← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భగవల్లీల bhagavallīla

Original — తెలుగు
  1. విచిత్ర చిద చిద్రూపేణ విక్రియమాణ మపి బ్రహ్మ సత్యమేవా భవత్. నిరస్త నిఖిలదోష గంధ మపరిచ్ఛిన్న జ్ఞానానాందమేకరూపమేవా భవత్ ఇత్యర్థః. సర్వాణి చిద చిద్వస్తూని సూక్ష్మదశా పన్నాని, స్థూలదశా పన్నాని చ పరస్య బ్రహ్మణః లీలోపకరణాని, సృష్ట్యా దయశ్చ లీలేతి భగవత్ ద్వైపాయన పరాశరాది భిరుక్తం –

“అవ్యక్తాది విశేషాంతం పరిణామర్థి సం యుతం |

క్రీడాం హరేరిదం సర్వం క్షరమత్యుపధార్యతాం ||“.

- - - క్రీడతో బాలకస్యైవ చేష్టాం తస్య నిశామయ ||

“- - - బాల క్రీడన కరైరివ” - ఇత్యాదిభిః వక్ష్యతి చ - “లోకవత్తు లీలా కైవల్యం” ఇతి. (శ్రీమాన్ రామానుజః)

చిత్ర విచిత్రమైన చిత్ అచిత్ (ఆత్మ, అనాత్మ) రూపములతో భగవంతుడు ఒక లీలగా కనబడుచున్నను అతను సత్పదార్థమే - క్షీణించుటలేక - ఎల్లకాలములందు ఉండువాడే - అనగా, - ఏ విధమైన దోషములులేక దేశకాలవస్తువులవల్ల పరిచ్ఛిన్నుడుకాక వాటివలన కలుగు పరిమితిలేని వాడై, జ్ఞానానందములు కలిసియుండు ఒకే రూపము అయినవాడు. సమస్తమైన చిదచిద్వస్తువులు, సూక్ష్మదశలోనున్నవైనను, స్థూలదశలోనున్నవైనను పరబ్రహ్మయొక్క లీలకు యోగపడునవే, సృష్టిచేయుట మొదలగునవి భగవంతుని లీలలని భగవంతుడగు ద్వైపాయనుడు పరాశరుడు చెప్పియుండిరి - ఎట్లంటే - అవ్యక్తము - ప్రకృతి - మొదలు విశేషాంతముగల వస్తువులన్నియు పరిణామములే, మార్పులే. అందుచేత ఇదంతయు భగవంతుని క్రీడయే - లీలయే. అన్నియు భగవంతుని లీలకొఱకు ఎట్లు కల్పించబడినవో అట్లే అన్నియు నశించవలసినవే - ఆటలాడు బాలకుని నడవడివలెనే. ఇదంతయు భగవతుని చేష్ట.

  1. “ఆ. గోపజనములందు గోపికలందును

సకలజంతులందును సంచరించు

నా మహాత్మునకు బరాంగనలెవ్వరు

సర్వమయుడు లీల సలిపెగాక”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. - 99)

  1. “ఉ. పుట్టువులేని నీకభవ పుట్టుట క్రీడయకాక పుట్టుటే - - -”. (శ్రీమదాంధ్రమహాభాగవత్ము - 10 - పూ,భా. - 99)
Transliteration
  1. vicitra cida cidrūpēṇa vikriyamāṇa mapi brahma satyamēvā bhavat. nirasta nikhiladōṣa gaṃdha maparicchinna jñānānāṃdamēkarūpamēvā bhavat ityarthaḥ. sarvāṇi cida cidvastūni sūkṣmadaśā pannāni, sthūladaśā pannāni ca parasya brahmaṇaḥ līlōpakaraṇāni, sṛṣṭyā dayaśca līlēti bhagavat dvaipāyana parāśarādi bhiruktaṃ –

“avyaktādi viśēṣāṃtaṃ pariṇāmarthi saṃ yutaṃ |

krīḍāṃ harēridaṃ sarvaṃ kṣaramatyupadhāryatāṃ ||“.

- - - krīḍatō bālakasyaiva cēṣṭāṃ tasya niśāmaya ||

“- - - bāla krīḍana karairiva” - ityādibhiḥ vakṣyati ca - “lōkavattu līlā kaivalyaṃ” iti. (śrīmān rāmānujaḥ)

citra vicitramaina cit acit (ātma, anātma) rūpamulatō bhagavaṃtuḍu oka līlagā kanabaḍucunnanu atanu satpadārthamē - kṣīṇiṃcuṭalēka - ellakālamulaṃdu uṃḍuvāḍē - anagā, - ē vidhamaina dōṣamululēka dēśakālavastuvulavalla paricchinnuḍukāka vāṭivalana kalugu parimitilēni vāḍai, jñānānaṃdamulu kalisiyuṃḍu okē rūpamu ayinavāḍu. samastamaina cidacidvastuvulu, sūkṣmadaśalōnunnavainanu, sthūladaśalōnunnavainanu parabrahmayokka līlaku yōgapaḍunavē, sṛṣṭicēyuṭa modalagunavi bhagavaṃtuni līlalani bhagavaṃtuḍagu dvaipāyanuḍu parāśaruḍu ceppiyuṃḍiri - eṭlaṃṭē - avyaktamu - prakṛti - modalu viśēṣāṃtamugala vastuvulanniyu pariṇāmamulē, mārpulē. aṃducēta idaṃtayu bhagavaṃtuni krīḍayē - līlayē. anniyu bhagavaṃtuni līlakoṟaku eṭlu kalpiṃcabaḍinavō aṭlē anniyu naśiṃcavalasinavē - āṭalāḍu bālakuni naḍavaḍivalenē. idaṃtayu bhagavatuni cēṣṭa.

  1. “ā. gōpajanamulaṃdu gōpikalaṃdunu

sakalajaṃtulaṃdunu saṃcariṃcu

nā mahātmunaku barāṃganalevvaru

sarvamayuḍu līla salipegāka”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. - 99)

  1. “u. puṭṭuvulēni nīkabhava puṭṭuṭa krīḍayakāka puṭṭuṭē - - -”. (śrīmadāṃdhramahābhāgavatmu - 10 - pū,bhā. - 99)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.