“పటతంతు న్యాయంబున కార్య కారణంబులందు వస్త్వైకత్వాలోచనంబుచేసి వికల్పంబు లేదని భావించుట భావాద్వైతము - వస్తు భేదబుద్ధి మానవలయు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 15 - 465)
(పొడుగు పేకదారములు అల్లుకొని బట్ట అయినట్లు, బట్టకి దానికి కారణమైన దారములకు భేదము లేనట్లు - కార్యవస్తువు నకు దాని కారణవస్తువునకు భేదము లేదు, రెండూ ఒకటే అయినట్లు - ప్రపంచమునకు దానికి కారణమైన భగవంతునకు భేదములేదు, రెండూ ఒకటే, ఉన్నదంతా భగవన్వతుడే ఒక్కడే – “ఉండేదీ రాముడొకడు”. భగవంతుడుకంటె వేఱైన వస్తువు లేదనుట అద్వైతము, అట్టి భావన కలిగియుండుట భావాద్వైతము)
“paṭataṃtu nyāyaṃbuna kārya kāraṇaṃbulaṃdu vastvaikatvālōcanaṃbucēsi vikalpaṃbu lēdani bhāviṃcuṭa bhāvādvaitamu - vastu bhēdabuddhi mānavalayu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 15 - 465)
(poḍugu pēkadāramulu allukoni baṭṭa ayinaṭlu, baṭṭaki dāniki kāraṇamaina dāramulaku bhēdamu lēnaṭlu - kāryavastuvu naku dāni kāraṇavastuvunaku bhēdamu lēdu, reṃḍū okaṭē ayinaṭlu - prapaṃcamunaku dāniki kāraṇamaina bhagavaṃtunaku bhēdamulēdu, reṃḍū okaṭē, unnadaṃtā bhagavanvatuḍē okkaḍē – “uṃḍēdī rāmuḍokaḍu”. bhagavaṃtuḍukaṃṭe vēṟaina vastuvu lēdanuṭa advaitamu, aṭṭi bhāvana kaligiyuṃḍuṭa bhāvādvaitamu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.