← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బంధము baṃdhamu

Original — తెలుగు
  1. బద్నాతీతి బంధః - అవిద్యా -

(బంధించునది - కట్టి ఉంచునది - అవిద్య లేక అజ్ఞానము మానవుని సంసారములో కట్టి యుంచు చున్నది - బంధించుచున్నది).

  1. బధ్యతే అస్మిన్ పర్యవస్య తీతి బంధః.

(దీనియందు - సంసారమందు - కట్టబడియున్నాడు, దీనిలోనే లీనమైపోవుచున్నాడు, కనుక ఇది బంధము).

  1. "అభిమానంబు బంధంబు, నిరభిమానియై వధించినను వధంబుకాదు" అట్టిది బంధించదు. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 -)

    1. "సంకల్పనం పరో బంధస్తద భావో విముక్తతా" (ఇతి వాసిష్టే)

(సంకల్పించుటయే - విషయములగుఱించి ఆలోచించుటయే గొప్ప బంధము. అట్టి సంకల్పము లేకుండుటయే విముక్తి).

  1. "సంకల్పాదికం మనోబంధ హేతుః, తద్వియుక్తం మనో మోక్షాయ భవతి" (మండల బ్రాహ్మణోపనిషత్)

(విషయముల గుఱించి సంకల్పించునది మనసే. అట్టి సంకల్పము మనసులో కలిగియుండుటే బంధమునకు కారణము. అట్టి సంకల్పములేని మనస్సు కలిగియుండుట మోక్షమునకు కారణమగును).

  1. "సవిషయ మనోబంధాయ, నిర్విషయం ముక్తయే భవతి. అతః సర్వం చిత్తగోచరం" (మండల బ్రాహ్మణోపనిషత్తు)

(విషయములగుఱించి ఆలోచించు మనస్సు బంధము కలుగచేయును. అట్లుకాని మనస్సు మోక్షమును కలిగించును - అందుచేత అంతయు - చిత్తగోచరము - కష్టముగాని, సుఖముకాని, బంధముకాని మోక్షముగాని చిత్తమును బట్టియే కలుగు చుండును).

  1. "సంకల్పత్వం హి బంధస్య కారణం తత్పరిత్యజ |

మోక్షో భవేద సంకల్పాత్ తదభ్యాసం ధియాకురు ||" (అన్నపూర్ణోపనిషత్)

(సంకల్పించుటయే బంధమునకు కారణము - దానిని విడిచిపెట్టుటవలన - సంకల్పము లేకుండుటవలన - మోక్షము కలుగును - బుద్ధిమంతుడవై దానిని అభ్యాసము చేసికొనుము).

  1. "మననాన్మన ఉచ్యతే |

అంతః సంకల్ప సిద్ధేయం సంకల్పేనైవ నశ్యతి |

నాహం బ్రహ్మేతిసంకల్పాత్ సుధృఢాద్బధ్యతే మనః |

సర్వం బ్రహ్మేతి సంకల్పాత్ సుధృఢాన్ముచ్యతే మనః |

కృశోహం దుఃఖ బద్ధోహం హస్త పాదాది మానవాం |

ఇతి భావానురూపేణ వ్యవహారేణ బధ్యతే |

నాహం దుఃఖీనమే దేహో బంధః కో(అ)స్యాత్మని స్థితః |

ఇతి భావానురూపేణ వ్యవహారేణ ముచ్యతే ||". (మహోపనిషత్)

(మననము చేయుటచేత - ఎల్లపుడు పదే పదే ఆలోచనచేయుటవలన మనస్సు అని చెప్పబడినది. అందుచేత సంకల్పముచేత కలిగినది సంకల్పము చేతనే నశించును. అది ఎట్లనగా - ' నేను బ్రహ్మనుకాను కాను ' అను ధృఢమైన సంకల్పము కలిగియున్నయడల మనసుకు బంధము కలుగుచున్నది. అంతయు బ్రహ్మమే యను ధృఢమైన సంకల్పము కలిగినయడల మనస్సు బంధమునుండి ముక్తినొందును - బంధము విడిపోవును. నేను కృశించితిని, నేను దుఃఖమును పొందుచున్నాను, చేతులు కాళ్ళు గలవాడిని అను ఈ విధమైన భావము కలిగి వ్యవహరించిన బంధము కలుగును. నాకు దుఃఖము లేదు, నేను ఈ దేహముకాను, నేను ఆత్మయందే నిత్యము పరాయణుడనై యున్నాను - నాకు దేనితోను సంబంధములేదు - అను భావనారూపము కలిగి వ్యవహరించుటచేత ముక్తిని పొందును - బంధమునుండి విడివడును).

  1. "అహమిత్యేవ బంధాయ నాహం మిత్యోపముక్తయే" (యోగవాశిష్టము)

(నేను అను అహంకారము కలిగియుండుటయే బంధము. నేను అను అహంకారము లేకుండుటయే ముక్తి).

  1. "మమేదమితి బంధాయ నాహం మిత్యేవ ముక్తయే" (యోగవాశిష్టము)

(ఇది నాది, వీడు నావాడు, అని ప్రపంచవస్తువులందు మమకారము కలిగియుండుట బంధము)

  1. "మోక్ష విషయవైరస్యం, బంధో వైషయికో రసః" (అష్టావక్రగీత - 15 - 2)

(విషయములందు ఇచ్ఛ లేకుండుట మోక్షము ; విషయములందు తగులుబడి వాటిని అనుభవించుటే బంధము).

  1. "ద్వేపదే బంధమోక్షాయ నిర్మమేతి మమేతి చ |

మమేతి బధ్యతేజం తుః నిర్మమేతి విముచ్యతే " (పైంగలోపనిషత్ - 4 - 72)

(రెండు పదములు బంధమునకు, మోక్షమునకు కారణము - నాది, నావాడు అను అభిమానము కలిగి యుండుట బంధమునకు కారణము, నాదికాదు అనుకొనుట మోక్షమునకు కారణము).

  1. దేహాదౌ అహంకార మమకార భవాభావౌ బంధి మోక్షహేతూ భవతః.

(దేహమందు, ఇది నేను, ఇది నాది అను అహంకారమమకారములు కలిగియుండుట బంధమునకు కారణము, అవి లేకుండుట మోక్షమునకు కారణము).

  1. గుణేషు శబ్దాది విషయేషు సక్తం ఆసక్తం చేతః బంధాయ భవతి.

(త్రిగుణముల కార్యములైన శబ్దము మొదలగు విషయములందాసక్తి కలిగిన మనస్సు బంధమునకు కారణము).

  1. భోగేచ్ఛా మాత్రకో బంధస్తత్త్యాగో మోక్ష ఉచ్యతే. (మహోపనిషత్ - 5 - 97)

(భోగములందు కోరికయే బంధము. దానిని వదలుకొనుటయే మోక్షము).

  1. యథా మధుకరో విశిష్ట గంధలోభేన ఏకస్మిన్నేవ పద్మే నివసన్, అస్త సమయే తస్మిన్ ముకుళితే సతి బధ్యతే, ఏవం మునిరపి గుణలోభేన, ఏవమేవ గృహం ఆశ్రితః తన్మోహేన బధ్యతే.

(విశిష్టమైన వాసనకు ఆసపడి తుమ్మెద ఒకే పద్మములో నుండుచు సాయంకాలమునకు ఆ పద్మము ముడుచుకొనిపోవుటచే నందులో బంధింపబడియుండును. ఆ ప్రకారము ముని యైనను గుణలోభముచేత ఒకే గృహమందుండుచు దానియందు మోహమువలన దానిలో బద్ధుడగుచున్నాడు).

  1. యస్తు పరమాత్మనః అన్యం ఆత్మానం జానాతి స బధ్యతే.

(పరమాత్మకంటె వేరైనవాడు జీవుడని - పరమాత్మకంటె తాను వేరైనవాడని తలచువాడు బంధమునొందును).

  1. "అవిచార నృతో బంధః, విచారాన్మోక్షో భవతి తస్మాత్ సదా విచారయేత్" (పైంగళోపనిషత్).

(భగవంతుని గుఱించి విచారించకపోవుటచేత - భగవత్ జ్ఞానము లేకపోవుటచేత బంధము కలుగును - జిజ్ఞాస కలిగిన మోక్షము కలుగును - అందుచేత ఎల్లపుడు భగవంతుని గుఱించి అయిన జ్ఞానము సంపాదింప ప్రయత్నము చేయవలెను).

  1. "దృశ్యమాశ్రయ సీదం చేత్ తత్ స చిత్తో (అ)సి బంధవాన్ |

దృశ్యం సంత్య జ నీదం చేత్ తదా (అ)చిత్తోపి మోక్షవాన్ ||". (మహోపనిషత్ - 6 - 35)

(ఈ కనబడు ప్రపంచము నాశ్రయించిన, దానిని గుఱించి ఆలోచించిన అది బంధమునకు కారణము - దానిని వదలివేసిన, దానిని గుఱించి ఆలోచించుట మాని వేసిన, ఆ చిత్తము మోక్షమునకు కారణమగును).

  1. "శుద్ధో ముక్తిః స దైవాత్మా న వై బధ్యతే కర్హిచిత్ |

బంధ మోక్షౌ మనస్సంస్థౌ తస్మిన్ శాంతే ప్రశామ్యతి ||".

(ఆత్మ శుద్ధుడు - నిష్కలంకుడు - ఆత్మకు ఎన్నడూ బంధము లేదు - బంధము, మోక్షము, అనునవి, మనస్సువలన కలిగినవి - మనస్సు శాంతించిన బంధములన్నియు శాంతించును).

  1. "అవిద్య యాహంకార రూపేణ ప్రతీతం జ్ఞానం బంధా యేష్యతి; విద్య యా తన్నిరాసేన జ్ఞానం మోక్షా యేష్యతే".

(అవిద్యవలన - అజ్ఞానమువలన - అహంకార రూపముగా వర్తించు జ్ఞానము బంధమును కలుగచేయును. బ్రహ్మజ్ఞానము కలుగుటచేత ఆ అవిద్య పోయి మోక్షమును కలుగుచేయును).

  1. "మన ఏవ మనుషాణాం కారణం బంధ మోక్షయోః |

బంధాయ విషయా సక్తం మోక్ష్యై నిర్విషయం స్మృతం ||".

(మనుష్యుల బంధ మోక్షములకు వారి మనసే కారణము. విషయములందాసక్తివలన బంధము కలుగును. అవి లేనిచో ముక్తి కలుగును).

"నహి జడం గృహం పురుషం బధ్నాతి, న చ అన్యత్ బంధనే కారణమస్తి కింతు మన ఆసక్తి మాత్రం కారణం. తాం విహాయ సంసారం కుర్వాణః ముచ్యతే".

(గృహము జడము, కనుక పురుషుని బంధింపలేదు - ఇది కాక యింక యేదియు బంధమునకు కారణము లేదు - కాని మనస్సే విషయములయడల మనస్సునకు కలిగిన ఆసక్తియే కారణము - దానిని వదలిపెట్టి విషయములందు ఆసక్తి మనసులో కలుగకుండచేసి సంసారమును నడిపించువాడు - జీవనము చేయువాడు - ముక్తుడగును).

  1. "తదా బంధో యదా చిత్తం సక్తం కాస్వపి దృష్టిషు |

తదా బంధో యదా చిత్తం కించిత్వాం ఛతి శోచతి |

కించిన్ముంచతి గృహ్ణాతి కించిత్ హృష్యతి కుప్యతి ||". (అష్టావక్రగీత - 8 - 1)

(చిత్తము దృశ్యవస్తువులందాసక్తి గలిగి యున్నయడల బంధము కలుగును. చిత్తములో దేనినైనను కోరినగాని, దేని గుఱించి అయినను శోకించినగాని, దేనిని గ్రహించినగాని, విడిచిననుగాని, దేనిని గుఱించి అయినను సంతోషించినగాని, దుఃఖపడినగాని, అప్పుడే బంధము కలుగును).

  1. "అహంకారాది దేహాంతానాం ఆత్మభూత దృశ్య వస్తుజాతం సర్వమపి బంధః ఇత్యుచ్యతే - సంబంధో యది అథ్యస్తః స్యాత్ తర్హి జ్ఞానేన నివర్తేత. అధ్యస్తః చేత్ సైవ జ్ఞానేన నివర్త్యేత |".

(అహంకారము మొదలు దేహమువరకు గల దృశ్యప్రపంచమంతయు బంధమే - ఈ బంధము అధ్యస్తమువలన కలిగినదైనయడల అది జ్ఞానమువలన నివర్తించును, అధ్యస్తము కానిచో జ్ఞానమువలన (బ్రహ్మజ్ఞానమువలన) నివర్తింపదు).

  1. "పురుషస్య భోక్తృత్వ సుఖ దుఃఖాది లక్షణః చిత్త ధర్మః, క్లేశరూపత్వాత్ బంధోభవతి. తన్నిరోధనం జీవన్ముక్తః". (ముక్తికోపనిషత్)

(పురుషుడు సుఖ దుఃఖముననుభవించుట చిత్త ధర్మము - ఇవి మనసు ద్వారా కష్టము, సుఖము అనిపించును. చిత్తము ద్వారా కష్టము కలిగించునవి కనుక అవి బంధములు. వాటిని నిరోధించుటయే - సుఖ దుఃఖములు కలిగిన వాటి గుఱించి మనసులో బాధ పడక యుండుటయే, (వాటిని నిరోధించుటయే) జీవన్ముక్తి).

"జీవవంతుడైన పురుషునికి కర్తృత్వ, భోక్తృత్వ, సుఖత్వ దుఃఖత్వాది గుణాలు ఏవి కలవో అవి చిత్త ధర్మాలు, క్లేశరూపాలు గాబట్టి బంధమనిపించును - - - ఈ బంధము జ్ఞానముననే నివారణ మగునుగాని మఱొకందువల్లగాదు". (బ్రహ్మవిద్యా సుధార్ణవము - 9)

  1. యస్మిన్నాభాసే స్వరూపావరణమస్తి తస్మిన్నేవ బంధః. జీవేతు ఆదరణ సత్వాత్ సః బద్ధః.

(ఏ ఆభాస పదార్థమందు స్వస్వరూపము - ఆత్మ స్వరూపము - ఆవరించబడు యున్నదో అక్కడ బంధముండును - జీవునిలోనున్న ఆత్మసత్వము అవిద్యచే ఆవరించబడి యున్నందున జీవుడు బద్ధుడై యున్నాడు).

  1. "అనాద్య విద్యా వాసనయా జాతో (అ)హమితి సంకల్పో బంధః. పితృ మాత్రు సహోదర దారాసత్య గృహా రామ క్షేత్రమమతా సంసారావరణ సంకల్పో బంధః. కర్తృత్వాద్యహంకార సంకల్పో బంధాః.అణిమాద్యష్టైశ్వర్యాశా సిద్ధ సంకల్పో బంధః దేవమనుష్యాద్యుపాసనా కామ సంకల్పో బంధః. యమాద్యష్టాంగ యోగ సంకల్పో బంధః, వర్ణాశ్రమధర్మ కర్మ సంకల్పో బంధః. ఆజ్ఞా భయ సంశయాత్మ గుణ సంకల్పో బంధః. యాగ వ్రత దాన తపో విధివిధాన జ్ఞాన సంకల్పో బంధః. కేవల మోక్షాపేక్ష సంకల్పో బంధః. సంకల్ప మాత్ర సంభవో బంధః".

(మొదలు ఎప్పుడో తెలియని అనేక జన్మలలో చేసిన కర్మలు వాసనా రూపములుగా యుండి అవిద్యచేత 'నేను పుట్టితిని' అను సంకల్పము కలుగును. అట్టి సంబంధము బంధము. తలిదండ్రులు, అన్నదమ్ములు, భార్య, సంతానము, గృహము, భూములు, తోటలు దొడ్లు - వీటిని గుఱించి ' ఇవన్నియు నావి ' యను మమకారముతో సంసారము యడల కలుగు సంకల్పము బంధము, నేను కర్తను - ఈ పని నేను చేసితిని అను అహంకారముతో కూడిన సంకల్పము - బంధము. అణిమాద్యష్టైశ్వర్యములు కలుగ వలెనను సంకల్పము బంధము - పరబ్రహ్మ కాక ఇతర దేవతుల గుఱించికాని, మనుష్యులగుఱించికాని ఉపాసన చేయుటయందు కలుగు సంకల్పము బంధము. యమ నియమాసన ప్రాణాయామము మొదలగు అష్టాంగయోగము గుఱించి చేయు సంకల్పము బంధము. చాతుర్వర్ణ ములకు, చతురాశ్రమములకు, ధర్మమునకు సంబంధించిన కర్మలు చేయ వలయునను సంకల్పము బంధము. ఆజ్ఞనిచ్చుట, భయమును కలుగచేయుట, సంశయము కలిగించుట - వీటిని ఆత్మ గుణములుగా సంకల్పించుట బంధము - యాగము, వ్రతము, తపస్సు, దానము మొదలగునవి శాస్త్రములో చెప్పిన ప్రకార ముగ నైనను చేయుటకు కలుగు సంకల్పము బంధము - కేవలము సంకల్పమనునది ఏది అయినను ఎట్టిదైనను బంధమే - మోక్షము పొందవలెనను సంకల్పము కూడ బంధము).

  1. "వ. విద్వాంసులు సంగంబింద్రియార్థాద్య సద్విషయంబుగ నొనరింపబడి జీవునకు నశిధిలంబగు బంధంబునకు కారణంబగుననియు - - - దెలియుదురు". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 25 -

  2. "నిర్గుణుండైన ఈశ్వరునివలన రజస్తత్వతమోగుణంబులు ప్రభూతంబులై యుత్పత్తి స్థితి లయంబులకు బాలువడి కార్యకారణ కర్తృత్వంబులందు ద్రవ్యంబులైన మహా భూతంబులును, జ్ఞానమూర్తులయిన దేవతులును, గ్రియారూపంబులైన ఇంద్రియంబులును నాశ్రయంబులుగా నిత్య ముక్తుండయ్యును మాయా సమన్వితుండైన జీవుని బంధించు". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 5 -)

  3. "సత్వం సుఖ జ్ఞానసంగేన బధ్నాతి, రజస్తు కర్మ సంగేన, తమస్తు ప్రమాదాలస్య నిద్రాదిభిః ఇతి బంధ హేతు ప్రకారః -".

(సత్వరజస్తమములను మూడు గుణములలోను సత్వగుణము సుఖమును, జ్ఞానమును, కలిగించుట ద్వారా, ఆ సుఖములనిచ్చు వస్తువులందు (విషయములయడల) బంధము కలిగించును. రజోగుణము కర్మ చేయించి దాని ఫలమనుభవించుటకు బంధము కలుగచేయును - తమోగుణము దాని వృత్తులయిన ప్రమాదము, ఆలస్యము, నిద్రా మొదలగువాటివలన బంధము కలుగచేయును).

  1. "సత్వం రజస్తమ ఇతి (ఏం నామానః) గుణాః స రూపాదివత్ ద్రవ్యాశ్రితాః గుణాః; న గుణ గుణినో అన్యత్వం అత్ర వివక్షితం తస్మాత్ గుణః ఇవ నిత్యపరతంత్రాః క్షేత్రజ్ఞం ప్రతి అవిద్యాత్మ కత్వాత్ క్షేత్రజ్ఞం నిబధ్నం తీవ. తం ఆస్పదీకృత్య ఆత్మానం ప్రతి లభంతే ఇతి, నిబధ్నంతి ఇతి ఉచ్యతే". (శ్రీశంకరః)

(సత్వము, రజసు, తమస్సు అను పేర్లుగల త్రిగుణములు రూపము మొదలగువాటివలె ఒక ద్రవ్యమును (వస్తువును) ఆశ్రయించియుండు గుణములుకావు - గుణములకు గుణికి (గుణములు కలదానికి) భేదము ఇక్కడ చెప్పబడియుండ లేదు. అందుచేత గుణమువలె పరతంత్రములు. అవిద్యా స్వరూపములగుటవలన క్షేత్రజ్ఞుని బంధించుచున్నట్లున్నవి. ఆత్మను ఉండుటకు స్థానముగా చేసుకొని యున్నందున బంధించునట్లు చెప్పబడుచున్నవి).

  1. "సత్వరజస్తమాంసి త్రయో గుణాః ప్రకృతేః స్వరూపాను బంధినః. స్వభావ విషేషాః ప్రకాశాది కార్యైక నిరూపణోయాః ప్రకృత్యవస్థాయాం అనుద్భూతాః తద్వికారేషు మహదాదిషు ఉద్భూతాః మహదాది విశేషాం తైః ఆరబ్దాదేవ మనుష్యాది దేహ సంబంధినం ఏనం దేహినం స్వతో గుణసంబంధానర్హం దేహే వర్తమానం నిబద్నంతి దేహే వర్తమానత్వోపాధినా నిబధ్నం తీత్యర్థః" (శ్రీమాన్ రామానుజః)

(సత్వము, రజస్సు, తమస్సు అను త్రిగుణములు ప్రకృతి స్వరూపములకు సబంధించినవి, స్వభావ విశేషములు - దేనిలో నవి యుండిన దాని స్వభావమును తెలియచేయునవి. ఇది యొక్కటియే అవి చేయు కార్యము. ప్రకృతిలోనే ఉన్నపుడు ఉన్నట్లు పైకి కనబడనివిఉ, కాని ప్రకృతియొక్క కార్యములైన మహత్తత్వము మొదలగు తత్వములన్నింటిలోనుండి, వాటితో కలిగిన దేవతులు, మనుష్యులు మొదలగు శరీరము కలిగి, స్వతహా గుణసంబంధము లేనివాడైనను - పరమాత్మ అంశయే అయినను, - జీవుడైనను - దేహములోనుండు జీవుని బంధించుచున్నది - అనగా, దేహములోనుండుటవలన దేహమను ఉపాధితో బంధించుచున్నది).

  1. “ఐశ్వర్యేవా సువిస్తీర్ణే వ్యసనే వాసుదారుణే |

రజ్జీవ పురుషం బధ్ధ్వా కృతాంతః సంకర్షతి ||".

(గొప్ప ఐశ్వర్యము కలిగిఉయున్నను, దారుణమైన వ్యసనము కలిగియున్నను అవి పురుషుని త్రాడుతో బంధించునట్లు కృతాంతుడు (యముడు) బంధించి తీసుకొని పోవును).

  1. "వ. శరీరాభిమానంబునం జేసి దండవాక్పారుష్యంబులు హింసయై తోచుతెఱంగున నేను నాయది యనియెడు వైషమ్యంబును భూతంబులకు శరీరంబునంద సంభవించు - అభిమానంబు బంధించు ". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 1 - 13)
Transliteration
  1. badnātīti baṃdhaḥ - avidyā -

(baṃdhiṃcunadi - kaṭṭi uṃcunadi - avidya lēka ajñānamu mānavuni saṃsāramulō kaṭṭi yuṃcu cunnadi - baṃdhiṃcucunnadi).

  1. badhyatē asmin paryavasya tīti baṃdhaḥ.

(dīniyaṃdu - saṃsāramaṃdu - kaṭṭabaḍiyunnāḍu, dīnilōnē līnamaipōvucunnāḍu, kanuka idi baṃdhamu).

  1. "abhimānaṃbu baṃdhaṃbu, nirabhimāniyai vadhiṃcinanu vadhaṃbukādu" aṭṭidi baṃdhiṃcadu. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 -)

    1. "saṃkalpanaṃ parō baṃdhastada bhāvō vimuktatā" (iti vāsiṣṭē)

(saṃkalpiṃcuṭayē - viṣayamulaguṟiṃci ālōciṃcuṭayē goppa baṃdhamu. aṭṭi saṃkalpamu lēkuṃḍuṭayē vimukti).

  1. "saṃkalpādikaṃ manōbaṃdha hētuḥ, tadviyuktaṃ manō mōkṣāya bhavati" (maṃḍala brāhmaṇōpaniṣat)

(viṣayamula guṟiṃci saṃkalpiṃcunadi manasē. aṭṭi saṃkalpamu manasulō kaligiyuṃḍuṭē baṃdhamunaku kāraṇamu. aṭṭi saṃkalpamulēni manassu kaligiyuṃḍuṭa mōkṣamunaku kāraṇamagunu).

  1. "saviṣaya manōbaṃdhāya, nirviṣayaṃ muktayē bhavati. ataḥ sarvaṃ cittagōcaraṃ" (maṃḍala brāhmaṇōpaniṣattu)

(viṣayamulaguṟiṃci ālōciṃcu manassu baṃdhamu kalugacēyunu. aṭlukāni manassu mōkṣamunu kaligiṃcunu - aṃducēta aṃtayu - cittagōcaramu - kaṣṭamugāni, sukhamukāni, baṃdhamukāni mōkṣamugāni cittamunu baṭṭiyē kalugu cuṃḍunu).

  1. "saṃkalpatvaṃ hi baṃdhasya kāraṇaṃ tatparityaja |

mōkṣō bhavēda saṃkalpāt tadabhyāsaṃ dhiyākuru ||" (annapūrṇōpaniṣat)

(saṃkalpiṃcuṭayē baṃdhamunaku kāraṇamu - dānini viḍicipeṭṭuṭavalana - saṃkalpamu lēkuṃḍuṭavalana - mōkṣamu kalugunu - buddhimaṃtuḍavai dānini abhyāsamu cēsikonumu).

  1. "mananānmana ucyatē |

aṃtaḥ saṃkalpa siddhēyaṃ saṃkalpēnaiva naśyati |

nāhaṃ brahmētisaṃkalpāt sudhṛḍhādbadhyatē manaḥ |

sarvaṃ brahmēti saṃkalpāt sudhṛḍhānmucyatē manaḥ |

kṛśōhaṃ duḥkha baddhōhaṃ hasta pādādi mānavāṃ |

iti bhāvānurūpēṇa vyavahārēṇa badhyatē |

nāhaṃ duḥkhīnamē dēhō baṃdhaḥ kō(a)syātmani sthitaḥ |

iti bhāvānurūpēṇa vyavahārēṇa mucyatē ||". (mahōpaniṣat)

(mananamu cēyuṭacēta - ellapuḍu padē padē ālōcanacēyuṭavalana manassu ani ceppabaḍinadi. aṃducēta saṃkalpamucēta kaliginadi saṃkalpamu cētanē naśiṃcunu. adi eṭlanagā - ' nēnu brahmanukānu kānu ' anu dhṛḍhamaina saṃkalpamu kaligiyunnayaḍala manasuku baṃdhamu kalugucunnadi. aṃtayu brahmamē yanu dhṛḍhamaina saṃkalpamu kaliginayaḍala manassu baṃdhamunuṃḍi muktinoṃdunu - baṃdhamu viḍipōvunu. nēnu kṛśiṃcitini, nēnu duḥkhamunu poṃducunnānu, cētulu kāḷḷu galavāḍini anu ī vidhamaina bhāvamu kaligi vyavahariṃcina baṃdhamu kalugunu. nāku duḥkhamu lēdu, nēnu ī dēhamukānu, nēnu ātmayaṃdē nityamu parāyaṇuḍanai yunnānu - nāku dēnitōnu saṃbaṃdhamulēdu - anu bhāvanārūpamu kaligi vyavahariṃcuṭacēta muktini poṃdunu - baṃdhamunuṃḍi viḍivaḍunu).

  1. "ahamityēva baṃdhāya nāhaṃ mityōpamuktayē" (yōgavāśiṣṭamu)

(nēnu anu ahaṃkāramu kaligiyuṃḍuṭayē baṃdhamu. nēnu anu ahaṃkāramu lēkuṃḍuṭayē mukti).

  1. "mamēdamiti baṃdhāya nāhaṃ mityēva muktayē" (yōgavāśiṣṭamu)

(idi nādi, vīḍu nāvāḍu, ani prapaṃcavastuvulaṃdu mamakāramu kaligiyuṃḍuṭa baṃdhamu)

  1. "mōkṣa viṣayavairasyaṃ, baṃdhō vaiṣayikō rasaḥ" (aṣṭāvakragīta - 15 - 2)

(viṣayamulaṃdu iccha lēkuṃḍuṭa mōkṣamu ; viṣayamulaṃdu tagulubaḍi vāṭini anubhaviṃcuṭē baṃdhamu).

  1. "dvēpadē baṃdhamōkṣāya nirmamēti mamēti ca |

mamēti badhyatējaṃ tuḥ nirmamēti vimucyatē " (paiṃgalōpaniṣat - 4 - 72)

(reṃḍu padamulu baṃdhamunaku, mōkṣamunaku kāraṇamu - nādi, nāvāḍu anu abhimānamu kaligi yuṃḍuṭa baṃdhamunaku kāraṇamu, nādikādu anukonuṭa mōkṣamunaku kāraṇamu).

  1. dēhādau ahaṃkāra mamakāra bhavābhāvau baṃdhi mōkṣahētū bhavataḥ.

(dēhamaṃdu, idi nēnu, idi nādi anu ahaṃkāramamakāramulu kaligiyuṃḍuṭa baṃdhamunaku kāraṇamu, avi lēkuṃḍuṭa mōkṣamunaku kāraṇamu).

  1. guṇēṣu śabdādi viṣayēṣu saktaṃ āsaktaṃ cētaḥ baṃdhāya bhavati.

(triguṇamula kāryamulaina śabdamu modalagu viṣayamulaṃdāsakti kaligina manassu baṃdhamunaku kāraṇamu).

  1. bhōgēcchā mātrakō baṃdhastattyāgō mōkṣa ucyatē. (mahōpaniṣat - 5 - 97)

(bhōgamulaṃdu kōrikayē baṃdhamu. dānini vadalukonuṭayē mōkṣamu).

  1. yathā madhukarō viśiṣṭa gaṃdhalōbhēna ēkasminnēva padmē nivasan, asta samayē tasmin mukuḷitē sati badhyatē, ēvaṃ munirapi guṇalōbhēna, ēvamēva gṛhaṃ āśritaḥ tanmōhēna badhyatē.

(viśiṣṭamaina vāsanaku āsapaḍi tummeda okē padmamulō nuṃḍucu sāyaṃkālamunaku ā padmamu muḍucukonipōvuṭacē naṃdulō baṃdhiṃpabaḍiyuṃḍunu. ā prakāramu muni yainanu guṇalōbhamucēta okē gṛhamaṃduṃḍucu dāniyaṃdu mōhamuvalana dānilō baddhuḍagucunnāḍu).

  1. yastu paramātmanaḥ anyaṃ ātmānaṃ jānāti sa badhyatē.

(paramātmakaṃṭe vērainavāḍu jīvuḍani - paramātmakaṃṭe tānu vērainavāḍani talacuvāḍu baṃdhamunoṃdunu).

  1. "avicāra nṛtō baṃdhaḥ, vicārānmōkṣō bhavati tasmāt sadā vicārayēt" (paiṃgaḷōpaniṣat).

(bhagavaṃtuni guṟiṃci vicāriṃcakapōvuṭacēta - bhagavat jñānamu lēkapōvuṭacēta baṃdhamu kalugunu - jijñāsa kaligina mōkṣamu kalugunu - aṃducēta ellapuḍu bhagavaṃtuni guṟiṃci ayina jñānamu saṃpādiṃpa prayatnamu cēyavalenu).

  1. "dṛśyamāśraya sīdaṃ cēt tat sa cittō (a)si baṃdhavān |

dṛśyaṃ saṃtya ja nīdaṃ cēt tadā (a)cittōpi mōkṣavān ||". (mahōpaniṣat - 6 - 35)

(ī kanabaḍu prapaṃcamu nāśrayiṃcina, dānini guṟiṃci ālōciṃcina adi baṃdhamunaku kāraṇamu - dānini vadalivēsina, dānini guṟiṃci ālōciṃcuṭa māni vēsina, ā cittamu mōkṣamunaku kāraṇamagunu).

  1. "śuddhō muktiḥ sa daivātmā na vai badhyatē karhicit |

baṃdha mōkṣau manassaṃsthau tasmin śāṃtē praśāmyati ||".

(ātma śuddhuḍu - niṣkalaṃkuḍu - ātmaku ennaḍū baṃdhamu lēdu - baṃdhamu, mōkṣamu, anunavi, manassuvalana kaliginavi - manassu śāṃtiṃcina baṃdhamulanniyu śāṃtiṃcunu).

  1. "avidya yāhaṃkāra rūpēṇa pratītaṃ jñānaṃ baṃdhā yēṣyati; vidya yā tannirāsēna jñānaṃ mōkṣā yēṣyatē".

(avidyavalana - ajñānamuvalana - ahaṃkāra rūpamugā vartiṃcu jñānamu baṃdhamunu kalugacēyunu. brahmajñānamu kaluguṭacēta ā avidya pōyi mōkṣamunu kalugucēyunu).

  1. "mana ēva manuṣāṇāṃ kāraṇaṃ baṃdha mōkṣayōḥ |

baṃdhāya viṣayā saktaṃ mōkṣyai nirviṣayaṃ smṛtaṃ ||".

(manuṣyula baṃdha mōkṣamulaku vāri manasē kāraṇamu. viṣayamulaṃdāsaktivalana baṃdhamu kalugunu. avi lēnicō mukti kalugunu).

"nahi jaḍaṃ gṛhaṃ puruṣaṃ badhnāti, na ca anyat baṃdhanē kāraṇamasti kiṃtu mana āsakti mātraṃ kāraṇaṃ. tāṃ vihāya saṃsāraṃ kurvāṇaḥ mucyatē".

(gṛhamu jaḍamu, kanuka puruṣuni baṃdhiṃpalēdu - idi kāka yiṃka yēdiyu baṃdhamunaku kāraṇamu lēdu - kāni manassē viṣayamulayaḍala manassunaku kaligina āsaktiyē kāraṇamu - dānini vadalipeṭṭi viṣayamulaṃdu āsakti manasulō kalugakuṃḍacēsi saṃsāramunu naḍipiṃcuvāḍu - jīvanamu cēyuvāḍu - muktuḍagunu).

  1. "tadā baṃdhō yadā cittaṃ saktaṃ kāsvapi dṛṣṭiṣu |

tadā baṃdhō yadā cittaṃ kiṃcitvāṃ chati śōcati |

kiṃcinmuṃcati gṛhṇāti kiṃcit hṛṣyati kupyati ||". (aṣṭāvakragīta - 8 - 1)

(cittamu dṛśyavastuvulaṃdāsakti galigi yunnayaḍala baṃdhamu kalugunu. cittamulō dēninainanu kōrinagāni, dēni guṟiṃci ayinanu śōkiṃcinagāni, dēnini grahiṃcinagāni, viḍicinanugāni, dēnini guṟiṃci ayinanu saṃtōṣiṃcinagāni, duḥkhapaḍinagāni, appuḍē baṃdhamu kalugunu).

  1. "ahaṃkārādi dēhāṃtānāṃ ātmabhūta dṛśya vastujātaṃ sarvamapi baṃdhaḥ ityucyatē - saṃbaṃdhō yadi athyastaḥ syāt tarhi jñānēna nivartēta. adhyastaḥ cēt saiva jñānēna nivartyēta |".

(ahaṃkāramu modalu dēhamuvaraku gala dṛśyaprapaṃcamaṃtayu baṃdhamē - ī baṃdhamu adhyastamuvalana kaliginadainayaḍala adi jñānamuvalana nivartiṃcunu, adhyastamu kānicō jñānamuvalana (brahmajñānamuvalana) nivartiṃpadu).

  1. "puruṣasya bhōktṛtva sukha duḥkhādi lakṣaṇaḥ citta dharmaḥ, klēśarūpatvāt baṃdhōbhavati. tannirōdhanaṃ jīvanmuktaḥ". (muktikōpaniṣat)

(puruṣuḍu sukha duḥkhamunanubhaviṃcuṭa citta dharmamu - ivi manasu dvārā kaṣṭamu, sukhamu anipiṃcunu. cittamu dvārā kaṣṭamu kaligiṃcunavi kanuka avi baṃdhamulu. vāṭini nirōdhiṃcuṭayē - sukha duḥkhamulu kaligina vāṭi guṟiṃci manasulō bādha paḍaka yuṃḍuṭayē, (vāṭini nirōdhiṃcuṭayē) jīvanmukti).

"jīvavaṃtuḍaina puruṣuniki kartṛtva, bhōktṛtva, sukhatva duḥkhatvādi guṇālu ēvi kalavō avi citta dharmālu, klēśarūpālu gābaṭṭi baṃdhamanipiṃcunu - - - ī baṃdhamu jñānamunanē nivāraṇa magunugāni maṟokaṃduvallagādu". (brahmavidyā sudhārṇavamu - 9)

  1. yasminnābhāsē svarūpāvaraṇamasti tasminnēva baṃdhaḥ. jīvētu ādaraṇa satvāt saḥ baddhaḥ.

(ē ābhāsa padārthamaṃdu svasvarūpamu - ātma svarūpamu - āvariṃcabaḍu yunnadō akkaḍa baṃdhamuṃḍunu - jīvunilōnunna ātmasatvamu avidyacē āvariṃcabaḍi yunnaṃduna jīvuḍu baddhuḍai yunnāḍu).

  1. "anādya vidyā vāsanayā jātō (a)hamiti saṃkalpō baṃdhaḥ. pitṛ mātru sahōdara dārāsatya gṛhā rāma kṣētramamatā saṃsārāvaraṇa saṃkalpō baṃdhaḥ. kartṛtvādyahaṃkāra saṃkalpō baṃdhāḥ.aṇimādyaṣṭaiśvaryāśā siddha saṃkalpō baṃdhaḥ dēvamanuṣyādyupāsanā kāma saṃkalpō baṃdhaḥ. yamādyaṣṭāṃga yōga saṃkalpō baṃdhaḥ, varṇāśramadharma karma saṃkalpō baṃdhaḥ. ājñā bhaya saṃśayātma guṇa saṃkalpō baṃdhaḥ. yāga vrata dāna tapō vidhividhāna jñāna saṃkalpō baṃdhaḥ. kēvala mōkṣāpēkṣa saṃkalpō baṃdhaḥ. saṃkalpa mātra saṃbhavō baṃdhaḥ".

(modalu eppuḍō teliyani anēka janmalalō cēsina karmalu vāsanā rūpamulugā yuṃḍi avidyacēta 'nēnu puṭṭitini' anu saṃkalpamu kalugunu. aṭṭi saṃbaṃdhamu baṃdhamu. talidaṃḍrulu, annadammulu, bhārya, saṃtānamu, gṛhamu, bhūmulu, tōṭalu doḍlu - vīṭini guṟiṃci ' ivanniyu nāvi ' yanu mamakāramutō saṃsāramu yaḍala kalugu saṃkalpamu baṃdhamu, nēnu kartanu - ī pani nēnu cēsitini anu ahaṃkāramutō kūḍina saṃkalpamu - baṃdhamu. aṇimādyaṣṭaiśvaryamulu kaluga valenanu saṃkalpamu baṃdhamu - parabrahma kāka itara dēvatula guṟiṃcikāni, manuṣyulaguṟiṃcikāni upāsana cēyuṭayaṃdu kalugu saṃkalpamu baṃdhamu. yama niyamāsana prāṇāyāmamu modalagu aṣṭāṃgayōgamu guṟiṃci cēyu saṃkalpamu baṃdhamu. cāturvarṇa mulaku, caturāśramamulaku, dharmamunaku saṃbaṃdhiṃcina karmalu cēya valayunanu saṃkalpamu baṃdhamu. ājñaniccuṭa, bhayamunu kalugacēyuṭa, saṃśayamu kaligiṃcuṭa - vīṭini ātma guṇamulugā saṃkalpiṃcuṭa baṃdhamu - yāgamu, vratamu, tapassu, dānamu modalagunavi śāstramulō ceppina prakāra muga nainanu cēyuṭaku kalugu saṃkalpamu baṃdhamu - kēvalamu saṃkalpamanunadi ēdi ayinanu eṭṭidainanu baṃdhamē - mōkṣamu poṃdavalenanu saṃkalpamu kūḍa baṃdhamu).

  1. "va. vidvāṃsulu saṃgaṃbiṃdriyārthādya sadviṣayaṃbuga nonariṃpabaḍi jīvunaku naśidhilaṃbagu baṃdhaṃbunaku kāraṇaṃbagunaniyu - - - deliyuduru". (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 25 -

  2. "nirguṇuṃḍaina īśvarunivalana rajastatvatamōguṇaṃbulu prabhūtaṃbulai yutpatti sthiti layaṃbulaku bāluvaḍi kāryakāraṇa kartṛtvaṃbulaṃdu dravyaṃbulaina mahā bhūtaṃbulunu, jñānamūrtulayina dēvatulunu, griyārūpaṃbulaina iṃdriyaṃbulunu nāśrayaṃbulugā nitya muktuṃḍayyunu māyā samanvituṃḍaina jīvuni baṃdhiṃcu". (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 5 -)

  3. "satvaṃ sukha jñānasaṃgēna badhnāti, rajastu karma saṃgēna, tamastu pramādālasya nidrādibhiḥ iti baṃdha hētu prakāraḥ -".

(satvarajastamamulanu mūḍu guṇamulalōnu satvaguṇamu sukhamunu, jñānamunu, kaligiṃcuṭa dvārā, ā sukhamulaniccu vastuvulaṃdu (viṣayamulayaḍala) baṃdhamu kaligiṃcunu. rajōguṇamu karma cēyiṃci dāni phalamanubhaviṃcuṭaku baṃdhamu kalugacēyunu - tamōguṇamu dāni vṛttulayina pramādamu, ālasyamu, nidrā modalaguvāṭivalana baṃdhamu kalugacēyunu).

  1. "satvaṃ rajastama iti (ēṃ nāmānaḥ) guṇāḥ sa rūpādivat dravyāśritāḥ guṇāḥ; na guṇa guṇinō anyatvaṃ atra vivakṣitaṃ tasmāt guṇaḥ iva nityaparataṃtrāḥ kṣētrajñaṃ prati avidyātma katvāt kṣētrajñaṃ nibadhnaṃ tīva. taṃ āspadīkṛtya ātmānaṃ prati labhaṃtē iti, nibadhnaṃti iti ucyatē". (śrīśaṃkaraḥ)

(satvamu, rajasu, tamassu anu pērlugala triguṇamulu rūpamu modalaguvāṭivale oka dravyamunu (vastuvunu) āśrayiṃciyuṃḍu guṇamulukāvu - guṇamulaku guṇiki (guṇamulu kaladāniki) bhēdamu ikkaḍa ceppabaḍiyuṃḍa lēdu. aṃducēta guṇamuvale parataṃtramulu. avidyā svarūpamulaguṭavalana kṣētrajñuni baṃdhiṃcucunnaṭlunnavi. ātmanu uṃḍuṭaku sthānamugā cēsukoni yunnaṃduna baṃdhiṃcunaṭlu ceppabaḍucunnavi).

  1. "satvarajastamāṃsi trayō guṇāḥ prakṛtēḥ svarūpānu baṃdhinaḥ. svabhāva viṣēṣāḥ prakāśādi kāryaika nirūpaṇōyāḥ prakṛtyavasthāyāṃ anudbhūtāḥ tadvikārēṣu mahadādiṣu udbhūtāḥ mahadādi viśēṣāṃ taiḥ ārabdādēva manuṣyādi dēha saṃbaṃdhinaṃ ēnaṃ dēhinaṃ svatō guṇasaṃbaṃdhānarhaṃ dēhē vartamānaṃ nibadnaṃti dēhē vartamānatvōpādhinā nibadhnaṃ tītyarthaḥ" (śrīmān rāmānujaḥ)

(satvamu, rajassu, tamassu anu triguṇamulu prakṛti svarūpamulaku sabaṃdhiṃcinavi, svabhāva viśēṣamulu - dēnilō navi yuṃḍina dāni svabhāvamunu teliyacēyunavi. idi yokkaṭiyē avi cēyu kāryamu. prakṛtilōnē unnapuḍu unnaṭlu paiki kanabaḍaniviu, kāni prakṛtiyokka kāryamulaina mahattatvamu modalagu tatvamulanniṃṭilōnuṃḍi, vāṭitō kaligina dēvatulu, manuṣyulu modalagu śarīramu kaligi, svatahā guṇasaṃbaṃdhamu lēnivāḍainanu - paramātma aṃśayē ayinanu, - jīvuḍainanu - dēhamulōnuṃḍu jīvuni baṃdhiṃcucunnadi - anagā, dēhamulōnuṃḍuṭavalana dēhamanu upādhitō baṃdhiṃcucunnadi).

  1. “aiśvaryēvā suvistīrṇē vyasanē vāsudāruṇē |

rajjīva puruṣaṃ badhdhvā kṛtāṃtaḥ saṃkarṣati ||".

(goppa aiśvaryamu kaligiuyunnanu, dāruṇamaina vyasanamu kaligiyunnanu avi puruṣuni trāḍutō baṃdhiṃcunaṭlu kṛtāṃtuḍu (yamuḍu) baṃdhiṃci tīsukoni pōvunu).

  1. "va. śarīrābhimānaṃbunaṃ jēsi daṃḍavākpāruṣyaṃbulu hiṃsayai tōcuteṟaṃguna nēnu nāyadi yaniyeḍu vaiṣamyaṃbunu bhūtaṃbulaku śarīraṃbunaṃda saṃbhaviṃcu - abhimānaṃbu baṃdhiṃcu ". (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 1 - 13)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.