భ్రాంతి.
దేహాత్మాభిమాన స్వతంత్రాభిమాన రూపం భ్రమం.
(దేహమే ఆత్మ యను అభిమానము, నేను స్వతంత్రుడను అను అభిమానము కలిగియుండుట భ్రమ. దేహము ఆత్మకాదు, నరుడు స్వతంత్రుడుకాడు – కర్మ వలన దైవమువలన పనులు చేయువాడు. కానిది అవును అనుకొనుట భ్రమ.)
మిథ్యాజ్ఞానము (కానిది అవును అనుకొను జ్ఞానము)
చేతనేషు అచిద్ధర్మబుద్ధిః పరతంత్రేషు స్వతంత్ర బుద్ధిశ్చ భ్రమః.
(చేతన వస్తువులందు - చైతన్యము గల వస్తువులందు అవి అచిద్వస్తువులను బుద్ధి కలిగియుండుట. పరతంత్రములైనవాటియందు - కర్మతంత్రము, దైవతంత్రము అయినవాటియందు - స్వతంత్రబుద్ధి (అవి తనే చేసితినను బుద్ధి కలిగియుండుట).
(అనాత్మ వస్తువునందు తన బుద్ధియే కారణమనుకొనుట భ్రమ).
చీకటిలో త్రాడును చూచి అది పాము అనుకొనుట భ్రమ - ఇదియే అధ్యాసము - ఈ భ్రమ అవిద్యవలన - అజ్ఞానమువలన, నిజస్థితి తెలియకపోవుటవలన - కలిగినది. చైతన్యమే ఒకప్పుడు ఈ విధముగా పరిణమించును)
“భ్రమః పంచవిధో భాతి తదేవేహ సముచ్యతే -” |
జీవేశ్వరౌ భిన్న రూపావితి ప్రాథమకో భ్రమః |
ఆత్మ నిష్ట కర్తృగుణం వాస్తవం ద్వితీయకః |
శరీరిత్రయ సం యుక్త జీవస్సంగీ తృతీయకః |
జగత్కారణ రూపస్య వికారత్వం చతుర్థకః |
కారణాద్భిన్న జగత స్సత్యత్వం పంచమో భ్రమః. (అన్నపూర్ణోపనిషత్)
(భ్రమ అనునది అయిదు విధములుగానున్నది - జీవుడు వేఱు, పరబ్రహ్మ వేఱు అనుకొనుట మొదటిది. ఆత్మయే కర్తయనుకొనుట రెండవది. కారణశరీరము, సూక్ష్మశరీరము, స్థూలశరీరము అను మూడు శరీరములు గల జీవుడు సంగి - అన్నింటిని అంటియుండువాడు - ఈ శరీరముల గుణములు అతనికి అంటుకొనియుండును - అనుకొనుట మూడవది - (భగవంతుడు నిర్లెపుడు - తామరాకుమీద నీటివలె దేనిలోనున్నను దేనిని అంటియుండనివాడు; వాటి గుణములు తనకు చెందనివాడు. జగత్తునకు కారణమైన భగవంతుడు ఈ జగత్తుగా మారెను అనుట నాలుగవది. ఈ జగత్తునకు కారణమైన భగవంతునికంటె జగత్తు వేఱైనది అనుకొనుట అయిదవది).
అర్థం నాస్తి గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత |
జాగ్రత ||“.
(తల్లిలేదు, తండ్రిలేడు, బధువులేరు, సహోదరులులేరు, అర్థములేదు, గృహములేదు - ఇదంతయు భగవంతుడే యగుటవలన వేఱు వేఱు వస్తువులున్నవి యనుకొనుట భ్రమ).
bhrāṃti.
dēhātmābhimāna svataṃtrābhimāna rūpaṃ bhramaṃ.
(dēhamē ātma yanu abhimānamu, nēnu svataṃtruḍanu anu abhimānamu kaligiyuṃḍuṭa bhrama. dēhamu ātmakādu, naruḍu svataṃtruḍukāḍu – karma valana daivamuvalana panulu cēyuvāḍu. kānidi avunu anukonuṭa bhrama.)
mithyājñānamu (kānidi avunu anukonu jñānamu)
cētanēṣu aciddharmabuddhiḥ parataṃtrēṣu svataṃtra buddhiśca bhramaḥ.
(cētana vastuvulaṃdu - caitanyamu gala vastuvulaṃdu avi acidvastuvulanu buddhi kaligiyuṃḍuṭa. parataṃtramulainavāṭiyaṃdu - karmataṃtramu, daivataṃtramu ayinavāṭiyaṃdu - svataṃtrabuddhi (avi tanē cēsitinanu buddhi kaligiyuṃḍuṭa).
(anātma vastuvunaṃdu tana buddhiyē kāraṇamanukonuṭa bhrama).
cīkaṭilō trāḍunu cūci adi pāmu anukonuṭa bhrama - idiyē adhyāsamu - ī bhrama avidyavalana - ajñānamuvalana, nijasthiti teliyakapōvuṭavalana - kaliginadi. caitanyamē okappuḍu ī vidhamugā pariṇamiṃcunu)
“bhramaḥ paṃcavidhō bhāti tadēvēha samucyatē -” |
jīvēśvarau bhinna rūpāviti prāthamakō bhramaḥ |
ātma niṣṭa kartṛguṇaṃ vāstavaṃ dvitīyakaḥ |
śarīritraya saṃ yukta jīvassaṃgī tṛtīyakaḥ |
jagatkāraṇa rūpasya vikāratvaṃ caturthakaḥ |
kāraṇādbhinna jagata ssatyatvaṃ paṃcamō bhramaḥ. (annapūrṇōpaniṣat)
(bhrama anunadi ayidu vidhamulugānunnadi - jīvuḍu vēṟu, parabrahma vēṟu anukonuṭa modaṭidi. ātmayē kartayanukonuṭa reṃḍavadi. kāraṇaśarīramu, sūkṣmaśarīramu, sthūlaśarīramu anu mūḍu śarīramulu gala jīvuḍu saṃgi - anniṃṭini aṃṭiyuṃḍuvāḍu - ī śarīramula guṇamulu ataniki aṃṭukoniyuṃḍunu - anukonuṭa mūḍavadi - (bhagavaṃtuḍu nirlepuḍu - tāmarākumīda nīṭivale dēnilōnunnanu dēnini aṃṭiyuṃḍanivāḍu; vāṭi guṇamulu tanaku ceṃdanivāḍu. jagattunaku kāraṇamaina bhagavaṃtuḍu ī jagattugā mārenu anuṭa nālugavadi. ī jagattunaku kāraṇamaina bhagavaṃtunikaṃṭe jagattu vēṟainadi anukonuṭa ayidavadi).
arthaṃ nāsti gṛhaṃ nāsti, tasmāt jāgrata |
jāgrata ||“.
(tallilēdu, taṃḍrilēḍu, badhuvulēru, sahōdarululēru, arthamulēdu, gṛhamulēdu - idaṃtayu bhagavaṃtuḍē yaguṭavalana vēṟu vēṟu vastuvulunnavi yanukonuṭa bhrama).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.