త్రాసః (జడియుట)
బిభేతి అస్మాత్ ఇతి భయం - చోర వ్యాగ్రాది. (శ్రీశంకరః)
(దీనివలన భయపడుదురు కనుక భయము చోరులవలనకాని, క్రూరజంతువులైనపులులు మొదలగువాటి వలన కలుగునది).
(ముందురాబోవు దుఃఖమునకు కారణము కనబడుటవలన కలుగు దుఃఖము).
(ఇష్టమైనది తొలగిపోయినపుడు, ఇష్టముకానిది సమకూడినపుడు - ఇష్టమైనది అయిపోయినపుడు, ఇష్టముకానిది ప్రాప్తించినను కలుగు దుఃఖమునకు కారణము కనబడినందున కలుగునది).
(నరకము మొదలగువాటివలన కలుగునది).
(మరణము - జన్మపరంపర రూపమైన సంసారమువలన కలుగు భయము).
గర్భ జన్మ జరామరణాది సాంసారిక భయం -
(తల్లి గర్భములో ప్రవేశించుట, జన్మించుట, పెరిగి పెరిగి ముసలి అయి చనిపోవుటయే రూపమైన సంసారమునకు సంబంధించిన భయము).
(మధుసూధనీ వ్యాఖ్య)
(తనకు అనురాగము కలిగిన విషయము నశించిపోవు సమయము దగ్గరకురాగా దానినితప్పించుకొను సామర్థ్యము చింతించుచు దీనుడువలె నుండు చిత్తవృత్తి).
(నియమించబడినకాలమువరకు స్వర్గములో పొందకలుగు సుఖముల ననుభవించి, పుణ్యము క్షీణించగానే మరల మర్త్యలోకమును ప్రవేశించుట తోడనే గొప్పదగు గర్భవాసమనెడి నరకముగల జన్మలనేకములలో కలుగు దుఃఖమును కలుగచేయునది కనుక భయము).
(తనుకానిది - ఆత్మకానిది - యింకొకటి యున్నదనుకొనుట వలన కలుగు భయము).
తద్గోచరస్య దుర్దైవాన్నాశకే ప్రత్యుపస్థితే,
తన్నిరాకరణా శక్తేః యత్ దైన్యం తద్భయం స్మృతం ||“. (గీతాభావ ప్రకాశము - 2 - 569. 570)
(తనకు దేనియందు రాగము కలుగునో దానికి నాశము కలుగునపుడు దానిని నివారింప శక్తిలేక దైన్యము పొందినపుడు తనకు కలిగిన చిత్తవృత్తి విశేషము).
(నారాయణీయము - 91)
(భగవంతుడు కాక మఱియొక వస్తువు - రెండవవస్తువు ఉన్నదనుకున్నయడల దానివలన భయము కలుగును - ఉన్నదంతా భగవంతుడొక్కడే రెండవ వస్తువు లేనే లేదు - ఉన్నదనుకొనుట మనసులో కల్పితము. అందుచేత అభ్యాసమువలన మనస్సును బుద్ధిచేత నిరోధించవలెను).
(భయము భగవంతుని మాయవలన కలుగును అని లోకములో ప్రసిద్ధిగానున్నది. అది దేహము నేనే అను అభినివేశమువలన కలుగుచున్నది, అది దేహము నేనే అను అహంకారము వలన కలుగుహున్నది. ఇది తన స్వరూపమును (తానే పరమాత్మ - అహం బ్రహ్మస్మి) అని స్మరించకపోవుటవలన - మఱచిపోవుటవలన - కలుగును - భగవంతునియందు విముఖతవలన మరుపు కలుగును - అందుచేత దేహమునేనే యను అభినివేశము కలుగును) - (దేహము ఎప్పుడు నశించిపోవునో యను భయము కలుగును).
(చెట్లకు పెద్దగాలివలన భయము, పర్వతములకు ఇంద్రుని వజ్రాయుధమువలన భయము, సాధువులకు దుర్మార్గులవలన భయము కలుగుచున్నది).
(పెనుగాలి వీచిన చెట్లు వేళ్ళతో ఊడి పడిపోవును - శిశిరము - మంచిఉపడిన పద్మములు ముడుచుకుపోవును - కొండల రెక్కలను ఇంద్రుడు వజ్రాయుధముతో నరికివేసెను - దుర్మార్గులు కొట్టినను, తిట్టినను సాధువులు అలుగరు - అనుభవించెదరు).
(భర్తృహరిసుభాషితం)
(ఇష్టము వచ్చినదానిని తిని, అనుభవించినవాడికి, అట్లు చేయుటవలన రోగము వచ్చునో యను భయము - మంచి కులములో (శ్రేష్టకులములో) పుట్టినవానికి, ఆ కులమునుండి చ్యుతి (కులచ్యుతి) - దిగజారిపోవుట) కలుగునేమో యను భయము, ధనమున్నవానికి, రాజు దానిని తీసుకొనునేమో యను భయము - గౌరవముగా బ్రతుకువానికి నిందకలుగునేమో యను భయము, బలవంతునకు తనకన్న బలవంతుడగు శత్రువువలన భయము - సౌందర్యము గలవానికి, ముసలితనమువచ్చి ఆ సౌందర్యము పోవునేమో యను భయము. పండితులకు ఇతర పండితులతో వాదోపవాదములు వచ్చుననుభయము - గుణవంతులకు దుర్మార్గులవలన భయము - కాముకునకు మరణము వచ్చునేమో యను భయము - ఈ రీతిగా భూమిమీద సమస్త వస్తువులు భయమును కలుగచేయునవే - వైరాగ్యమొక్కటే భయమును కలుగచేయనది)
“ప్రాణార్థవంతులకు భయంబు నిత్యంబు”. (శ్రీమదాంధ్రమహాభాగవంతు - 7 -)
“సుఖం దుఃఖం, భవో(అ)భావో, భయం చా భయమేవ చ | - - - మత్త ఏవ పృధక్ విధాః - - -”. (శ్రీమద్భగవద్గీత - 10 - 4, 5)
(సుఖదుఃఖములు, జననమరణములు, వాటివలన కలుగు భయము, అభయము నా వలననే (భగవంతునిచే) అనేక విధములుగా కలుగుచున్నవి. అవన్నియు భగవంతుడే - మూర్తివంతముకానివి కూడ (abstract things) భగవంతుడే - అందుచేత సుఖ దుఃఖములు అనునవి లేవు - వటి వలన కలుగు భయము లేదు).
(ఇప్పుడున్న దేవతులు, తిర్యక్ జంతువులు, మానవులు, స్థావరములు - కొండలు చెట్లు మొదలగునవి - వేరు వేరుగా భేదములతో కనబడు ఈ జగత్తు అంతయు బ్రహ్మమేయని అనుసంథానము చేయువానికి - ధ్యానము చేయువానికి - శాంతి (మనశ్శాంతి)కలుగుటచేత అతనికి అందువలన అభయము కలుగుటవలన భయము కలుగుటవకాశమే లేదు).
(ఎంతవరకు భగవంతుడు వేరు, జగత్తు వేరు అను భేద బుద్ధి కలుగునో అప్పుడు జగత్తులోని వస్తువులవలన భయము కలుగును. జగత్తు అంతా బ్రహ్మమేయని బ్రహ్మధ్యానమందు నిష్టకలిగియుండుటవలన దేని వలనను భయము కలుగదు - భయపడువాడు, భయము కలుగచేయునది బ్రహ్మమే కనుక).
యద్వేత్తి తత్స కురుతే న భయం తస్య కుత్రచిత్ ||“. (అష్టావక్రగీత)
(జగదీశ్వరుడు, పరమాత్ముడైనవాడు అద్వయుడు - (తనకన్న వేరొక వస్తువు లేనివాడు) అయిన వానిని తెలుసుకొనినవానికి ఎక్కడను, దేనివలనను భయములేదు). “రాముడు రక్షకుండు రఘురాముని నమ్మిన బంటు నేను నాకేమి భయంబు”.
యే నమస్యంతి గోవిందం న తేషాం విద్యతే భయం ||“. (మహాభారతము - శాంతి పర్వము)
(నీలమైన దేహము కలవాడు, పచ్చనిబట్ట కట్టుకొనినవాడు అచ్యుతుడు అయిన గోవిందునకు (శ్రీమహావిష్ణువునకు) నమస్కరించువారికి భయము లేదు).
లక్ష్మణో మిత్రమస్మాకం కో విచారః కుతో భయం? ||“. (శ్రీరామ కర్ణామృతం - 1 - 53)
(శ్రీమతి జానకీదేవి నా తల్లి, రఘునందనుడైన శ్రీరామచంద్రుడు నాకు సాక్షాత్తు తండ్రి, లక్ష్మణస్వామి నా మిత్రుడు నాకేమి విచారము? దేనినుండి భయము?).
trāsaḥ (jaḍiyuṭa)
bibhēti asmāt iti bhayaṃ - cōra vyāgrādi. (śrīśaṃkaraḥ)
(dīnivalana bhayapaḍuduru kanuka bhayamu cōrulavalanakāni, krūrajaṃtuvulainapululu modalaguvāṭi valana kalugunadi).
(muṃdurābōvu duḥkhamunaku kāraṇamu kanabaḍuṭavalana kalugu duḥkhamu).
(iṣṭamainadi tolagipōyinapuḍu, iṣṭamukānidi samakūḍinapuḍu - iṣṭamainadi ayipōyinapuḍu, iṣṭamukānidi prāptiṃcinanu kalugu duḥkhamunaku kāraṇamu kanabaḍinaṃduna kalugunadi).
(narakamu modalaguvāṭivalana kalugunadi).
(maraṇamu - janmaparaṃpara rūpamaina saṃsāramuvalana kalugu bhayamu).
garbha janma jarāmaraṇādi sāṃsārika bhayaṃ -
(talli garbhamulō pravēśiṃcuṭa, janmiṃcuṭa, perigi perigi musali ayi canipōvuṭayē rūpamaina saṃsāramunaku saṃbaṃdhiṃcina bhayamu).
(madhusūdhanī vyākhya)
(tanaku anurāgamu kaligina viṣayamu naśiṃcipōvu samayamu daggarakurāgā dāninitappiṃcukonu sāmarthyamu ciṃtiṃcucu dīnuḍuvale nuṃḍu cittavṛtti).
(niyamiṃcabaḍinakālamuvaraku svargamulō poṃdakalugu sukhamula nanubhaviṃci, puṇyamu kṣīṇiṃcagānē marala martyalōkamunu pravēśiṃcuṭa tōḍanē goppadagu garbhavāsamaneḍi narakamugala janmalanēkamulalō kalugu duḥkhamunu kalugacēyunadi kanuka bhayamu).
(tanukānidi - ātmakānidi - yiṃkokaṭi yunnadanukonuṭa valana kalugu bhayamu).
tadgōcarasya durdaivānnāśakē pratyupasthitē,
tannirākaraṇā śaktēḥ yat dainyaṃ tadbhayaṃ smṛtaṃ ||“. (gītābhāva prakāśamu - 2 - 569. 570)
(tanaku dēniyaṃdu rāgamu kalugunō dāniki nāśamu kalugunapuḍu dānini nivāriṃpa śaktilēka dainyamu poṃdinapuḍu tanaku kaligina cittavṛtti viśēṣamu).
(nārāyaṇīyamu - 91)
(bhagavaṃtuḍu kāka maṟiyoka vastuvu - reṃḍavavastuvu unnadanukunnayaḍala dānivalana bhayamu kalugunu - unnadaṃtā bhagavaṃtuḍokkaḍē reṃḍava vastuvu lēnē lēdu - unnadanukonuṭa manasulō kalpitamu. aṃducēta abhyāsamuvalana manassunu buddhicēta nirōdhiṃcavalenu).
(bhayamu bhagavaṃtuni māyavalana kalugunu ani lōkamulō prasiddhigānunnadi. adi dēhamu nēnē anu abhinivēśamuvalana kalugucunnadi, adi dēhamu nēnē anu ahaṃkāramu valana kaluguhunnadi. idi tana svarūpamunu (tānē paramātma - ahaṃ brahmasmi) ani smariṃcakapōvuṭavalana - maṟacipōvuṭavalana - kalugunu - bhagavaṃtuniyaṃdu vimukhatavalana marupu kalugunu - aṃducēta dēhamunēnē yanu abhinivēśamu kalugunu) - (dēhamu eppuḍu naśiṃcipōvunō yanu bhayamu kalugunu).
(ceṭlaku peddagālivalana bhayamu, parvatamulaku iṃdruni vajrāyudhamuvalana bhayamu, sādhuvulaku durmārgulavalana bhayamu kalugucunnadi).
(penugāli vīcina ceṭlu vēḷḷatō ūḍi paḍipōvunu - śiśiramu - maṃciupaḍina padmamulu muḍucukupōvunu - koṃḍala rekkalanu iṃdruḍu vajrāyudhamutō narikivēsenu - durmārgulu koṭṭinanu, tiṭṭinanu sādhuvulu alugaru - anubhaviṃcedaru).
(bhartṛharisubhāṣitaṃ)
(iṣṭamu vaccinadānini tini, anubhaviṃcinavāḍiki, aṭlu cēyuṭavalana rōgamu vaccunō yanu bhayamu - maṃci kulamulō (śrēṣṭakulamulō) puṭṭinavāniki, ā kulamunuṃḍi cyuti (kulacyuti) - digajāripōvuṭa) kalugunēmō yanu bhayamu, dhanamunnavāniki, rāju dānini tīsukonunēmō yanu bhayamu - gauravamugā bratukuvāniki niṃdakalugunēmō yanu bhayamu, balavaṃtunaku tanakanna balavaṃtuḍagu śatruvuvalana bhayamu - sauṃdaryamu galavāniki, musalitanamuvacci ā sauṃdaryamu pōvunēmō yanu bhayamu. paṃḍitulaku itara paṃḍitulatō vādōpavādamulu vaccunanubhayamu - guṇavaṃtulaku durmārgulavalana bhayamu - kāmukunaku maraṇamu vaccunēmō yanu bhayamu - ī rītigā bhūmimīda samasta vastuvulu bhayamunu kalugacēyunavē - vairāgyamokkaṭē bhayamunu kalugacēyanadi)
“prāṇārthavaṃtulaku bhayaṃbu nityaṃbu”. (śrīmadāṃdhramahābhāgavaṃtu - 7 -)
“sukhaṃ duḥkhaṃ, bhavō(a)bhāvō, bhayaṃ cā bhayamēva ca | - - - matta ēva pṛdhak vidhāḥ - - -”. (śrīmadbhagavadgīta - 10 - 4, 5)
(sukhaduḥkhamulu, jananamaraṇamulu, vāṭivalana kalugu bhayamu, abhayamu nā valananē (bhagavaṃtunicē) anēka vidhamulugā kalugucunnavi. avanniyu bhagavaṃtuḍē - mūrtivaṃtamukānivi kūḍa (abstract things) bhagavaṃtuḍē - aṃducēta sukha duḥkhamulu anunavi lēvu - vaṭi valana kalugu bhayamu lēdu).
(ippuḍunna dēvatulu, tiryak jaṃtuvulu, mānavulu, sthāvaramulu - koṃḍalu ceṭlu modalagunavi - vēru vērugā bhēdamulatō kanabaḍu ī jagattu aṃtayu brahmamēyani anusaṃthānamu cēyuvāniki - dhyānamu cēyuvāniki - śāṃti (manaśśāṃti)kaluguṭacēta ataniki aṃduvalana abhayamu kaluguṭavalana bhayamu kaluguṭavakāśamē lēdu).
(eṃtavaraku bhagavaṃtuḍu vēru, jagattu vēru anu bhēda buddhi kalugunō appuḍu jagattulōni vastuvulavalana bhayamu kalugunu. jagattu aṃtā brahmamēyani brahmadhyānamaṃdu niṣṭakaligiyuṃḍuṭavalana dēni valananu bhayamu kalugadu - bhayapaḍuvāḍu, bhayamu kalugacēyunadi brahmamē kanuka).
yadvētti tatsa kurutē na bhayaṃ tasya kutracit ||“. (aṣṭāvakragīta)
(jagadīśvaruḍu, paramātmuḍainavāḍu advayuḍu - (tanakanna vēroka vastuvu lēnivāḍu) ayina vānini telusukoninavāniki ekkaḍanu, dēnivalananu bhayamulēdu). “rāmuḍu rakṣakuṃḍu raghurāmuni nammina baṃṭu nēnu nākēmi bhayaṃbu”.
yē namasyaṃti gōviṃdaṃ na tēṣāṃ vidyatē bhayaṃ ||“. (mahābhāratamu - śāṃti parvamu)
(nīlamaina dēhamu kalavāḍu, paccanibaṭṭa kaṭṭukoninavāḍu acyutuḍu ayina gōviṃdunaku (śrīmahāviṣṇuvunaku) namaskariṃcuvāriki bhayamu lēdu).
lakṣmaṇō mitramasmākaṃ kō vicāraḥ kutō bhayaṃ? ||“. (śrīrāma karṇāmṛtaṃ - 1 - 53)
(śrīmati jānakīdēvi nā talli, raghunaṃdanuḍaina śrīrāmacaṃdruḍu nāku sākṣāttu taṃḍri, lakṣmaṇasvāmi nā mitruḍu nākēmi vicāramu? dēninuṃḍi bhayamu?).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.