← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భగవన్మహిమా bhagavanmahimā

Original — తెలుగు
  1. “భూలోకే సంసార తంత్ర వర్తన రూప ఏవ మహిమా”. (శ్రీరంగరామానుజః)

(భూలోకములో సంసారమను - పుట్టుట, చనిపోవుట, మరల పుట్టుట, మరల చనిపోవుట యను - తంత్రమును నడుపుటయే భగవంతుని మహిమ).

  1. “యస్యమే ద్యావా పృధివీ శాసనే విద్యతే - తిష్టతః, సూర్యా చంద్ర మసౌ యస్య శాసనే ఆలాత చక్రవద జస్రం భ్రమః, యస్య శాసనే సరితస్సాగరాశ్చ స్వగోచరం నాతి క్రామంతి, తథా స్థావరం జంగమం చ యస్య శాసనే నియతం, తథాచ ఋతువః, అయనే అబ్దాశ్చ యస్య శాసనం నాతి క్రామంతి, తథాకర్తారః కర్మాణి ఫలంచ యచ్ఛసనాత్ స్వం స్వం కాలం నాతి వర్తంతే, స ఏష మహిమా భువిలోకే యస్యసః||”. (శ్రీశంకరః)

(భూమి, ఆకాశము, భగవంతుని శాసనమునకు లోబడియుండుట, సూర్య చంద్రులు ఆలాత చక్రమువలె అతని శాసనము ననుసరించి తిరుగుచుండుట, నదులు, సముద్రములు అతని శాసనమునతిక్రమించి ఒడ్డులు దాటకుండుట, స్థావర జంగమములు అతని శాసనము ప్రకారము వాటి వాటికి నియమించబడిన పనులు చేయుచుండుట, ఆ ప్రకారముగానే ఋతువులు, అయనములు, సంవత్సరములు అతని శాసనమునతిక్రమించక నడచుచు, కర్మలను, ఫలములను ఆయా కాలములలో జరుగునట్లు చేయుట - ఇవన్నియు క్రమ పద్దతి ప్రకారము లోకములో జరుగు చుండుటయే శ్రీభగవంతుని మహిమ).

Transliteration
  1. “bhūlōkē saṃsāra taṃtra vartana rūpa ēva mahimā”. (śrīraṃgarāmānujaḥ)

(bhūlōkamulō saṃsāramanu - puṭṭuṭa, canipōvuṭa, marala puṭṭuṭa, marala canipōvuṭa yanu - taṃtramunu naḍupuṭayē bhagavaṃtuni mahima).

  1. “yasyamē dyāvā pṛdhivī śāsanē vidyatē - tiṣṭataḥ, sūryā caṃdra masau yasya śāsanē ālāta cakravada jasraṃ bhramaḥ, yasya śāsanē saritassāgarāśca svagōcaraṃ nāti krāmaṃti, tathā sthāvaraṃ jaṃgamaṃ ca yasya śāsanē niyataṃ, tathāca ṛtuvaḥ, ayanē abdāśca yasya śāsanaṃ nāti krāmaṃti, tathākartāraḥ karmāṇi phalaṃca yacchasanāt svaṃ svaṃ kālaṃ nāti vartaṃtē, sa ēṣa mahimā bhuvilōkē yasyasaḥ||”. (śrīśaṃkaraḥ)

(bhūmi, ākāśamu, bhagavaṃtuni śāsanamunaku lōbaḍiyuṃḍuṭa, sūrya caṃdrulu ālāta cakramuvale atani śāsanamu nanusariṃci tirugucuṃḍuṭa, nadulu, samudramulu atani śāsanamunatikramiṃci oḍḍulu dāṭakuṃḍuṭa, sthāvara jaṃgamamulu atani śāsanamu prakāramu vāṭi vāṭiki niyamiṃcabaḍina panulu cēyucuṃḍuṭa, ā prakāramugānē ṛtuvulu, ayanamulu, saṃvatsaramulu atani śāsanamunatikramiṃcaka naḍacucu, karmalanu, phalamulanu āyā kālamulalō jarugunaṭlu cēyuṭa - ivanniyu krama paddati prakāramu lōkamulō jarugu cuṃḍuṭayē śrībhagavaṃtuni mahima).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.