“పంచభ్రమ నివృత్తిశ్చ తథా స్ఫురతి చేతసి |
బింబ ప్రతిబింబ దర్శనేన భేదభ్రమో నివృత్తః |
స్ఫటిక లోహిత దర్శనేన పారమార్థిక కర్తృత్వ భ్రమో నివృత్తః |
ఘటమహాకాశ దర్శనేన సంగీత భ్రమా నివృత్తః |
రజ్జు స్పర్శ దర్శనేన కారణాత్ జగద్భిన్న జగతస్సత్యత్వ భ్రమో నివృత్తః |
కనక రుచిర దర్శనేన వికారిత్వ భ్రమో నివృత్తః“. (అన్నపూర్ణోపనిషత్)
(బింబ ప్రతిబింబ న్యాయమున - జీవుడు పరబ్రహ్మ యొక్క ప్రతిబింబమే యనుటవలన జీవుడు వేఱు పరబ్రహ్మ వేఱు అను భ్రమ తొలగిపోవును. ముత్యపు చిప్పను చూచి యిది వెండికాదు అను భ్రమవలన అది వెండియను భ్రమ తొలగిపోవును. ఘటాకాశము, మహాకాశములో కలిసిపోయినపుడు అది వేఱు ఇది వేఱు అను భ్రమ తొలగిపోవును. చీకటిలో త్రాడును చూచి అది పాము అనుకొను భ్రమ అది పాముకాదు త్రాడు యని తెలిసినంతనే తొలగిపోవును. అట్లే జగత్తునకు కారణమైనవాడు పరబ్రహ్మమే యని తెలుసుకొనుటచేత జగత్తు వేఱు, పరబ్రహ్మ వేఱు అను భ్రమ తొలగిపోవును. బంగారముతో చేసిన ఆభరణములు వేఱు బంగారము వేఱు అను భ్రమ ఆభరణములకు కారణము బంగారమే రెండింటికి భేదము లేదు అను జ్ఞానమువలన తొలగి పోవును).
“paṃcabhrama nivṛttiśca tathā sphurati cētasi |
biṃba pratibiṃba darśanēna bhēdabhramō nivṛttaḥ |
sphaṭika lōhita darśanēna pāramārthika kartṛtva bhramō nivṛttaḥ |
ghaṭamahākāśa darśanēna saṃgīta bhramā nivṛttaḥ |
rajju sparśa darśanēna kāraṇāt jagadbhinna jagatassatyatva bhramō nivṛttaḥ |
kanaka rucira darśanēna vikāritva bhramō nivṛttaḥ”. (annapūrṇōpaniṣat)
(biṃba pratibiṃba nyāyamuna - jīvuḍu parabrahma yokka pratibiṃbamē yanuṭavalana jīvuḍu vēṟu parabrahma vēṟu anu bhrama tolagipōvunu. mutyapu cippanu cūci yidi veṃḍikādu anu bhramavalana adi veṃḍiyanu bhrama tolagipōvunu. ghaṭākāśamu, mahākāśamulō kalisipōyinapuḍu adi vēṟu idi vēṟu anu bhrama tolagipōvunu. cīkaṭilō trāḍunu cūci adi pāmu anukonu bhrama adi pāmukādu trāḍu yani telisinaṃtanē tolagipōvunu. aṭlē jagattunaku kāraṇamainavāḍu parabrahmamē yani telusukonuṭacēta jagattu vēṟu, parabrahma vēṟu anu bhrama tolagipōvunu. baṃgāramutō cēsina ābharaṇamulu vēṟu baṃgāramu vēṟu anu bhrama ābharaṇamulaku kāraṇamu baṃgāramē reṃḍiṃṭiki bhēdamu lēdu anu jñānamuvalana tolagi pōvunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.