← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భరతవర్షము bharatavarṣamu

Original — తెలుగు
  1. “భరణాత్తు ప్రజానాం వై మనుర్భరత ఇత్యుచ్యతే |

నిరుక్త వచనాచ్చైవ వర్షం తద్భారతం స్మృతం ||“.

(ప్రజలను భరించువాడు - పోషించువాడు - కనుక మనువు భరతుడని చెప్పబడుచున్నాడు - నిరుక్తముననుసరించి భరతుడు పాలించునది - భరించునదికనుక భరతవర్షమని చెప్పబడినది).

  1. “నాభికి సత్పుత్రుండై ఋషభుండు పుట్టెనతండు హరిదాసుండై సుతసతంబు బడసె,నందిగ్రజుండైన మహానుభావుండు నారాయణ పరాయణుండై యిహ లోకంబులం బరిహరించి ఘోర తపంబాచరించి జన్మత్రితయంబున నిర్వాణ సుఖపారవశ్యంబున సకలబంధ విముక్తుండై వాసుదేవపదంబునొందె నాతని పేర నతడేలిన భూఖండంబు భారతవర్షంబను వ్యవహారంబున నెగడి జగంబుల బ్రసిద్ధంబయ్యె”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 35)

Transliteration
  1. “bharaṇāttu prajānāṃ vai manurbharata ityucyatē |

nirukta vacanāccaiva varṣaṃ tadbhārataṃ smṛtaṃ ||“.

(prajalanu bhariṃcuvāḍu - pōṣiṃcuvāḍu - kanuka manuvu bharatuḍani ceppabaḍucunnāḍu - niruktamunanusariṃci bharatuḍu pāliṃcunadi - bhariṃcunadikanuka bharatavarṣamani ceppabaḍinadi).

  1. “nābhiki satputruṃḍai ṛṣabhuṃḍu puṭṭenataṃḍu haridāsuṃḍai sutasataṃbu baḍase,naṃdigrajuṃḍaina mahānubhāvuṃḍu nārāyaṇa parāyaṇuṃḍai yiha lōkaṃbulaṃ barihariṃci ghōra tapaṃbācariṃci janmatritayaṃbuna nirvāṇa sukhapāravaśyaṃbuna sakalabaṃdha vimuktuṃḍai vāsudēvapadaṃbunoṃde nātani pēra nataḍēlina bhūkhaṃḍaṃbu bhāratavarṣaṃbanu vyavahāraṃbuna negaḍi jagaṃbula brasiddhaṃbayye”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 35)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.