← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భాగవతము bhāgavatamu

Original — తెలుగు
  1. “భగవతః ఇదం భాగవతం - భగవత్సంబంధి చరిత్రం, భగవద్విషయం భాగవతం”.

(భగవంతునికి సంబంధించిన చరిత్ర, భగవంతుడు అందలి విషయముగాగలది. దానిలో చెప్పినదంతయు భగవంతునిగుఱించియే - అందుచేత భాగవతమని చెప్పబడినది).

  1. భగవంతుని గుఱించి ఉపనిషత్తులు చక్కగ వివరించినవి - వాటిలోని సారమే ఈ గ్రంధమందు పొందుపఱచబడినది. అందుచేత భాగవతమని చెప్పబడినది. అది ఎట్లంటే -

    1. నిగమార్థ ప్రతిపాదక ప్రకటమై నిర్వాణ సంధాయిగా_ భగవంతుడు రచింపభాగవత కల్పక్ష్మాజమై - - -

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 7 - 212)

  1. “తే. భూరి నిగమార్థసార విచారమగుచు, దనరు నీ భాగవతము సాదరతబలికె” - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 8 - 268)

(వేదములు, ఉపనిషత్తులు - వీటి సారమును విచారించునది, స్పష్టీకరించి ప్రకటనచేయునది కనుక భాగవతమని చెప్పబడినది).

  1. “నిగమ కల్ప తరోర్గళితం ఫలం శుకముఖాదమృత ద్రవిసం యుతం |

పి బ త భాగవతం రసమాలయం ముహూరహో రసికా భువి భావుకాః ||“. (శ్రీమద్భాగవతం - 1 - 1 - 3)

“ఆ. వేదకల్పవృక్ష నిగళితమై శుక

ముఖసుథా ద్రవమున మొనసియున్న

భాగవతపురాణ ఫల రసాస్వాదన

పదముగనుడు రసిక భావ విదులు “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 1 - 39)

(నిగమములు - వేదములు, ఉపనిషత్తులు - అను కల్ప వృక్షమునుండి కలిగిన ఫలము వంటిది భాగవతము - శుకమహర్షి ముఖమునుండి ద్రవించిన రసము కలది. ఆ ఫలము - అట్టి ఫలరసరూపమగు - ఉపనిషత్తుల సారమగు - భాగవతమును రసిక జనులారా! - బ్రహ్మజ్ఞానము అను రసమును గ్రోల కోరికగలవారా! - భాగవతమును (దాని అంతరార్థమును) మాటి మాటికి త్రాగుడు).

  1. “సీ. కార్యవర్గంబును కారణ సంఘంబు నధికరించి చలించు నాత్మతత్వ

మధ్యా త్మమనబడు; నట్టి యధ్యాత్మమ్ము దెలియజేయజాలు దీపమగుచు

సకల వేదములకు సారాంశమై యేకమై యసాధారణమగు ప్రభావ

రాజకంబైన పురాణ మర్మంబును గాఢ సంసారాంధకార పటలి

తే. దాట గోరెడివారికి దయ దలిర్ప

నే తపోనిధి వివరించె నేర్పడంగ

- - - || (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 2- 19)

  1. “వేదోపనిషదాం సారాజ్జాతా భాగవతీ కథా |”. (పద్మపురాణము - ఉత్తర ఖండము)

  2. “తొల్లి సర్వేశ్వరుండు బ్రహ్మకల్పంబున బ్రహ్మకుపదేశించిన భాగవత పురాణంబు వేదతుల్యంబు” –

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 8 - 222)

  1. “అర్థోయం బ్రహ్మసూత్రాణాం భారతార్థ వినిర్ణయః |

గాయత్రీ భాష్యరూపో(అ)సౌ వేదార్థ పరిబృంహితః |

పురాణానాం సారరూప స్సాక్షాత్ భగవతోదితః |

ద్వాదశస్కందిసం యుక్తః - - -

గ్రంధో - - -

అష్టాదశ సాహస్రః శ్రీమద్భాగవతాభిథా ||“.

(శ్రీమద్భాగవతము బ్రహ్మ సూత్రములకర్థము తెలుపునది - వ్యాఖ్యానము వంటిది - మఱియు, భారతము యొక్క అర్థమును తెలుపునది - “సత్యమేవ జయతే” అనుదానిని స్పష్టపఱచునది. గాయత్రీ మంత్రమునకు భాష్యము - వ్యాఖ్యానము వంటిది. వేదములోని అంతరార్థమును పైకి తీసి, తేట తెల్లముగ పెంచి చూపించునది. పురాణములన్నింటి సారమైనది - పురాణములన్నింటిలోను పరబ్రహ్మతత్వమే చెప్పబడినది. ఆ పురాణములన్నింటిసారము భాగవతము. ఇది సాక్షాత్తు పరమపురుషుడైన భగవంతుడు చెప్పినది - అందుచేత భగవత్తత్త్వము గుఱించి ఇది ప్రమాణ గ్రంధము. “ఈ పదునెనిమిది పురాణంబుల మధ్యంబున దేవతలయందు బద్మగర్భునిమాడ్కి, దారకలందు గళానిధి గరిమ - - - యుగంబులందు గృతయుగంబునోజ దేజరిల్లు నిట్టి భాగవత పురాణంబు పఠియించి విష్ణుసాయుజ్యంబు జెందుదురు”.)

(శ్రీ మదాంధ్రమహాభాగవతము - 12 - 48 -)

  1. ఈ గ్రంధమునకు భాగవతమని పేరెట్లు వచ్చినదనగా : -

    1. “భగవతః ఇదం భాగవతం - భగవత్సంబంధి చరిత్రం భగవద్విషయం భాగవతం” (చూడుము - 1).

    2. “భగవతా ప్రోక్తం భాగవతం”

(భగవంతుని చేత చెప్పబడినదికనుక భాగవతమని పేరు పొందినది).

  1. “మ. నిగమార్థ ప్రతిపాదక స్రకటమై నిర్వాణ సంధాయిగా

భగవంతుండు రచింప భాగవత కల్పక్ష్మాజమై శాస్త్ర రా

జి గరిష్టంబగు నీ పూరాణ కథ - - - “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 7 - 212)

  1. “భగవత్ప్రోక్తం తన్నామైవ ప్రథానం పురాణం”

(భగావంతునిచేత చెప్పబడినది - భగవంతుడను నామమే - భగవంతుని నామమే ప్రథాన విషయముగా గలది కనుక భాగవతము -“.

“భగవతా పుత్రాయ బ్రహ్మణే ప్రోక్తం, అత ఏవ సః భగవతం నామ - న కేవలం గ్రంధః, అపి తు గ్రంధ ప్రతిపాదో భగవదవతార కథా ప్రసంగః - స చ కల్పే కల్పే భగవదవతారాణాం విద్యమానత్వాత్ తచ్చరితస్యాపి ప్రవాహతః నిత్యత్వాత్, తత్కథా ప్రసంగోపి అనాదిరేవ. అత ఏవ బ్రహ్మణః వేదోపదేశ సమయే వేదవత్పురాణేతిహాసాది కమపి ఉపదిష్టం ఇత్యుచ్యతే. గ్రంధప్రణయనంతస్య కథా ప్రసంగస్య ప్రళయాది వశాత్ ఉజద్రేవే జాతే వేదవదేవ భగవదుపదేశపూర్వకం పునః ప్రవర్తనాయ. ఇయాన్ పరం వేద పురాణాదీనాంతు భేదః - వేదస్య పదవాక్యాను వాక్యాన్యనుక్రమః పూర్వ పూర్వ భిన్నః అతః పురాణానాం పురాణత్వ మితి జ్ఞేయం”.

(భగవంతునిచే తన పుత్రుడైన చతుర్ముఖ బ్రహ్మకు చెప్పబడినది కనుక భాగవతమని పేరు కలిగినది. భాగవతమనగా కేవలము గ్రంధము పేరు కాదు, గ్రంధములో చెప్పబడిన భగవంతునియొక్క అవతార ప్రసంగము భాగవతము. ప్రతి కల్పమందు భగవంతుని అవతారములు కలుగుచున్నందువలన ఆ అవతారముల చరిత్ర కూడ ప్రవాహరూపములో నిత్యమగుటవలన భగవంతుని కథా ప్రసంగములు అనాది - అనాది కాలమునుండి వచ్చుచున్నవి. అందుచేతనే చతుర్ముఖబ్రహ్మకు భగవంతుడు వేదములనుపదేశించినపుడే వేదమువలె పురాణములను ఇతిహాసములను కూడ నుపదేశించెను - అని చెప్పబడినది. ప్రళయము మొదలగు ఉపద్రవముల కారణముగా వేదమువలె ఇతిహాసపురాణములు కూడ ఉపదేశింపబడినవనే చెప్పబడినవి. అందుచేతనే పురాణములు పురాతనమైనవి.

  1. “భగవత్యాః ఇదం భాగవతం”.

(భగవతి అయిన దేవీకి సంబంధించినది - దేవి గుఱించి చెప్పునది కనుక భాగవతమని చెప్పబడినది).

  1. “భగవత్యాశ్చ దుర్గాయాః చరిత్రం యత్రవిద్యతే |

తత్తు భాగవతం ప్రోక్తం నతు దేవీపురాణకం ||“.

అనేన చ వాక్యేన భగవత్యాః ఇదం భాగవతం ఇతి వ్యుత్పత్యా గ్రంధ ప్రతిపాద్యముఖ్య దేవతా చరిత సంబంధః ప్రవృత్తి నివృత్తిమితి స్పష్టమేవ దర్శితం“.

(భగవతి అయిన దుర్గాదేవియొక్క చరిత్ర ఎందులో చెప్పబడినదో అది భాగవతము - దేవీ పురాణముకాదు. ఇట్లు చెప్పబడియుండుటవలనను భగవతి అయిన దేవికి సంబంధించినది అని ఉత్పత్యర్థము చెప్పబడియుండుటవలనను గ్రంధములో చెప్పబడిన ముఖ్య దేవత (ఎవరో వారి) యొక్క చరిత్రకు సంబంధించియుండు ప్రవృత్తి నిమిత్తమైనది భాగవతమని యర్థము - గ్రంధముకాదు - స్పష్టము చేయబడినది.)

  1. “గుణత్రయోపాధి హరిహరాద్యా పేక్షయాపి గుణత్రయ సామ్యావస్థోపాధి సహితాయాః భగవత్యాః ఉత్కృష్టత్వాత్ తస్యాః ఏవ పురాణం భాగవతం, వేదనాన్యమత్కృష్ట పక్షపాతిత్వాత్ సర్వేషాం”.

(సత్వరజస్తమోగుణములు అను మూడు గుణములు ఉపాధిగాగల బ్రహ్మ విష్ణు మహేశ్వరులకంటె గుణత్రయ సామ్యావస్థ ఉపాధిగాగల భగవతియగు దేవి ఉత్కృష్టమైనదగుటవలన ఆ దేవియొక్క పురాణమే భాగవతము; దానికన్న ఉత్కృష్టమైన గ్రంధములేదని అందఱికి తెలిసినందున అదియే - దేవీ భాగవతమే - భాగవతమని చెప్పబడినది).

  1. “యత్రాధికృత్య గాయత్రీం వర్ణ్యతే ధర్మ విస్తరః |

వృత్రాసురవధోపేతం తద్భాగవతమిష్యతే ||

వేదే త్రిపాద గాయత్రి ఇతి గాయత్రీ లక్షణం శ్రూయతే తేనచ త్రిపాచ్ఛందోధికృత్య యత్ర ధర్మ విస్తరో వర్ణ్యతే తద్భాగవతమితి తదర్థః -

(గాయత్రిని అధికరించి ధర్మము - ఎందులో విస్తరించి చెప్పబడినదో, ఎందులో వృత్రాసురవధ చెప్పబడినదో అది భాగవతమని చెప్పబడుచున్నది. వేదమందు త్రిపాదగాయత్రి (గాయత్రి మూడు పాదములు గలది) అని గాయత్రీ లక్షణము చెప్ప బడినది. దాని వలన త్రిపాద గాయత్రిని అధికరించి యెందు ధర్మ విస్తరము చేయబడినదో అది భాగవతమని చెప్పబడినది).

  1. “హయగ్రీవ బ్రహ్మవిద్యా యత్ర, వృత్ర నధస్తథా - గాయత్ర్యాచ సమారంభః తద్వై భాగవతం విదుః ||”.

హయగ్రీవనామ అసురో దేవీ భాగవతే ప్రథమస్కందే ప్రసిద్ధః |

తేన ఉపాసితా బ్రహ్మ ప్రతిపాదికా విద్యా స్త్రీ దైవత్యో మంత్రః. సా విద్యా యత్ర వర్తతే తద్భాగవత మిత్యర్థః

(హయగ్రీవ బ్రహ్మ విద్య, వృత్రాసురవధ గాయత్రితో ఆరంభించి యెచ్చట చెప్పబడినదో అదియే భాగవతమని చెప్పబడినది. దేవీ భాగవతములో హయగ్రీవుడను రాక్షసుని గుఱించి ప్రథమ స్కందములో చెప్పబడినది. ఆ హయగ్రీవుడు ఉపాసించిన బ్రహ్మ విద్య, స్త్రీ దైవము, దేవియొక్క మంత్రము - ఇవి ఎందులో వర్ణింపబడినవో అది భాగవతమని యర్థము).

  1. “సత్యం పరంధీమహి” యను గాయత్రీ ప్రారంభమున గాయత్రీనామ బ్రహ్మ స్వరూపంబై మత్స్యపురాణంబులోన గాయత్రి నధికరించి ధర్మ విస్తరంబును వృత్రాసుర వధంబును నెందు చెప్పంబడు నదియ భాగవతంబని పలుకుటంజేసి యీ పురాణంబు శ్రీమహాభాగవతంబు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 1- 35)
  1. “భాగవతం ద్వివిధం భవతి - ఏకం వైష్ణవం శ్రీమద్భాగవతం, అపరం దేవీ భాగవతం; పరంతు ఏకం తయోః పురాణం. ఏ తదుభయమపి వ్యాసకృతమేవ తస్మాత్ ఉభయమపి ప్రమాణం ఏవ”.

(భాగవతము రెండు విధములుగా నున్నది - ఒకటి విష్ణువునకు ప్రాముఖ్యమిచ్చి విష్ణువు గుఱించి చెప్పునది - శ్రీమద్భాగవతం. రెండవది దేవీ భాగవతము - కాని వాటిలో చెప్పబడిన పురాణగాధ ఒకటే - పరబ్రహ్మ గుఱించియే. ఈ రెండును వ్యాసమహర్షి వ్రాసినవే అందుచేత రెండు పురాణములు ప్రమాణ గ్రంధములే).

  1. ఈ భాగవతరచనా విషయము గుఱించి యీ క్రింద విధముగా చెప్పబడినది : -

    1. “సీ. అవనీశ నీవు నన్నడిగిన పగిది నాతడు దండ్రినడుగ బితామహుండు

భగవంతుడాశ్రితపారిజాతము, హరి, కృపతోడ దనకెఱిగించినట్టి

లోక మంగళద సుశ్లోక రూపంబున దశలక్షణంబులదనరు భాగ

వతము నారదున కున్నతి జెప్పె; నాతడు చారు సరస్వతీ తీరమునను

తే. హరి పదధ్యాన పారీణుడాత్మవేది

ప్రకట తేజస్వియగు బాదరాయణునకు

గోరి యెఱిగించె, నమ్మహోదరుడెలమి

నాకు నెఱిగించె - - - “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 9 - 258)

  1. “ఆ దేవుడున్ –

“తే. భూరి నిగమార్థసార విచారమగుచు

దనరు నీ భాగవతము సాదరిత బలికె

నలిన భవ సూతియైన సనత్కుమార

కునకు నెఱిగించె సాంఖ్యాయనునకు నతడు,

“క. పరగ నతడంత బరా

శరునకు నుపదేశమిచ్చె; సన్మతి నతడున్

సురగురునకొసగె; నాతడు

గరమరుదుగ నాకు చెప్పె; గైకొని యేనున్

క. నీకిప్పుడు వివరించెద నాకర్ణింపుము - - -

వ. ఇట్లు భగవత్పోక్తంబును, ఋషి సంప్రదాయానుగతంబును, బురుషోత్తమ స్తోత్రంబును, బరమ పవిత్రంబును, భవ లతాలవిత్రంబును నయిన భాగవత కథాప్రపంచంబు శ్రద్ధాళుండవు, భక్తుండవునగు నీకు నుపన్యసించెద”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 8 - 268 to 271)

  1. “మ. అవిరోధంబున నెవు నన్నిడుగు నీయర్థంబు మున్ బ్రహ్మ మా

ధవు చేతన్ విని నారదుండడిగినం దధ్యంబుగా జెప్పె; మా

నవ లోకేశ్వర, నారదుండు వెనుకన్ నాకుం బ్రసాదించె; సం

శవ్రణీయంబు, మహాద్బుతంబు, వినుమా, సందేహ విచ్ఛేదివై“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 4 - 71)

  1. “సీ. ద్వైపాయనుడు నాదు తండ్రి ద్వాపర వేళ బ్రహ్మ సమ్మితమైన భాగవతము

బఠనంబు సేయించె, బ్రహ్మ తత్పరుడనై యుత్తమశ్లోక లీలోత్సవమున

నాకృష్ట చిత్తుడనై పఠించితి - - - “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 1 - 7)

  1. “సీ. పుణ్యకీర్తనుడైన భువనేశు చరితంబు బ్రహ్మతుల్యంబైన భాగవతము

సకల పురాణరాజము దొల్లి లోకభద్రముగ, ధన్యముగ, మోదముగ, బ్రీతి

భగవంతుడగు వ్యాస భట్టారకుడొనర్చి శుకుడనియెడు తన సుతునిచేత

జదివించె - - - “. (శ్రీమందాంధ్రమహాభాగవతము - 1 - 3 - 36)

  1. ఆ. బాదరాయణుండు భగవంతుడనఘుండు

పరమగుహ్యమైన భాగవతము

నందనుండనైన నాకు జెప్పెను; శిష్య

జనుల మొఱగి యేను జదువుకొంటి. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 9 - 21 - 670)

  1. “అమ్మహాపురాణంబు చతుర్దశసహస్ర శ్లోకరూపంబును, దశలక్షణ సమంచితంబునునై సంకుచితమార్గంబున నొప్పు. అందు దశలక్షణంబులెవ్వి యనిన సర్గంబును, విసర్గంబును, స్థానంబును, బోషణంబును, సుతులును, మన్వంతర్మబులును, నీశానుచరితంబులును, నిరోధంబును, ముక్తియు, నాశ్రయంబును నన బది తెఱంగులయ్యె దశమాశ్రయ విశుద్ధ్యర్థంబు దక్కిన తొమ్మిది లక్షణంబులు సెప్పంబడె”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 10 - 259)

(భగవంతుడు అన్నింటికి ఆశ్రయుడు - అందుచేత పైన చెప్పిన పది లక్షణములలోను తొమ్మిది లక్షణము పదియవ లక్షణమైన ఆశ్రయమును గుఱించి - భగవంతుని గుఱించియే చెప్పబడినవి. ఈ పది లక్షణములు భగవంతునికి సంబంధించినవేకనుక ఈ గ్రంధము భాగవతమని చెప్పబడినది).

  1. భాగవతముయొక్క ఉత్కృష్టత యీ క్రింద చెప్పబడినది : -

    1. తే. “బరగనాధ్యాత్మికాది తాపత్రయంబు

నడచి పరమార్థభూతమై యధిక సుఖద

మై సమస్తంబుగాకయు నయ్యునుండు

వస్తువెఱుగంగదగు భాగవతమునందు “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 1 - 36)

  1. “తే. అల్పతరమైన సుఖములనందుచున్న

జనుల దుఃఖంబు మాన్పంగ జాలునట్టి

పుండరీకాక్షు గుణకథాప్రోతమైన

వితత నిగమార్థమగు భాగవతము నీకు.”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 8 - 263)

  1. “అనర్థోపశమం సాక్షాత్ భక్తియోగమధోక్షజే |

లోకస్యా జానతో విద్వాన్ చక్రే సాత్వత సంహితాం ||“. (శ్రీమద్భాగవతం - 1 - 7 - 6)

(అనర్థములను పోగొట్టునది, తెలియని లోకులకు - అజ్ఞానులకు విష్ణువునందు భక్తియోగము కలుగచేయునది సాత్వత సంహితయగు భాగవతమును శ్రీవ్యాసమహర్షి రచించెను).

  1. “ఉ. ఎయ్యది కర్మబంధములనెల్ల హరించు, విభూతికారణ

బెయ్యది, సన్మునీంద్రులకు నెల్లగవిత్వ సమాశ్రయంబు ము

న్నెయ్యది; సర్వమంత్రముల నేలిన దెయ్యది, మోక్షలక్ష్మిరూ

పెయ్యది, దాని బల్కెద హృద్యము భాగవతాఖ్య మంత్రమున్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 14 -)

  1. “పుష్కరంబందు ద్వారకాపురమునందు

మధురయుండును, రవిదినమందు నెవడు

పఠనసేయును రమణతో భాగవతము

వాడు దరియించు సంసారవార్థినపుడ “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 12 - 46)

  1. “శ్రీమన్నఖిలోపనిషత్ప్రపతిపాద్య పరమాద్వైత సిద్ధాంత ప్రతిపాదనత్వాత్ - - భగవాద్గుణ వర్ణనైక ప్రథానతయా ప్రణీతత్వాత్, మత్స్యగారుడాధ్యనేక సద్గ్రంధేషు అత్యుత్కృష్టతయా ప్రతిపాదితత్వాత్, మోక్షశాస్త్రమిదం ఇతి నిశ్చయ బుద్ధ్యా తేనైవ మహర్షిణా (శుకమహర్షిణా) ముముక్షవే పరీక్షితో బోధితత్వాత్, ఇత్యాద్యనేక హేతుభిః శ్రీమద్భాగవతస్య అస్య సర్వ పురాణోత్కృష్టత్వం నిఖిలోపనిషత్తుల్యంచ స్పష్టతరమేవ” -

(ఉపనిషత్తులన్నింటిలోను చెప్పబడిన పరమ అద్వైత సిద్ధాంతము ఈ భాగవత గ్రంధములో ప్రతిపాదించియుండడమువల్ల భగవంతుని యొక్క గుణవర్ణనమే ప్రథానముగా తలచి వ్రాయబడియుండడము వలనను, మత్స్యపురాణము మొదలగు అనేక సద్గ్రంధములలో అత్యుత్కృష్టమైన గ్రంధమని ప్రతిపాదించుటవలనను, ఇదే మోక్ష శాస్త్రము - మోక్షమునిచ్చే శాస్త్రము - అని నిశ్చయించుకొనిన బుద్ధితో శుకమహర్షిచేత మోక్షార్థి (మోక్షము కోరువాడు) అయిన పరీక్షిత్తునకు బోధించబడి యున్నందువలనను, ఈ మొదలగు అనేక కారణములవలనను, ఈ భాగవతము అన్ని పురాణములకన్న ఉత్కృష్టమైనదనిన్నీ, అన్ని ఉపనిషత్తులతోను సమానమైనదనిన్నీ బాగుగా స్పష్టమైన విషయము).

  1. భగవంతుడు - పరబ్రహ్మ, నిరాకారుడు - అతని తత్వమును తెలుసుకొనుట చాలకష్టము - తెలుసుకొనినను ఇతరులకు చెప్పుట చాలకష్టము - శ్రీపోతనామాత్యులుగారికి శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమై వ్యాసమహర్షి సంస్కృతములో వ్రాసిన శ్రీమద్భాగవతమును ఆంధ్రములో వ్రాసి తనకు కృతియిచ్చిన ముక్తినిచ్చెదనని చెప్పెను - ఇట్లు భగవత్కృపవలన, భగవంతుని ఆదేశమువలనను అతను వ్రాసిన గ్రంధము శ్రీమదాంధ్రమహాభాగవతము - భగవంతుని ప్రోత్సాహము వలనను, అతని సహాయమువలనను వ్రాసినదగుటచేత నీగ్రంధము అతి మధురమైన పదములతో, చక్కని పద్యములతో - చిన్నపిల్లలుకూడ సునాయాసముగా కంఠస్థముగా చేయగలుగు పద్యములతో - భక్తి రసముతో నిండియున్నది. - “పలికించెడివాడు రామభద్రుండట” అని పోతనామాత్యులే స్పష్టముచేసిరి. శ్రీరామచంద్రుని కటాక్షమువలననే ఈ గ్రంధమింత మాధుర్యముగా నున్నది. అట్లుగానిచో బోధపడని ఆధ్యాత్మతత్వము ఇంటింట ప్రతివానినోటంట పద్యరూపముగా యిప్పటివరకు వెలువడుచున్నది –

“ఆ. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు

శూలికైన పద్మచూలికైన

విబుధ జనులవలన విన్నంత గన్నంత

దెలియవచ్చినంత దేట పఱతు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 1 - 19)

“ఆ. భాగవతము తేట పఱుప నెవ్వడుసాలు?

శుకుడు దక్క నరుని సకుడు దక్క

బుద్ధిదోచినంత బుధులచే విన్నంత

భక్తి నిగిడినంత పలుకువాడ ||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 1 -)

  1. శ్రీమదాంధ్రమహాభాగవతము శ్రీమహావిష్ణువే పరబ్రహ్మము (పరతత్వము) అని విష్ణు ప్రాశస్త్యము నుద్ఘోషించు అత్యుత్తమమైన ఆధ్యాత్మిక గ్రంధము. ఈ విషయము ఈ క్రింద వచనముల వలన నిర్థారణ చేయబడినది : -
  1. “భగవన్నామైక ప్రథానం పురాణం” (భగవంతుని నామమొక్కటే ప్రథానముగాగల పురాణము –

“జగత్ప్రభుం దేవ దేవమనంతం పురుషోత్తమం |

స్తువన్నామ సహశ్రేణ పురుషః స తలోత్థితః ||“.

(జగత్తు అంతటికి ప్రభువైనటువంటిన్నీ, దేవదేవుడైనటువంటిన్నీ, అనంతుడైనటు వంటిన్నీ, పురుషోత్తముడైనటువంటిన్నీ శ్రీమహావిష్ణువుని వేలకొలదియున్న అతని నామములతో స్తోత్రముచేసిన పురుషుడు మోక్షమును పొందును)

  1. “న దైవవం కేశవాత్పరం” (శ్రీ మహావిష్ణువుకంటె ఉత్కృష్టమైన దేవుడు లేడు)

  2. “ఏకో దేవః నారాయణః” (నారాయణుడొక్కడే దేవుడు - దేవుడైనవాడొక్కడే - అతనే నారాయణుడు).

  3. “మోక్షమిచ్చుటంజేసి నారాయణుండు సేవ్యుండు” (శ్రీమదాంధ్రమహాభాగవతము -)

  4. “వేద యోగ యోగ క్రియా జ్ఞాన తపోగతి ధర్మంబులు వాసుదేవ పరంబులు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము -)

  5. క. “హరిమయము విశ్వమంతయు

హరి విశ్వమయుండు సంశయము పనిలేదు; ఆ

హరిమయముగాని ద్రవ్యము

పరమాణువు లేదు, వంశపావన వింటే“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 -)

(7). “వైష్ణవంబైన పరమపదంబు సర్వోత్తమంబు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 -)

(8). విశ్వమయతలేమి వినియు నూరకయుండిరి

అంబుజాసనాదులడ్డుపడక

విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు

భక్తియుతునకడ్డుపడదలంచె“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 -)

(9). “ఆ. ఈశుడుడనంతుడు హరి

నాయకుడీ భువనమునకు నాకున్ నీకున్

మాయకు ప్రాణివ్రాతము

కే యడలన్ లేద యీశ్వరేతరము, సుతా“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 -)

(10). క. “హరి భగవంతునంతుడు

కరుణాంబుధి సృష్టికార్య

కారణ హేతుస్ఫురణుండవ్విభుకంటెన్

పరుడెవ్వడులేడు, తండ్రి, పరికింపగన్” (శ్రీమదాంధ్రమహాభాగవతము -)

  1. శ్రీమదాంధ్రమహాభాగవతము భక్తిరస ప్రథానమైనది. భక్తివలన మోక్షము సులభమని వక్కాణింపబడినది -

(1). “సంసార ప్రవిష్టుండైనవానికి తపో యోగాదులైన మోక్షమార్గంబులు పెక్కు గలవు. అందు భక్తి మార్గంబుకంటె సులభంబులేదు”.

(2). “హరినామ సంస్మరణము ఒక్క ముహూర్తమాత్రముచాలు ముక్తిదమే, నృపా”.

(3). “క. గోవిందనామకీర్తన

గావించి భయంబు దక్కి ఖట్వాంగ ధరి

త్రీ విభుడు సూరగొనియెను

కైవల్యము దొల్లి రెండు గడియలలోనన్“.

  1. ఈ గ్రంధములో భగవన్నామములెన్నో ఎన్ని పర్యాయములో వాడబడినవి. మొదటినుండి చివరవఱకు గ్రంధము చదివినయడల ఎన్ని పర్యాయములో భగవంతుని నామములు అప్రయత్నముగా స్మరించడమగును.
Transliteration
  1. “bhagavataḥ idaṃ bhāgavataṃ - bhagavatsaṃbaṃdhi caritraṃ, bhagavadviṣayaṃ bhāgavataṃ”.

(bhagavaṃtuniki saṃbaṃdhiṃcina caritra, bhagavaṃtuḍu aṃdali viṣayamugāgaladi. dānilō ceppinadaṃtayu bhagavaṃtuniguṟiṃciyē - aṃducēta bhāgavatamani ceppabaḍinadi).

  1. bhagavaṃtuni guṟiṃci upaniṣattulu cakkaga vivariṃcinavi - vāṭilōni sāramē ī graṃdhamaṃdu poṃdupaṟacabaḍinadi. aṃducēta bhāgavatamani ceppabaḍinadi. adi eṭlaṃṭē -

    1. nigamārtha pratipādaka prakaṭamai nirvāṇa saṃdhāyigā_ bhagavaṃtuḍu raciṃpabhāgavata kalpakṣmājamai - - -

(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 7 - 212)

  1. “tē. bhūri nigamārthasāra vicāramagucu, danaru nī bhāgavatamu sādaratabalike” - (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 8 - 268)

(vēdamulu, upaniṣattulu - vīṭi sāramunu vicāriṃcunadi, spaṣṭīkariṃci prakaṭanacēyunadi kanuka bhāgavatamani ceppabaḍinadi).

  1. “nigama kalpa tarōrgaḷitaṃ phalaṃ śukamukhādamṛta dravisaṃ yutaṃ |

pi ba ta bhāgavataṃ rasamālayaṃ muhūrahō rasikā bhuvi bhāvukāḥ ||“. (śrīmadbhāgavataṃ - 1 - 1 - 3)

“ā. vēdakalpavṛkṣa nigaḷitamai śuka

mukhasuthā dravamuna monasiyunna

bhāgavatapurāṇa phala rasāsvādana

padamuganuḍu rasika bhāva vidulu “. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 1 - 39)

(nigamamulu - vēdamulu, upaniṣattulu - anu kalpa vṛkṣamunuṃḍi kaligina phalamu vaṃṭidi bhāgavatamu - śukamaharṣi mukhamunuṃḍi draviṃcina rasamu kaladi. ā phalamu - aṭṭi phalarasarūpamagu - upaniṣattula sāramagu - bhāgavatamunu rasika janulārā! - brahmajñānamu anu rasamunu grōla kōrikagalavārā! - bhāgavatamunu (dāni aṃtarārthamunu) māṭi māṭiki trāguḍu).

  1. “sī. kāryavargaṃbunu kāraṇa saṃghaṃbu nadhikariṃci caliṃcu nātmatatva

madhyā tmamanabaḍu; naṭṭi yadhyātmammu deliyajēyajālu dīpamagucu

sakala vēdamulaku sārāṃśamai yēkamai yasādhāraṇamagu prabhāva

rājakaṃbaina purāṇa marmaṃbunu gāḍha saṃsārāṃdhakāra paṭali

tē. dāṭa gōreḍivāriki daya dalirpa

nē tapōnidhi vivariṃce nērpaḍaṃga

- - - || (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 2- 19)

  1. “vēdōpaniṣadāṃ sārājjātā bhāgavatī kathā |”. (padmapurāṇamu - uttara khaṃḍamu)

  2. “tolli sarvēśvaruṃḍu brahmakalpaṃbuna brahmakupadēśiṃcina bhāgavata purāṇaṃbu vēdatulyaṃbu” –

(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 8 - 222)

  1. “arthōyaṃ brahmasūtrāṇāṃ bhāratārtha vinirṇayaḥ |

gāyatrī bhāṣyarūpō(a)sau vēdārtha paribṛṃhitaḥ |

purāṇānāṃ sārarūpa ssākṣāt bhagavatōditaḥ |

dvādaśaskaṃdisaṃ yuktaḥ - - -

graṃdhō - - -

aṣṭādaśa sāhasraḥ śrīmadbhāgavatābhithā ||“.

(śrīmadbhāgavatamu brahma sūtramulakarthamu telupunadi - vyākhyānamu vaṃṭidi - maṟiyu, bhāratamu yokka arthamunu telupunadi - “satyamēva jayatē” anudānini spaṣṭapaṟacunadi. gāyatrī maṃtramunaku bhāṣyamu - vyākhyānamu vaṃṭidi. vēdamulōni aṃtarārthamunu paiki tīsi, tēṭa tellamuga peṃci cūpiṃcunadi. purāṇamulanniṃṭi sāramainadi - purāṇamulanniṃṭilōnu parabrahmatatvamē ceppabaḍinadi. ā purāṇamulanniṃṭisāramu bhāgavatamu. idi sākṣāttu paramapuruṣuḍaina bhagavaṃtuḍu ceppinadi - aṃducēta bhagavattattvamu guṟiṃci idi pramāṇa graṃdhamu. “ī padunenimidi purāṇaṃbula madhyaṃbuna dēvatalayaṃdu badmagarbhunimāḍki, dārakalaṃdu gaḷānidhi garima - - - yugaṃbulaṃdu gṛtayugaṃbunōja dējarillu niṭṭi bhāgavata purāṇaṃbu paṭhiyiṃci viṣṇusāyujyaṃbu jeṃduduru”.)

(śrī madāṃdhramahābhāgavatamu - 12 - 48 -)

  1. ī graṃdhamunaku bhāgavatamani pēreṭlu vaccinadanagā : -

    1. “bhagavataḥ idaṃ bhāgavataṃ - bhagavatsaṃbaṃdhi caritraṃ bhagavadviṣayaṃ bhāgavataṃ” (cūḍumu - 1).

    2. “bhagavatā prōktaṃ bhāgavataṃ”

(bhagavaṃtuni cēta ceppabaḍinadikanuka bhāgavatamani pēru poṃdinadi).

  1. “ma. nigamārtha pratipādaka srakaṭamai nirvāṇa saṃdhāyigā

bhagavaṃtuṃḍu raciṃpa bhāgavata kalpakṣmājamai śāstra rā

ji gariṣṭaṃbagu nī pūrāṇa katha - - - “. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 7 - 212)

  1. “bhagavatprōktaṃ tannāmaiva prathānaṃ purāṇaṃ”

(bhagāvaṃtunicēta ceppabaḍinadi - bhagavaṃtuḍanu nāmamē - bhagavaṃtuni nāmamē prathāna viṣayamugā galadi kanuka bhāgavatamu -“.

“bhagavatā putrāya brahmaṇē prōktaṃ, ata ēva saḥ bhagavataṃ nāma - na kēvalaṃ graṃdhaḥ, api tu graṃdha pratipādō bhagavadavatāra kathā prasaṃgaḥ - sa ca kalpē kalpē bhagavadavatārāṇāṃ vidyamānatvāt taccaritasyāpi pravāhataḥ nityatvāt, tatkathā prasaṃgōpi anādirēva. ata ēva brahmaṇaḥ vēdōpadēśa samayē vēdavatpurāṇētihāsādi kamapi upadiṣṭaṃ ityucyatē. graṃdhapraṇayanaṃtasya kathā prasaṃgasya praḷayādi vaśāt ujadrēvē jātē vēdavadēva bhagavadupadēśapūrvakaṃ punaḥ pravartanāya. iyān paraṃ vēda purāṇādīnāṃtu bhēdaḥ - vēdasya padavākyānu vākyānyanukramaḥ pūrva pūrva bhinnaḥ ataḥ purāṇānāṃ purāṇatva miti jñēyaṃ”.

(bhagavaṃtunicē tana putruḍaina caturmukha brahmaku ceppabaḍinadi kanuka bhāgavatamani pēru kaliginadi. bhāgavatamanagā kēvalamu graṃdhamu pēru kādu, graṃdhamulō ceppabaḍina bhagavaṃtuniyokka avatāra prasaṃgamu bhāgavatamu. prati kalpamaṃdu bhagavaṃtuni avatāramulu kalugucunnaṃduvalana ā avatāramula caritra kūḍa pravāharūpamulō nityamaguṭavalana bhagavaṃtuni kathā prasaṃgamulu anādi - anādi kālamunuṃḍi vaccucunnavi. aṃducētanē caturmukhabrahmaku bhagavaṃtuḍu vēdamulanupadēśiṃcinapuḍē vēdamuvale purāṇamulanu itihāsamulanu kūḍa nupadēśiṃcenu - ani ceppabaḍinadi. praḷayamu modalagu upadravamula kāraṇamugā vēdamuvale itihāsapurāṇamulu kūḍa upadēśiṃpabaḍinavanē ceppabaḍinavi. aṃducētanē purāṇamulu purātanamainavi.

  1. “bhagavatyāḥ idaṃ bhāgavataṃ”.

(bhagavati ayina dēvīki saṃbaṃdhiṃcinadi - dēvi guṟiṃci ceppunadi kanuka bhāgavatamani ceppabaḍinadi).

  1. “bhagavatyāśca durgāyāḥ caritraṃ yatravidyatē |

tattu bhāgavataṃ prōktaṃ natu dēvīpurāṇakaṃ ||“.

anēna ca vākyēna bhagavatyāḥ idaṃ bhāgavataṃ iti vyutpatyā graṃdha pratipādyamukhya dēvatā carita saṃbaṃdhaḥ pravṛtti nivṛttimiti spaṣṭamēva darśitaṃ”.

(bhagavati ayina durgādēviyokka caritra eṃdulō ceppabaḍinadō adi bhāgavatamu - dēvī purāṇamukādu. iṭlu ceppabaḍiyuṃḍuṭavalananu bhagavati ayina dēviki saṃbaṃdhiṃcinadi ani utpatyarthamu ceppabaḍiyuṃḍuṭavalananu graṃdhamulō ceppabaḍina mukhya dēvata (evarō vāri) yokka caritraku saṃbaṃdhiṃciyuṃḍu pravṛtti nimittamainadi bhāgavatamani yarthamu - graṃdhamukādu - spaṣṭamu cēyabaḍinadi.)

  1. “guṇatrayōpādhi hariharādyā pēkṣayāpi guṇatraya sāmyāvasthōpādhi sahitāyāḥ bhagavatyāḥ utkṛṣṭatvāt tasyāḥ ēva purāṇaṃ bhāgavataṃ, vēdanānyamatkṛṣṭa pakṣapātitvāt sarvēṣāṃ”.

(satvarajastamōguṇamulu anu mūḍu guṇamulu upādhigāgala brahma viṣṇu mahēśvarulakaṃṭe guṇatraya sāmyāvastha upādhigāgala bhagavatiyagu dēvi utkṛṣṭamainadaguṭavalana ā dēviyokka purāṇamē bhāgavatamu; dānikanna utkṛṣṭamaina graṃdhamulēdani aṃdaṟiki telisinaṃduna adiyē - dēvī bhāgavatamē - bhāgavatamani ceppabaḍinadi).

  1. “yatrādhikṛtya gāyatrīṃ varṇyatē dharma vistaraḥ |

vṛtrāsuravadhōpētaṃ tadbhāgavatamiṣyatē ||

vēdē tripāda gāyatri iti gāyatrī lakṣaṇaṃ śrūyatē tēnaca tripācchaṃdōdhikṛtya yatra dharma vistarō varṇyatē tadbhāgavatamiti tadarthaḥ -

(gāyatrini adhikariṃci dharmamu - eṃdulō vistariṃci ceppabaḍinadō, eṃdulō vṛtrāsuravadha ceppabaḍinadō adi bhāgavatamani ceppabaḍucunnadi. vēdamaṃdu tripādagāyatri (gāyatri mūḍu pādamulu galadi) ani gāyatrī lakṣaṇamu ceppa baḍinadi. dāni valana tripāda gāyatrini adhikariṃci yeṃdu dharma vistaramu cēyabaḍinadō adi bhāgavatamani ceppabaḍinadi).

  1. “hayagrīva brahmavidyā yatra, vṛtra nadhastathā - gāyatryāca samāraṃbhaḥ tadvai bhāgavataṃ viduḥ ||”.

hayagrīvanāma asurō dēvī bhāgavatē prathamaskaṃdē prasiddhaḥ |

tēna upāsitā brahma pratipādikā vidyā strī daivatyō maṃtraḥ. sā vidyā yatra vartatē tadbhāgavata mityarthaḥ

(hayagrīva brahma vidya, vṛtrāsuravadha gāyatritō āraṃbhiṃci yeccaṭa ceppabaḍinadō adiyē bhāgavatamani ceppabaḍinadi. dēvī bhāgavatamulō hayagrīvuḍanu rākṣasuni guṟiṃci prathama skaṃdamulō ceppabaḍinadi. ā hayagrīvuḍu upāsiṃcina brahma vidya, strī daivamu, dēviyokka maṃtramu - ivi eṃdulō varṇiṃpabaḍinavō adi bhāgavatamani yarthamu).

  1. “satyaṃ paraṃdhīmahi” yanu gāyatrī prāraṃbhamuna gāyatrīnāma brahma svarūpaṃbai matsyapurāṇaṃbulōna gāyatri nadhikariṃci dharma vistaraṃbunu vṛtrāsura vadhaṃbunu neṃdu ceppaṃbaḍu nadiya bhāgavataṃbani palukuṭaṃjēsi yī purāṇaṃbu śrīmahābhāgavataṃbu” (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 1- 35)
  1. “bhāgavataṃ dvividhaṃ bhavati - ēkaṃ vaiṣṇavaṃ śrīmadbhāgavataṃ, aparaṃ dēvī bhāgavataṃ; paraṃtu ēkaṃ tayōḥ purāṇaṃ. ē tadubhayamapi vyāsakṛtamēva tasmāt ubhayamapi pramāṇaṃ ēva”.

(bhāgavatamu reṃḍu vidhamulugā nunnadi - okaṭi viṣṇuvunaku prāmukhyamicci viṣṇuvu guṟiṃci ceppunadi - śrīmadbhāgavataṃ. reṃḍavadi dēvī bhāgavatamu - kāni vāṭilō ceppabaḍina purāṇagādha okaṭē - parabrahma guṟiṃciyē. ī reṃḍunu vyāsamaharṣi vrāsinavē aṃducēta reṃḍu purāṇamulu pramāṇa graṃdhamulē).

  1. ī bhāgavataracanā viṣayamu guṟiṃci yī kriṃda vidhamugā ceppabaḍinadi : -

    1. “sī. avanīśa nīvu nannaḍigina pagidi nātaḍu daṃḍrinaḍuga bitāmahuṃḍu

bhagavaṃtuḍāśritapārijātamu, hari, kṛpatōḍa danakeṟigiṃcinaṭṭi

lōka maṃgaḷada suślōka rūpaṃbuna daśalakṣaṇaṃbuladanaru bhāga

vatamu nāraduna kunnati jeppe; nātaḍu cāru sarasvatī tīramunanu

tē. hari padadhyāna pārīṇuḍātmavēdi

prakaṭa tējasviyagu bādarāyaṇunaku

gōri yeṟigiṃce, nammahōdaruḍelami

nāku neṟigiṃce - - - “. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 9 - 258)

  1. “ā dēvuḍun –

“tē. bhūri nigamārthasāra vicāramagucu

danaru nī bhāgavatamu sādarita balike

nalina bhava sūtiyaina sanatkumāra

kunaku neṟigiṃce sāṃkhyāyanunaku nataḍu,

“ka. paraga nataḍaṃta barā

śarunaku nupadēśamicce; sanmati nataḍun

suragurunakosage; nātaḍu

garamaruduga nāku ceppe; gaikoni yēnun

ka. nīkippuḍu vivariṃceda nākarṇiṃpumu - - -

va. iṭlu bhagavatpōktaṃbunu, ṛṣi saṃpradāyānugataṃbunu, buruṣōttama stōtraṃbunu, barama pavitraṃbunu, bhava latālavitraṃbunu nayina bhāgavata kathāprapaṃcaṃbu śraddhāḷuṃḍavu, bhaktuṃḍavunagu nīku nupanyasiṃceda”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 8 - 268 to 271)

  1. “ma. avirōdhaṃbuna nevu nanniḍugu nīyarthaṃbu mun brahma mā

dhavu cētan vini nāraduṃḍaḍiginaṃ dadhyaṃbugā jeppe; mā

nava lōkēśvara, nāraduṃḍu venukan nākuṃ brasādiṃce; saṃ

śavraṇīyaṃbu, mahādbutaṃbu, vinumā, saṃdēha vicchēdivai”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 4 - 71)

  1. “sī. dvaipāyanuḍu nādu taṃḍri dvāpara vēḷa brahma sammitamaina bhāgavatamu

baṭhanaṃbu sēyiṃce, brahma tatparuḍanai yuttamaślōka līlōtsavamuna

nākṛṣṭa cittuḍanai paṭhiṃciti - - - “. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 1 - 7)

  1. “sī. puṇyakīrtanuḍaina bhuvanēśu caritaṃbu brahmatulyaṃbaina bhāgavatamu

sakala purāṇarājamu dolli lōkabhadramuga, dhanyamuga, mōdamuga, brīti

bhagavaṃtuḍagu vyāsa bhaṭṭārakuḍonarci śukuḍaniyeḍu tana sutunicēta

jadiviṃce - - - “. (śrīmaṃdāṃdhramahābhāgavatamu - 1 - 3 - 36)

  1. ā. bādarāyaṇuṃḍu bhagavaṃtuḍanaghuṃḍu

paramaguhyamaina bhāgavatamu

naṃdanuṃḍanaina nāku jeppenu; śiṣya

janula moṟagi yēnu jaduvukoṃṭi. (śrīmadāṃdhramahābhāgavatamu - 9 - 21 - 670)

  1. “ammahāpurāṇaṃbu caturdaśasahasra ślōkarūpaṃbunu, daśalakṣaṇa samaṃcitaṃbununai saṃkucitamārgaṃbuna noppu. aṃdu daśalakṣaṇaṃbulevvi yanina sargaṃbunu, visargaṃbunu, sthānaṃbunu, bōṣaṇaṃbunu, sutulunu, manvaṃtarmabulunu, nīśānucaritaṃbulunu, nirōdhaṃbunu, muktiyu, nāśrayaṃbunu nana badi teṟaṃgulayye daśamāśraya viśuddhyarthaṃbu dakkina tommidi lakṣaṇaṃbulu seppaṃbaḍe”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 10 - 259)

(bhagavaṃtuḍu anniṃṭiki āśrayuḍu - aṃducēta paina ceppina padi lakṣaṇamulalōnu tommidi lakṣaṇamu padiyava lakṣaṇamaina āśrayamunu guṟiṃci - bhagavaṃtuni guṟiṃciyē ceppabaḍinavi. ī padi lakṣaṇamulu bhagavaṃtuniki saṃbaṃdhiṃcinavēkanuka ī graṃdhamu bhāgavatamani ceppabaḍinadi).

  1. bhāgavatamuyokka utkṛṣṭata yī kriṃda ceppabaḍinadi : -

    1. tē. “baraganādhyātmikādi tāpatrayaṃbu

naḍaci paramārthabhūtamai yadhika sukhada

mai samastaṃbugākayu nayyunuṃḍu

vastuveṟugaṃgadagu bhāgavatamunaṃdu “. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 1 - 36)

  1. “tē. alpataramaina sukhamulanaṃducunna

janula duḥkhaṃbu mānpaṃga jālunaṭṭi

puṃḍarīkākṣu guṇakathāprōtamaina

vitata nigamārthamagu bhāgavatamu nīku.”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 8 - 263)

  1. “anarthōpaśamaṃ sākṣāt bhaktiyōgamadhōkṣajē |

lōkasyā jānatō vidvān cakrē sātvata saṃhitāṃ ||“. (śrīmadbhāgavataṃ - 1 - 7 - 6)

(anarthamulanu pōgoṭṭunadi, teliyani lōkulaku - ajñānulaku viṣṇuvunaṃdu bhaktiyōgamu kalugacēyunadi sātvata saṃhitayagu bhāgavatamunu śrīvyāsamaharṣi raciṃcenu).

  1. “u. eyyadi karmabaṃdhamulanella hariṃcu, vibhūtikāraṇa

beyyadi, sanmunīṃdrulaku nellagavitva samāśrayaṃbu mu

nneyyadi; sarvamaṃtramula nēlina deyyadi, mōkṣalakṣmirū

peyyadi, dāni balkeda hṛdyamu bhāgavatākhya maṃtramun”. (śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 14 -)

  1. “puṣkaraṃbaṃdu dvārakāpuramunaṃdu

madhurayuṃḍunu, ravidinamaṃdu nevaḍu

paṭhanasēyunu ramaṇatō bhāgavatamu

vāḍu dariyiṃcu saṃsāravārthinapuḍa “. (śrīmadāṃdhramahābhāgavatamu - 12 - 46)

  1. “śrīmannakhilōpaniṣatprapatipādya paramādvaita siddhāṃta pratipādanatvāt - - bhagavādguṇa varṇanaika prathānatayā praṇītatvāt, matsyagāruḍādhyanēka sadgraṃdhēṣu atyutkṛṣṭatayā pratipāditatvāt, mōkṣaśāstramidaṃ iti niścaya buddhyā tēnaiva maharṣiṇā (śukamaharṣiṇā) mumukṣavē parīkṣitō bōdhitatvāt, ityādyanēka hētubhiḥ śrīmadbhāgavatasya asya sarva purāṇōtkṛṣṭatvaṃ nikhilōpaniṣattulyaṃca spaṣṭataramēva” -

(upaniṣattulanniṃṭilōnu ceppabaḍina parama advaita siddhāṃtamu ī bhāgavata graṃdhamulō pratipādiṃciyuṃḍaḍamuvalla bhagavaṃtuni yokka guṇavarṇanamē prathānamugā talaci vrāyabaḍiyuṃḍaḍamu valananu, matsyapurāṇamu modalagu anēka sadgraṃdhamulalō atyutkṛṣṭamaina graṃdhamani pratipādiṃcuṭavalananu, idē mōkṣa śāstramu - mōkṣamuniccē śāstramu - ani niścayiṃcukonina buddhitō śukamaharṣicēta mōkṣārthi (mōkṣamu kōruvāḍu) ayina parīkṣittunaku bōdhiṃcabaḍi yunnaṃduvalananu, ī modalagu anēka kāraṇamulavalananu, ī bhāgavatamu anni purāṇamulakanna utkṛṣṭamainadaninnī, anni upaniṣattulatōnu samānamainadaninnī bāgugā spaṣṭamaina viṣayamu).

  1. bhagavaṃtuḍu - parabrahma, nirākāruḍu - atani tatvamunu telusukonuṭa cālakaṣṭamu - telusukoninanu itarulaku ceppuṭa cālakaṣṭamu - śrīpōtanāmātyulugāriki śrīrāmacaṃdruḍu pratyakṣamai vyāsamaharṣi saṃskṛtamulō vrāsina śrīmadbhāgavatamunu āṃdhramulō vrāsi tanaku kṛtiyiccina muktiniccedanani ceppenu - iṭlu bhagavatkṛpavalana, bhagavaṃtuni ādēśamuvalananu atanu vrāsina graṃdhamu śrīmadāṃdhramahābhāgavatamu - bhagavaṃtuni prōtsāhamu valananu, atani sahāyamuvalananu vrāsinadaguṭacēta nīgraṃdhamu ati madhuramaina padamulatō, cakkani padyamulatō - cinnapillalukūḍa sunāyāsamugā kaṃṭhasthamugā cēyagalugu padyamulatō - bhakti rasamutō niṃḍiyunnadi. - “palikiṃceḍivāḍu rāmabhadruṃḍaṭa” ani pōtanāmātyulē spaṣṭamucēsiri. śrīrāmacaṃdruni kaṭākṣamuvalananē ī graṃdhamiṃta mādhuryamugā nunnadi. aṭlugānicō bōdhapaḍani ādhyātmatatvamu iṃṭiṃṭa prativāninōṭaṃṭa padyarūpamugā yippaṭivaraku veluvaḍucunnadi –

“ā. bhāgavatamu telisi palukuṭa citraṃbu

śūlikaina padmacūlikaina

vibudha janulavalana vinnaṃta gannaṃta

deliyavaccinaṃta dēṭa paṟatu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 1 - 19)

“ā. bhāgavatamu tēṭa paṟupa nevvaḍusālu?

śukuḍu dakka naruni sakuḍu dakka

buddhidōcinaṃta budhulacē vinnaṃta

bhakti nigiḍinaṃta palukuvāḍa ||“. (śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 1 -)

  1. śrīmadāṃdhramahābhāgavatamu śrīmahāviṣṇuvē parabrahmamu (paratatvamu) ani viṣṇu prāśastyamu nudghōṣiṃcu atyuttamamaina ādhyātmika graṃdhamu. ī viṣayamu ī kriṃda vacanamula valana nirthāraṇa cēyabaḍinadi : -
  1. “bhagavannāmaika prathānaṃ purāṇaṃ” (bhagavaṃtuni nāmamokkaṭē prathānamugāgala purāṇamu –

“jagatprabhuṃ dēva dēvamanaṃtaṃ puruṣōttamaṃ |

stuvannāma sahaśrēṇa puruṣaḥ sa talōtthitaḥ ||“.

(jagattu aṃtaṭiki prabhuvainaṭuvaṃṭinnī, dēvadēvuḍainaṭuvaṃṭinnī, anaṃtuḍainaṭu vaṃṭinnī, puruṣōttamuḍainaṭuvaṃṭinnī śrīmahāviṣṇuvuni vēlakoladiyunna atani nāmamulatō stōtramucēsina puruṣuḍu mōkṣamunu poṃdunu)

  1. “na daivavaṃ kēśavātparaṃ” (śrī mahāviṣṇuvukaṃṭe utkṛṣṭamaina dēvuḍu lēḍu)

  2. “ēkō dēvaḥ nārāyaṇaḥ” (nārāyaṇuḍokkaḍē dēvuḍu - dēvuḍainavāḍokkaḍē - atanē nārāyaṇuḍu).

  3. “mōkṣamiccuṭaṃjēsi nārāyaṇuṃḍu sēvyuṃḍu” (śrīmadāṃdhramahābhāgavatamu -)

  4. “vēda yōga yōga kriyā jñāna tapōgati dharmaṃbulu vāsudēva paraṃbulu”. (śrīmadāṃdhramahābhāgavatamu -)

  5. ka. “harimayamu viśvamaṃtayu

hari viśvamayuṃḍu saṃśayamu panilēdu; ā

harimayamugāni dravyamu

paramāṇuvu lēdu, vaṃśapāvana viṃṭē”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 -)

(7). “vaiṣṇavaṃbaina paramapadaṃbu sarvōttamaṃbu” (śrīmadāṃdhramahābhāgavatamu - 2 -)

(8). viśvamayatalēmi viniyu nūrakayuṃḍiri

aṃbujāsanādulaḍḍupaḍaka

viśvamayuḍu vibhuḍu viṣṇuṃḍu jiṣṇuṃḍu

bhaktiyutunakaḍḍupaḍadalaṃce”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 -)

(9). “ā. īśuḍuḍanaṃtuḍu hari

nāyakuḍī bhuvanamunaku nākun nīkun

māyaku prāṇivrātamu

kē yaḍalan lēda yīśvarētaramu, sutā”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 -)

(10). ka. “hari bhagavaṃtunaṃtuḍu

karuṇāṃbudhi sṛṣṭikārya

kāraṇa hētusphuraṇuṃḍavvibhukaṃṭen

paruḍevvaḍulēḍu, taṃḍri, parikiṃpagan” (śrīmadāṃdhramahābhāgavatamu -)

  1. śrīmadāṃdhramahābhāgavatamu bhaktirasa prathānamainadi. bhaktivalana mōkṣamu sulabhamani vakkāṇiṃpabaḍinadi -

(1). “saṃsāra praviṣṭuṃḍainavāniki tapō yōgādulaina mōkṣamārgaṃbulu pekku galavu. aṃdu bhakti mārgaṃbukaṃṭe sulabhaṃbulēdu”.

(2). “harināma saṃsmaraṇamu okka muhūrtamātramucālu muktidamē, nṛpā”.

(3). “ka. gōviṃdanāmakīrtana

gāviṃci bhayaṃbu dakki khaṭvāṃga dhari

trī vibhuḍu sūragoniyenu

kaivalyamu dolli reṃḍu gaḍiyalalōnan”.

  1. ī graṃdhamulō bhagavannāmamulennō enni paryāyamulō vāḍabaḍinavi. modaṭinuṃḍi civaravaṟaku graṃdhamu cadivinayaḍala enni paryāyamulō bhagavaṃtuni nāmamulu aprayatnamugā smariṃcaḍamagunu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.