(వస్తువునకు రెండు బీజములున్నవని వేదములు చెప్పుచున్నవి - ఇందుకు కారణమేమనగా నేను మాయాభాగము, బ్రహ్మ-భాగము అని రెండు భాగములుగల శబల బ్రహ్మరూపిణి నేనే, అట్టి నేనే ఈ జగత్తు అంతటిని సృష్టించుచున్నాను - ఇందుచేత - నేను రెండు భాగములు - మాయ, శబల బ్రహ్మ - నేనే అయి యుండుట చేత - బీజద్వయము అని వేదము చెప్పుచున్నది).
భాగద్వయవతీ యస్మాత్ సృజామి సకలం జగత్ |
తత్త్రైవ భాగస్సంప్రోక్తః సచ్చిదానంద నామకః |
మాయా ప్రకృతి సంజ్ఞస్తు ద్వితీయో భాగ ఈరితః |
సాచ మాయా పరాశక్తిః శక్తి మత్యహ మీశ్వరీ |
చంద్ర చంద్రికే దేయం మమాభిన్నత్వ మాగతా |
సామ్యావస్థాత్మికా చైషా మాయా మమ సురోత్తమా | (దేవీ భాగవతం)
(వేదములో నామంత్రమున బీజములు రెండు అని చెప్పబడినవి. నేను రెండు భాగములుగలవానినై జగత్తును సృష్టించుచున్నాను - ఒకటి సచ్చిదానందమను పేరుగలది; రెండవది మాయా ప్రకృతి అను సంజ్ఞ (పేరు) గలది. ఆ మాయ పరాశక్తి - ఆ శక్తిగల ఈశ్వరిని నేను - చంద్రునికి అతని కాంతి అయిన వెన్నెలకు తేడా లేదు (వేరు లేదు). అట్లే సామ్యావస్థను పొందిన నా శక్తి అగు మాయ నాకంటె వేఱుకాదు).
(శక్తిమంతునికన్న - శక్తిగలవానికన్న - వాని శక్తి వేఱుగానుండదు - అగ్ని కంటె అగ్ని శక్తి వేఱుగాదు. పరబ్రహ్మ భాగవాచకమైన ప్రణవము యొక్క (ఓం కారము యొక్క) శక్తి విశిష్ట బ్రహ్మవాచకము - బీజ ద్వయములోని మాయా శక్తి భాగము (మాయా శక్తి బీజము) మాయా విశిష్ట బ్రహ్మ వాచకము - రెండు బీజములున్నూ, విశిష్ట బ్రహ్మవాచకములే - అందుచేత 'హ్రీం' బ్రహ్మ వాచకమునకు సమానాధికరణ్యముగా చెప్పబడినది). - ('ఓం'; ’హ్రీం').
(మాయతో కలియని పరబ్రహ్మ - నిరాకార పరబ్రహ్మ. నిరాకారపరబ్రహ్మ - దేవి అయినను, శ్రీ మహావిష్ణువైనను, పరమేశ్వరుడైనను రెండు శక్తులు గలవాడు - చిచ్ఛక్తి (చైతన్య శక్తి.- పరా శక్తి); జడమైనదిప్రకృతి యను అపరాశక్తి. ఈ రెండు శక్తులు ఇచ్చట రెండు బీజములుగా చెప్పబడినవి - ఈ రెండు శక్తులు - ఈ రెండు శక్తులు భగవంతుని కంటె వేరు కావు. ఈ రెండు శక్తులు - బీజములు కలియుటవలననే సృష్టి జరుగుచున్నది. ఈ రెండు శక్తులు - రెండు బీజములు - తానే అయి యున్నందున ఈ రెండింటి రూపములతో భగవంతుడు సృష్టి చేయుచున్నాడు - (చూడుము - 'బీజము').
(vastuvunaku reṃḍu bījamulunnavani vēdamulu ceppucunnavi - iṃduku kāraṇamēmanagā nēnu māyābhāgamu, brahma-bhāgamu ani reṃḍu bhāgamulugala śabala brahmarūpiṇi nēnē, aṭṭi nēnē ī jagattu aṃtaṭini sṛṣṭiṃcucunnānu - iṃducēta - nēnu reṃḍu bhāgamulu - māya, śabala brahma - nēnē ayi yuṃḍuṭa cēta - bījadvayamu ani vēdamu ceppucunnadi).
bhāgadvayavatī yasmāt sṛjāmi sakalaṃ jagat |
tattraiva bhāgassaṃprōktaḥ saccidānaṃda nāmakaḥ |
māyā prakṛti saṃjñastu dvitīyō bhāga īritaḥ |
sāca māyā parāśaktiḥ śakti matyaha mīśvarī |
caṃdra caṃdrikē dēyaṃ mamābhinnatva māgatā |
sāmyāvasthātmikā caiṣā māyā mama surōttamā | (dēvī bhāgavataṃ)
(vēdamulō nāmaṃtramuna bījamulu reṃḍu ani ceppabaḍinavi. nēnu reṃḍu bhāgamulugalavāninai jagattunu sṛṣṭiṃcucunnānu - okaṭi saccidānaṃdamanu pērugaladi; reṃḍavadi māyā prakṛti anu saṃjña (pēru) galadi. ā māya parāśakti - ā śaktigala īśvarini nēnu - caṃdruniki atani kāṃti ayina vennelaku tēḍā lēdu (vēru lēdu). aṭlē sāmyāvasthanu poṃdina nā śakti agu māya nākaṃṭe vēṟukādu).
(śaktimaṃtunikanna - śaktigalavānikanna - vāni śakti vēṟugānuṃḍadu - agni kaṃṭe agni śakti vēṟugādu. parabrahma bhāgavācakamaina praṇavamu yokka (ōṃ kāramu yokka) śakti viśiṣṭa brahmavācakamu - bīja dvayamulōni māyā śakti bhāgamu (māyā śakti bījamu) māyā viśiṣṭa brahma vācakamu - reṃḍu bījamulunnū, viśiṣṭa brahmavācakamulē - aṃducēta 'hrīṃ' brahma vācakamunaku samānādhikaraṇyamugā ceppabaḍinadi). - ('ōṃ'; ’hrīṃ').
(māyatō kaliyani parabrahma - nirākāra parabrahma. nirākāraparabrahma - dēvi ayinanu, śrī mahāviṣṇuvainanu, paramēśvaruḍainanu reṃḍu śaktulu galavāḍu - cicchakti (caitanya śakti.- parā śakti); jaḍamainadiprakṛti yanu aparāśakti. ī reṃḍu śaktulu iccaṭa reṃḍu bījamulugā ceppabaḍinavi - ī reṃḍu śaktulu - ī reṃḍu śaktulu bhagavaṃtuni kaṃṭe vēru kāvu. ī reṃḍu śaktulu - bījamulu kaliyuṭavalananē sṛṣṭi jarugucunnadi. ī reṃḍu śaktulu - reṃḍu bījamulu - tānē ayi yunnaṃduna ī reṃḍiṃṭi rūpamulatō bhagavaṃtuḍu sṛṣṭi cēyucunnāḍu - (cūḍumu - 'bījamu').
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.