← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భావః bhāvaḥ

Original — తెలుగు
  1. భవతి ఉత్పద్యతే ఇతి భావః (శ్రీ జయతీర్థముని)

(పుట్టునది, పుట్టుక కలది).

  1. ఉత్పత్తిమాన్ పదార్థో, నాసవాన్ పదార్థః -

(పుట్టుటకల వస్తువు, నాశముకల వస్తువు).

  1. యత్కించిత్ జనిమత్ వస్తు ఇత్యర్థః

(పుట్టుక కల వస్తువేదైనను)

  1. 4.శరీరాద్య చిత్పదార్థం.

(శరీరము మొదలగు అచిత్ పదార్థము).

  1. పదార్థాః సర్వే భావాః దృశ్య మానాః, గుణమయాః - ఏతా దేవ దేహాదీని.

(పదార్థములు; కనబడుచున్న వస్తువులు అన్నియు - సత్వరజస్తమోగుణమయములు; దేహము మొదలగునవి.)

  1. అంతర్గతం మనః, తదాభిధానాత్ -

(భావములో అంతర్గతముగా నుండు మనస్సు - మనస్సులోనుండు తలంపు).

  1. “ప్రవృత్తి నివృత్తి హేతువః - మనోవృత్తయః -. (శ్రీమాన్ రామానుజః)

(ప్రవృత్తికి. నివృత్తికి కారణమైన మనో వ్యాపారము).

  1. భావనా అనుధ్యానం భవస్య భవస్యద్యే యాకార జన్మనః కారణం, పే శస్కారీ ధ్యానేన కటాదౌ తధా దృష్టత్వాత్ -.

(భావించుట, తీవ్రముగా ఆలోచించుట - అనుక్షణము ఒకేదానిని గుఱించి ధ్యానించుట - దేనిని గుఱించి తీవ్రముగా ఆలోచించు చుందురో దాని ఆకారముగల జన్మకు కారణమైనది. కీటములు తుమ్మెద ఎప్పుడు వచ్చునో, వాటిని చంపునో యని దానినే నిత్యము భయముతో ధ్యానించుచుండుటవలన ఆ తుమ్మెద ఆకారముగనే అవి మారిపోవును)

  1. “యే చైవ సాత్వికా భావా రాజసాస్తామసాశ్చ యే |

మత్త ఏవేతి తాన్ విద్ధి న త్వహం తేషు తేమయి ||“. (శ్రీమద్భగవద్గీత - 7 - 12)

“భావాశ్చిత్తపరిణామాః సాత్వికా యే శమాదయః |

రాజసా హర్షథర్పాద్యా మోహాద్యా స్తామ సాశ్చయే |

విద్యా కర్మాది వశతో జాయంతే దేహినాం హితాన్ |

మత్తః సర్వేశ్వరాత్ సర్వాన్ జాయమానాన వేహి తాన్ ||

న త్వహం తేషు భావేషు యజ్జతత్వేపి సర్వతః |

నాహమస్మి తదాయత్తో మదాయత్తో భవంతి తే |

మత్తః పృధక్ న తే సంతి తేభ్యో భిన్నోస్మ్యహం సదా ||

రజ్జౌ సర్పాదయో యద్వత్ కల్పితా అపి తద్భ్రమైః |

రజ్జోర్నాస్తి మనాగ్లేపః తథా మమనతద్భ్రమైః ||“. (గీతాభావప్రకాశము - 7 - 65 to 68.)

(భావములు అనగా చిత్త పరిణామ రూపములు - మనస్సు పరి పరి విధములుగా పరిణమించుట, మారుట, వేఱు వేఱు అభిప్రాయములు కలిగియుండుట - సత్వగుణమువలన కలుగునవి శమము, దమము మొదలగునవి. రాజసగుణమువలన కలుగునవి హర్షము (సంతోషము), దర్పము (గర్వము) మొదలగునవి. తామసగుణమువలన కలుగునవి మోహము మొదలగునవి, విద్య కర్మవలన కలుగునవి. ఇవన్నియు సర్వేశ్వరుడనైన నావలననే కలుగుచున్నవని తెలుసుకొనుము).

  1. “త్రిభిర్గుణమయైర్భావైరేభిః సర్వమిదం జగత్ |

మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం ||. (శ్రీమద్భగవద్గీత - 7 - 13)

“రాగద్వేష ప్రమాదాది ప్రకారైర్గుణ జన్మభిః |

పదార్థైర్మోహితం సర్వం ప్రాణిమాత్రమిదం కిల |

ఏభో గుణమయోభ్యోమాం సర్వాధిష్ఠానమీశ్వరం |

సమస్త విక్రియా శూన్యం పరం చాతి విలక్షణం |

ఆనందఘనమాత్మానాం స్వప్రకాశం నిరంజనం |

న జానాతి తతః స్వాత్మజ్ఞానాదేవ కు సంస్కృతౌ |

భ్రమత్యహో సుదౌర్భాగ్య మ వివేక జనస్యచ ||’. (గీతాభావప్రకాశము - 7 - 69 to 73)

(రాగద్వేషములు మొదలగునవి త్రిగుణములవలన కలుగునవి. ఈ ప్రాణులందఱు ఈ పదార్థములచేత మోహము చెందు చున్నారు. అందుచేత అన్నింటికీ అధిష్ఠానమైనటువంటిన్నీ, ఈశ్వరుడైనటువంటిన్నీ, ఏ విధమైన వికారములు లేనటువంటిన్నీ, అన్నింటికన్న వేఱైన లక్షణములు గలిగినటువంటిన్నీ, ఆనందఘనమైనటువంటిన్నీ, ఉత్కృష్టమైనటువంటిన్నీ, స్వయముగా ప్రకాశించువాడై నటువంటిన్నీ, నిరంజనుడు, ఆత్మ అయినటువంటి నన్ను తెలుసుకొనలేకున్నారు - అందుచే ఆత్మజ్ఞానము లేకపోవుటచేత - తానెవరో తెలుసుకొనలేకపోవుటచేత భ్రమ చెందుచున్నారు)

“యం యంవాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం | తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః||. (శ్రీమద్భగవద్గీత - 8 - 6)

“యం యం దేవ విశేషం వా యత్కించిద్వస్తుమాత్రకం |

చింతయన్నంత కాలే (అ)సౌ త్యజతీహ కళేబరం |

తం తం సంస్మర్యమాణం స భావమేవైతి నాపరం - - -

పూర్వాభ్యాసార్చితా పుంసాం వాసనా స్మృతికారణం |

సర్వదా యేన యో(అ)భ్యస్తో భావో దేవాది గోచరః |

స్మర్యమాణతయా సోంతే తం తమేవైతి నాపరం||“. (గీతాభావప్రకాశము - 8 - 43, 44, 46, 47)

(మరణకాలమందు భగవంతుని చింతించుటచే - అట్టి భావము కలిగియుండుటచేత - భగవత్ప్రాప్తి కలుగును - ఇతర విధమైన చింత - (భావము) కలిగియున్నను ఈ నియమము వర్తించును. మరణకాలమందు ఏ ఏ ఆలోచనలు సలుపుచు ఏ యే విషయములందు మనసు నిలుపునో అట్టివాడు ఆయా భావములనే పొందును, ఏ దేవుని గుఱించు చింతించునో ఆ దేవునే పొందును - దేవుని గుఱించికాక యే విషయము గుఱించి అయినను చింతించుచు చనిపోయిన దానినే పొందును - ఇట్లు మరణకాలమందు యీ చింతనము - భావము - కలుగుట యింతకుముందు జన్మలలోని అభ్యాసముద్వారా ఆర్జించిన వాసన వలననే. ఎల్లపుడు ఏ ఏ దేవుని గుఱించిగాని, విషయము గుఱించిగాని ఆలోచించు చుండడము అభ్యాసము చేసుకొనినవాడు మరణకాలమందు దానినే చింతించుచుండుటచేత దానినే పొందును.) అందుచేత –

“అంతకాలేచ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం |

యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః ||“. (శ్రీమద్భగవద్గీత - 8 - 5)

“మామేవ వాసుదేవం యః సగుణం వాధ నిర్గుణం |

చింతయన్ సంతతం బుద్ధ్యా తత్తత్సంసార పాటవాత్ |

సమస్త కరణగ్రామ వైయుగ్ర్యసమయే మృతౌ |

స్మరన్ కళేబరం ముక్త్వా(అ)హం మమేతి థియం తథా |

త్యక్త్వా ప్రాణవియోగే యః సగుణధ్యానవాన్యది |

తదా సదేవ యానేన ప్రయాతి మదుపాసకః |

మద్భావం నిర్గుణం బ్రహ్మ బ్రహ్మలోకే విరించినా |

సః భోగావసానే (అ)సౌ ప్రాప్నోతి జ్ఞాన లాభతః |

నిర్గుణు ధ్యాన పక్షేతు - - - |

స సాక్షాదేవ మద్భావం యాతి బ్రహ్మైవ సన్ స్వయం |

నాస్త్యత్ర సంశయః కశ్చి ద్బ్రహ్మైవ బ్రహ్మ విద్యతః ||“. (గీతాభావప్రకాశము - 8 - 31 to 35, 37.)

(ఇంద్రియములన్నియు వాటి వాటి సత్తువను కోలుపోయిన సమయమైన మరణకాలమందు ఎవడు వాని సంస్కారబలము కొలది వాసుదేవుడనైన నన్ను సగుణ బ్రహ్మగాగాని నిర్గుణబ్రహ్మగాగాని బుద్ధితో నిరంతరము చింతించుచు చనిపోవునో అట్టివాడు సగుణ బ్రహ్మగా చింతించిన యడల దేవయానమార్గమున వెళ్ళి బ్రహ్మలోకమందు బ్రహ్మతోకూడ భోగములననుభవించి, అనుభవము పూర్తి అయినతర్వాత, బ్రహ్మజ్ఞానము పొందియుండుటవలన నా భావమైన (బ్రహ్మభావమైన) నిర్గుణ పరబ్రహ్మను పొందును. అట్టివాడు నిర్గుణ పరబ్రహ్మను మరణకాలమందు చింతించిన యడల, జ్ఞానయోగి యగుటవలన, “బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి” అని శ్రుతి చెప్పుటచేత (బ్రహ్మజ్ఞానము కలవాడు బ్రహ్మమే యగును అని శ్రుతి చెప్పుటచేత) బ్రహ్మమే యగును - సాక్షాత్ నిర్గుణబ్రహ్మభావమునే పొందును.)

  1. “బుద్ధిర్ జ్ఞానమ సం మోహః క్షమా సత్యం దమః శమః |

సుఖం దుఃఖం భవో (అ)భావో భయం చా భయమేవ చ |

అహింసా సమతా తుష్టిస్తపో దానం యశో(అ)యశః |

భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథక్ విథాః ||“. (శ్రీమద్భగవద్గీత - 10 - 4, 5)

“ఏతే బుద్ధ్యాదయో భావాః కార్య భేదాః సహేతుకాః |

ధర్మాధర్మాది హేతునాం వై చిత్ర్యేణ పృథక్ విధాః |

సర్వేషాం ప్రాణినాం మత్తో భవంతి పరమేశ్వరాత్ ||“. (గీతాభావప్రకాశము - 10 - 24, 25.)

(బుద్ధి జ్ఞానము, అసమ్మోహము, క్షమా, సత్యము, దమము. శమము, సుఖము, దుఃఖము, భవము (పుట్టుట), అభవము (మృత్యువు), భయము, అభయము, అహిన్స, సమత్వము, తుష్టి, తపస్సు, దానము, యశస్సు (కీర్తి), అయశస్సు (అపకీర్తి), - ఇవన్నియు - ఈ భావములన్నియు కార్యభేదములు, కారణములు కలవి. ధర్మము, అధర్మము (పుణ్యము,పాపము) అనునవి వీటికి కారణములు - ఇవన్నియు భూతములకు నావలననే కలుగుచున్నవి)

  1. “మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా |

మద్భావాః మానసా జాతాః యేషాం లోక ఇమాః ప్రజాః ||“. (శ్రీమద్భగవద్గీత - 10 - 6)

(పూర్వము - సృష్టిప్రారంభములో సప్తమహర్షులు, నలుగురు మనువులు, నాలోనుండి పుట్టినవారే, నా సంకల్పమాత్రమున పుట్టినవారు - వారు నా భావములు - నాలోనుండి పుట్టిన వారు - వీరినుండి యీ లోకములు, ఈ లోకములోని ప్రజలు పుట్టిరి. వీరందఱూ ఈ సప్త మహర్షులు వలేనే నాభావములే, నాలోనుండి ఒకదానిలోనుండి ఒకటిగా పుట్టినవారే.)

  1. “విస్ఫులింగా యథా వహ్నేస్సు దీప్తాత్ ప్రభవంతిచ |

అపియంతి తథా భావా అక్షరే శివసంజ్ఞితే ||“. (బ్రహ్మగీతాయాం)

(అగ్నిజ్వాలనుండి అగ్నితునకలు పుట్టినట్లే అక్షరుడైన శివునినుండి భావములు - లోకములు, లొకములోని ప్రజలు - పుట్టుచు అతనిలోనే లీనమైపోవుచున్నవి).

  1. “యథా భావస్తథా దేవః”.

(భావమును బట్టియే దేవుడు) - (భావము ఏ ప్రకారముగా నుండునో దేవుడు ఆ ప్రకారముగా యుండును - భక్తి శ్రద్ధలతో దేవుని భజించిన దానికనుగుణమగు ఫలము లభించును - దేవుని ఆకారముగా మనము భావించిన ఆ ప్రకారముగానే దేవుడు ఉండును –

“మ. నరయోగీంద్రులు యోగమార్గముల భావంబందు నేనీమనో

హర రూపంబు దలంచి. యే గుణగణధ్యానంబు గావింతుర

ప్పురుష శ్రేష్ట పరి గ్రహంబునకునై పొల్పార దద్ధ్యాన గో

చర మూర్తిన్ ధరియింతుగాదే పరమోత్సాహుండవై మాధవా’. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 9 - 298)

  1. “అయః శలకా సదృశాః పరస్పర మసంగినః |

శ్లిష్యంతే కేవలం భావాః మనః కల్పనయా స్వయా ||“. (యోగవాసిష్టము - 12 - 9)

(విషయములకు పరస్పర సంబంధములేదు - ఇనుక ముక్కలవంటివి. వాటి సంబంధము - వాటి గుఱించి అయిన భావములు కేవలము మనస్సు యొక్క కల్పనయే).

  1. భావయతీతి భావః. (సృష్టి చేయువాడు)

  2. భాసి అవతీతి భావః -

(ప్రకాశరూపములైన నక్షత్రములు మొదలగువాటికి ప్రకాశము నిచ్చువాడు) (ఉనికి గలది)

  1. కుండ చేయబడకముందు లేదు - ఇది అభావము - (లేనిది) - ప్రాగభావము - అది పగిలిపోయిన తర్వాత లేదు - అది ప్రధ్వంసాభావము - చేయబడిన తర్వాత, పగలముందుండుట భావము -
Transliteration
  1. bhavati utpadyatē iti bhāvaḥ (śrī jayatīrthamuni)

(puṭṭunadi, puṭṭuka kaladi).

  1. utpattimān padārthō, nāsavān padārthaḥ -

(puṭṭuṭakala vastuvu, nāśamukala vastuvu).

  1. yatkiṃcit janimat vastu ityarthaḥ

(puṭṭuka kala vastuvēdainanu)

  1. 4.śarīrādya citpadārthaṃ.

(śarīramu modalagu acit padārthamu).

  1. padārthāḥ sarvē bhāvāḥ dṛśya mānāḥ, guṇamayāḥ - ētā dēva dēhādīni.

(padārthamulu; kanabaḍucunna vastuvulu anniyu - satvarajastamōguṇamayamulu; dēhamu modalagunavi.)

  1. aṃtargataṃ manaḥ, tadābhidhānāt -

(bhāvamulō aṃtargatamugā nuṃḍu manassu - manassulōnuṃḍu talaṃpu).

  1. “pravṛtti nivṛtti hētuvaḥ - manōvṛttayaḥ -. (śrīmān rāmānujaḥ)

(pravṛttiki. nivṛttiki kāraṇamaina manō vyāpāramu).

  1. bhāvanā anudhyānaṃ bhavasya bhavasyadyē yākāra janmanaḥ kāraṇaṃ, pē śaskārī dhyānēna kaṭādau tadhā dṛṣṭatvāt -.

(bhāviṃcuṭa, tīvramugā ālōciṃcuṭa - anukṣaṇamu okēdānini guṟiṃci dhyāniṃcuṭa - dēnini guṟiṃci tīvramugā ālōciṃcu cuṃdurō dāni ākāramugala janmaku kāraṇamainadi. kīṭamulu tummeda eppuḍu vaccunō, vāṭini caṃpunō yani dāninē nityamu bhayamutō dhyāniṃcucuṃḍuṭavalana ā tummeda ākāramuganē avi māripōvunu)

  1. “yē caiva sātvikā bhāvā rājasāstāmasāśca yē |

matta ēvēti tān viddhi na tvahaṃ tēṣu tēmayi ||“. (śrīmadbhagavadgīta - 7 - 12)

“bhāvāścittapariṇāmāḥ sātvikā yē śamādayaḥ |

rājasā harṣatharpādyā mōhādyā stāma sāścayē |

vidyā karmādi vaśatō jāyaṃtē dēhināṃ hitān |

mattaḥ sarvēśvarāt sarvān jāyamānāna vēhi tān ||

na tvahaṃ tēṣu bhāvēṣu yajjatatvēpi sarvataḥ |

nāhamasmi tadāyattō madāyattō bhavaṃti tē |

mattaḥ pṛdhak na tē saṃti tēbhyō bhinnōsmyahaṃ sadā ||

rajjau sarpādayō yadvat kalpitā api tadbhramaiḥ |

rajjōrnāsti manāglēpaḥ tathā mamanatadbhramaiḥ ||“. (gītābhāvaprakāśamu - 7 - 65 to 68.)

(bhāvamulu anagā citta pariṇāma rūpamulu - manassu pari pari vidhamulugā pariṇamiṃcuṭa, māruṭa, vēṟu vēṟu abhiprāyamulu kaligiyuṃḍuṭa - satvaguṇamuvalana kalugunavi śamamu, damamu modalagunavi. rājasaguṇamuvalana kalugunavi harṣamu (saṃtōṣamu), darpamu (garvamu) modalagunavi. tāmasaguṇamuvalana kalugunavi mōhamu modalagunavi, vidya karmavalana kalugunavi. ivanniyu sarvēśvaruḍanaina nāvalananē kalugucunnavani telusukonumu).

  1. “tribhirguṇamayairbhāvairēbhiḥ sarvamidaṃ jagat |

mōhitaṃ nābhijānāti māmēbhyaḥ paramavyayaṃ ||. (śrīmadbhagavadgīta - 7 - 13)

“rāgadvēṣa pramādādi prakārairguṇa janmabhiḥ |

padārthairmōhitaṃ sarvaṃ prāṇimātramidaṃ kila |

ēbhō guṇamayōbhyōmāṃ sarvādhiṣṭhānamīśvaraṃ |

samasta vikriyā śūnyaṃ paraṃ cāti vilakṣaṇaṃ |

ānaṃdaghanamātmānāṃ svaprakāśaṃ niraṃjanaṃ |

na jānāti tataḥ svātmajñānādēva ku saṃskṛtau |

bhramatyahō sudaurbhāgya ma vivēka janasyaca ||’. (gītābhāvaprakāśamu - 7 - 69 to 73)

(rāgadvēṣamulu modalagunavi triguṇamulavalana kalugunavi. ī prāṇulaṃdaṟu ī padārthamulacēta mōhamu ceṃdu cunnāru. aṃducēta anniṃṭikī adhiṣṭhānamainaṭuvaṃṭinnī, īśvaruḍainaṭuvaṃṭinnī, ē vidhamaina vikāramulu lēnaṭuvaṃṭinnī, anniṃṭikanna vēṟaina lakṣaṇamulu galiginaṭuvaṃṭinnī, ānaṃdaghanamainaṭuvaṃṭinnī, utkṛṣṭamainaṭuvaṃṭinnī, svayamugā prakāśiṃcuvāḍai naṭuvaṃṭinnī, niraṃjanuḍu, ātma ayinaṭuvaṃṭi nannu telusukonalēkunnāru - aṃducē ātmajñānamu lēkapōvuṭacēta - tānevarō telusukonalēkapōvuṭacēta bhrama ceṃducunnāru)

“yaṃ yaṃvāpi smaran bhāvaṃ tyajatyaṃtē kaḷēbaraṃ | taṃ tamēvaiti kauṃtēya sadā tadbhāva bhāvitaḥ||. (śrīmadbhagavadgīta - 8 - 6)

“yaṃ yaṃ dēva viśēṣaṃ vā yatkiṃcidvastumātrakaṃ |

ciṃtayannaṃta kālē (a)sau tyajatīha kaḷēbaraṃ |

taṃ taṃ saṃsmaryamāṇaṃ sa bhāvamēvaiti nāparaṃ - - -

pūrvābhyāsārcitā puṃsāṃ vāsanā smṛtikāraṇaṃ |

sarvadā yēna yō(a)bhyastō bhāvō dēvādi gōcaraḥ |

smaryamāṇatayā sōṃtē taṃ tamēvaiti nāparaṃ||“. (gītābhāvaprakāśamu - 8 - 43, 44, 46, 47)

(maraṇakālamaṃdu bhagavaṃtuni ciṃtiṃcuṭacē - aṭṭi bhāvamu kaligiyuṃḍuṭacēta - bhagavatprāpti kalugunu - itara vidhamaina ciṃta - (bhāvamu) kaligiyunnanu ī niyamamu vartiṃcunu. maraṇakālamaṃdu ē ē ālōcanalu salupucu ē yē viṣayamulaṃdu manasu nilupunō aṭṭivāḍu āyā bhāvamulanē poṃdunu, ē dēvuni guṟiṃcu ciṃtiṃcunō ā dēvunē poṃdunu - dēvuni guṟiṃcikāka yē viṣayamu guṟiṃci ayinanu ciṃtiṃcucu canipōyina dāninē poṃdunu - iṭlu maraṇakālamaṃdu yī ciṃtanamu - bhāvamu - kaluguṭa yiṃtakumuṃdu janmalalōni abhyāsamudvārā ārjiṃcina vāsana valananē. ellapuḍu ē ē dēvuni guṟiṃcigāni, viṣayamu guṟiṃcigāni ālōciṃcu cuṃḍaḍamu abhyāsamu cēsukoninavāḍu maraṇakālamaṃdu dāninē ciṃtiṃcucuṃḍuṭacēta dāninē poṃdunu.) aṃducēta –

“aṃtakālēca māmēva smaran muktvā kaḷēbaraṃ |

yaḥ prayāti samadbhāvaṃ yāti nāstyatra saṃśayaḥ ||“. (śrīmadbhagavadgīta - 8 - 5)

“māmēva vāsudēvaṃ yaḥ saguṇaṃ vādha nirguṇaṃ |

ciṃtayan saṃtataṃ buddhyā tattatsaṃsāra pāṭavāt |

samasta karaṇagrāma vaiyugryasamayē mṛtau |

smaran kaḷēbaraṃ muktvā(a)haṃ mamēti thiyaṃ tathā |

tyaktvā prāṇaviyōgē yaḥ saguṇadhyānavānyadi |

tadā sadēva yānēna prayāti madupāsakaḥ |

madbhāvaṃ nirguṇaṃ brahma brahmalōkē viriṃcinā |

saḥ bhōgāvasānē (a)sau prāpnōti jñāna lābhataḥ |

nirguṇu dhyāna pakṣētu - - - |

sa sākṣādēva madbhāvaṃ yāti brahmaiva san svayaṃ |

nāstyatra saṃśayaḥ kaści dbrahmaiva brahma vidyataḥ ||“. (gītābhāvaprakāśamu - 8 - 31 to 35, 37.)

(iṃdriyamulanniyu vāṭi vāṭi sattuvanu kōlupōyina samayamaina maraṇakālamaṃdu evaḍu vāni saṃskārabalamu koladi vāsudēvuḍanaina nannu saguṇa brahmagāgāni nirguṇabrahmagāgāni buddhitō niraṃtaramu ciṃtiṃcucu canipōvunō aṭṭivāḍu saguṇa brahmagā ciṃtiṃcina yaḍala dēvayānamārgamuna veḷḷi brahmalōkamaṃdu brahmatōkūḍa bhōgamulananubhaviṃci, anubhavamu pūrti ayinatarvāta, brahmajñānamu poṃdiyuṃḍuṭavalana nā bhāvamaina (brahmabhāvamaina) nirguṇa parabrahmanu poṃdunu. aṭṭivāḍu nirguṇa parabrahmanu maraṇakālamaṃdu ciṃtiṃcina yaḍala, jñānayōgi yaguṭavalana, “brahmavid brahmaiva bhavati” ani śruti ceppuṭacēta (brahmajñānamu kalavāḍu brahmamē yagunu ani śruti ceppuṭacēta) brahmamē yagunu - sākṣāt nirguṇabrahmabhāvamunē poṃdunu.)

  1. “buddhir jñānama saṃ mōhaḥ kṣamā satyaṃ damaḥ śamaḥ |

sukhaṃ duḥkhaṃ bhavō (a)bhāvō bhayaṃ cā bhayamēva ca |

ahiṃsā samatā tuṣṭistapō dānaṃ yaśō(a)yaśaḥ |

bhavaṃti bhāvā bhūtānāṃ matta ēva pṛthak vithāḥ ||“. (śrīmadbhagavadgīta - 10 - 4, 5)

“ētē buddhyādayō bhāvāḥ kārya bhēdāḥ sahētukāḥ |

dharmādharmādi hētunāṃ vai citryēṇa pṛthak vidhāḥ |

sarvēṣāṃ prāṇināṃ mattō bhavaṃti paramēśvarāt ||“. (gītābhāvaprakāśamu - 10 - 24, 25.)

(buddhi jñānamu, asammōhamu, kṣamā, satyamu, damamu. śamamu, sukhamu, duḥkhamu, bhavamu (puṭṭuṭa), abhavamu (mṛtyuvu), bhayamu, abhayamu, ahinsa, samatvamu, tuṣṭi, tapassu, dānamu, yaśassu (kīrti), ayaśassu (apakīrti), - ivanniyu - ī bhāvamulanniyu kāryabhēdamulu, kāraṇamulu kalavi. dharmamu, adharmamu (puṇyamu,pāpamu) anunavi vīṭiki kāraṇamulu - ivanniyu bhūtamulaku nāvalananē kalugucunnavi)

  1. “maharṣayaḥ sapta pūrvē catvārō manavastathā |

madbhāvāḥ mānasā jātāḥ yēṣāṃ lōka imāḥ prajāḥ ||“. (śrīmadbhagavadgīta - 10 - 6)

(pūrvamu - sṛṣṭiprāraṃbhamulō saptamaharṣulu, naluguru manuvulu, nālōnuṃḍi puṭṭinavārē, nā saṃkalpamātramuna puṭṭinavāru - vāru nā bhāvamulu - nālōnuṃḍi puṭṭina vāru - vīrinuṃḍi yī lōkamulu, ī lōkamulōni prajalu puṭṭiri. vīraṃdaṟū ī sapta maharṣulu valēnē nābhāvamulē, nālōnuṃḍi okadānilōnuṃḍi okaṭigā puṭṭinavārē.)

  1. “visphuliṃgā yathā vahnēssu dīptāt prabhavaṃtica |

apiyaṃti tathā bhāvā akṣarē śivasaṃjñitē ||“. (brahmagītāyāṃ)

(agnijvālanuṃḍi agnitunakalu puṭṭinaṭlē akṣaruḍaina śivuninuṃḍi bhāvamulu - lōkamulu, lokamulōni prajalu - puṭṭucu atanilōnē līnamaipōvucunnavi).

  1. “yathā bhāvastathā dēvaḥ”.

(bhāvamunu baṭṭiyē dēvuḍu) - (bhāvamu ē prakāramugā nuṃḍunō dēvuḍu ā prakāramugā yuṃḍunu - bhakti śraddhalatō dēvuni bhajiṃcina dānikanuguṇamagu phalamu labhiṃcunu - dēvuni ākāramugā manamu bhāviṃcina ā prakāramugānē dēvuḍu uṃḍunu –

“ma. narayōgīṃdrulu yōgamārgamula bhāvaṃbaṃdu nēnīmanō

hara rūpaṃbu dalaṃci. yē guṇagaṇadhyānaṃbu gāviṃtura

ppuruṣa śrēṣṭa pari grahaṃbunakunai polpāra daddhyāna gō

cara mūrtin dhariyiṃtugādē paramōtsāhuṃḍavai mādhavā’. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 9 - 298)

  1. “ayaḥ śalakā sadṛśāḥ paraspara masaṃginaḥ |

śliṣyaṃtē kēvalaṃ bhāvāḥ manaḥ kalpanayā svayā ||“. (yōgavāsiṣṭamu - 12 - 9)

(viṣayamulaku paraspara saṃbaṃdhamulēdu - inuka mukkalavaṃṭivi. vāṭi saṃbaṃdhamu - vāṭi guṟiṃci ayina bhāvamulu kēvalamu manassu yokka kalpanayē).

  1. bhāvayatīti bhāvaḥ. (sṛṣṭi cēyuvāḍu)

  2. bhāsi avatīti bhāvaḥ -

(prakāśarūpamulaina nakṣatramulu modalaguvāṭiki prakāśamu niccuvāḍu) (uniki galadi)

  1. kuṃḍa cēyabaḍakamuṃdu lēdu - idi abhāvamu - (lēnidi) - prāgabhāvamu - adi pagilipōyina tarvāta lēdu - adi pradhvaṃsābhāvamu - cēyabaḍina tarvāta, pagalamuṃduṃḍuṭa bhāvamu -
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.