద్ధించినదాని యందు, సిద్ధించనిదాని యందు సమత్వ బుద్ధి కలిగి యుండుట యోగము అని చెప్పబడినది. అట్టి యోగముచేత పరమేశ్వరునియందు కర్మలు సమర్పించినవాడు శుద్ధమైన మనస్సు కలవాడు ఆత్మజ్ఞానము కలవాడగుటచేత ఆత్మజ్ఞానము కలుగుటవలన ఏ విధమైన సంశయము లేనివాడు ఆత్మవంతుడు. ఈ లక్షణములు కలవానిని, అతను చేసిన యే విధమైన కర్మలైనను, బంధించవు).

  1. "ఆత్మా బద్ధో ముక్తశ్చ భగవద్గుణ తః - భగవదధీన సత్వాది గుణోపాదితః - న తు వస్తుతః; గుణస్య మాయా మూలత్వాత్ బంధనం నాస్తి. అత ఏవ మోక్షశ్చ నాస్తి - (గుణతః = గుణపార తంత్ర్యాత్) భగవతః మాయయా (మాయా వృత్తి రూపత్వాత్) విద్యా, అవుద్యా ఇతి బంధ మోక్షకరీ శక్తీ వినిర్మితే - "యావత్ అవిద్యయాం ప్రవర్తయామి తావద్బంధః యదా విద్యాం దదామి తదా మోక్షః స్ఫురతి". ఇత్యర్థః - యథా స్వప్నః ఆత్మనః బుద్ధేః ఖ్యాతిః (వివర్తః), నతు వా వాస్తవః, తద్వత్ శోకమోహే సుఖం దుఃఖం దేహాపత్తిశ్వ మాయయా భవంతి".

(భగవంతుని ఆధీనములోనున్న సత్వము, తజస్సు, తమము అను త్రిగుణములు ఉపాధిగా కలిగి యున్నందువలన - వాటికి లోబడి యుండుటవలన - ఆత్మకు బంధము, ముక్తి కలుగుచున్నవి. అంతేగాని, వస్తుతః కాదు - త్రిగుణములు మాయవలన కలుగుటవలన బంధములేదు, ముక్తిలేదు - మాయ యొక్క వృత్తి విద్య, అవిద్య; విద్య మోక్షము కలుగ చేయునవి, అవిద్య బంధము కలుగచేయునది యగు శక్తి నేను అవిద్యను కల్పించినప్పుడు బంధము, విద్యను కల్పించినపుడు మోక్షము కలుగుచున్నది. స్వప్నము ఆత్మయొక్క బుద్ధి యొక్క వివర్తముగాని నిజమైనది కాదు - అట్లే శోకమోహములు సుఖదుఃఖములు మాయవలననే కలుగుచున్నవి. అందుచేత ఆత్మకు బంధములేదు, ముక్తి లేదు).

  1. "జాగ్రత్స్వప్న సుషుప్త్యాది ప్రపంచం యత్ప్రాకాశతే |

తద్బ్రహ్మాహమి తిజ్ఞాత్వా సర్వబంధైః ప్రముచ్యతే ||” (కైవల్యోపనిషత్)

(జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థలుగల యీ ప్రపంచమంతయు బ్రహ్మమే, అది నేనే అని జ్ఞానము కలిగిన బంధములన్నియు తొలగిపోవును).

  1. "క. తమ తమ ధర్మము దప్పక

సములైనను నమ్మితిరుగు లభ్యులకును బం

ధమునను జూచిన విరియును

గమలాప్తుడు వొడము విరియు ఘన తమము క్రియన్". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ. భా. 40)

  1. "అత్యంత దుష్టస్య కలేరయమేకో మహాన్ గుణః |

కీర్తనాదేవ కృష్ణస్య ముక్తి బందః పరం ప్రజేత్ ||". (విష్ణుపురాణము - 6 - 2 - 40)

  1. "ద్రష్టా దృశ్య బలాద్బద్దో దృశ్యాభాజే విముచ్యతే". (యోగవాశిష్టము - 1 -22)

(దృశ్య ప్రపంచముయొక్క బలమువలన ద్రష్ట (చూచువాడు) బద్ధుడగుచున్నాడు, దృశ్యప్రపంచములేనిదే అని తెలిసినపుడు ముక్తుడగుచున్నాడు).

"ఏవమజ్ఞానాకాదేవ బంధమోక్ష దృశో (అ)స్మృతేః |

వస్తు తస్తు న బంధోస్తి న మోక్షో (అ)స్తిమహామతే ||".

(బంధమొక్షములు అజ్ఞానమువలన కలుగుచున్నవి - నిజముగా లేనివే). "న ముముక్షుర్న వై ముక్తః ఇత్యేషా పరమార్థతా" (మోక్షము కోరువాడు లేడు - ముక్తిని పొందినవాడు లేడు - ఇదియే పర్తమార్థము) అని చెప్పినట్లు బంధములేదు, ముక్తిలేదు - పరమార్థ దృష్టిలో).

  1. "వాసనాతానవం, రామ |

మోక్ష ఇత్యుచ్యతే బుధైః |

పదార్థ వాసనా దార్ఢ్యం బంధ ఇత్యభిధీయతే ||" (యోగవాశిష్టము - 2 - 2 - 5)

(దృఢమైన కర్మవాసన బంధము - అది లేకుండుటయే మోక్షము అని పండితులు చెప్పుచున్నారు).

  1. "యేన జ్ఞానప్రాపితః కేవలత్వేన కృత్స్న బంధాత్ విముచ్యతే" - బంధాలు అనేక విధాలు - అవిద్యాగ్రంధి, అబ్రహ్మత్వం, హృదయగ్రంధి, సంశయః, కర్మాణి; అసర్వ కామత్వం, మృత్యుః; పునర్జన్మ ఇత్యాది బంధాలు సర్వమున్నూ తత్వం జ్ఞానం వల్ల నివర్తి కాలేవు. - : యో వేద నిహితం గుహాయం పరమే వ్యోమన్ సోవిద్యాగ్రంధి వికరతి.

"భిధ్యతే హృదయ గ్రంధి శ్ఛిద్యంతే సర్వ సంశయాః |

క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే ||",

"తమేవ విదిత్వాది మృత్యుమేతి". (బ్రహ్మవిద్యా సుధార్ణవము - 10)

  1. "మనంబు అన్నమయంబు గావున మనంబున అన్నరూపియైన పృధివి నెఱింగి, పృధివిని జలంబువలన నడంచి, జలంబు తేజంబువలన నింకించి, తేజంబు వాయువువలనం జేరిచి, వాయువు నాకాశంబునం గలిపి, యాకసంబు తామసాహంకారంబునందు లయంబు చేసి, యహంకార త్రయంబు మహత్తత్త్వంబునందు డిందించి, పరతత్వంబునకు లోకంబులు సృజించెదనను తలంపైన మహత్తత్త్వంబునందు విషయాకారంబు నివర్తించి, విషయ వివర్జితంబైన మహత్తత్త్వంబును పరతత్వంబుగా నెఱుంగుచు, అయ్యెఱుకవలన సంసారహేతువైన ప్రకృతిని భస్మంబుచేసి, అయ్యెఱుకను నిర్వాణ సుఖ పారవశ్యంబున పరిహరించి, సకల బంధ విముక్తుడగును."

  2. "మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరం |

హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే ||" (శ్రీమద్భగవద్గీత - 9 - 10)

"సృష్టిస్థితి లయాఖ్యాని క్రియమాణాని మాయయా |

మాయావినేవ కర్మాణి తాని స్వప్నదృశేవచ |

నిగ్రహానుగ్రహానాం న నిబధ్నంతి మాం హరిం |

మిధ్యత్వాన్నైవ కుర్వంతి పుణ్యపాపాది భాగినం |

ఉపేక్షకో యధా కశ్చిద్ద్వ యోర్వివదమానమోః ||“.

- - - "మాయా దృఙాత్మ రూపేణాధ్య క్షేణా విక్రియాత్మనా |

నియంత్రా ప్రకృతిర్మాయా భాసకేనావభాసితా |

సత్వాది భిరనిర్వాచ్యోత్పాదయా త్యఖిలం జగత్ |

మాయావినాశ్రితా మాయా యధాధ్యస్తం గజాదికం |

సృజత్యహం తథాధ్యస్తం సృజామీదం చరాచరం |

నత్వహం సర్వ కార్యాత్మా మాయా భాసనమంతరా |

వ్యాపారాంతర మప్యత్ర విదధే విక్రియాతిగః |

అనేనాధ్యక్షభావేన నిమిత్తేన సచరాచరం |

జననాది వినాశాంతం వికారమాను యాత్యదః |

అతోహం భాస కత్యాఖ్య వ్యాపారేణ సృజామితత్ |

తావతా సూర్యవన్నాస్తి కర్తృత్వం మమ సర్వదా |

ఉదాసీన వదాసీన ముత్యుక్తేర్న విరుద్ధతా |"

అస్య ద్వైతేంద్రజాలస్య యదుపాదాన కారణం |

అజ్ఞానం తదుపాశ్రిత్య బ్రహ్మకారణముచ్యతే |

- "అపూర్వా నపరం బ్రహ్మ తస్య కార్యం న కారణం |

అధిష్ఠానత్వ మాత్రేణ కారణం బ్రహ్మ గీయతే |

ఇత్యుక్తేరపి హేతుత్వం మాయయా నతు వస్తుతః |

ప్రవృత్తిః సర్వ జగతః చిదధీనా సదైవహి |

అతస్తదు భయం నైవ విరుద్ధం స్యాత్ పరస్పరం ||". (గీతాభావప్రకాశము - 9 - 65 to 88; 9 - 71 to 80)

(కల్పావసానమందు సమస్త భూతములు నా ప్రకృతిలో (భగవంతునిచే సృష్టింపబడిన ప్రకృతిలో) లీనమగుచున్నవి. తరువాత కల్పము ప్రారంభ ములో (తిరిగి సృష్టి ప్రారంభమగుకాలములో) నేను వాటిని విడిచిపెట్టు చున్నాను - (సృష్టిచేయుచున్నాను). నేను ప్రకృతిలో అధిష్టించియుండుటచేత ప్రకృతి ఈ చరాచర జగత్తును పుట్టించుచున్నది. ఈ కారణమువలన జగత్తు లయమగుచుండుటయు మరల సృష్టింపబడుటయు జరుగుచున్నది.

"న చ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ |

ఉదాసీన వదాసీన మసక్తం తేషు కర్మసు ||". (శ్రీమద్భగవద్గీత - 9 - 9)

(ఈ సృష్టి మొదలగు కర్మలందు నేను ఉదాసీనునివలె తటస్థుడుగా నున్నను ఆ పనులలో నాకాసక్తి లేదు. అందుచేత ఆ కర్మలు నన్ను బంధించవు - - - సృష్టి స్థితిలయములనునవిమాయచేత చేయబడుచున్నవి - ఒక మాయగాడు - (ఇంద్రజాలము చేయువాడు) చేయు పనులవలె మాయ చేయుచున్నది. అవి స్వప్నమువలె ఉండును - ఆ కర్మలు వాటి ఫలరూపములుగా నాకు (భగవంతునికి) నిగ్రహముకాని, అనుగ్రహముకాని కలిగించి బంధించునవికావు. ఇద్దరు వాదించుకొనుచున్నపుడు అందులో జోక్యము చేసుకొనక ఉదాసీనునివలె ఉన్నవానివలె నున్న నన్ను పాపముగాని, పుణ్యముగాని వాటి ఫలము ననుభవించునట్లు చేయవు. ఎందుచేతననగా అవి మాయవలన కలిగినవి కనుక మిధ్యలు. ఆ కర్మలు చేయుటలో నేను వికారము చెందను, ఇవి నేను చేయుచున్నానను అహంకారము నాకు లేదు -

(అవిక్రియుడను, అధ్యక్షుడను అయిన నా ఈస్క్షణమాత్రమున నేను దాని పనిలో దానిని నియోగించుటచేత - నా సత్తాస్ఫూర్తిని దానిలో నుంచుటచేత - నా కాంతివలన - తేజస్సువలన, శక్తివలన - ప్రకాశించునదియు, సత్వ రజస్తమములను గుణములు గలిగి, ఇటువంటిది యని చెప్పవీలుకానిది అయిన మాయ యను ప్రకృతి యీ జగత్తునంతటినీ ఉత్పాదించుచున్నది - సృష్టించుచున్నది. ఒక మాయవిలో (మాయలు చేయువానిలో) నున్న మాయా శక్తియే ఏనుగు మొదలగువాటిని సృజించినట్లు యీ ప్రకృతి సృజించుచున్నది. అటువంటి మాయ యందు అధ్యస్తమై యున్న నేను ఈ చరాచర జగత్తును సృష్టించుచున్నాను, ఈ జగత్తు సృష్టి మొదలు ప్రళయమువరకు - నశించు వఱకు - గలుగు వికారములను పొందుచున్నది. ప్రకృతి ద్వారా ఇది జరుగుచున్నది కాని నేను మఱియొక విధముగా సృష్టి మొదలగు వాటిని చేయుటలేదు - నేను ప్రకృతికి నా చైతన్య శక్తినిచ్చి దానిచేత నిట్లు చేయించుచున్నాను. ఇట్లు ప్రకృతి చేయుచున్న సృష్టియందు నేను ఉదాసీనుడుగనే యున్నాను. అందుచేత సృష్టి మొదలగు కర్మలందు నాకు కర్తృత్వములేదు - అందుచేత నేను సృష్టి చేయుచున్నానని చెప్పుటకు, నేను వాటికికర్తను కాను అని చెప్పుటకును విరోధములేదు -

(ప్రస్తుతము ప్రతిజీవిలోను భగవంతుడుండి యా జీవికి తన శక్తినిచ్చి పని చేయించుచున్నప్పటికీ ఆ జీవి చేయు పాప పుణ్యములు భగవంతుని అంటవు - అట్లే ప్రకృతి ద్వారా చేయు సృష్టి మొదలగు కార్యములకు భగవంతుడు కర్తకాడు, దాని ఫలము వానిని అంటదు. దానివలన అతనికి బంధము లేదు).

(ఈ మాయాజాలమైన ప్రపంచరూపమగు ద్వైతమంతటికీ మాయ యను అజ్ఞానము ఉపాదాన కారణము - దానికి అధిష్టానమైనవాడు కనుక బ్రహ్మ కారణమని (నిమిత్తకారణమని) చెప్పబడుచున్నాడు. అంతేగాని బ్రహ్మ 'అపూర్వము' (బ్రహ్మకు ముందు ఏమియు లేదు - జన్మ లేదు), 'అనపరం' (బ్రహ్మ తర్వాత మరేమియు లేదు). అతనికి కార్యము (చేయవలసిన పని) గాని, కారణముకాని అధిష్టానమై యుండుటచేతనే కలుగుచున్నది, అని ఇట్లు చెప్పుటకు కారణము కూడ మాయయేకాని నిజము కాదు. ఈ సమస్త జగత్తు యొక్క ప్రవృత్తి చిన్మాత్రుడైన భగవంతుని యధీనమే).

  1. "యః యతిః అన్నాదేః శరీరస్థిత హేతోః లాభా లాభయోః సమః హర్ష విషాద వర్జితః, కర్మాదౌ అకర్మా విధర్మీ యధ భూతాత్మా దర్శన నిష్టస్సన్ శరీర స్థితమాత్ర ప్రయోజనే భిక్షాట నాదౌ కర్మణి శరీరాది నిర్వర్త్య, "నైవ కించిత్కరోమ్యహం", "గుణాః గుణేషు వర్తంతే" ఇత్యేవం యదా పరిసంచ క్షాణః ఆత్మనః కర్తృత్వా భావం పశ్యన్నైవ కించిత్ భిక్షాటనాదికం కర్మ కరోతి లోకవ్యవహార సామాన్య దర్శనేన తు లౌకికైః ఆరోపిత కర్తృత్వాత్ భిక్షాటనాదౌ కర్మాణి కర్తా భవతి, స్వాను భావేన తు శాస్త్ర ప్రమాణ జనితేన ఆకర్తైవ న ఏవం పరాధ్యారోపిత కర్తృత్వః, శరీర స్థితి మాత్ర ప్రయోజనం భిక్షాటనాదికం కర్మ కృత్వాపి న స బద్యతే బంధ హేతోః కర్మణః సహేతుకస్య జ్ఞానాగ్నినా దగ్ధత్వాత్ ఇతి ఉక్తానువాదః ఏవ ఏషః". (శ్రీశంకరః)

(శరీరమును నిలుపుకొనుటకు మాత్రము యతి యగువాడు అన్నము మొదలగు వాటిని తిని, లాభా లాభములందు సమముగానుండి - అనగా, లాభము కలిగినపుడు సంతోషింపక, లాభము కలుగనపుడు దుఃఖమును పొందక - తాను చేయు కర్మలను అకర్మగానే చూచుచు, ఆత్మదర్శనమందే నిష్ఠ కలిగియున్నవాడై, శరీరము నిలుపుకొనుటకుమాత్రము భిక్షాటనము చేయుచు "నేనొకింతయు కర్మ చేయుటలేదు. గుణములు (సత్వరజస్తమోగుణములు) వాటి వాటి విషయములందు ప్రవర్తించు చున్నవి" అని "ఆత్మకు కర్తృత్వము లేదు" అని తెలిసినవాడై కొంచెము భిక్షాటనము మొదలగు కర్మలు చేయువాడు లోకవ్యవహారములలో లోకులచేత వీడు కర్మ చేయుచున్నాడు అని అనిపించుకొనినను, లోకదృష్టిలో కర్తయే యగుచున్నాడు, కాని, శాస్త్ర ప్రమాణమువలనను తన అనుభవమువలనను తాను అకర్తయే. అట్టివాడు ఇతరులచేత కర్త యని చెప్పబడుచున్నను, శరీరము నిలబెట్టుటమాత్రమే ప్రయోజనముగా తలచి దానికి, కావలసినంత మాత్రమే భిక్షాటనము చేసినను అట్టివాడు బద్ధుడుకాడు. అట్టి వానికి అతని కర్మలు బంధము కలుగచేయవు. బంధమునకు కారణమైన కర్మ దాని కారణముతో కూడ దగ్ధమై పోవును).

Transliteration
  1. "sī. savitṛkahō rātraṃbulu lēni teṟaṃguna baripūrṇa jñāna mūrtiyagu nātmayaṃdu najñānaṃbunu lēmini baṃdhaṃbunu, sujñānaṃbu lēmini mōkṣaṃbunu lēvu ". (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā, - 569)

  2. "sī. saṃsāriyai yunna janunaku nīśvara nī kṛpa yeppuḍu nerayagalgu

nappuḍa baṃdhaṃbulanniyu degipōvu; baṃdhamōkṣaṃbaina brāptamagunu

satsaṃgamaṃbu ; satsaṃgaṃbuna nīdu bhakti siddhiṃcu; nī bhaktivalana

sanmukti yagu - - ". (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. - 1665)

  1. "ka. tama tama dharmamu tappaka

samulai nanu nammi tirugu sabhyulakunu baṃ

dhamu nanu jūcina viriyunu

gamalāptuḍu voḍama viriyu ghanatamamu kriyan". (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. 411)

  1. "ajñānādēva saṃsārō jñānādēva vimucyatē" (yōgatatvōpaniṣat)

(brahmajñānamu lēkuṃḍuṭavalananē karmalanāsaktitō cēyuṭa, vāṭi phalamanubhaviṃcuṭaku tirigi janmiṃcuṭa kalugucunnadi. idiyē saṃsāramu. karmalu cēyuṭacē phalamanubhaviṃcavalenu anu baṃdhamu kalugucunnadi. iṃduvalananē janamaraṇamulu kalugucunnavi).

  1. "padārtha bhāvanā dārḍhyaṃ baṃdha ityabhidhīyatē |

vāsanā tānavaṃ, brahman, mōkṣa ityabhi dhīyatē ||". (mahōpaniṣat)

(viṣayamula guṟiṃci dhṛḍhamaina bhāvana - ālōcana baṃdhamani ceppabaḍucunnadi).

  1. "baṃdhōhi vāsanā baṃdhō, mōkṣasyāt vāsanā kṣayaḥ”. (yōgavāśiṣṭamu)

(idivaraku janmalalō cēsina karmalu phalamu niccuṭaku sūkṣmarūpamulō vāsanalugā nuṃḍunaviyē baṃdhamu - āvāsanalu kṣīṇiṃcuṭayē mōkṣamu)

  1. "yathānāhaṃ tathā mōkṣō yadāhaṃ baṃdhanaṃ tadā |". (aṣṭāvakragīta - 8 - 4)

('nēnu kānu' anubhāvana unnaṃtakālamu - ahaṃkāramu - lēnaṃtakālamu mōkṣamu - 'nēnu' anu ahaṃbhāvamunnaṃtakālamu baṃdhamu).

  1. "tṛṣṇā mātrātmakā baṃdhastannāśō mōkṣa ucyatē” (aṣṭāvakragīta - 10 - 4)

(viṣayamulaṃdu kalugu tṛṣṇayē - adhika āśayē - baṃdhamu. ā tṛṣṇa naśiṃcuṭayē mōkṣamu).

  1. "daivī saṃpadvimōkṣāya nibaṃdhāyāsurī matā" (śrīmadbhagavadgīta - 16 - 3)

(daivī saṃpadavalana mōkṣamukalugunu, āsurī saṃpadavalana baṃdhamu kalugunu).

  1. "īśvarasya rūpā parijñānā dbaṃdhaḥ, tatvarūpa parijñānāt mōkṣaḥ - tathā ca śrutiḥ - jñātvā dēvaṃ sarva pāśāpahāniḥ, kṣīṇairklēśai janma mṛtyu prahāṇiḥ. tasyābhidhyānāt tṛtīyaṃ dēva bhēdē viśvaiśvaryaṃ kēvala āptakāmaḥ" ityēvamādyāḥ.

(bhagavaṃtuni svasvarūpamu teliyanaṃduvalananē baṃdhamu, atani svasvarūpajñānamu kaluguṭavalananē mōkṣamu - ī viṣayamu śruti yī prakāramugā ceppucunnadi - brahma jñānamu kalugaganē samastamaina pāpamulu naśiṃcunu. klēśamulu kṣīṇiṃcuṭacētanē jananamaraṇamulu lēkuṃḍa pōvunu - anagā jananamaraṇarūpamagu saṃsāramu anu baṃdhamu lēkapōvunu).

  1. “svātiriktāstitā rūpē yā saṃsṛtiḥ, tadastīti pravṛttimārgō baṃdhaḥ tannāstīti nivṛttimārgō mōkṣaḥ".

(aṃtayu ātmakānidi lēdu - adi aṃtayu bhagavaṃtuḍē yanu nivṛtti mārgamē mōkṣamu).

  1. "brahmasvarūpācchādikā vidyāmūla ma paramārthikaṃ, bhēda darśana mēva baṃdhamūlaṃ baṃdhaśca asaramārthikaḥ saca samūlō asarimārtha katvāt ēva jñānē naiva nivartatē nivartakaṃ ca jñānaṃ tatvamastādi sākṣyajanyaṃ".

(brahmasvarūpamunu kappivēyu avidyāmūlamu aparimārthikamu ayina bhēdadarśanamē. (bhagavaṃtuḍu vēru, prapaṃcamu vēru anuṭa) baṃdhamunaku mūlamu (kāraṇamu). adi paramārthamunaku saṃbaṃdhiṃcinadi kādu. kanuka paramārtha jñānamu (brahmajñānamu) kalugaganē nivartiṃcunu - brahmajñānamanagā " tatvamasi " (nīvē ā brahmavu ayi tivi) anu mahāvākyamu valana kalugu jñānamu)..

  1. "caturviṃśati tatvāni māyā karmaguṇā iti |

viṣayā api kīrtyaṃtē pāśāḥ jīva nibaṃdhanāt tairbaddhāśśiva bhaktyaiva mucyaṃtē sarva dēhinaḥ ||".

(iruvadi nālugu tatvamulu māyākarmaguṇamulu, viṣayamulu. ivi jīvuni baṃdhiṃcucunnavi kanuka pāśamulani ceppabaḍucunnavi. ī pāśamulacēta baṃdhiṃpabaḍina samasta jīvulu śivabhaktivalananē ā baṃdhamunuṃḍi vimukti ceṃducunnāru).

  1. "karmaṇā badhyatē jaṃtuḥ vidyayāca vimucyatē |

tasmāt karma na kurvaṃti yatayaḥ pāradarśanaḥ ||".

(jīvuḍu tānu cēyu karmacēta baṃdhiṃpabaḍucunnāḍu. ē karma cēsinanu dāni phalamanubhaviṃpavalasiyē yunnadi. brahmajñānamu kaluguṭacēta baṃdhamunuṃḍi viḍuvabaḍucunnāḍu (Every action has its reaction) - cēsina karmavalana kalugu reaction dāni phalitamu - cēsina pratikarma baṃdhamunu kaligiṃcunu kanuka, yī saṃsārasamudramu yokka pāramu - oḍḍu - (saṃsāramu lēkuṃḍunaṭlu cēsukonuṭa) telisinavāru karmacēyaru. kāni "nahi kaścit kṣaṇamapi jātu tiṣṭatyakarmakṛt kāryatē hyavaśaḥ karma sarvaḥ prakṛti jairguṇaiḥ". (śrīmadbhagavadgīta - 3 - 5)

(evaḍainanu oka nimiṣamainanu karma cēyaka uṃḍalēḍu. prakṛtivalana tana svabhāvamugā mārina prakṛticēta prērēpiṃcabaḍinavāḍai, svataṃtramugā pani cēyuṭaku śakti lēnivāḍai, jīvuḍu karma cēyucunnāḍu. aṃducēta tāni cēsina karmaphalamu anubhaviṃcavalasiyunnadi ani ceppabaḍiyunnadi kadā, karma cēyaka naruḍe ṭluṃḍagalaḍu? anu viṣayamu guṟiṃci śrīkṛṣṇa bhagavānuḍu śrīmadbhagavadgītalō ī kriṃdavidhagamugā ceppenu : -

"yajñārthāt karmaṇō (a)vyatra lōkōyaṃ karma baṃdhanaḥ |

tadarthaṃ karma kauṃtēya mukta saṃgaḥ samācara ||". (śrīmadbhagavadgīta - 3 - 9)

(cēsina karmanaṃtanu phalamu kōraka bhagavaṃtunikarpiṃcuṭa yajñamani ceppabaḍinadi. iṭlu cēyani karmayē baṃdhamu kalugacēyunu - aṃducēta karmaphalamaṃdāśa lēka bhagavadarpaṇa buddhitō karma cēsina aṭṭikarma baṃdhamu kānēradu).

painavrāsina śrīmadbhagavadgītāślōkamunaku vyākhyānamu ī kriṃdavidhamugā nunnadi : -

"karmaṇā badhyatē jaṃturiti smṛtyā mumukṣuṇā |

baṃdhakatvātkadhaṃ karma kartavya miticēcchṛṇu |

"yajñō vai viṣṇuḥ" rityuktastadhārādhana hētukaṃ |

yatkarma kriyatē tasmātpravṛttō (a)nyatra karmaṇē |

karmādhi kāryayaṃ lōkaḥ karmaṇā baddhyatē tathā |

nīśvarārādhanārthēna baddhyatē (a)tasta darthakaṃ |

karmaṇyadhikṛtaḥ saṃstvaṃ phalasaṃga vivarjitaḥ |

samyak śraddhādinā karma kauṃtēya kuru śāstrataḥ ||". (gītābhāvaprakāśamu - 3 - 64 to 67)

(karma cēyuṭavalana janma kalavāḍagunu - baddhuḍagunu ani śrutilō ceppabaḍinadi - ayina yaḍala mōkṣamu kōruvāḍu karma neṭlu cēyavalayunu? - yajñamanagā viṣṇuvē yani ceppabaḍinadi. yajñamanagā karma. viṣṇuni ārādhiṃcuṭakē yī karma cēyucunnānu anu bhāvamutō yajñamu cēsina adi baṃdhamukādu - aṭlukāka iṃkoka buddhitō cēsina yaḍala baddhuḍagunu - ā karma vānini baṃdhiṃcunu - dāni phalamu nanubhaviṃpacēyunu. aṃducēta karmanu phalamunu kōraka śraddhatō śāstramulō ceppabaḍina prakāramu viṣṇuvu nārādhiṃcucunnānanu manasutōnē cēyumu).

  1. "anātmanyātma tādhyāsāt baṃdhaiva kalpitaḥ |

tannivṛttaikya vijñānānmukta ityupacaryatē |

vastutō baṃdhamōkṣādi nāstyēvādvaita vastuni |

svābhāvikatvē baṃdhasya muktirnasyāttatō vibhōḥ |

na svabhāva viparyāsaḥ pramāṇānāṃ śatairapi |

tasmāt baṃdhasya midhyātvaṃ taduktaṃ vārtikē sphuṭaṃ ||".

(ātma kānidāniyaṃdu ātmayani bhāviṃcuṭa adhyāsamu. ī adhyāsa valana baṃdhamu kalugunu - adhyāsa tolagipōyinanē jīvātmalu okaṭē yanu jñānamu kalugunu -appuḍu muktuḍagunu - baṃdhamu adhyāsavalana kaluguṭacētanu, adhyāsa tolagipōgā mukti kaluguṭacētanu, ī reṃḍunū kalpitamulē. adhvaita vastuvaina paramātmayaṃdu yadhārthamugā baṃdhamōkṣamulu lēvu - :

"midhyājñāna prayuktōyaṃ baṃdhō adhyastascyēdātmani |

samya khadhvaita bōdhēna tannivṛttyāsya muktatā ||". (gītābhāvaprakāśamu - 2 - 177)

(cidātma ayina bhagavaṃtuniyaṃdu midhyājñānamuvalana ceppabaḍina baṃdhamu adhyāsamātramē. advaita tatvajñānamucēta ī adhyāsa tolagina adē mukti).

  1. "yuktaḥ karmaphalaṃ tyaktvā śāṃti māpnoti naiṣṭhikīṃ |

ayuktaḥ kāmakārēṇa phalē saktō nibaddhyatē ||". (śrīmadbhagavadgīta - 5 - 11)

"śṛṇu īśā yaiva karmāṇi naitāni phalāyamē |

ityabhiprāyavān yuktaḥ, tyaktvā karmaphalaṃ sudhīḥ |

kurvan karmāṇi mōkṣākhyāṃ śāṃtri māpnōti naiṣṭikīṃ |

- - - yastva yuktōsti pūrvasmādviparītaḥ. sakāyataḥ |

pravṛtyā mē phalāyē daṃ karōmīti phalēssukaḥ |

karma bhirnitarāṃ baṃdhaṃ saṃsārākhyaṃ prayātyasau |

dēhābhimāna sāmyēpi kṛtaṃ bhagavadarpaṇaṃ |

karma śrautaṃ tathāsmārtaṃ laukikaṃ ca mumukṣubhiḥ |

citta śuddhyāpta vairāgya jñānadvārā vimuktidaṃ |

tadēva kāmakāraṇa kṛtaṃ satphalakāmibhiḥ |

dhṛḍhabaṃdhāya mūḍhānāṃ bhavatītyāśayō harēḥ ||".

(nēnu cēyu ī karmalu bhagavaṃtuni koṟakē, nāku phalamu kaluguṭakukādu ani abhiprāyamu galavāḍu yuktuḍu. karmavalana kalugu phalamunu viḍicipeṭṭi karmalu cēyuvāḍu mōkṣamanu pērugala naiṣṭikaśāṃtini poṃdunu. iṃduku viparītamugā karmalu cēyuvāḍu, karmaphalamaṃdu kōrika kaligiyuṃḍuṭacēta, ayuktuḍu - iṭṭivāḍu pravṛtti dharmamunanusariṃci nēnu phalamu koṟaku ī karma (phalamunu kōriyē) cēyucunnānu anukoni cēyuvāḍu saṃsāramanu pērugala baṃdhamunu ellapuḍu poṃdutāḍu. bhagavadarpaṇagā mumukṣuvulu cēyu karma śrautamukāni, smārtamukāni, laukikamugāni cittaśuddhi valana poṃdina vairāgya jñānamudvārā muktiniccunu. ā karmayē phalāpēkṣa galigi phalāsaktitō cēyuvāriki dhṛḍhamaina baṃdhamunu kaligiṃcunu - ani śrīkṛṣṇuni āśayamu).

  1. "yatkarōṣi yadaśnāsi yajju hōṣi dadāsi yat |

yatta pasyasi kauṃtēya, tatkuruṣvamadarpaṇaṃ |

śubhāśubha phalai rēvaṃ mōkṣyasē karmabaṃdhanaiḥ - (śrīmadbhagavadgīta - 9 - 27, 28)

"yatkarōṣi svataḥ prāptaṃ yadaśnāsi svatṛptayē |

śrautaṃ vādhi smārta madhavā yajjuhōṣi vidērbhalāt |

atidhi brāhmaṇādibhyō hēmānnādi dadāsiyat |

cāṃdrāyaṇādikaṃ dōṣaśāṃtyai carasi yattapaḥ |

ucchṛṃkala pravṛttērvā nirāsāyātmasaṃśayaḥ |

laukikaṃ vaidikaṃ prāṇisvabhāvadvā karōṣiyat |

mayyarpitaṃ yadhā tatsyāt kuruṣva tvaṃ tathā sadā |

samarpakagataṃ sarvaṃ samarpaṇa phalaṃ yataḥ ||". (gītābhāvaprakāśamu - 9 - 178 to 181)

ēdi cesinanu, ēdi vininanu, ēdi havanamu cēsinanu, ēdi evarikiccinanu, eṭṭi tapassu cēsinanu dāninaṃtayu nāku (bhagavaṃtuniki) arpiṃcumu - anagā - dānaṃtaṭa adi yēdi nīku prāptiṃcinanu, nī tṛpti koṟaku - nī ākali tīrcukonuṭaku mātramu - nīvēdi tininanu, ēdi hōmamu cēsinanu - anagā, atidhulu, brāhmaṇulu modalaguvāriki baṃgāramu kāni, annamukāni, yēdi iccinanu, cēsina dōṣamula śāṃti koṟaku, cāṃdrāyaṇamu modalagunavi yēvi cēsinanu, laukika karmagāni, vaidikakarmakāni nīvu nī svabhāvamu valana ēdi cēsinanu, dāni naṃtayu nāku (bhagavaṃtuniki) arpiṃcumu. (śrīkṛṣṇārpaṇamanumu). iṭlu nīvēdi samarpiṃcinanu nāku dāni phalamu kalugunu - ā karma phalamu nīku kalugadu. aṃducēta adi ninnu baṃdhiṃcadu - vāṭi phalamunīvu anubhaviṃcanakkarlēdu - cittaśuddhi kaligi nīvu cēyu karmalanu iṭlu nāku arpiṃcuṭayē yōgamu. dīnivalana nīvu jīviṃci yuṃḍaganē muktuḍavaguduvu. prārabdakarmavalana ī janmāṃtamu vaṟaku uṃḍi maraṇānaṃtaramu brahmarūpuḍavai yē vidhamaina upādhi lēka kaivalyarūpuḍagu nālō aikyamaguduvu).

  1. yathā ēkasyāpi caṃdrādēḥ jalādyupādhinā biṃba pratibiṃba rūpō bhēdaḥ, yathā ca tatra jalakṛtāḥ kaṃpādayaḥ pratibiṃbasyava, yathāca tatra pratibiṃbanā mapi upādhi bhēdēna bhēdāt ēkasminnudaka kuṃbhē bhagnē tadgata pratibiṃbasyaiva biṃbaikyaṃ nānya gatasya, tathā avidyāyāṃ pratibiṃbitasya madaṃśasya jīvasyēva tatkṛtō baṃdhaḥ, tasyaca upādhitō bhēdā nnā vyavasthā.

(caṃdruḍu okaḍē ayinanu jalamu modalagu upādhulavalana caṃdrabiṃbamunaku nīṭilōni caṃdruni pratibiṃbamulaku bhēdamunnadi. eṭlanagā, - nīṭilōni alaluvala aṃdulō pratibiṃbiṃcina caṃdruḍu kadalinaṭluṃḍunu. ā kadaluṭa caṃdrabiṃbamunaku upādhiyaina nīru kaduluṭavalana kaliginadi kāni caṃdrunaku - caṃdruni biṃbamunaku - kaliginadikādi. ā prakāramugānē oka kuṃḍalōni pratibiṃbamu (caṃdra pratibiṃbamu) ā kuṃḍa pagilipōgā kanabaḍakuṃḍa pōvunu - dāni upādhi pōvuṭavalana pōvunu kāni caṃdrabiṃbamu pōdu - ā rītigānē avidyayaṃdu pratibiṃbiṃcina nā aṃśa ayina jīvunikē baṃdhamu).

  1. yathākōśaskṛt - (kōśakārīkīṭaḥ) - gṛhaṃ kōśātmakaṃ kurvan ātmanaḥ nirgamāya dvāramapi na avaśēṣa yati, tathā svabaṃdhakādi karmāṇi kurvāṇaḥ (yīhamānaḥ) jaihva sukhamadhikaṃ manyamānaḥ duraṃta mōhaḥ atṛpta kāmaḥ dōṣadarśanēna viraktaḥ san tyajēt.

(paṭṭupurugu tānu nivasiṃcuṭaku oka kōśamu anu gṛhamu - kōṣaṇakāyaḍokka - nirmiṃcukonucu tānu dānilōnuṃḍi paiki vaccuṭaku mārgamunu vadalaka dānilō baṃdhiṃpabaḍinaṭlu, kōrikalatō tananu baṃdhiṃcu karmalanu cēyuvāḍu, jihva cāpalyamuvalana kalugu sukhamē goppadiyani talacucu, dāniyaṃdu goppa mōhamunu ceṃdinavāḍai, kōrika tanivi tīrakayuṃḍi konni nāḷḷaku vāṭivalana kalugu dōṣamunu telusukoni - adi baṃdhamunu kalugacēyunavi yani telusukoni vāṭini viḍicipeṭṭunu).

  1. anīśō jīvastu karmaphala bhōkyatvāt badhyatē. paramātmanastu avāpta samastakāmatayā karttṛphalaspṛhā bhāvāt karmavēpō nāsti atō na baṃdha prasaktiḥ - - -

"namē karmāṇi liṃpaṃti namē karmaphalē spṛhā |". (śrīmadbhagavadgīta - 4 - 14)

dēvamīśaṃ itthaṃ cidacidvilakṣaṇēna yō jānāti sa sarvapāśaiḥ pramucyatē |

paramātma viśva śarīrakōpi satyakāmānaṃta guṇāśrayaḥ.

ata ēva nirapēkṣaḥ, atō jīvavat na phalābhisaṃdhipūrvaka kartṛtvavān.

(jīvuḍu īśvaruḍu kānaṃduna, svataṃtruḍu kānaṃduna, cēsina karmala valana kalugu phalamunanubhaviṃcavalasinavāḍu kanuka, ā karmala valana baṃdhamu kalugucunnadi. paramātmaku ē vidhamaina kōrikalu lēnaṃduna - annikōrikalu tīrinavāḍainaṃduna - cēsina karmalayaṃdu (sṛṣṭi modalagu vāṭiyaṃdu) spṛhalēnivāḍu (phalamaṃdāsakti lēnivāḍu) kanuka, karmalu atanini baṃdhiṃpavu, aṃṭavu. aṃducēta avi baṃdhiṃcunanu prasakti lēdu - nāku karmalu aṃṭavu - eṃducētananagā nāku karmalayaṃdu spṛhalēdu." (śrīmadbhagavadgīta - 4 - 14). bhagavaṃtuḍu ī prakāramu karmalu cēsinanu avi atanini baṃdhiṃcavu ani telusukoninavāḍu samasta pāśamulacēta (baṃdha mulacētanu) viḍuvabaḍunu - prapaṃcamaṃtayu atani śarīramē ayinanu satyakāmuḍu anaṃtaguṇamulaku āśrayuḍaguṭa valana dēniyaṃdunu apēkṣa lēnivāḍu, aṃducēta jīvunivale kartṛtvamu lēnivāḍu).

  1. "yadṛcchā lābha saṃtuṣṭō dvaṃdātītō vimatsaraḥ |

samaḥ siddhāva siddhau ca kṛtvāpi na nibadhyatē ||". (śrīmadbhagavadgīta - 4 - 22)

(tānu okarini aḍagakuṃḍaganē, tānu prayatnamu cēyakuṃḍaganē labhiṃcina dānitōnē saṃtōṣamuceṃdi śītōṣṇamulu modalagu dvaṃdvamula valana kalgu bādhalanu tolagiṃcu prayatnamu cēyaka vāṭini sahiṃcagaligi, samasta jaṃtuvulaṃdu vairamu lēkanuṃḍuvāḍu; ēdi labhiṃcinanu labhiṃcaka pōyinanu caliṃpani manassu kalavāḍu itarula dṛṣṭilō karta yanipiṃcukonnanu, tana anubhūtivalana akartayē yagunu. atanu karma cēsinanu adi atanini baṃdhiṃcadu).

  1. "tadēva makhilaṃ yajña kriyā kārakavastuyat |

brahma jñānēna tatrai vādhyastaṃ rajjausragādivat |

brahma jñānēna bādhētu bhāsamāna mapi sphuṭaṃ |

kalpatē naiva baṃdhāya yathā svāpnaṃ prajāgarē. |

brahma dṛṣṭē riyaṃ sarva yajñarūpa tayādhunā |

stūyatē hariṇā samyagdṛṣṭi dhārḍhyāya tadvidāṃ ||". (gītābhāvaprakāśamu - 4 - 161 to 164)

(yajñakriya aṃtayu brahmajñānamu lēkuṃḍuṭavalana trāḍunu cūci pūlamāla anu koninaṭlu adhyastamu yajñakriya yaṃtayu brahmamē, yajñamu cēyu agni brahmamu, yajñamu cēyu yajamāni brahma, cēyuṃcuvāḍu hōtabrahmamu, yāgāgnilō hutamu cēyunadi brahma; dīni phalitamu brahma prāpti. ī prakāramugā aṃtā brahmamē ayinappaṭikī vēru vēru pērlatō vāṭini vyavahariṃcuṭa adhyāsamu. idaṃtā brahmamē anu jñānamu kaluga gānē ī adhyāsa tolagunu - trāḍu, trāḍē anu jñānamu kalugagānē pūlamāla anu bhāvamu - uṃḍanaṭlu. svapnamulō unna vastuvu telivi vacci napuḍu uṃḍanaṭlu. iṭlu aṃtā brahmamē anu bhāvamutō cēsina karma yēdiyu baṃdhiṃpadu).

  1. "yōga sanya stakarmāṇaṃ jñānaṃ saṃchinna saṃśayaṃ |

ātmavaṃtaṃ na karmāṇi nibadhnaṃti, dhanaṃjaya" (śrīmadbhagavadgīta - 4 - 4)

(siddhiṃcinadāni yaṃdu, siddhiṃcanidāni yaṃdu samatva buddhi kaligi yuṃḍuṭa yōgamu ani ceppabaḍinadi. aṭṭi yōgamucēta paramēśvaruniyaṃdu karmalu samarpiṃcinavāḍu śuddhamaina manassu kalavāḍu ātmajñānamu kalavāḍaguṭacēta ātmajñānamu kaluguṭavalana ē vidhamaina saṃśayamu lēnivāḍu ātmavaṃtuḍu. ī lakṣaṇamulu kalavānini, atanu cēsina yē vidhamaina karmalainanu, baṃdhiṃcavu).

  1. "ātmā baddhō muktaśca bhagavadguṇa taḥ - bhagavadadhīna satvādi guṇōpāditaḥ - na tu vastutaḥ; guṇasya māyā mūlatvāt baṃdhanaṃ nāsti. ata ēva mōkṣaśca nāsti - (guṇataḥ = guṇapāra taṃtryāt) bhagavataḥ māyayā (māyā vṛtti rūpatvāt) vidyā, avudyā iti baṃdha mōkṣakarī śaktī vinirmitē - "yāvat avidyayāṃ pravartayāmi tāvadbaṃdhaḥ yadā vidyāṃ dadāmi tadā mōkṣaḥ sphurati". ityarthaḥ - yathā svapnaḥ ātmanaḥ buddhēḥ khyātiḥ (vivartaḥ), natu vā vāstavaḥ, tadvat śōkamōhē sukhaṃ duḥkhaṃ dēhāpattiśva māyayā bhavaṃti".

(bhagavaṃtuni ādhīnamulōnunna satvamu, tajassu, tamamu anu triguṇamulu upādhigā kaligi yunnaṃduvalana - vāṭiki lōbaḍi yuṃḍuṭavalana - ātmaku baṃdhamu, mukti kalugucunnavi. aṃtēgāni, vastutaḥ kādu - triguṇamulu māyavalana kaluguṭavalana baṃdhamulēdu, muktilēdu - māya yokka vṛtti vidya, avidya; vidya mōkṣamu kaluga cēyunavi, avidya baṃdhamu kalugacēyunadi yagu śakti nēnu avidyanu kalpiṃcinappuḍu baṃdhamu, vidyanu kalpiṃcinapuḍu mōkṣamu kalugucunnadi. svapnamu ātmayokka buddhi yokka vivartamugāni nijamainadi kādu - aṭlē śōkamōhamulu sukhaduḥkhamulu māyavalananē kalugucunnavi. aṃducēta ātmaku baṃdhamulēdu, mukti lēdu).

  1. "jāgratsvapna suṣuptyādi prapaṃcaṃ yatprākāśatē |

tadbrahmāhami tijñātvā sarvabaṃdhaiḥ pramucyatē ||” (kaivalyōpaniṣat)

(jāgratsvapna suṣuptyavasthalugala yī prapaṃcamaṃtayu brahmamē, adi nēnē ani jñānamu kaligina baṃdhamulanniyu tolagipōvunu).

  1. "ka. tama tama dharmamu dappaka

samulainanu nammitirugu labhyulakunu baṃ

dhamunanu jūcina viriyunu

gamalāptuḍu voḍamu viriyu ghana tamamu kriyan". (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū. bhā. 40)

  1. "atyaṃta duṣṭasya kalērayamēkō mahān guṇaḥ |

kīrtanādēva kṛṣṇasya mukti baṃdaḥ paraṃ prajēt ||". (viṣṇupurāṇamu - 6 - 2 - 40)

  1. "draṣṭā dṛśya balādbaddō dṛśyābhājē vimucyatē". (yōgavāśiṣṭamu - 1 -22)

(dṛśya prapaṃcamuyokka balamuvalana draṣṭa (cūcuvāḍu) baddhuḍagucunnāḍu, dṛśyaprapaṃcamulēnidē ani telisinapuḍu muktuḍagucunnāḍu).

"ēvamajñānākādēva baṃdhamōkṣa dṛśō (a)smṛtēḥ |

vastu tastu na baṃdhōsti na mōkṣō (a)stimahāmatē ||".

(baṃdhamokṣamulu ajñānamuvalana kalugucunnavi - nijamugā lēnivē). "na mumukṣurna vai muktaḥ ityēṣā paramārthatā" (mōkṣamu kōruvāḍu lēḍu - muktini poṃdinavāḍu lēḍu - idiyē partamārthamu) ani ceppinaṭlu baṃdhamulēdu, muktilēdu - paramārtha dṛṣṭilō).

  1. "vāsanātānavaṃ, rāma |

mōkṣa ityucyatē budhaiḥ |

padārtha vāsanā dārḍhyaṃ baṃdha ityabhidhīyatē ||" (yōgavāśiṣṭamu - 2 - 2 - 5)

(dṛḍhamaina karmavāsana baṃdhamu - adi lēkuṃḍuṭayē mōkṣamu ani paṃḍitulu ceppucunnāru).

  1. "yēna jñānaprāpitaḥ kēvalatvēna kṛtsna baṃdhāt vimucyatē" - baṃdhālu anēka vidhālu - avidyāgraṃdhi, abrahmatvaṃ, hṛdayagraṃdhi, saṃśayaḥ, karmāṇi; asarva kāmatvaṃ, mṛtyuḥ; punarjanma ityādi baṃdhālu sarvamunnū tatvaṃ jñānaṃ valla nivarti kālēvu. - : yō vēda nihitaṃ guhāyaṃ paramē vyōman sōvidyāgraṃdhi vikarati.

"bhidhyatē hṛdaya graṃdhi śchidyaṃtē sarva saṃśayāḥ |

kṣīyaṃtē cāsya karmāṇi tasmin dṛṣṭē parāvarē ||",

"tamēva viditvādi mṛtyumēti". (brahmavidyā sudhārṇavamu - 10)

  1. "manaṃbu annamayaṃbu gāvuna manaṃbuna annarūpiyaina pṛdhivi neṟiṃgi, pṛdhivini jalaṃbuvalana naḍaṃci, jalaṃbu tējaṃbuvalana niṃkiṃci, tējaṃbu vāyuvuvalanaṃ jērici, vāyuvu nākāśaṃbunaṃ galipi, yākasaṃbu tāmasāhaṃkāraṃbunaṃdu layaṃbu cēsi, yahaṃkāra trayaṃbu mahattattvaṃbunaṃdu ḍiṃdiṃci, paratatvaṃbunaku lōkaṃbulu sṛjiṃcedananu talaṃpaina mahattattvaṃbunaṃdu viṣayākāraṃbu nivartiṃci, viṣaya vivarjitaṃbaina mahattattvaṃbunu paratatvaṃbugā neṟuṃgucu, ayyeṟukavalana saṃsārahētuvaina prakṛtini bhasmaṃbucēsi, ayyeṟukanu nirvāṇa sukha pāravaśyaṃbuna parihariṃci, sakala baṃdha vimuktuḍagunu."

  2. "mayādhyakṣēṇa prakṛtiḥ sūyatē sacarācaraṃ |

hētunānēna kauṃtēya jagadviparivartatē ||" (śrīmadbhagavadgīta - 9 - 10)

"sṛṣṭisthiti layākhyāni kriyamāṇāni māyayā |

māyāvinēva karmāṇi tāni svapnadṛśēvaca |

nigrahānugrahānāṃ na nibadhnaṃti māṃ hariṃ |

midhyatvānnaiva kurvaṃti puṇyapāpādi bhāginaṃ |

upēkṣakō yadhā kaściddva yōrvivadamānamōḥ ||“.

- - - "māyā dṛṅātma rūpēṇādhya kṣēṇā vikriyātmanā |

niyaṃtrā prakṛtirmāyā bhāsakēnāvabhāsitā |

satvādi bhiranirvācyōtpādayā tyakhilaṃ jagat |

māyāvināśritā māyā yadhādhyastaṃ gajādikaṃ |

sṛjatyahaṃ tathādhyastaṃ sṛjāmīdaṃ carācaraṃ |

natvahaṃ sarva kāryātmā māyā bhāsanamaṃtarā |

vyāpārāṃtara mapyatra vidadhē vikriyātigaḥ |

anēnādhyakṣabhāvēna nimittēna sacarācaraṃ |

jananādi vināśāṃtaṃ vikāramānu yātyadaḥ |

atōhaṃ bhāsa katyākhya vyāpārēṇa sṛjāmitat |

tāvatā sūryavannāsti kartṛtvaṃ mama sarvadā |

udāsīna vadāsīna mutyuktērna viruddhatā |"

asya dvaitēṃdrajālasya yadupādāna kāraṇaṃ |

ajñānaṃ tadupāśritya brahmakāraṇamucyatē |

- "apūrvā naparaṃ brahma tasya kāryaṃ na kāraṇaṃ |

adhiṣṭhānatva mātrēṇa kāraṇaṃ brahma gīyatē |

ityuktērapi hētutvaṃ māyayā natu vastutaḥ |

pravṛttiḥ sarva jagataḥ cidadhīnā sadaivahi |

atastadu bhayaṃ naiva viruddhaṃ syāt parasparaṃ ||". (gītābhāvaprakāśamu - 9 - 65 to 88; 9 - 71 to 80)

(kalpāvasānamaṃdu samasta bhūtamulu nā prakṛtilō (bhagavaṃtunicē sṛṣṭiṃpabaḍina prakṛtilō) līnamagucunnavi. taruvāta kalpamu prāraṃbha mulō (tirigi sṛṣṭi prāraṃbhamagukālamulō) nēnu vāṭini viḍicipeṭṭu cunnānu - (sṛṣṭicēyucunnānu). nēnu prakṛtilō adhiṣṭiṃciyuṃḍuṭacēta prakṛti ī carācara jagattunu puṭṭiṃcucunnadi. ī kāraṇamuvalana jagattu layamagucuṃḍuṭayu marala sṛṣṭiṃpabaḍuṭayu jarugucunnadi.

"na ca māṃ tāni karmāṇi nibadhnaṃti dhanaṃjaya |

udāsīna vadāsīna masaktaṃ tēṣu karmasu ||". (śrīmadbhagavadgīta - 9 - 9)

(ī sṛṣṭi modalagu karmalaṃdu nēnu udāsīnunivale taṭasthuḍugā nunnanu ā panulalō nākāsakti lēdu. aṃducēta ā karmalu nannu baṃdhiṃcavu - - - sṛṣṭi sthitilayamulanunavimāyacēta cēyabaḍucunnavi - oka māyagāḍu - (iṃdrajālamu cēyuvāḍu) cēyu panulavale māya cēyucunnadi. avi svapnamuvale uṃḍunu - ā karmalu vāṭi phalarūpamulugā nāku (bhagavaṃtuniki) nigrahamukāni, anugrahamukāni kaligiṃci baṃdhiṃcunavikāvu. iddaru vādiṃcukonucunnapuḍu aṃdulō jōkyamu cēsukonaka udāsīnunivale unnavānivale nunna nannu pāpamugāni, puṇyamugāni vāṭi phalamu nanubhaviṃcunaṭlu cēyavu. eṃducētananagā avi māyavalana kaliginavi kanuka midhyalu. ā karmalu cēyuṭalō nēnu vikāramu ceṃdanu, ivi nēnu cēyucunnānanu ahaṃkāramu nāku lēdu -

(avikriyuḍanu, adhyakṣuḍanu ayina nā īskṣaṇamātramuna nēnu dāni panilō dānini niyōgiṃcuṭacēta - nā sattāsphūrtini dānilō nuṃcuṭacēta - nā kāṃtivalana - tējassuvalana, śaktivalana - prakāśiṃcunadiyu, satva rajastamamulanu guṇamulu galigi, iṭuvaṃṭidi yani ceppavīlukānidi ayina māya yanu prakṛti yī jagattunaṃtaṭinī utpādiṃcucunnadi - sṛṣṭiṃcucunnadi. oka māyavilō (māyalu cēyuvānilō) nunna māyā śaktiyē ēnugu modalaguvāṭini sṛjiṃcinaṭlu yī prakṛti sṛjiṃcucunnadi. aṭuvaṃṭi māya yaṃdu adhyastamai yunna nēnu ī carācara jagattunu sṛṣṭiṃcucunnānu, ī jagattu sṛṣṭi modalu praḷayamuvaraku - naśiṃcu vaṟaku - galugu vikāramulanu poṃducunnadi. prakṛti dvārā idi jarugucunnadi kāni nēnu maṟiyoka vidhamugā sṛṣṭi modalagu vāṭini cēyuṭalēdu - nēnu prakṛtiki nā caitanya śaktinicci dānicēta niṭlu cēyiṃcucunnānu. iṭlu prakṛti cēyucunna sṛṣṭiyaṃdu nēnu udāsīnuḍuganē yunnānu. aṃducēta sṛṣṭi modalagu karmalaṃdu nāku kartṛtvamulēdu - aṃducēta nēnu sṛṣṭi cēyucunnānani ceppuṭaku, nēnu vāṭikikartanu kānu ani ceppuṭakunu virōdhamulēdu -

(prastutamu pratijīvilōnu bhagavaṃtuḍuṃḍi yā jīviki tana śaktinicci pani cēyiṃcucunnappaṭikī ā jīvi cēyu pāpa puṇyamulu bhagavaṃtuni aṃṭavu - aṭlē prakṛti dvārā cēyu sṛṣṭi modalagu kāryamulaku bhagavaṃtuḍu kartakāḍu, dāni phalamu vānini aṃṭadu. dānivalana ataniki baṃdhamu lēdu).

(ī māyājālamaina prapaṃcarūpamagu dvaitamaṃtaṭikī māya yanu ajñānamu upādāna kāraṇamu - dāniki adhiṣṭānamainavāḍu kanuka brahma kāraṇamani (nimittakāraṇamani) ceppabaḍucunnāḍu. aṃtēgāni brahma 'apūrvamu' (brahmaku muṃdu ēmiyu lēdu - janma lēdu), 'anaparaṃ' (brahma tarvāta marēmiyu lēdu). ataniki kāryamu (cēyavalasina pani) gāni, kāraṇamukāni adhiṣṭānamai yuṃḍuṭacētanē kalugucunnadi, ani iṭlu ceppuṭaku kāraṇamu kūḍa māyayēkāni nijamu kādu. ī samasta jagattu yokka pravṛtti cinmātruḍaina bhagavaṃtuni yadhīnamē).

  1. "yaḥ yatiḥ annādēḥ śarīrasthita hētōḥ lābhā lābhayōḥ samaḥ harṣa viṣāda varjitaḥ, karmādau akarmā vidharmī yadha bhūtātmā darśana niṣṭassan śarīra sthitamātra prayōjanē bhikṣāṭa nādau karmaṇi śarīrādi nirvartya, "naiva kiṃcitkarōmyahaṃ", "guṇāḥ guṇēṣu vartaṃtē" ityēvaṃ yadā parisaṃca kṣāṇaḥ ātmanaḥ kartṛtvā bhāvaṃ paśyannaiva kiṃcit bhikṣāṭanādikaṃ karma karōti lōkavyavahāra sāmānya darśanēna tu laukikaiḥ ārōpita kartṛtvāt bhikṣāṭanādau karmāṇi kartā bhavati, svānu bhāvēna tu śāstra pramāṇa janitēna ākartaiva na ēvaṃ parādhyārōpita kartṛtvaḥ, śarīra sthiti mātra prayōjanaṃ bhikṣāṭanādikaṃ karma kṛtvāpi na sa badyatē baṃdha hētōḥ karmaṇaḥ sahētukasya jñānāgninā dagdhatvāt iti uktānuvādaḥ ēva ēṣaḥ". (śrīśaṃkaraḥ)

(śarīramunu nilupukonuṭaku mātramu yati yaguvāḍu annamu modalagu vāṭini tini, lābhā lābhamulaṃdu samamugānuṃḍi - anagā, lābhamu kaliginapuḍu saṃtōṣiṃpaka, lābhamu kaluganapuḍu duḥkhamunu poṃdaka - tānu cēyu karmalanu akarmagānē cūcucu, ātmadarśanamaṃdē niṣṭha kaligiyunnavāḍai, śarīramu nilupukonuṭakumātramu bhikṣāṭanamu cēyucu "nēnokiṃtayu karma cēyuṭalēdu. guṇamulu (satvarajastamōguṇamulu) vāṭi vāṭi viṣayamulaṃdu pravartiṃcu cunnavi" ani "ātmaku kartṛtvamu lēdu" ani telisinavāḍai koṃcemu bhikṣāṭanamu modalagu karmalu cēyuvāḍu lōkavyavahāramulalō lōkulacēta vīḍu karma cēyucunnāḍu ani anipiṃcukoninanu, lōkadṛṣṭilō kartayē yagucunnāḍu, kāni, śāstra pramāṇamuvalananu tana anubhavamuvalananu tānu akartayē. aṭṭivāḍu itarulacēta karta yani ceppabaḍucunnanu, śarīramu nilabeṭṭuṭamātramē prayōjanamugā talaci dāniki, kāvalasinaṃta mātramē bhikṣāṭanamu cēsinanu aṭṭivāḍu baddhuḍukāḍu. aṭṭi vāniki atani karmalu baṃdhamu kalugacēyavu. baṃdhamunaku kāraṇamaina karma dāni kāraṇamutō kūḍa dagdhamai pōvunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.