← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భేద దర్శీ bhēda darśī

Original — తెలుగు
  1. “యదేదేహ తదముత్ర, యదముత్ర తదర్వాహ మృత్యోస్స మృత్యుమాప్నోతి య ఇహ నానేవ పశ్యతి.”

ఇతి జీవ ప్రాజ్ఞ భేదదృష్టి మపవదతి

“ఇహ దేహే యచ్ఛైతన్యం తదేవాముత్ర సూర్యాదౌ ఏవ మహఖండైకరసే బ్రహ్మణి, యోనానేవ మిథ్యా భేదం పశ్యతి స భేదదర్శీ మరణా న్మరణం ప్రాప్నోతి. - సంసార భయాన్న ముచ్యతే ఇత్యర్థః”.

(ఇక్కడ భూలోకమందు ఏ చైతన్యముకలదో అదియే పరలోకములో సూర్యుడు మొదలగు వాటిలోను అఖండైకరసమైన - చైతన్యమొక్కటే, ఉన్న చైతన్యమంతా ఒకే చైతన్యము. పరబ్రహ్మమే చైతన్యశక్తి రూపములో అన్నింటిలోను ఉన్నాడు. అన్నీ భగవంతుడే. ఎవడు అన్నింటినీ వేఱు వేఱుగా చూచునో - భగవంతుని కంటె వేరైనవనియు, ఒకదానికంటె ఒకటి వేఱనినియు చూచునో (తలంచునో) అట్టివాడు భేదదర్శి. అంతా పరబ్రహ్మమే అయినను పరబ్రహ్మ వేఱు, ప్రపంచము వేఱు - ప్రపంచములోని వస్తువులు వేఱు అని తలచువాడుమరణమునుండి మరణమును పొందును - అనగా, మరణించి జన్మించి, మరల మరణించి జన్మించి - ఇట్లు మరల మరల జననమరణముల పొందుచుండును - సంసారములో చిక్కుకొని యుండునేగాని ముక్తిని (మోక్షమును) పొందడు).

  1. “గురౌ మనుష్య బుద్ధించ మంత్రే చాక్షర బుద్ధితాం |

ప్రతిమాను శిలా బుద్ధిం కుర్వాణో నరకం వ్రజేత్||“.

గురునియందు తనవంటి మనుష్యుడే యను బుద్ధియు, మంత్రమందు ఇవి సాధారణ అక్షరములే యను బుద్ధియు, ప్రతిమలందు దేవతా విగ్రహములందు (రాతితో చేసిన వాటియందు) ఇవి వట్టి రాతి బొమ్మలేయని బుద్ధియు కలిగియుండు వాడు నరకమును పొందును - వాటిని ఆయా దేవతా మూర్తులుగానే భావించవలెను - గురువును

“గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |

గురుస్సాక్షాత్పరబ్రహ్మ - - ||“.

అనినట్లు దైవ స్వరూపముగా భావించవలెను - అట్లు భావించిననే అతనివలన విద్య - బ్రహ్మజ్ఞానము - దానిలోని రహస్యము తెలియనగును - మంత్రములలోని అక్షరములనుకూడ పరబ్రహ్మ స్వరూపములే అని భావించవలెను - “ఓమిత్యేక్షరం బ్రహ్మ” - (‘ఓం’ అను ఒకే అక్షరము పరబ్రహ్మమని ఉపాసించవలెను). ‘అ ఇతి బ్రహ్మ’ ‘కం’ బ్రహ్మ, “అక్షాంతవర్ణం”, “ఆక్షాంతవర్ణాశ్రయం”- ‘క’ అనగా బ్రహ్మ అని భావించవలెను. అకారము మొదలు క్షకారమువఱకు గల వర్ణములు - అక్షరములు పరబ్రహ్మరూపములే అనిన్నీ ‘అ’ కారము మొదలు ‘క్ష’ కారమువఱకు గల వర్ణముల నాశ్రయించి యున్నవాడు - అనిన్నీ భావించవలెను - (every letter in the alphabet is charged with divinity).

  1. “శ్రీకృష్ణే తదర్చాయాం అన్యేషాం ప్రకృతౌ సతి |

శివేచ శివలింగే చ సూర్యే సూర్యమణౌ తథా |

గణేశే దుర్గాయాం ఏవం సర్వత్ర సుందరి |

యః కరఓతి భేదబుద్ధిః బ్రహ్మహత్యాం లభేత్తు సః |

స్వగురౌ స్వేష్ట దేవేచ జన్మదాతరిమాతరి |

కరోతి భేదబుద్ధిం యో బ్రహ్మహత్యాం లభేత్తు సః

వైష్ణవేషు చ భక్తేషు బ్రహ్మణేష్వితరేషు చ |

కరోతి బేదబుద్ధిం యో బ్రహ్మహత్యాం లభేత్తుసః |

విప్రపాదోదకే చైవ సాలగ్రామోదకే తథా |

కరోతి భేదబుద్ధిం యో బ్రహ్మ హత్యాం లభేత్తు సః |

శివే నైవేద్యకే చైవ హరినైవేద్యకే తథా |

కరోతి భేదబుద్ధిం యో బ్రహ్మహత్యాం లభేత్తు సః |

సర్వేశిరేశ్వరే కృష్ణే సర్వకారణ కారణే |

సర్వాద్యే సర్వదేవానాం సేవ్యే సర్వాంతరాత్మని |

మాయ యానేక రూపే వ్యాప్యేక ఏవహి నిర్గుణే |

కరోతి భేదబుద్ధిం యో బ్రహ్మ హత్యాం లభేత్తు సః ||“. (దేవీభాగవతం)

(శ్రీకృష్ణునకు, అతని అర్చా విగ్రహమునకు, శివునికి శివలింగమునకు, సూర్యునికి సూర్యకాంతమణికి గణాధిపతికి, దుర్గాదేవికి భేదమున్నదని - అదివేఱు ఇదివేఱు అని ఎవడు భేదబుద్ధితోనుండునో వాడు బ్రహ్మహత్యాపాతకము పొందును - తన గురువునందు, తన యిష్టదేవతయందు, తన తల్లియందు భేదబుద్ధికలవాడున్నూ; విష్ణుభక్తులందు, ఇతరులందు, ఇతర బ్రాహ్మణులందు భేదబుద్ధి కలవాడున్నూ, సాలగ్రామోదకమునందు, బ్రాహ్మణపాదములు కడిగిన జలమునందు భేదబుద్ధికలవాడున్నూ - (బ్రాహ్మణుడు విష్ణుస్వరూపుడు - “బ్రాహ్మణో మమ దేవతా” అను బుద్ధిలేనివాడున్నూ; శివునియందు, శివప్రసాదమునందు; ఆ ప్రకారముగానే విష్ణువునందు, విష్ణుప్రసాదమునందు భేదబుద్ధి కలవాడున్నూ; సర్వేశ్వరుడైనవంటిన్నీ, కారణములన్నింటికి కారణమైనటువంటిన్నీ, అన్నింటికి మొదటివాడు, సమస్త దేవతులచేత నారాధించబడువాడు, అన్నింటియందును అంతరాత్మగానుండువాడు, తన మాయచేత అనేకరూపములతో నుండువాడైనను ఒక్కడే, నిర్గుణుడు, - త్రిగుణములు లేనటువంటివాడు అయిన వానియందు భేదబుద్ధి కలిగియుండువాడు - వీరందరూ బ్రహ్మహత్యాపాతక మును పొందుదురు - పైన చెప్పినవన్నియు ఒక్కటే యని తలంచవలెను, వేఱు వేఱు అను తలంచవలదు).

Transliteration
  1. “yadēdēha tadamutra, yadamutra tadarvāha mṛtyōssa mṛtyumāpnōti ya iha nānēva paśyati.”

iti jīva prājña bhēdadṛṣṭi mapavadati

“iha dēhē yacchaitanyaṃ tadēvāmutra sūryādau ēva mahakhaṃḍaikarasē brahmaṇi, yōnānēva mithyā bhēdaṃ paśyati sa bhēdadarśī maraṇā nmaraṇaṃ prāpnōti. - saṃsāra bhayānna mucyatē ityarthaḥ”.

(ikkaḍa bhūlōkamaṃdu ē caitanyamukaladō adiyē paralōkamulō sūryuḍu modalagu vāṭilōnu akhaṃḍaikarasamaina - caitanyamokkaṭē, unna caitanyamaṃtā okē caitanyamu. parabrahmamē caitanyaśakti rūpamulō anniṃṭilōnu unnāḍu. annī bhagavaṃtuḍē. evaḍu anniṃṭinī vēṟu vēṟugā cūcunō - bhagavaṃtuni kaṃṭe vērainavaniyu, okadānikaṃṭe okaṭi vēṟaniniyu cūcunō (talaṃcunō) aṭṭivāḍu bhēdadarśi. aṃtā parabrahmamē ayinanu parabrahma vēṟu, prapaṃcamu vēṟu - prapaṃcamulōni vastuvulu vēṟu ani talacuvāḍumaraṇamunuṃḍi maraṇamunu poṃdunu - anagā, maraṇiṃci janmiṃci, marala maraṇiṃci janmiṃci - iṭlu marala marala jananamaraṇamula poṃducuṃḍunu - saṃsāramulō cikkukoni yuṃḍunēgāni muktini (mōkṣamunu) poṃdaḍu).

  1. “gurau manuṣya buddhiṃca maṃtrē cākṣara buddhitāṃ |

pratimānu śilā buddhiṃ kurvāṇō narakaṃ vrajēt||“.

guruniyaṃdu tanavaṃṭi manuṣyuḍē yanu buddhiyu, maṃtramaṃdu ivi sādhāraṇa akṣaramulē yanu buddhiyu, pratimalaṃdu dēvatā vigrahamulaṃdu (rātitō cēsina vāṭiyaṃdu) ivi vaṭṭi rāti bommalēyani buddhiyu kaligiyuṃḍu vāḍu narakamunu poṃdunu - vāṭini āyā dēvatā mūrtulugānē bhāviṃcavalenu - guruvunu

“gururbrahma gururviṣṇuḥ gururdēvō mahēśvaraḥ |

gurussākṣātparabrahma - - ||“.

aninaṭlu daiva svarūpamugā bhāviṃcavalenu - aṭlu bhāviṃcinanē atanivalana vidya - brahmajñānamu - dānilōni rahasyamu teliyanagunu - maṃtramulalōni akṣaramulanukūḍa parabrahma svarūpamulē ani bhāviṃcavalenu - “ōmityēkṣaraṃ brahma” - (‘ōṃ’ anu okē akṣaramu parabrahmamani upāsiṃcavalenu). ‘a iti brahma’ ‘kaṃ’ brahma, “akṣāṃtavarṇaṃ”, “ākṣāṃtavarṇāśrayaṃ”- ‘ka’ anagā brahma ani bhāviṃcavalenu. akāramu modalu kṣakāramuvaṟaku gala varṇamulu - akṣaramulu parabrahmarūpamulē aninnī ‘a’ kāramu modalu ‘kṣa’ kāramuvaṟaku gala varṇamula nāśrayiṃci yunnavāḍu - aninnī bhāviṃcavalenu - (every letter in the alphabet is charged with divinity).

  1. “śrīkṛṣṇē tadarcāyāṃ anyēṣāṃ prakṛtau sati |

śivēca śivaliṃgē ca sūryē sūryamaṇau tathā |

gaṇēśē durgāyāṃ ēvaṃ sarvatra suṃdari |

yaḥ karaōti bhēdabuddhiḥ brahmahatyāṃ labhēttu saḥ |

svagurau svēṣṭa dēvēca janmadātarimātari |

karōti bhēdabuddhiṃ yō brahmahatyāṃ labhēttu saḥ

vaiṣṇavēṣu ca bhaktēṣu brahmaṇēṣvitarēṣu ca |

karōti bēdabuddhiṃ yō brahmahatyāṃ labhēttusaḥ |

viprapādōdakē caiva sālagrāmōdakē tathā |

karōti bhēdabuddhiṃ yō brahma hatyāṃ labhēttu saḥ |

śivē naivēdyakē caiva harinaivēdyakē tathā |

karōti bhēdabuddhiṃ yō brahmahatyāṃ labhēttu saḥ |

sarvēśirēśvarē kṛṣṇē sarvakāraṇa kāraṇē |

sarvādyē sarvadēvānāṃ sēvyē sarvāṃtarātmani |

māya yānēka rūpē vyāpyēka ēvahi nirguṇē |

karōti bhēdabuddhiṃ yō brahma hatyāṃ labhēttu saḥ ||“. (dēvībhāgavataṃ)

(śrīkṛṣṇunaku, atani arcā vigrahamunaku, śivuniki śivaliṃgamunaku, sūryuniki sūryakāṃtamaṇiki gaṇādhipatiki, durgādēviki bhēdamunnadani - adivēṟu idivēṟu ani evaḍu bhēdabuddhitōnuṃḍunō vāḍu brahmahatyāpātakamu poṃdunu - tana guruvunaṃdu, tana yiṣṭadēvatayaṃdu, tana talliyaṃdu bhēdabuddhikalavāḍunnū; viṣṇubhaktulaṃdu, itarulaṃdu, itara brāhmaṇulaṃdu bhēdabuddhi kalavāḍunnū, sālagrāmōdakamunaṃdu, brāhmaṇapādamulu kaḍigina jalamunaṃdu bhēdabuddhikalavāḍunnū - (brāhmaṇuḍu viṣṇusvarūpuḍu - “brāhmaṇō mama dēvatā” anu buddhilēnivāḍunnū; śivuniyaṃdu, śivaprasādamunaṃdu; ā prakāramugānē viṣṇuvunaṃdu, viṣṇuprasādamunaṃdu bhēdabuddhi kalavāḍunnū; sarvēśvaruḍainavaṃṭinnī, kāraṇamulanniṃṭiki kāraṇamainaṭuvaṃṭinnī, anniṃṭiki modaṭivāḍu, samasta dēvatulacēta nārādhiṃcabaḍuvāḍu, anniṃṭiyaṃdunu aṃtarātmagānuṃḍuvāḍu, tana māyacēta anēkarūpamulatō nuṃḍuvāḍainanu okkaḍē, nirguṇuḍu, - triguṇamulu lēnaṭuvaṃṭivāḍu ayina vāniyaṃdu bhēdabuddhi kaligiyuṃḍuvāḍu - vīraṃdarū brahmahatyāpātaka munu poṃduduru - paina ceppinavanniyu okkaṭē yani talaṃcavalenu, vēṟu vēṟu anu talaṃcavaladu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.