← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భజన bhajana

Original — తెలుగు
  1. భజనం భక్తేః ప్రధమాంగమస్తి.

(భక్తి చేయు విధములలో మొదటిది).

  1. “ఈశ్వరుండు గాలత్రయంబునందును, జంగమ స్థావరాంతర్గతుడగుటం జేసి జీవకర్మమార్గంబుల బ్రవర్తించువారు తాపత్రయ నివారణంబుకొఱకు భజియింతురు”. (శ్రీమదాంధ్రమహాభారతము -3 - 31 -)

  2. “విషయంబుల జిక్కువడిన రక్కసులకు హరిభజనంబు శక్యంబుకాదు”. (శ్రీమదాంధ్రమహా భాగవతము - 7 -)

  3. “అధినా స్వల్పం వయః ఖేలన ఖాదనయోః విషయభోగస్య చ సమయో అస్తి, వృద్ధావస్తాయాం భజనం కరిష్యామః ఇతికో వక్తుం శక్నుయాత్ యత్త్వం వృద్ధావస్థాయా ఆగమనాత్ న ప్రాగేవ న పంచత్వం ప్రాప్స్యసి ఇతి కాలస్య నగ్నః కరవాలస్తు సదైవ శిరసి లంబతే - అముకస్థితే ప్రాప్తాయాం భగవతః భజనం కరిష్యామి ఇత్యే తాదృశీ ధారణాత్యక్తవ్యా. తథా అధునైవ యస్యామివస్థాయా మస్తి తేనాస్యామేవావస్థాయాం భగవతః కృపామాశ్రిత్య సాధనమార్గం భణీయం”.

(ఇప్పుడు నాకు చిన్నవయసు, బాల్యము, ఆడుచు తినుచు విషయములను - సౌఖ్యములను అనుభవించుచునుండు సమయము - ముసలివాడనైన తర్వాత భగవంతుని భజన చేసెదను - అని ఎవరు చెప్పగలరు. ముసలితనము రాకమునుపే మరణమురాదు అని ఎవరు నిశ్చయము చేసుకోగలరు? మరణకాలము ఎప్పుడు వచ్చునో ఎవరికిని తెలియదు, ఎప్పుడును దగ్గరగనే నుండునట్లే - పీకమీద కత్తి వేలాడునట్లే యుండును. ఉత్తరక్షణము మనదికాదేమో! అందుచేత ఆ అవస్థయందే, ముసలితనమందే - మరణకాలమందే భగవంతుని భజన చేసెదను అను అభిప్రాయము మాని, ఇప్పుడే ఏ అవస్థయందున్నను ఆ అవస్థలోనే భగవంతుని భజనచేసి, అతని దయకొఱకు తగిన సాధన చేయవలెను).

  1. “శ్లో||. యావత్ స్వస్థమిదం కళేబరగృహం యాచ్చ దూరే జరా |

యావచ్చేంద్రియ శక్తిరప్రతిహతా యావత్ క్షయో నాయుషః |

ఆత్మశ్రేయసి తావదేన విదుషా కార్యః ప్రయత్నో మహాన్ |

ప్రోద్దీప్తే భవనేచ కూపఖననం ప్రత్యుద్యమః కీదృశః ||“. (భర్తృహరి - వైరాగ్యశతకము)

(జీవమునకు గృహమువలెనుండు ఈ శరీరము ఎప్పుడు ఎంతకాలము స్వస్థతగానుండునో ఆరోగ్యముగానుండునో - ప్రాణము దానిలో నుండుటకు వీలుకలిగి యుండునో – ముసలితనము రాకుండగనే ఇంద్రియముల శక్తి సన్నగిలకమునుపే, ఆయుర్దాయము క్షీణించక మునుపే, బుద్ధిమంతుడగు పురుషుడు ఆత్మ శ్రేయస్సుకొఱకు గొప్ప ప్రయత్నము చేయవలయును. దీపముండగనె యిల్లు చక్కబెట్టుకొనునట్లు - శరీరముండిననే భగవంతుని భజన చేయగలుగుట. అది క్షీణించుచున్న సమయమున మనస్సు వశములోనుండదు, ఇంద్రియములు పనిచేయవు. ఇల్లు అంటుకొని మండిపోవుచున్న సమయమందు దానిని ఆర్పుటకు అప్పుడు నుయ్యి త్రవ్వి దానిలో వచ్చు నీటితో ఆర్పుదును అనునట్లే యుండును - దానివలన ప్రయోజనముండునా ?).

  1. “శ్లో|| కృష్ణ త్వదీయ పదపంకజ పంజరాంతే అద్వైవమే విశతు మానస రాజహంసః| ప్రాణప్రయాణ సమయే కఫవాత పిత్తైః కంఠావరోధనవిదౌ స్మరణం కుతస్తే ||”. (ముకుందమాల -)

“హే కృష్ణ! తవ పదకమల రూపే పంజరే మమాయం మనో, రూపో రాజహంసః అద్యైవ ప్రవేశం కరోతు. ప్రాణ నిష్క్రమణ సమయే యథా కఫవాత పిత్తేషు వృద్ధే సత్సు కంఠో అవరోధో భవిష్యతి. తదా తవస్మరణం కుతః భవైష్యతై. అత ఏవ స్వల్పోపి కాలో భగవద్భజనం వినా నవ్యతి గమనీయః”.

(ఓ కృష్ణా! నీ పాదకమలములను పంజరమందు నా మనస్సు అను రాజహంస ఇప్పుడే ప్రవేశించుగాక - ఎందుచేతననగా - మరణకాలమందు కఫవాతపైత్యములు ముదిరి కంఠమునందు అడ్డుపడునపుడు నిన్నెట్లు స్మరించగలను - అందుచేత ఇప్పుడే మనస్సు, అవయవములు నావశములో నున్నపుడే నాకేమాత్రము అవకాశము కలిగిన వేళలందు నీ భజన చేయక వృధాచేయకుండునట్లు కటాక్షించుము). అందుచేత –

“క. నీ నామస్తుతిస్వపచుం

డైనను జిహ్వాగ్రమందు నను సంధింపన్

వానికి సరి భూసురుడుం

గానేరడు, చిత్రమిది జగంబులనరయన్“.

“ఉ. ఈ విధమాత్మలందెలిసి యెప్పుడు సజ్జన సంఘముల్ జగ

త్పావనమైన నీ గుణకథామృతమాత్మలగ్ర్తోలి, సర్వతీ

ర్థావలి గ్రుంకినట్టి ఫలమందు దురంచు సమస్త వేదముల్

నావిరిబల్కు గావునను వారలు ధన్యులు మాన్యులుత్తముల్ “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 33 -)

  1. “సత్యత్వ, జ్ఞానత్వ, ఆనందత్వ, అమలత్వ అనంతవిశిష్టం శోధక వాక్యావగతం పరమాత్మ స్వరూపం భజనీయం”.

(సత్యమైనది - శాశ్వతముగా నుండునది - జ్ఞానత్వము - చిన్మయమైనది - ఆనందత్వము, అమలత్వము - శుద్ద చైతన్యము, అనంతము - ఏ విధముగా చూచినను అంతము లేనిది, కాని వానినన్నింటిని త్రోసివేసి మిగిలి యుండునది యగు పరమాత్మరూపము భజించతగినది).

Transliteration
  1. bhajanaṃ bhaktēḥ pradhamāṃgamasti.

(bhakti cēyu vidhamulalō modaṭidi).

  1. “īśvaruṃḍu gālatrayaṃbunaṃdunu, jaṃgama sthāvarāṃtargatuḍaguṭaṃ jēsi jīvakarmamārgaṃbula bravartiṃcuvāru tāpatraya nivāraṇaṃbukoṟaku bhajiyiṃturu”. (śrīmadāṃdhramahābhāratamu -3 - 31 -)

  2. “viṣayaṃbula jikkuvaḍina rakkasulaku haribhajanaṃbu śakyaṃbukādu”. (śrīmadāṃdhramahā bhāgavatamu - 7 -)

  3. “adhinā svalpaṃ vayaḥ khēlana khādanayōḥ viṣayabhōgasya ca samayō asti, vṛddhāvastāyāṃ bhajanaṃ kariṣyāmaḥ itikō vaktuṃ śaknuyāt yattvaṃ vṛddhāvasthāyā āgamanāt na prāgēva na paṃcatvaṃ prāpsyasi iti kālasya nagnaḥ karavālastu sadaiva śirasi laṃbatē - amukasthitē prāptāyāṃ bhagavataḥ bhajanaṃ kariṣyāmi ityē tādṛśī dhāraṇātyaktavyā. tathā adhunaiva yasyāmivasthāyā masti tēnāsyāmēvāvasthāyāṃ bhagavataḥ kṛpāmāśritya sādhanamārgaṃ bhaṇīyaṃ”.

(ippuḍu nāku cinnavayasu, bālyamu, āḍucu tinucu viṣayamulanu - saukhyamulanu anubhaviṃcucunuṃḍu samayamu - musalivāḍanaina tarvāta bhagavaṃtuni bhajana cēsedanu - ani evaru ceppagalaru. musalitanamu rākamunupē maraṇamurādu ani evaru niścayamu cēsukōgalaru? maraṇakālamu eppuḍu vaccunō evarikini teliyadu, eppuḍunu daggaraganē nuṃḍunaṭlē - pīkamīda katti vēlāḍunaṭlē yuṃḍunu. uttarakṣaṇamu manadikādēmō! aṃducēta ā avasthayaṃdē, musalitanamaṃdē - maraṇakālamaṃdē bhagavaṃtuni bhajana cēsedanu anu abhiprāyamu māni, ippuḍē ē avasthayaṃdunnanu ā avasthalōnē bhagavaṃtuni bhajanacēsi, atani dayakoṟaku tagina sādhana cēyavalenu).

  1. “ślō||. yāvat svasthamidaṃ kaḷēbaragṛhaṃ yācca dūrē jarā |

yāvaccēṃdriya śaktirapratihatā yāvat kṣayō nāyuṣaḥ |

ātmaśrēyasi tāvadēna viduṣā kāryaḥ prayatnō mahān |

prōddīptē bhavanēca kūpakhananaṃ pratyudyamaḥ kīdṛśaḥ ||“. (bhartṛhari - vairāgyaśatakamu)

(jīvamunaku gṛhamuvalenuṃḍu ī śarīramu eppuḍu eṃtakālamu svasthatagānuṃḍunō ārōgyamugānuṃḍunō - prāṇamu dānilō nuṃḍuṭaku vīlukaligi yuṃḍunō – musalitanamu rākuṃḍaganē iṃdriyamula śakti sannagilakamunupē, āyurdāyamu kṣīṇiṃcaka munupē, buddhimaṃtuḍagu puruṣuḍu ātma śrēyassukoṟaku goppa prayatnamu cēyavalayunu. dīpamuṃḍagane yillu cakkabeṭṭukonunaṭlu - śarīramuṃḍinanē bhagavaṃtuni bhajana cēyagaluguṭa. adi kṣīṇiṃcucunna samayamuna manassu vaśamulōnuṃḍadu, iṃdriyamulu panicēyavu. illu aṃṭukoni maṃḍipōvucunna samayamaṃdu dānini ārpuṭaku appuḍu nuyyi travvi dānilō vaccu nīṭitō ārpudunu anunaṭlē yuṃḍunu - dānivalana prayōjanamuṃḍunā ?).

  1. “ślō|| kṛṣṇa tvadīya padapaṃkaja paṃjarāṃtē advaivamē viśatu mānasa rājahaṃsaḥ| prāṇaprayāṇa samayē kaphavāta pittaiḥ kaṃṭhāvarōdhanavidau smaraṇaṃ kutastē ||”. (mukuṃdamāla -)

“hē kṛṣṇa! tava padakamala rūpē paṃjarē mamāyaṃ manō, rūpō rājahaṃsaḥ adyaiva pravēśaṃ karōtu. prāṇa niṣkramaṇa samayē yathā kaphavāta pittēṣu vṛddhē satsu kaṃṭhō avarōdhō bhaviṣyati. tadā tavasmaraṇaṃ kutaḥ bhavaiṣyatai. ata ēva svalpōpi kālō bhagavadbhajanaṃ vinā navyati gamanīyaḥ”.

(ō kṛṣṇā! nī pādakamalamulanu paṃjaramaṃdu nā manassu anu rājahaṃsa ippuḍē pravēśiṃcugāka - eṃducētananagā - maraṇakālamaṃdu kaphavātapaityamulu mudiri kaṃṭhamunaṃdu aḍḍupaḍunapuḍu ninneṭlu smariṃcagalanu - aṃducēta ippuḍē manassu, avayavamulu nāvaśamulō nunnapuḍē nākēmātramu avakāśamu kaligina vēḷalaṃdu nī bhajana cēyaka vṛdhācēyakuṃḍunaṭlu kaṭākṣiṃcumu). aṃducēta –

“ka. nī nāmastutisvapacuṃ

ḍainanu jihvāgramaṃdu nanu saṃdhiṃpan

vāniki sari bhūsuruḍuṃ

gānēraḍu, citramidi jagaṃbulanarayan”.

“u. ī vidhamātmalaṃdelisi yeppuḍu sajjana saṃghamul jaga

tpāvanamaina nī guṇakathāmṛtamātmalagrtōli, sarvatī

rthāvali gruṃkinaṭṭi phalamaṃdu duraṃcu samasta vēdamul

nāviribalku gāvunanu vāralu dhanyulu mānyuluttamul “. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 33 -)

  1. “satyatva, jñānatva, ānaṃdatva, amalatva anaṃtaviśiṣṭaṃ śōdhaka vākyāvagataṃ paramātma svarūpaṃ bhajanīyaṃ”.

(satyamainadi - śāśvatamugā nuṃḍunadi - jñānatvamu - cinmayamainadi - ānaṃdatvamu, amalatvamu - śudda caitanyamu, anaṃtamu - ē vidhamugā cūcinanu aṃtamu lēnidi, kāni vāninanniṃṭini trōsivēsi migili yuṃḍunadi yagu paramātmarūpamu bhajiṃcataginadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.