"మన్మనా భవ, మద్భక్తో, మద్యాజీ, మాం నమస్కురు |
మామే వైష్యసి యుక్త్యైవమాత్మానం మత్పరాయణః ||". (శ్రీమద్భగవద్గీత - 9 - 34)
"మనో మయీశ్వరే యస్య సత్వం మద్భక్త ఏవసన్ |
మద్యాజీ సతతం భూత్వా మామేవ త్వం నమస్కురు |
మనోవాక్కాయ సద్భావైః ప్రకారైరేభి రేవచ |
మదేక శరణో భూత్వ సమాదాయ మనోమయి |
మామేవ స్వప్రకాశం త్వం సచ్చిదానంద విగ్రహం |
సర్వోపాధి వినుర్ముక్తమభయం ప్రాప్స్యసి స్వయం ||". (గీతాభావప్రకాశము - 9 - 221 to 224)
(భగవంతుడే పరమ అయనము - పొందతగిన స్థానము, పరమపదము, మోక్షము అని తలచు వాడు - అది ఎట్లంటే - నాయందే మనసు నిలిపి, నా భక్తుడవై, నాకు నమస్కారము చేయువాడు, మనోవాక్కా యముల నాయందే నిలుపువాడు, (వినియోగించువాడు), నన్నే శరణు పొందినవాడు, నాయందే మనస్సును సమాధానము చేసుకొనినవాడు మత్పరాయణుడు - నేను స్వయముగా ప్రకాశించువాడను, సచ్చిదానంద ఘనుడను, ఏ విధమైన ఉపాధియు లేనివాడను, అభయమునిచ్చువాడను. అట్టి నన్ను మత్పరాయణుడు పొందును).
"manmanā bhava, madbhaktō, madyājī, māṃ namaskuru |
māmē vaiṣyasi yuktyaivamātmānaṃ matparāyaṇaḥ ||". (śrīmadbhagavadgīta - 9 - 34)
"manō mayīśvarē yasya satvaṃ madbhakta ēvasan |
madyājī satataṃ bhūtvā māmēva tvaṃ namaskuru |
manōvākkāya sadbhāvaiḥ prakārairēbhi rēvaca |
madēka śaraṇō bhūtva samādāya manōmayi |
māmēva svaprakāśaṃ tvaṃ saccidānaṃda vigrahaṃ |
sarvōpādhi vinurmuktamabhayaṃ prāpsyasi svayaṃ ||". (gītābhāvaprakāśamu - 9 - 221 to 224)
(bhagavaṃtuḍē parama ayanamu - poṃdatagina sthānamu, paramapadamu, mōkṣamu ani talacu vāḍu - adi eṭlaṃṭē - nāyaṃdē manasu nilipi, nā bhaktuḍavai, nāku namaskāramu cēyuvāḍu, manōvākkā yamula nāyaṃdē nilupuvāḍu, (viniyōgiṃcuvāḍu), nannē śaraṇu poṃdinavāḍu, nāyaṃdē manassunu samādhānamu cēsukoninavāḍu matparāyaṇuḍu - nēnu svayamugā prakāśiṃcuvāḍanu, saccidānaṃda ghanuḍanu, ē vidhamaina upādhiyu lēnivāḍanu, abhayamuniccuvāḍanu. aṭṭi nannu matparāyaṇuḍu poṃdunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.