(అనుభవించుటకు యోగ్యమైనవి - శబ్దం స్పర్శ, రూప,రస, గంధములు - వీటికి సంబంధించినవి - శబ్దమునకు సంబంధించినది శ్రావ్యమైన సంగీతము - శ్రీకృష్ణుని వేణుగానము వంటిది –
“- - - మౌనీంద్ర హృత్సరసీజంబులు సంచలింప మురళీ సంజాత గీతామృత
స్ఫురణన్ రాల్ గరగం జరించు హరి కై శోరంబు భావించెదన్” (శ్రీకృష్ణకర్ణామృతం - 1 - 18)
- స్పర్శకు సంబంధించినది - “తన్వీ తనూ భోగముల్;” “చల్లని కమ్మని గాలి మెల్లనవీచె” (శ్రీమదాంధ్రమహాభాగవతము -)
రూపమునకు సంబంధించినవి - కోటి కోటి మన్మధుల లావణ్యముగల శ్రీరామచంద్రుని విగ్రహము “లావణ్య రాము కన్నులార జూడరే”
(శ్రీత్యాగరాజు)
“కందర్పకోటి లావణ్యం వందేహం రఘునందనం”. రసమునకు సంబంధించినవి - తేనె మొదలగు పానీయములు - అధరామృతము - “నీ అధరామృతంబానగా లేని జిహ్వకు ఫలరససిద్ధి యేల -” (శ్రీమద్భాగవతము -)
గంధమునకు సంబంధించినవి - మంచిగంధము, పుష్పమాల - “నీ వనమాలికా గంధమబ్బలేని ఘ్రాణమేల”.
అనిభవించుటకు యోగ్యమైనవి - సకల ప్రాణులకు ఆవశ్యకములైన, అన్నము, నీరు, గాలి మొదలగునవి.
దృశ్యజాతం (సృష్టిలో కనబడుచున్న సమస్త వస్తువులు)
“తిషత్వసౌ భోక్తృ దోషో భోగ్యపి శ్రూయతా మయా |
అబ్ధి గిర్యాదికం సర్వం నశ్వరం కిముతేతరత్ ||“. (అనుభూతప్రకాశిక)
(సముద్రము, పర్వతములు మొదలగు నవన్నియు నశించునవియే - ఇక మిగిలినవస్తువులగుఱించి, చిన్న భోగ్య వస్తువుల గుఱించి - చెప్పనవసరములేదు).
అస్థి చర్మస్నాయు మజ్జామాంస శుక్లాదయో (అ)ఖిలాః |
భీభత్సా కారణేష్వేషు మజ్జతా భుజ్జతా కథం |
విణ్మూత్ర ఖాతే మగ్నస్సన్ భుంక్తే కోపి న బుద్ధిమాన ||“. (అనుభూతిప్రకాశిక)
(దేహము భోగాధికరణము - భోగములకు స్థానము - శరీరము కలిగిననే భోగముల ననుభవింప వచ్చును - ఆ దేహము యొక్క దోషము లేవియనగా - యముకలు, చర్మము, స్నాయువు, మజ్జా,మాంసము, శుక్లము మొదలగునవి, భయమును కలుగచేయునవి. వీటియందు మునుగుచు, వీటిని తినుట యెట్లు - విణ్మూత్రములను తినుచు వాటిలో మునిగియున్నవాడు ఎవడైనను బుద్ధిమంతుడు కానేరడు).
(anubhaviṃcuṭaku yōgyamainavi - śabdaṃ sparśa, rūpa,rasa, gaṃdhamulu - vīṭiki saṃbaṃdhiṃcinavi - śabdamunaku saṃbaṃdhiṃcinadi śrāvyamaina saṃgītamu - śrīkṛṣṇuni vēṇugānamu vaṃṭidi –
“- - - maunīṃdra hṛtsarasījaṃbulu saṃcaliṃpa muraḷī saṃjāta gītāmṛta
sphuraṇan rāl garagaṃ jariṃcu hari kai śōraṃbu bhāviṃcedan” (śrīkṛṣṇakarṇāmṛtaṃ - 1 - 18)
- sparśaku saṃbaṃdhiṃcinadi - “tanvī tanū bhōgamul;” “callani kammani gāli mellanavīce” (śrīmadāṃdhramahābhāgavatamu -)
rūpamunaku saṃbaṃdhiṃcinavi - kōṭi kōṭi manmadhula lāvaṇyamugala śrīrāmacaṃdruni vigrahamu “lāvaṇya rāmu kannulāra jūḍarē”
(śrītyāgarāju)
“kaṃdarpakōṭi lāvaṇyaṃ vaṃdēhaṃ raghunaṃdanaṃ”. rasamunaku saṃbaṃdhiṃcinavi - tēne modalagu pānīyamulu - adharāmṛtamu - “nī adharāmṛtaṃbānagā lēni jihvaku phalarasasiddhi yēla -” (śrīmadbhāgavatamu -)
gaṃdhamunaku saṃbaṃdhiṃcinavi - maṃcigaṃdhamu, puṣpamāla - “nī vanamālikā gaṃdhamabbalēni ghrāṇamēla”.
anibhaviṃcuṭaku yōgyamainavi - sakala prāṇulaku āvaśyakamulaina, annamu, nīru, gāli modalagunavi.
dṛśyajātaṃ (sṛṣṭilō kanabaḍucunna samasta vastuvulu)
“tiṣatvasau bhōktṛ dōṣō bhōgyapi śrūyatā mayā |
abdhi giryādikaṃ sarvaṃ naśvaraṃ kimutētarat ||“. (anubhūtaprakāśika)
(samudramu, parvatamulu modalagu navanniyu naśiṃcunaviyē - ika migilinavastuvulaguṟiṃci, cinna bhōgya vastuvula guṟiṃci - ceppanavasaramulēdu).
asthi carmasnāyu majjāmāṃsa śuklādayō (a)khilāḥ |
bhībhatsā kāraṇēṣvēṣu majjatā bhujjatā kathaṃ |
viṇmūtra khātē magnassan bhuṃktē kōpi na buddhimāna ||“. (anubhūtiprakāśika)
(dēhamu bhōgādhikaraṇamu - bhōgamulaku sthānamu - śarīramu kaliginanē bhōgamula nanubhaviṃpa vaccunu - ā dēhamu yokka dōṣamu lēviyanagā - yamukalu, carmamu, snāyuvu, majjā,māṃsamu, śuklamu modalagunavi, bhayamunu kalugacēyunavi. vīṭiyaṃdu munugucu, vīṭini tinuṭa yeṭlu - viṇmūtramulanu tinucu vāṭilō munigiyunnavāḍu evaḍainanu buddhimaṃtuḍu kānēraḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.