లోకవ్యవహార సిద్ధములగు వస్తువులు భావములనియు అభావములనియు రెండు విధములు - ఘటపటాదులు భావ పదార్థములు. అభావపదర్థమనగా నాశము - కఱ్ఱతో కొట్టుటవలనగాని బద్దలగుటవలనగాని భావపదార్థములు - కుండ మొదలగునవి నశించును - కాని ఇది కుండ అని కలిగిన జ్ఞానము యీ కఱ్ఱచేత, పగులుటచేత నశించదు. త్రాడును చూచి చీకటిలో పాము అనుకొనుట మిథ్యాజ్ఞానము - ఇది పాముకాదు త్రాడే అను యధార్థజ్ఞానము కలుగగనే మిథ్యాజ్ఞానము పోవును - కాని యజ్ఞ, దాన. మంత్ర, జపములు మొదలగు క్రియలవలన ఈ మిథ్యాజ్ఞానము పోదు. మిధ్యావస్తువులను వాటి యదార్థజ్ఞానమే తొలగించును - అట్లే ఇది ప్రపంచము అనుట మిధ్యాజ్ఞానము వేదాంత జ్ఞానమువలననే తొలగును. మిధ్యాజ్ఞానము తొలగుటవలననే, యదార్థజ్ఞానము కలుగుటయే ముక్తి - “జ్ఞానే నైవ తు కైవల్యం” బ్రహ్మజ్ఞానము వలననే మోక్షము)
lōkavyavahāra siddhamulagu vastuvulu bhāvamulaniyu abhāvamulaniyu reṃḍu vidhamulu - ghaṭapaṭādulu bhāva padārthamulu. abhāvapadarthamanagā nāśamu - kaṟṟatō koṭṭuṭavalanagāni baddalaguṭavalanagāni bhāvapadārthamulu - kuṃḍa modalagunavi naśiṃcunu - kāni idi kuṃḍa ani kaligina jñānamu yī kaṟṟacēta, paguluṭacēta naśiṃcadu. trāḍunu cūci cīkaṭilō pāmu anukonuṭa mithyājñānamu - idi pāmukādu trāḍē anu yadhārthajñānamu kalugaganē mithyājñānamu pōvunu - kāni yajña, dāna. maṃtra, japamulu modalagu kriyalavalana ī mithyājñānamu pōdu. midhyāvastuvulanu vāṭi yadārthajñānamē tolagiṃcunu - aṭlē idi prapaṃcamu anuṭa midhyājñānamu vēdāṃta jñānamuvalananē tolagunu. midhyājñānamu tolaguṭavalananē, yadārthajñānamu kaluguṭayē mukti - “jñānē naiva tu kaivalyaṃ” brahmajñānamu valananē mōkṣamu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.