← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భాః bhāḥ

Original — తెలుగు
  1. దీప్తిః; ప్రభా - (కాంతి, కిరణము).

  2. “స్వప్రకాశరూపః స్వేనైవ ఆత్మరూపేణ ప్రకాశతే. నత్వనాత్మనా దృశ్యేన ప్రకాశ్యతే. ఆత్మ వ్యతిరిక్తస్య సర్వస్య దృశ్యస్య స్వయమేవావ భాసకమిత్యర్థః”.

(స్వయముగా ప్రకాశించు రూపముగలది. అనాత్మ వస్తువుచేత - ఆత్మకాని వస్తువుచేత ప్రకాశించునదికాదు - ఆత్మకంటె వేరయిన సమస్త వస్తువులు తవచేతనే ప్రకాశింపబడుచున్నవి. కనుక స్వయంప్రకాశము.

  1. భూతం భానం సదాస్వేన భాసా భాతి న చాన్యతః |

యత్స్వంభాతి తద్భానం ఖలు భాస్యస్య భాసకం |

అతః సర్వస్య సాక్ష్యస్య సాఖిభూతం స్వయం ప్రభః | (సూతసంహితాయాం)

(ఎల్లపుడు తనకాంతిచేతనే ప్రకాశించువాడు. ఇతర వస్తువులు ప్రకాశమువలన తాను ప్రకాశించువాడుకాడు. స్వయం ప్రకాశమైనది భాసము - అందుచేత అన్నింటిని ప్రకాశింపచేయునది కనుక అన్నింటికి సాక్షి అయినది).

  1. “తమేవ భాంతమనుభాతి - సర్వం, తస్య భాసా సర్వమిదం విభాతి” ఇతి శ్రుతేః -

(స్వయం ప్రకాశమైన పరమాత్మయొక్క ప్రకాశము (తేజస్సు) వల్లనే యీ సర్వమును, ప్రపంచములోనున్న వస్తువులన్నియు ప్రకాశించుచున్నవి. పరమాత్మ తేజస్సు వాటిలోనుండుటవలననే అవి ప్రకాశించుచున్నవి - చైతన్యవంతమై పని చేయుచున్నవి -

“తేజః తేజస్వినామహం”

(తేజస్సుగలవాటిలో - ప్రకాశించు స్వరూపముగలవాటిలో - నున్న తేజస్సు నేనే).

“యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేనవా |

తత్త దేవావగచ్ఛ త్వం మమ తేజోంశ సంభవం ||“. (శ్రీమద్భగవద్గీత - 10 - 36; 10 - 41)

(ఏ వస్తువులో సత్వమున్నట్లు పైకి బాగా గోచరమగుచున్నదో అది నా తేజస్సుయొక్క అంశ దానిలో నుండుటవలననే యని తెలుసుకొనుము).

Transliteration
  1. dīptiḥ; prabhā - (kāṃti, kiraṇamu).

  2. “svaprakāśarūpaḥ svēnaiva ātmarūpēṇa prakāśatē. natvanātmanā dṛśyēna prakāśyatē. ātma vyatiriktasya sarvasya dṛśyasya svayamēvāva bhāsakamityarthaḥ”.

(svayamugā prakāśiṃcu rūpamugaladi. anātma vastuvucēta - ātmakāni vastuvucēta prakāśiṃcunadikādu - ātmakaṃṭe vērayina samasta vastuvulu tavacētanē prakāśiṃpabaḍucunnavi. kanuka svayaṃprakāśamu.

  1. bhūtaṃ bhānaṃ sadāsvēna bhāsā bhāti na cānyataḥ |

yatsvaṃbhāti tadbhānaṃ khalu bhāsyasya bhāsakaṃ |

ataḥ sarvasya sākṣyasya sākhibhūtaṃ svayaṃ prabhaḥ | (sūtasaṃhitāyāṃ)

(ellapuḍu tanakāṃticētanē prakāśiṃcuvāḍu. itara vastuvulu prakāśamuvalana tānu prakāśiṃcuvāḍukāḍu. svayaṃ prakāśamainadi bhāsamu - aṃducēta anniṃṭini prakāśiṃpacēyunadi kanuka anniṃṭiki sākṣi ayinadi).

  1. “tamēva bhāṃtamanubhāti - sarvaṃ, tasya bhāsā sarvamidaṃ vibhāti” iti śrutēḥ -

(svayaṃ prakāśamaina paramātmayokka prakāśamu (tējassu) vallanē yī sarvamunu, prapaṃcamulōnunna vastuvulanniyu prakāśiṃcucunnavi. paramātma tējassu vāṭilōnuṃḍuṭavalananē avi prakāśiṃcucunnavi - caitanyavaṃtamai pani cēyucunnavi -

“tējaḥ tējasvināmahaṃ”

(tējassugalavāṭilō - prakāśiṃcu svarūpamugalavāṭilō - nunna tējassu nēnē).

“yadyadvibhūtimatsatvaṃ śrīmadūrjitamēnavā |

tatta dēvāvagaccha tvaṃ mama tējōṃśa saṃbhavaṃ ||“. (śrīmadbhagavadgīta - 10 - 36; 10 - 41)

(ē vastuvulō satvamunnaṭlu paiki bāgā gōcaramagucunnadō adi nā tējassuyokka aṃśa dānilō nuṃḍuṭavalananē yani telusukonumu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.