← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భవభయం bhavabhayaṃ

Original — తెలుగు
  1. సంసారభయం; సంసృతి భయం - -

(సంసృతి అనగా సంసారము, దానివలన కలుగు భయము).

  1. భవాత్ సంసారాత్ యత్ భయం తత్ -

(భవము అనగా పుట్టుట, జన్మ - జన్మ పరంపరలు - అనగా జన్మ తర్వాత జన్మ, మరల జన్మ, మళ్ళీ జన్మ - ఈ ప్రకారముగ జననమరణములు ఒకదాని తర్వాత నొకటి ప్రవాహరూపముగా వచ్చు వాటివలన కలుగు సుఖదుఃఖములవలన కలుగు భయము).

  1. “సీ. రూఢిప్రధాన పూరుష నాయకుండును భగవంతుండును జగత్ప్రభుడనైన

నా కంటె నన్యుల గైకొని తగిలిన యాత్మలు భవభయం బందురది

గావున నాయాజ్ఞ గడవంగ నోడుటజేసి వాయువు వీచు, శిఖి వెలుగు

నినుడు దీపించు, దానింద్రుడు వర్షించు, భయమంది మృత్యువు పరువుపెట్టు

తే. గాన విజ్ఞాన వైరాగ్య కలితమైన

భక్తియోగంబునంజేసి పరమపదము

కొఱకు నయ్యోగివరులు మచ్చరణ భజను

లగుచు చరియింపుదురు నిర్భయాత్ములగుచు|“. (శ్రీమదాంధ్రహాభాగవతము - 3 - 25 - 882)

Transliteration
  1. saṃsārabhayaṃ; saṃsṛti bhayaṃ - -

(saṃsṛti anagā saṃsāramu, dānivalana kalugu bhayamu).

  1. bhavāt saṃsārāt yat bhayaṃ tat -

(bhavamu anagā puṭṭuṭa, janma - janma paraṃparalu - anagā janma tarvāta janma, marala janma, maḷḷī janma - ī prakāramuga jananamaraṇamulu okadāni tarvāta nokaṭi pravāharūpamugā vaccu vāṭivalana kalugu sukhaduḥkhamulavalana kalugu bhayamu).

  1. “sī. rūḍhipradhāna pūruṣa nāyakuṃḍunu bhagavaṃtuṃḍunu jagatprabhuḍanaina

nā kaṃṭe nanyula gaikoni tagilina yātmalu bhavabhayaṃ baṃduradi

gāvuna nāyājña gaḍavaṃga nōḍuṭajēsi vāyuvu vīcu, śikhi velugu

ninuḍu dīpiṃcu, dāniṃdruḍu varṣiṃcu, bhayamaṃdi mṛtyuvu paruvupeṭṭu

tē. gāna vijñāna vairāgya kalitamaina

bhaktiyōgaṃbunaṃjēsi paramapadamu

koṟaku nayyōgivarulu maccaraṇa bhajanu

lagucu cariyiṃpuduru nirbhayātmulagucu|“. (śrīmadāṃdhrahābhāgavatamu - 3 - 25 - 882)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.