← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బీజాంకురన్యాయము bījāṃkuranyāyamu

Original — తెలుగు
  1. బీజమునుండి - విత్తనమునుండి - అంకురము (మొక్క) మొలచును. మొక్క పెద్దదిగా పెరిగి బీజములు కలిగించును - ఈ విధముగా బీజమునుండి మొలక, మొలకనుండి బీజము పుట్టుచున్నవి. బీజము కారణము, దానిలోనుండి మొలచిన మొలక కార్యము - మొలకలోనుండి బీజము పుట్టినపుడు మొలక కారణము, బీజము కార్యము - ఈ ప్రకారముగా కారణ వస్తువులోనుండి కార్య వస్తువు పుట్టుట జరుగుచున్నది. కార్య వస్తువు పుట్టకముందు అది కారణ వస్తువులో సూక్ష్మరూపములో నుండును - ఇట్లు జరుగుచుండుట బీజాంకుర న్యాయమని చెప్పబడినది).

  2. హేతు ఫలయోః కార్య కారణ భావః.

(కారణము దాని ఫలము, లేక, కారణ కార్యములకు అన్యోన్య సంబంధము)

  1. పూర్వ దేహ కర్మణః ఏ తద్దేహ సంబంధోత్పత్తిః. పూర్వ దేహశ్చ తత్పూర్వదేహకృత కర్మణః ఇతి బీజాంకురవత్ అనాదిత్వం -

(పూర్వ దేహములో - పూర్వ జన్మలో - చేసిన కర్మ ఫలముగా యిప్పటి జన్మము - కలిగినది. పూర్వ దేహము దానికి పూర్వమందలి జన్మలో చేసిన కర్మవలన కలిగినది. ఈప్రకారముగా బీజాంకుర న్యాయము వలె యిది - ఈ జన్మ పరంపర - ప్రవాహరూపముగా అనాది, మొదలు లేనిది (ఎప్పుడు ఎట్లు ప్రారంభమైనదో తెలియరానిది. అందుచేత అనాది - మొదలు లేనిది - అని చెప్పబడినది).

  1. "కర్మణో జాయతే జంతుర్బీజాదివ నవాంకురః |

జంతోః ప్రజాయతే కర్మ పునర్బీజ మహాంకురాత్ ||". (యోగవాశిష్టము - 95 - 21)

(బీజమునుండి - విత్తనమునుండి - కొత్త అంకురము (మొలక) పుట్టినట్లు, కర్మవలన జంతువు (ప్రాణి) కలుగుచున్నది - పుట్టుచున్నది. మరల అంకురమునుండి బీజము పుట్టినట్లు జంతువు వలన కర్మ పుట్టుచున్నది. (ప్రాణి కర్మ చేయుచున్నాడు). బీజాంకురన్యాయమువలెనే జననమరణరూపమైన సంసారము కలుగుచున్నది).

  1. "ఏతద్దేహ జన్య ధర్మాధర్మకర్మణః ఏతద్దేహ సంబంధ హేతుత్వే స్యాదన్యోన్యాశ్రయః, పూర్వ దేహ కర్మణః ఏతద్దేహ సంబంధోత్పత్తిః - పూర్వ దేహశ్చ తత్పూర్వదేహ కృత కర్మణః ఇతి బీజాంకుర వదనాదిత్వాత్ న అయం దోషః ".

(ఈ వర్తమాన దేహముతో - యీ జన్మలో చేయు పాప పుణ్య కర్మలు ఈ దేహమునకు కారణమైన దేహముతో అన్యోన్యాశ్రయము కలిగి యున్నవి. ఇదివరకు కలిగిన జన్మలో చేసిన కర్మ వలన ఈ ప్రస్తుత దేహము కలిగినది. ఇది వరకు దేహము దానికంటె పూర్వ దేహముతో చేసిన కర్మలవలన కలిగినది. ఈ ప్రకారముగా బీజాంకురన్యాయమువలె ఈ జన్మల ప్రవాహము - సంసారము - అనాది - మొదలు లేనిది, మొదలు తెలియనిది).

  1. "దేహి యైన పితృ దేహంబుచేత దేహియైన పుత్ర దేహంబు మాతృదేహంబువలనం గలుగుచుండు, నా ప్రకారంబున బీజంబువలన బీజంబు పుట్టుచుండ దేహి దేహికి నివి శాశ్వతంబై జరుగుచునుండు". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 15 - 455)

  2. "బీజాంకుర న్యాయో దృష్టాంతః న సాధ్యేన తుల్యో మమ ఇత్యభిప్రాయః - నను ప్రత్యక్షః కార్యకారణ భావో బీజాంకుర యోః అనాదిః. న పూర్వస్య పూర్వస్యా పర భావాదాది మత్వా భ్యువగమాత్. యథా ఇదానీం ఉత్పన్నో అపరో అంకురో బీజాదాదిమాన్ బీజం చా వరం అన్యస్మాత్ అంకురాదిత్రి క్రమేణోత్పన్నత్వాత్ ఆదివత్ ఏవం పూర్వః పూర్వోంకురో బీజం చ పూర్వం పూర్వ మాది వదేవేతి ప్రత్యేకం సర్వస్య బీజాంకుర జాతస్య ఆదిమత్వాత్ కస్య చిదనాదిత్వానుప పత్తిః". (శ్రీశంకరః)

(బీజాంకుర న్యాయము అను దృష్టాంతము సాధ్యమనియే నా అభిప్రాయము - కార్య కారణభావము (కారణమునుండి కార్య వస్తువు కలుగుట) బీజాంకురములలో ప్రత్యక్షముగా మనము చూచుచున్నదే. అది అనాదియే - ఇప్పుడు పుట్టిన అంకురము బీజము వలన పుట్టినది కనుక దానికి ఆది (కారణము) (కారణవస్తువు) కలదు - మఱియొక అంకురమువలన బీజముత్పత్తి యగుచున్నది. ఈ ప్రకారముగా క్రమ క్రమముగా జరుగుచున్నందున ఆది కలదు - ఆ ప్రకారముగానే యింతకు ముందున్న అంకురము బీజము వాటికి ముందు కారణ వస్తువు (ఆది) కలవియే - ఇట్లు వెనుక వెనుకకు వెళ్ళినకొలది ప్రతి అంకురము, ప్రతి బీజము ఇంకొక దానిలోనుండి పుట్టినవియే - ఇందుచేత అన్ని బీజములకు అంకురములకు ఆది (కారణవస్తువు) ఉంటున్నది గనుక ఏదియు అనాదికాదు అన్నియు ఏదైన నొక కారణవస్తువువలన కలిగినదే కనుక అనాదికాదు - అన్ని విధముల కారణవస్తువులకు ఒకటే ఆది (మూల కారణము). అదియే భగవంతుడు.భగవంతుడు వీటికి 'ఆది' గా నున్నాడు కనుక ఏదియు అనాదికాదు).

"అంకురో బీజాదిమాన్, బీజం అంకురాదిమత్ ఇతి బీజాంకురాభ్యో దృష్టాంతః. హేతు ఫలయోః కార్య కారణాభ్యుసగమే దృష్టాంతః, సాధ్య సమస్తుల్యః ఇత్యర్థః - బీజాంకుర సంతతే రనాదిత్వోక్తే బీజాంకురవ్యతిరేకేణ నహి బీజాంకురసంతతిరస్తి, ఏకత్వానుప పత్తేః - హేతు ఫలసంతయేరపి తథాత్వాత్. తస్తాత్ సుష్టూక్తః - "హేతోః ఫలస్య చానాదిః కథం తైరువవర్ణ్యతే -" ఇతి, న ప్రమాణకుశలైః సాధ్య సమో హేతుః. సాధ్య సిద్ధి నిమిత్త తయా యుజ్యతే -".

(అంకురము బీజము మొదలగునవి కలది, దాని సూక్ష్మరూపములోనుండి పైకి ఆవిర్భవింప చేయునది. బీజముకూడా తనలో సూక్ష్మరూపములోనున్న అంకురము మొదలగు వాటిని తనలోనుండి ఉద్భవింపచేయునది. ఇది దృష్టాంతముగా చెప్పబడుచున్నది. సృష్టిలో ఒక వస్తువులోనుండి ఇంకొక వస్తువు పుట్టుచున్నది అని చెప్పుటకు బీజాంకురన్యాయము ఉదాహరణగా చెప్పబడుచున్నది. కారణవస్తువులోనుండి కార్య వస్తువు పుట్టుచున్నదని చెప్పుటకు ఇది దృష్టాంతము క్రింద చెప్పబడుచున్నది. బీజమునుండి అంకురము పుట్టినపుడు ఆ బీజము యింకొక అంకురమునుండి పుట్టియుండును - ఆ అంకురము ఇంకొక బీజమునుండి పుట్టియుండవలయును. ఈ ప్రకారముగా వెనుకకు వెనుకకు వెళ్ళిన మొదటి బీజము, లేక, అంకురము దేనినుండి పుట్టినదో చెప్పుటకు అవకాశములేదు. అందుచేత ఈ న్యాయము ప్రకారము విత్తనమునుండి మొలక పుట్టుట, మొలకనుండి విత్తనము పుట్టుట, మొదటి విత్తనము లేక మొలక దేనినుండి పుట్టీనది అను విషయము తర్కము ప్రకారము సాధించుకొన వీలులేదు. ఉదాహరణమాత్రముగనే పనికి వచ్చుచున్నది. అందుచేత ఇది అనాది, దీనికి మొదలులేదు - ఎట్లు ప్రారంభమైనదో తెలియదు - అని చెప్పబడి యున్నది. సృష్టి క్రమములో కూడ కారణ కార్య వస్తువులకు మొదటి కారణ వస్తువేది - ఆది కారణమేదియని అనునపుడు పరమాత్మయని చెప్పబడినది. అయిన యడల అతనికి కారణ వస్తువేది యనిన అతను అనాది (ఆది లేనివాడు - మొదలు లేనివాడు - కారణము లేనివాడు, దేనినుండియు పుట్టనివాడు), జన్మ లేనివాడు (అజుడు) అని చెప్పియున్నారు - శ్రుతిలో "థాతా యథా పూర్వమకల్పయత్". (పూర్వకల్పములో వలెనే యీ కల్పములో కూడ సృష్టి చేసెను) అని చెప్పబడియున్నది. ముందు సృష్టిలోని జీవరాసులు ప్రళయకాలమందు సూక్ష్మరూపములో చతుర్ముఖ బ్రహ్మయందు (ప్రకృతి యందు) లీనముకాగా అవియే తరవాత సృష్టిలోమరల స్థూలరూపమును పొందుచున్నవి. అందుచేత పూర్వసృష్టిలోనివే తరువాత సృష్టిలోనివాటికి కారణము - అట్లు అయినయడల మొట్ట మొదటి సృష్టిలో పుట్టిన జీవులకు (వస్తువులకు) కారణముండవలెను - అది యేది? ఈ ప్రశ్న పరంపరలకు అంతము లేదు - అందుచేత ఈ సృష్టి కారణకార్య రూపము అనాదిగా వచ్చుచున్నది యని చెప్పియుండిరి. మొదటికారణము, ఆదికారణము, మూలకారణము, కారణకారణము భగవంతుడే).

(ఈ బీజాంకుర న్యాయమునకు వ్యతిరేకముగా సృష్టి జరుగుట లేదు - సృష్టికి భగవంతుడే కారణము - అతనికి కారణము లేదు - అట్లే సృష్టి క్రమములోని ముఖ్యమైన న్యాయము (Natural Law) బీజాంకుర న్యాయమునకు కూడ బీజము మొదటి కారణము భగవంతుడే (భగంతుడు బీజము - మహత్తత్వము అంకురము - (చూడుము - బీజము - 6).

  1. "బీజసంతతే రంకురసంతతేశ్చానిదిత్వం అన్యోన్య కారణత్వంచ అవిరుద్ధం సిద్ధ్యతి. బీజ జాతీయాదంకుర జాతీయం, అంకుర జాతీయాద్వీజ జాతీయం ఉత్పద్యమానం ఉపలభ్యతే. తధైవ హేతు జాతీయాత్ ఫలజాతీయం ఫలజాతీయాత్ చ హేతు జాతీయ మనిరుద్ధ మిత్యర్థః. (cause and effect).

(బీజము వలన మొక్క పుట్టుట, మొలకవలన బీజము పుట్టుట - ఈ ప్రకారముగా బీజమువలన మొలకలు, మొలకలవలన బీజము పుట్టుట విరుద్ధముకాదు - బీజమువలన మొలక, మొలకవలన బీజము పుట్టుట మన అనుభవము లోనిదే - ఆ ప్రకారముగానే కారణమువలన ఫలము, ఫలమువలన మరల కారణము కలుగుటకూడ విరుద్ధముకాదు).

(మనము ప్రపంచములో చూచుచునే యున్నాము - మనిషిలోనుండి ఇంకొక మనిషి, పశువులోనుండి యింకొక పశువు, పక్షిలోనుండి యింకొక పక్షి చెట్టులోనుండి (విత్తనములోనుండి) యింకొక చెట్టు పుట్టుట మనము చూచుచున్నదే. అందుచేత అది విరుద్ధముకాదు - ఈ ప్రపంచములోనున్న అనేక విధములైన వస్తువులన్నియు మొదటిలో (ప్రారంభములో) ఒకేదానినుండి పుట్టినవి. కాలక్రమము, స్వభావము మొదలగు శక్తుల బట్టి వస్తువులువేరు వేరుగా మారినను అన్నియు మొదటిలో ఒకే వస్తువుగా (ఆత్మగా) నుండెను. ఆ ఒకే వస్తువునుండియే పుట్టినవి - రూపములు పొందినవి. ఈ విషయము ఆధునికశాస్త్ర సమ్మతమే)

  1. "సదేవ సోమ్యే దమగ్ర ఆసీ దేవమేవా ద్వితీయం" ఇతి ప్రాక్సృష్టేర విభాగావ ధారణాన్నాస్తికర్మ యదపేక్షా విషమా సృష్టిస్స్యాత్ సృష్ట్యుత్తర కాలంహి శరీరాది విభాగాపేక్షం కర్మ, కర్మాపేక్షశ్చ శరీరాది విభాగః ఇతీతరేతరాశ్రయత్వం ప్రసజ్యేతి. అతో విభాగాదూర్ధ్వంకర్మాపేక్ష ఈశ్వరః ప్రవర్తతాం నామప్రాక్తు విభాగద్వై చిత్ర్యనిమిత్తస్య కర్మణో అభావాత్తుల్వైవా ద్యా సృష్టిఃప్రాప్నో తీతి చేత్ నైష దోషః - అనాదిత్వాత్ సంసారస్య భవేదేష దోషః - యద్యాది మానయం సంసారస్స్యాత్ - అనాదేతు సంసారే బీజాంకురవత్ హేతు హేతుమద్భావేన కర్మణ స్సర్గవైషమ్యస్య చ ప్రవృత్తిర్ని విరుద్ధ్యతే. (శ్రీశంకరః). (బ్రహ్మ సూత్రభాష్యే)

("ఈ సృష్టికి పూర్వము సత్పదార్థము (ఆత్మ) ఒక్కటే ఉండెను - అటువంటి వస్తువు అప్పుడు మఱియొకటిలేదు - అటువంటిదేకాక ఇంకేవిధమైన వస్తువైనను అప్పుడు లేదు" అని ఛాందోగ్యోపనిషత్ లో (6 - 2 - 1) చెప్పబడినది. దీనిని బట్టి సృష్టికి పూర్వము విభక్తమైన వస్తువేదియు లేదు - వేరు వేరుగానుండు వస్తువులేమియు లేవు - అంతా ఒకే వస్తువుగానుండెను - కనుక అప్పుడు కర్మ ప్రసక్తియే లేదు. కర్మ ప్రసక్తి లేనపుడు శరీరముండదు, పాపపుణ్యములుండవు, వాటి ఫలితముగా కలుగు పుణ్యపాప జన్మలు,వాటివల్ల కలుగు అనుభవము ఉండదు - కర్మవలన జన్మ, జన్మ వలన కర్మ - ఈ ప్రకారముగా అన్యోన్యాశ్రయము (ఒకదానినొకటి ఆశ్రయించి యుండుట - కర్మవలన జన్మ, జన్మవలన కర్మ జరుగుట) ఉండదు - అను వాదము సమంజసముకాదు - ఎందుచేతననగా - కర్మవలన జన్మ, జన్మవలన కర్మ, ఎప్పటినుండియో వచ్చుచున్నది. ఎప్పుడు మొదలైనదో తెలియదు - అందుచేత దానిని 'అనాది' అని చెప్పి యున్నారు. "న కర్మవిభాగాదితి చేన్న అనాదిత్వాత్ -" (బ్రహ్మసూత్రములు - 2 - 1 - 35). అనాది యని చెప్పుటవలన అన్యోన్యాశ్రయదోషము పోవును. ప్రతి కల్పమునందును పూర్వ కల్పములో వలెనే ధాత (చతుర్ముఖ బ్రహ్మ) సృష్టి చేసెను - (ఋగ్వేద సంహీత - 10 - 190 - 3)

"ప్రతి కల్పములోను పూర్వ కల్పములో వలెనే సృష్టి చేయబడుచున్నది". పూర్వ కల్పములో జీవుల ధర్మాధర్మ కర్మలబట్టి ఈ కల్పములో జన్మించి అందుకు అనుగుణమైన శరీరములను పొందుచున్నారు. ఇట్లైన యడల మొదటికల్పములో దేనిని బట్టి విషమసృష్టి కలిగెను? మొదటి సృష్టిలో భగవంతునిలోనుండి అనేక శక్తులు ప్రకృతితో కలిసి కాలక్రమమున స్వభావము కల్పించి ప్రకృతి యొక్క త్రిగుణములు అనేక విధములుగా ప్రవర్తించి, అనేక విధములైన రూపములు, స్వభావములు గల ప్రపంచ వస్తువులుగా రూపొందింప చేసెను - ప్రకృతి యొక్క త్రిగుణముల దోషములవలన పాప పుణ్య కార్యములు జరిగి వాటి వలన అనంత జన్మ పరంపరలకు కారణమాయెను).

("న రూపమస్యేహ తధోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్టా". (శ్రీమద్భగవద్గీత - 15 - 3)

(ఈ సంసారమునకు మొదలు. తుది దొరకదు (తెలియదు), ఒక రూపముకనబడదు. దీనికి భగవంతుడే ఆది - భగవంతునిలోనుండి పుట్టినది కనుక; దీనికి భగవంతుడే ఆది అంతము - అతనిలోనే అంతమైపోవునది కనుక - ప్రవాహరూపములో - మరల మరల సృష్టి ప్రళయములు కలుగుచుండుటవలన - బీజాంకురములుకూడ సృష్టిలోని వస్తువులేకనుక వాటికి కూడ ఇతర వస్తువులవలె భగవంతుడే 'ఆది'). (ఆదిబీజము - బీజ ప్రదః పిత ") (గీత).

Transliteration
  1. bījamunuṃḍi - vittanamunuṃḍi - aṃkuramu (mokka) molacunu. mokka peddadigā perigi bījamulu kaligiṃcunu - ī vidhamugā bījamunuṃḍi molaka, molakanuṃḍi bījamu puṭṭucunnavi. bījamu kāraṇamu, dānilōnuṃḍi molacina molaka kāryamu - molakalōnuṃḍi bījamu puṭṭinapuḍu molaka kāraṇamu, bījamu kāryamu - ī prakāramugā kāraṇa vastuvulōnuṃḍi kārya vastuvu puṭṭuṭa jarugucunnadi. kārya vastuvu puṭṭakamuṃdu adi kāraṇa vastuvulō sūkṣmarūpamulō nuṃḍunu - iṭlu jarugucuṃḍuṭa bījāṃkura nyāyamani ceppabaḍinadi).

  2. hētu phalayōḥ kārya kāraṇa bhāvaḥ.

(kāraṇamu dāni phalamu, lēka, kāraṇa kāryamulaku anyōnya saṃbaṃdhamu)

  1. pūrva dēha karmaṇaḥ ē taddēha saṃbaṃdhōtpattiḥ. pūrva dēhaśca tatpūrvadēhakṛta karmaṇaḥ iti bījāṃkuravat anāditvaṃ -

(pūrva dēhamulō - pūrva janmalō - cēsina karma phalamugā yippaṭi janmamu - kaliginadi. pūrva dēhamu dāniki pūrvamaṃdali janmalō cēsina karmavalana kaliginadi. īprakāramugā bījāṃkura nyāyamu vale yidi - ī janma paraṃpara - pravāharūpamugā anādi, modalu lēnidi (eppuḍu eṭlu prāraṃbhamainadō teliyarānidi. aṃducēta anādi - modalu lēnidi - ani ceppabaḍinadi).

  1. "karmaṇō jāyatē jaṃturbījādiva navāṃkuraḥ |

jaṃtōḥ prajāyatē karma punarbīja mahāṃkurāt ||". (yōgavāśiṣṭamu - 95 - 21)

(bījamunuṃḍi - vittanamunuṃḍi - kotta aṃkuramu (molaka) puṭṭinaṭlu, karmavalana jaṃtuvu (prāṇi) kalugucunnadi - puṭṭucunnadi. marala aṃkuramunuṃḍi bījamu puṭṭinaṭlu jaṃtuvu valana karma puṭṭucunnadi. (prāṇi karma cēyucunnāḍu). bījāṃkuranyāyamuvalenē jananamaraṇarūpamaina saṃsāramu kalugucunnadi).

  1. "ētaddēha janya dharmādharmakarmaṇaḥ ētaddēha saṃbaṃdha hētutvē syādanyōnyāśrayaḥ, pūrva dēha karmaṇaḥ ētaddēha saṃbaṃdhōtpattiḥ - pūrva dēhaśca tatpūrvadēha kṛta karmaṇaḥ iti bījāṃkura vadanāditvāt na ayaṃ dōṣaḥ ".

(ī vartamāna dēhamutō - yī janmalō cēyu pāpa puṇya karmalu ī dēhamunaku kāraṇamaina dēhamutō anyōnyāśrayamu kaligi yunnavi. idivaraku kaligina janmalō cēsina karma valana ī prastuta dēhamu kaliginadi. idi varaku dēhamu dānikaṃṭe pūrva dēhamutō cēsina karmalavalana kaliginadi. ī prakāramugā bījāṃkuranyāyamuvale ī janmala pravāhamu - saṃsāramu - anādi - modalu lēnidi, modalu teliyanidi).

  1. "dēhi yaina pitṛ dēhaṃbucēta dēhiyaina putra dēhaṃbu mātṛdēhaṃbuvalanaṃ galugucuṃḍu, nā prakāraṃbuna bījaṃbuvalana bījaṃbu puṭṭucuṃḍa dēhi dēhiki nivi śāśvataṃbai jarugucunuṃḍu". (śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 15 - 455)

  2. "bījāṃkura nyāyō dṛṣṭāṃtaḥ na sādhyēna tulyō mama ityabhiprāyaḥ - nanu pratyakṣaḥ kāryakāraṇa bhāvō bījāṃkura yōḥ anādiḥ. na pūrvasya pūrvasyā para bhāvādādi matvā bhyuvagamāt. yathā idānīṃ utpannō aparō aṃkurō bījādādimān bījaṃ cā varaṃ anyasmāt aṃkurāditri kramēṇōtpannatvāt ādivat ēvaṃ pūrvaḥ pūrvōṃkurō bījaṃ ca pūrvaṃ pūrva mādi vadēvēti pratyēkaṃ sarvasya bījāṃkura jātasya ādimatvāt kasya cidanāditvānupa pattiḥ". (śrīśaṃkaraḥ)

(bījāṃkura nyāyamu anu dṛṣṭāṃtamu sādhyamaniyē nā abhiprāyamu - kārya kāraṇabhāvamu (kāraṇamunuṃḍi kārya vastuvu kaluguṭa) bījāṃkuramulalō pratyakṣamugā manamu cūcucunnadē. adi anādiyē - ippuḍu puṭṭina aṃkuramu bījamu valana puṭṭinadi kanuka dāniki ādi (kāraṇamu) (kāraṇavastuvu) kaladu - maṟiyoka aṃkuramuvalana bījamutpatti yagucunnadi. ī prakāramugā krama kramamugā jarugucunnaṃduna ādi kaladu - ā prakāramugānē yiṃtaku muṃdunna aṃkuramu bījamu vāṭiki muṃdu kāraṇa vastuvu (ādi) kalaviyē - iṭlu venuka venukaku veḷḷinakoladi prati aṃkuramu, prati bījamu iṃkoka dānilōnuṃḍi puṭṭinaviyē - iṃducēta anni bījamulaku aṃkuramulaku ādi (kāraṇavastuvu) uṃṭunnadi ganuka ēdiyu anādikādu anniyu ēdaina noka kāraṇavastuvuvalana kaliginadē kanuka anādikādu - anni vidhamula kāraṇavastuvulaku okaṭē ādi (mūla kāraṇamu). adiyē bhagavaṃtuḍu.bhagavaṃtuḍu vīṭiki 'ādi' gā nunnāḍu kanuka ēdiyu anādikādu).

"aṃkurō bījādimān, bījaṃ aṃkurādimat iti bījāṃkurābhyō dṛṣṭāṃtaḥ. hētu phalayōḥ kārya kāraṇābhyusagamē dṛṣṭāṃtaḥ, sādhya samastulyaḥ ityarthaḥ - bījāṃkura saṃtatē ranāditvōktē bījāṃkuravyatirēkēṇa nahi bījāṃkurasaṃtatirasti, ēkatvānupa pattēḥ - hētu phalasaṃtayērapi tathātvāt. tastāt suṣṭūktaḥ - "hētōḥ phalasya cānādiḥ kathaṃ tairuvavarṇyatē -" iti, na pramāṇakuśalaiḥ sādhya samō hētuḥ. sādhya siddhi nimitta tayā yujyatē -".

(aṃkuramu bījamu modalagunavi kaladi, dāni sūkṣmarūpamulōnuṃḍi paiki āvirbhaviṃpa cēyunadi. bījamukūḍā tanalō sūkṣmarūpamulōnunna aṃkuramu modalagu vāṭini tanalōnuṃḍi udbhaviṃpacēyunadi. idi dṛṣṭāṃtamugā ceppabaḍucunnadi. sṛṣṭilō oka vastuvulōnuṃḍi iṃkoka vastuvu puṭṭucunnadi ani ceppuṭaku bījāṃkuranyāyamu udāharaṇagā ceppabaḍucunnadi. kāraṇavastuvulōnuṃḍi kārya vastuvu puṭṭucunnadani ceppuṭaku idi dṛṣṭāṃtamu kriṃda ceppabaḍucunnadi. bījamunuṃḍi aṃkuramu puṭṭinapuḍu ā bījamu yiṃkoka aṃkuramunuṃḍi puṭṭiyuṃḍunu - ā aṃkuramu iṃkoka bījamunuṃḍi puṭṭiyuṃḍavalayunu. ī prakāramugā venukaku venukaku veḷḷina modaṭi bījamu, lēka, aṃkuramu dēninuṃḍi puṭṭinadō ceppuṭaku avakāśamulēdu. aṃducēta ī nyāyamu prakāramu vittanamunuṃḍi molaka puṭṭuṭa, molakanuṃḍi vittanamu puṭṭuṭa, modaṭi vittanamu lēka molaka dēninuṃḍi puṭṭīnadi anu viṣayamu tarkamu prakāramu sādhiṃcukona vīlulēdu. udāharaṇamātramuganē paniki vaccucunnadi. aṃducēta idi anādi, dīniki modalulēdu - eṭlu prāraṃbhamainadō teliyadu - ani ceppabaḍi yunnadi. sṛṣṭi kramamulō kūḍa kāraṇa kārya vastuvulaku modaṭi kāraṇa vastuvēdi - ādi kāraṇamēdiyani anunapuḍu paramātmayani ceppabaḍinadi. ayina yaḍala ataniki kāraṇa vastuvēdi yanina atanu anādi (ādi lēnivāḍu - modalu lēnivāḍu - kāraṇamu lēnivāḍu, dēninuṃḍiyu puṭṭanivāḍu), janma lēnivāḍu (ajuḍu) ani ceppiyunnāru - śrutilō "thātā yathā pūrvamakalpayat". (pūrvakalpamulō valenē yī kalpamulō kūḍa sṛṣṭi cēsenu) ani ceppabaḍiyunnadi. muṃdu sṛṣṭilōni jīvarāsulu praḷayakālamaṃdu sūkṣmarūpamulō caturmukha brahmayaṃdu (prakṛti yaṃdu) līnamukāgā aviyē taravāta sṛṣṭilōmarala sthūlarūpamunu poṃducunnavi. aṃducēta pūrvasṛṣṭilōnivē taruvāta sṛṣṭilōnivāṭiki kāraṇamu - aṭlu ayinayaḍala moṭṭa modaṭi sṛṣṭilō puṭṭina jīvulaku (vastuvulaku) kāraṇamuṃḍavalenu - adi yēdi? ī praśna paraṃparalaku aṃtamu lēdu - aṃducēta ī sṛṣṭi kāraṇakārya rūpamu anādigā vaccucunnadi yani ceppiyuṃḍiri. modaṭikāraṇamu, ādikāraṇamu, mūlakāraṇamu, kāraṇakāraṇamu bhagavaṃtuḍē).

(ī bījāṃkura nyāyamunaku vyatirēkamugā sṛṣṭi jaruguṭa lēdu - sṛṣṭiki bhagavaṃtuḍē kāraṇamu - ataniki kāraṇamu lēdu - aṭlē sṛṣṭi kramamulōni mukhyamaina nyāyamu (Natural Law) bījāṃkura nyāyamunaku kūḍa bījamu modaṭi kāraṇamu bhagavaṃtuḍē (bhagaṃtuḍu bījamu - mahattatvamu aṃkuramu - (cūḍumu - bījamu - 6).

  1. "bījasaṃtatē raṃkurasaṃtatēścāniditvaṃ anyōnya kāraṇatvaṃca aviruddhaṃ siddhyati. bīja jātīyādaṃkura jātīyaṃ, aṃkura jātīyādvīja jātīyaṃ utpadyamānaṃ upalabhyatē. tadhaiva hētu jātīyāt phalajātīyaṃ phalajātīyāt ca hētu jātīya maniruddha mityarthaḥ. (cause and effect).

(bījamu valana mokka puṭṭuṭa, molakavalana bījamu puṭṭuṭa - ī prakāramugā bījamuvalana molakalu, molakalavalana bījamu puṭṭuṭa viruddhamukādu - bījamuvalana molaka, molakavalana bījamu puṭṭuṭa mana anubhavamu lōnidē - ā prakāramugānē kāraṇamuvalana phalamu, phalamuvalana marala kāraṇamu kaluguṭakūḍa viruddhamukādu).

(manamu prapaṃcamulō cūcucunē yunnāmu - maniṣilōnuṃḍi iṃkoka maniṣi, paśuvulōnuṃḍi yiṃkoka paśuvu, pakṣilōnuṃḍi yiṃkoka pakṣi ceṭṭulōnuṃḍi (vittanamulōnuṃḍi) yiṃkoka ceṭṭu puṭṭuṭa manamu cūcucunnadē. aṃducēta adi viruddhamukādu - ī prapaṃcamulōnunna anēka vidhamulaina vastuvulanniyu modaṭilō (prāraṃbhamulō) okēdāninuṃḍi puṭṭinavi. kālakramamu, svabhāvamu modalagu śaktula baṭṭi vastuvuluvēru vērugā mārinanu anniyu modaṭilō okē vastuvugā (ātmagā) nuṃḍenu. ā okē vastuvunuṃḍiyē puṭṭinavi - rūpamulu poṃdinavi. ī viṣayamu ādhunikaśāstra sammatamē)

  1. "sadēva sōmyē damagra āsī dēvamēvā dvitīyaṃ" iti prāksṛṣṭēra vibhāgāva dhāraṇānnāstikarma yadapēkṣā viṣamā sṛṣṭissyāt sṛṣṭyuttara kālaṃhi śarīrādi vibhāgāpēkṣaṃ karma, karmāpēkṣaśca śarīrādi vibhāgaḥ itītarētarāśrayatvaṃ prasajyēti. atō vibhāgādūrdhvaṃkarmāpēkṣa īśvaraḥ pravartatāṃ nāmaprāktu vibhāgadvai citryanimittasya karmaṇō abhāvāttulvaivā dyā sṛṣṭiḥprāpnō tīti cēt naiṣa dōṣaḥ - anāditvāt saṃsārasya bhavēdēṣa dōṣaḥ - yadyādi mānayaṃ saṃsārassyāt - anādētu saṃsārē bījāṃkuravat hētu hētumadbhāvēna karmaṇa ssargavaiṣamyasya ca pravṛttirni viruddhyatē. (śrīśaṃkaraḥ). (brahma sūtrabhāṣyē)

("ī sṛṣṭiki pūrvamu satpadārthamu (ātma) okkaṭē uṃḍenu - aṭuvaṃṭi vastuvu appuḍu maṟiyokaṭilēdu - aṭuvaṃṭidēkāka iṃkēvidhamaina vastuvainanu appuḍu lēdu" ani chāṃdōgyōpaniṣat lō (6 - 2 - 1) ceppabaḍinadi. dīnini baṭṭi sṛṣṭiki pūrvamu vibhaktamaina vastuvēdiyu lēdu - vēru vērugānuṃḍu vastuvulēmiyu lēvu - aṃtā okē vastuvugānuṃḍenu - kanuka appuḍu karma prasaktiyē lēdu. karma prasakti lēnapuḍu śarīramuṃḍadu, pāpapuṇyamuluṃḍavu, vāṭi phalitamugā kalugu puṇyapāpa janmalu,vāṭivalla kalugu anubhavamu uṃḍadu - karmavalana janma, janma valana karma - ī prakāramugā anyōnyāśrayamu (okadāninokaṭi āśrayiṃci yuṃḍuṭa - karmavalana janma, janmavalana karma jaruguṭa) uṃḍadu - anu vādamu samaṃjasamukādu - eṃducētananagā - karmavalana janma, janmavalana karma, eppaṭinuṃḍiyō vaccucunnadi. eppuḍu modalainadō teliyadu - aṃducēta dānini 'anādi' ani ceppi yunnāru. "na karmavibhāgāditi cēnna anāditvāt -" (brahmasūtramulu - 2 - 1 - 35). anādi yani ceppuṭavalana anyōnyāśrayadōṣamu pōvunu. prati kalpamunaṃdunu pūrva kalpamulō valenē dhāta (caturmukha brahma) sṛṣṭi cēsenu - (ṛgvēda saṃhīta - 10 - 190 - 3)

"prati kalpamulōnu pūrva kalpamulō valenē sṛṣṭi cēyabaḍucunnadi". pūrva kalpamulō jīvula dharmādharma karmalabaṭṭi ī kalpamulō janmiṃci aṃduku anuguṇamaina śarīramulanu poṃducunnāru. iṭlaina yaḍala modaṭikalpamulō dēnini baṭṭi viṣamasṛṣṭi kaligenu? modaṭi sṛṣṭilō bhagavaṃtunilōnuṃḍi anēka śaktulu prakṛtitō kalisi kālakramamuna svabhāvamu kalpiṃci prakṛti yokka triguṇamulu anēka vidhamulugā pravartiṃci, anēka vidhamulaina rūpamulu, svabhāvamulu gala prapaṃca vastuvulugā rūpoṃdiṃpa cēsenu - prakṛti yokka triguṇamula dōṣamulavalana pāpa puṇya kāryamulu jarigi vāṭi valana anaṃta janma paraṃparalaku kāraṇamāyenu).

("na rūpamasyēha tadhōpalabhyatē nāṃtō na cādirna ca saṃpratiṣṭā". (śrīmadbhagavadgīta - 15 - 3)

(ī saṃsāramunaku modalu. tudi dorakadu (teliyadu), oka rūpamukanabaḍadu. dīniki bhagavaṃtuḍē ādi - bhagavaṃtunilōnuṃḍi puṭṭinadi kanuka; dīniki bhagavaṃtuḍē ādi aṃtamu - atanilōnē aṃtamaipōvunadi kanuka - pravāharūpamulō - marala marala sṛṣṭi praḷayamulu kalugucuṃḍuṭavalana - bījāṃkuramulukūḍa sṛṣṭilōni vastuvulēkanuka vāṭiki kūḍa itara vastuvulavale bhagavaṃtuḍē 'ādi'). (ādibījamu - bīja pradaḥ pita ") (gīta).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.