← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బీజము bījamu

Original — తెలుగు
  1. విత్తనము, వీర్యము, కారణము, కారణకారణము, అజ్ఞానము, హేతువు.

  2. ప్రరోహ కారణం ప్రరోహ ధర్మిణాం (శ్రీశంకరః).

(పుట్టి పెరుగువాటుకి పుట్టుటకు కారణము).

  1. ఉద్గమస్థానం -

(సూక్ష్మరూపములోనుండి పైకి స్థూలరూపముగా వచ్చుటకు స్థాన మైనది).

  1. మూలము, మూలకారణము.

  2. సర్వ భూతానాం సనాతనం బీజం ప్రకృతి తత్వం సర్వేషాం పరిణామి ద్రవ్యాణాం స్వకార్య పరిణామ సామర్థ్యం ఇత్యర్థః - అధవా, బీజం ప్రరోహాకారణం జంగమస్థావర భూతానాం తత్తదుపాదాన ద్రవ్యం.

(సమస్త భూతములకు సనాతనమైన (ఎప్పటినుండియో యున్న) బీజము, అవి పుట్టుటకు కారణమైనది ప్రకృతి తత్వము - అనగా, మార్పులు చెందు స్వభా వముగల వస్తువులన్నింటికీ వాటిలో నారీతి పరిణామము (మార్పు) కలుగ చేయు సామర్థ్యము గలది యని యర్థము లేక, ఒక వస్తువులోనుండి ఇంకొక వస్తువు పుట్టుటకు - పైకి ఉబుకుటకు - కారణమైనది. (ఆత్మా - ఆధత్తే, కారణాత్ కార్యముత్పాదయతి) (కారణవస్తువునుండి కార్యవస్తువును పుట్టించునది కనుక ఆత్మ అని చెప్పబడినది). చరాచర రూపములైన భూతములన్నింటికీ ఉపాదాన వస్తువు - కుండకు మట్టివలె).

"బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం" (శ్రీమద్భగవద్గీత - 7 - 10)

"మాయోపాధిక చైతన్యం బీజం యత్సర్వ దేహినాం" (గీతాభావప్రకాశము - 10 - 164)

(సర్వ భూతములకు సర్వదేహములకు ఉత్పత్తికారణమైన బీజము మాయ ఉపాధిగాగల చైతన్యము నేనే (భగవంతుడే).

(మాయను ఉపాదిగా చేసుకొని, మాయలో (ప్రకృతిలో) భగవంతుడు ప్రవేశించి దాని చేత సృష్టి చేయించుచున్నాడు - అతను ప్రకృతిలో కలియుట చేతనే ప్రకృతి ఈ సృష్టి చేయగలుగుచున్నది. ప్రకృతి జడము. భగవంతునియొక్క చైతన్య శక్తి లేనిదే ప్రకృతి యేమియు చేయజాలదు. ఇదియే ప్రకృతి పురుషుల సంయోగము - (combination of matter and Energy) - దీనివలననే సృష్టి జరుగుచున్నది. ఈ ప్రకృతి పురుషుల సం యోగము వలనప్రకృతిలోనుండి మహత్తత్త్వము పుట్టినది. అందుచేత మహత్తత్త్వము పుట్టుటకు భగవంతుడు బీజము (కారణము), ప్రకృతి యోని. మహత్తత్వములో బీజముండుటవలన దానిలోనుండి అహంకారము పుట్టినది. ఈ ప్రకారముగా ఒకదానిలోనుండి మరొకటిపుట్టి, దానిలోనుండి యింకొకటి పుట్టుచున్నది. ఇదియే సృష్టి ప్రకారము - ఇప్పటివరకు ఈ ప్రకారముగానే జరుగుచున్నది. ఇకముందుకూడ నిట్లే జరుగును - ఇట్లు జరుగుచున్నపుడు ప్రతివస్తువులోను రెండు అంశలున్నవి - ఒకటి భగవదంశ, అదియే అతని చైతన్యశక్తి - బీజము. రెండవది ప్రకృతియొక్క అంశ - యోని. భగవంతుని చైతన్య శక్తి లేనిదే ఏ వస్తువైనను దానిలోనుండి ఇంకొక వస్తువును పుట్టింప చాలదు. అందుచేత అన్నివస్తువులు పుట్టుటకు బీజము భగవంతుడే - సృష్టికాలములోనేకాక స్థితి కాలమందుకూడ).

  1. మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం |

సంభవః సర్వభూతానాం తతో భవతి భారత |

సర్వయోనిషు కౌతేయ మూర్తయః సంబవంతి యాః |

తాసాం బ్రహ్మ మహద్యోనిరహం బీజప్రదః పితా ||". (శ్రీమద్భగవద్గీత - 14 - 3, 4)

(నేను సృష్టి చేయుటలో బ్రహ్మ (చతుర్ముఖ బ్రహ్మ; ప్రకృతి; మాయ) యోని. దానిలో నా బీజమునుంచి (నా చైతన్య శక్తి అను బీజమునుంచి) దానిచే గర్భము ధరింప చేయుచున్నాను - దానిలో నుండి వస్తువులను పుట్టింప చేయుచున్నాను. (దానిలోనుండి ఇట్లు సమస్త వస్తువులు పుట్టుచున్నవి - ఒకదానిలోనుండి ఒకటిగా పుట్టుచున్నవి. అట్లు పుట్టిన భూతములు కార్యములు - అవి ఎందులోనుండి పుట్టుచున్నవో అవి వాటికి కారణములు - తమలోనుండి యింకొక వస్తువును - కార్యవస్తువును - పుట్టించుటచేత అవి కారణవస్తువులు (యోనియని చెప్పబడుచున్నది) కాని వాటిలో ప్రకృతి యొక్క అంశ ఉన్నందువలననే అది యోని యని చెప్పబడుచున్నది. అందుచేతనే వీటి అంశకు మూలమైన ప్రకృతి అన్ని భూతములకు (మహత యోని) యోని యని చెప్పబడుచున్నది. ఈ ప్రకారముగానే ప్రతి వస్తువులో భగవంతుని చైతన్య శక్తి (అంశ) (బీజము) ఉండుటవలన ఆ వస్తువు ఇంకొక వస్తువును పుట్టించగలుగుచున్నది. అందుచేత మొదటిలోనే కాక యిప్పటివరకు, యికముందుకూడ ప్రతి వస్తువు పుట్టుటకు ప్రకృతి యోని, భగవంతుడు తన బీజమును (చైతన్యశక్తిని) దానిలో నుంచుటవలన బీజప్రదుడైనాడు).

  1. "బీజమవ్యయం" (శ్రీమద్భగవద్గీత - 9 - 18)

(బీజమనగా ఉత్పత్తి కారణము - ప్రపంచము భగవంతునిలోనుండి పుట్టినది. అందుచేత ప్రపంచమునకు భగవంతుడు బీజము; భగవంతునిలోనుండి ఒకదానిలోనుండి ఒకటిగా అన్ని వస్తువులు పుట్టినవి. పుట్టిన వస్తువునకు అది ఎందులోనుండి పుట్టినదో అది బీజము (కారణము). చెట్టు బీజములోనుండి పుట్టినది. ఈ ప్రకారముగా అన్ని వస్తువులు పుట్టుటకు వాటి బీజములుండును - ఆ వస్తువులన్నియు కాలక్రమేణ నశించవలసినవియే. వాటిలోని బీజము మాత్రము భగవతుడే కనుక - చిచ్ఛక్తితో కూడియున్న భగవంతుడే కనుక - నశింపదు. అన్ని వస్తువులకు, మొదటి బీజము (ఆది బీజము) అయిన భగవంతుడు శాశ్వతుడు (ఎల్లకాలములందుండువాడు). అందుచేత ఆ మొదటి బీజము అనంతము - అంతములేనిది. అందుచేత ప్రపంచములో పుట్టిన వస్తువులన్నియు ప్రళయకాలమందు నశించినను ఆ మొదటి బీజము నశించదు - ఈ శాశ్వత బీజమైన భగవంతునినుండి ప్రపంచములోని వస్తువులన్నియు ఒకదానిలోనుండి ఒకటిగా మరల మరల పుట్టుచుండును - అందుచేత భగవంతుడు (అవ్యయమైన) శాశ్వతమైన బీజము. ప్రళయములో ప్రపంచమంతా అంతరించిపోయినను భవంతుడనెడు బీజము అవ్యయము; నశింపనిది, శాశ్వతమైనది).

  1. “న్యక్రోధ ఫలమద ఆహార;" 'ఇదం భగవః', 'భిందీతి', 'భిన్నం భగవతి'; ‘కిమిత్రపశ్యసి?'; 'అణవ ఇవే మాధా నాః', ’తానా మంగ ఏకాం భింది', 'భిన్నా భగవః'; 'కిమిత్ర పశ్యసి?’; 'నకించన భగవః'; "తంహో నాచ -”యం వై, సౌమ్య, ఏ తమణి మానం నని ఛాలయసే, ఏతస్యైవ ఖలు సోమ్యా ఏషోణిమ్నః ఏవం మహాన్ న్యగ్రోధస్తిష్ట తీతి". (ఛాందోగ్యోపనిషత్ 6 - 12 - 1)

('ఆ రావి పండు నిటు తెమ్ము'; 'తెచ్చితిని'; 'బ్రద్దలు సేయుము', 'కొట్టితిని'; ఏమి చూచుచున్నావు?; 'అణువులవంటి గింజలను', 'ఒకదానిని బ్రద్దలు చేయుము’; 'కొట్టితిని' "ఏమి చూచుచున్నావు?" ’ఏమున్నది, ఏమియును లేదు'; “నీవు గుర్తింపలేని ఈ సూక్ష్మమునందే ఈ మహాన్యాగ్రోధ వృక్షమున్నది." అని ప్ర శ్నోత్తర రూపమగు నీ సంవాదము జగత్తు యొక్క ప్రాగవస్థలో అణువులు ఏమియు లేవని శూన్య స్వభావము దృష్టాంతముగా చూపబడినది - 'న కించన' (యేమియును లేదు) అను మాటవల్ల అభివ్యక్తమైన నామరూపములు కలది యేదియును లేదను భావము - అంతేకాని శూన్య స్వభావము కాదు - అభివ్యక్తముకాని సూక్ష్మవస్తువు దానిలో కనబడకుండ ముందు (తర్వాత) చెట్టుగా పెరుగు దానికి కారణము. ఈ ప్రకారముగానే అభివ్యక్తమై (కంటికి కనబడు ప్రతివస్తువు, మొత్తము సృష్టి అంతటిలోనున్న వస్తువులన్నియు, ఒక సూక్ష్మాతి సూక్ష్మమైనది కారణముగా గలిగి, దానిలోనుండి పైకి అభివ్యక్తమై కంటికి ఇప్పుడు కనబడుచున్నవి).

"ఛాందోగ్యే జగత్కారణ జ్ఞాపకార్థం పితా పుత్ర మువాచ - "ఆసాం వట ధ్యానానాంమధ్యే ఏకం భిందేత". "భిన్నా భగవ" ఇత్యువాచ పుత్రః; పునఃపితా “కిమిత్ర పశ్య - సీత్యుక్తే -" నకించ న భగవః "ఇత్యాహ - తత్ర పితా" అణిమానం న పశ్య సీ "త్యుక్తం" తథాచ "నికించిన" శబ్దాచ్ఛాన్య స్వభావాదే ప్రతీయతే".

  1. "ఆప ఏవ స సర్జాదౌ తాసు బీజ మహ సృజత్".

(మొట్టమొదట భగవంతుడు సృష్టి చేయబూని జలతత్వమును సృజించెను - దానిలో తన బీజమునుంచెను -"Life thrives in water or liquid gas".)

"అమ్మహాత్ముండు లీలార్థంబై జగత్సర్జనంబు సేయుతలంపున బ్రహ్మాడంబు వినిర్భేధించి తనకు సుఖశయనంబు నపేక్షించి, మొదల జలతత్వంబు సృజియించె" - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 10 - 268)

"తే. - - - అమ్మహా పురుషవరుడు

కార్య కారణ రూపమై ఘనతకెక్కి

భూరి మాయాభిదాన విస్పురత శక్తి

వినుతికెక్కిన యట్టి యవిద్య యందు

క. పురుషాకృతి నాత్మాంశ

స్ఫురణము గల శక్తి నిలిపి పురుషోత్తము డీ

శ్వరుడభవుండజుడు నిజో

దర సంస్థితవిశ్వమపుడు దగ బుట్టించెన్". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 5 - 199, 200).

  1. "బీజము పృధివీ సంగమువల్ల తప్ప ఉత్పన్న పరిణామాలు కానట్టె సంస్కార విశిష్టమైన శుక్ల శోణిత బిందువులందు సం యోగ సిద్ధి గలిగితేనేగాని స్పురించదు".
Transliteration
  1. vittanamu, vīryamu, kāraṇamu, kāraṇakāraṇamu, ajñānamu, hētuvu.

  2. prarōha kāraṇaṃ prarōha dharmiṇāṃ (śrīśaṃkaraḥ).

(puṭṭi peruguvāṭuki puṭṭuṭaku kāraṇamu).

  1. udgamasthānaṃ -

(sūkṣmarūpamulōnuṃḍi paiki sthūlarūpamugā vaccuṭaku sthāna mainadi).

  1. mūlamu, mūlakāraṇamu.

  2. sarva bhūtānāṃ sanātanaṃ bījaṃ prakṛti tatvaṃ sarvēṣāṃ pariṇāmi dravyāṇāṃ svakārya pariṇāma sāmarthyaṃ ityarthaḥ - adhavā, bījaṃ prarōhākāraṇaṃ jaṃgamasthāvara bhūtānāṃ tattadupādāna dravyaṃ.

(samasta bhūtamulaku sanātanamaina (eppaṭinuṃḍiyō yunna) bījamu, avi puṭṭuṭaku kāraṇamainadi prakṛti tatvamu - anagā, mārpulu ceṃdu svabhā vamugala vastuvulanniṃṭikī vāṭilō nārīti pariṇāmamu (mārpu) kaluga cēyu sāmarthyamu galadi yani yarthamu lēka, oka vastuvulōnuṃḍi iṃkoka vastuvu puṭṭuṭaku - paiki ubukuṭaku - kāraṇamainadi. (ātmā - ādhattē, kāraṇāt kāryamutpādayati) (kāraṇavastuvunuṃḍi kāryavastuvunu puṭṭiṃcunadi kanuka ātma ani ceppabaḍinadi). carācara rūpamulaina bhūtamulanniṃṭikī upādāna vastuvu - kuṃḍaku maṭṭivale).

"bījaṃ māṃ sarvabhūtānāṃ viddhi pārtha sanātanaṃ" (śrīmadbhagavadgīta - 7 - 10)

"māyōpādhika caitanyaṃ bījaṃ yatsarva dēhināṃ" (gītābhāvaprakāśamu - 10 - 164)

(sarva bhūtamulaku sarvadēhamulaku utpattikāraṇamaina bījamu māya upādhigāgala caitanyamu nēnē (bhagavaṃtuḍē).

(māyanu upādigā cēsukoni, māyalō (prakṛtilō) bhagavaṃtuḍu pravēśiṃci dāni cēta sṛṣṭi cēyiṃcucunnāḍu - atanu prakṛtilō kaliyuṭa cētanē prakṛti ī sṛṣṭi cēyagalugucunnadi. prakṛti jaḍamu. bhagavaṃtuniyokka caitanya śakti lēnidē prakṛti yēmiyu cēyajāladu. idiyē prakṛti puruṣula saṃyōgamu - (combination of matter and Energy) - dīnivalananē sṛṣṭi jarugucunnadi. ī prakṛti puruṣula saṃ yōgamu valanaprakṛtilōnuṃḍi mahattattvamu puṭṭinadi. aṃducēta mahattattvamu puṭṭuṭaku bhagavaṃtuḍu bījamu (kāraṇamu), prakṛti yōni. mahattatvamulō bījamuṃḍuṭavalana dānilōnuṃḍi ahaṃkāramu puṭṭinadi. ī prakāramugā okadānilōnuṃḍi marokaṭipuṭṭi, dānilōnuṃḍi yiṃkokaṭi puṭṭucunnadi. idiyē sṛṣṭi prakāramu - ippaṭivaraku ī prakāramugānē jarugucunnadi. ikamuṃdukūḍa niṭlē jarugunu - iṭlu jarugucunnapuḍu prativastuvulōnu reṃḍu aṃśalunnavi - okaṭi bhagavadaṃśa, adiyē atani caitanyaśakti - bījamu. reṃḍavadi prakṛtiyokka aṃśa - yōni. bhagavaṃtuni caitanya śakti lēnidē ē vastuvainanu dānilōnuṃḍi iṃkoka vastuvunu puṭṭiṃpa cāladu. aṃducēta annivastuvulu puṭṭuṭaku bījamu bhagavaṃtuḍē - sṛṣṭikālamulōnēkāka sthiti kālamaṃdukūḍa).

  1. mama yōnirmahadbrahma tasmin garbhaṃ dadāmyahaṃ |

saṃbhavaḥ sarvabhūtānāṃ tatō bhavati bhārata |

sarvayōniṣu kautēya mūrtayaḥ saṃbavaṃti yāḥ |

tāsāṃ brahma mahadyōnirahaṃ bījapradaḥ pitā ||". (śrīmadbhagavadgīta - 14 - 3, 4)

(nēnu sṛṣṭi cēyuṭalō brahma (caturmukha brahma; prakṛti; māya) yōni. dānilō nā bījamunuṃci (nā caitanya śakti anu bījamunuṃci) dānicē garbhamu dhariṃpa cēyucunnānu - dānilō nuṃḍi vastuvulanu puṭṭiṃpa cēyucunnānu. (dānilōnuṃḍi iṭlu samasta vastuvulu puṭṭucunnavi - okadānilōnuṃḍi okaṭigā puṭṭucunnavi. aṭlu puṭṭina bhūtamulu kāryamulu - avi eṃdulōnuṃḍi puṭṭucunnavō avi vāṭiki kāraṇamulu - tamalōnuṃḍi yiṃkoka vastuvunu - kāryavastuvunu - puṭṭiṃcuṭacēta avi kāraṇavastuvulu (yōniyani ceppabaḍucunnadi) kāni vāṭilō prakṛti yokka aṃśa unnaṃduvalananē adi yōni yani ceppabaḍucunnadi. aṃducētanē vīṭi aṃśaku mūlamaina prakṛti anni bhūtamulaku (mahata yōni) yōni yani ceppabaḍucunnadi. ī prakāramugānē prati vastuvulō bhagavaṃtuni caitanya śakti (aṃśa) (bījamu) uṃḍuṭavalana ā vastuvu iṃkoka vastuvunu puṭṭiṃcagalugucunnadi. aṃducēta modaṭilōnē kāka yippaṭivaraku, yikamuṃdukūḍa prati vastuvu puṭṭuṭaku prakṛti yōni, bhagavaṃtuḍu tana bījamunu (caitanyaśaktini) dānilō nuṃcuṭavalana bījapraduḍaināḍu).

  1. "bījamavyayaṃ" (śrīmadbhagavadgīta - 9 - 18)

(bījamanagā utpatti kāraṇamu - prapaṃcamu bhagavaṃtunilōnuṃḍi puṭṭinadi. aṃducēta prapaṃcamunaku bhagavaṃtuḍu bījamu; bhagavaṃtunilōnuṃḍi okadānilōnuṃḍi okaṭigā anni vastuvulu puṭṭinavi. puṭṭina vastuvunaku adi eṃdulōnuṃḍi puṭṭinadō adi bījamu (kāraṇamu). ceṭṭu bījamulōnuṃḍi puṭṭinadi. ī prakāramugā anni vastuvulu puṭṭuṭaku vāṭi bījamuluṃḍunu - ā vastuvulanniyu kālakramēṇa naśiṃcavalasinaviyē. vāṭilōni bījamu mātramu bhagavatuḍē kanuka - cicchaktitō kūḍiyunna bhagavaṃtuḍē kanuka - naśiṃpadu. anni vastuvulaku, modaṭi bījamu (ādi bījamu) ayina bhagavaṃtuḍu śāśvatuḍu (ellakālamulaṃduṃḍuvāḍu). aṃducēta ā modaṭi bījamu anaṃtamu - aṃtamulēnidi. aṃducēta prapaṃcamulō puṭṭina vastuvulanniyu praḷayakālamaṃdu naśiṃcinanu ā modaṭi bījamu naśiṃcadu - ī śāśvata bījamaina bhagavaṃtuninuṃḍi prapaṃcamulōni vastuvulanniyu okadānilōnuṃḍi okaṭigā marala marala puṭṭucuṃḍunu - aṃducēta bhagavaṃtuḍu (avyayamaina) śāśvatamaina bījamu. praḷayamulō prapaṃcamaṃtā aṃtariṃcipōyinanu bhavaṃtuḍaneḍu bījamu avyayamu; naśiṃpanidi, śāśvatamainadi).

  1. “nyakrōdha phalamada āhāra;" 'idaṃ bhagavaḥ', 'bhiṃdīti', 'bhinnaṃ bhagavati'; ‘kimitrapaśyasi?'; 'aṇava ivē mādhā nāḥ', ’tānā maṃga ēkāṃ bhiṃdi', 'bhinnā bhagavaḥ'; 'kimitra paśyasi?’; 'nakiṃcana bhagavaḥ'; "taṃhō nāca -”yaṃ vai, saumya, ē tamaṇi mānaṃ nani chālayasē, ētasyaiva khalu sōmyā ēṣōṇimnaḥ ēvaṃ mahān nyagrōdhastiṣṭa tīti". (chāṃdōgyōpaniṣat 6 - 12 - 1)

('ā rāvi paṃḍu niṭu temmu'; 'teccitini'; 'braddalu sēyumu', 'koṭṭitini'; ēmi cūcucunnāvu?; 'aṇuvulavaṃṭi giṃjalanu', 'okadānini braddalu cēyumu’; 'koṭṭitini' "ēmi cūcucunnāvu?" ’ēmunnadi, ēmiyunu lēdu'; “nīvu gurtiṃpalēni ī sūkṣmamunaṃdē ī mahānyāgrōdha vṛkṣamunnadi." ani pra śnōttara rūpamagu nī saṃvādamu jagattu yokka prāgavasthalō aṇuvulu ēmiyu lēvani śūnya svabhāvamu dṛṣṭāṃtamugā cūpabaḍinadi - 'na kiṃcana' (yēmiyunu lēdu) anu māṭavalla abhivyaktamaina nāmarūpamulu kaladi yēdiyunu lēdanu bhāvamu - aṃtēkāni śūnya svabhāvamu kādu - abhivyaktamukāni sūkṣmavastuvu dānilō kanabaḍakuṃḍa muṃdu (tarvāta) ceṭṭugā perugu dāniki kāraṇamu. ī prakāramugānē abhivyaktamai (kaṃṭiki kanabaḍu prativastuvu, mottamu sṛṣṭi aṃtaṭilōnunna vastuvulanniyu, oka sūkṣmāti sūkṣmamainadi kāraṇamugā galigi, dānilōnuṃḍi paiki abhivyaktamai kaṃṭiki ippuḍu kanabaḍucunnavi).

"chāṃdōgyē jagatkāraṇa jñāpakārthaṃ pitā putra muvāca - "āsāṃ vaṭa dhyānānāṃmadhyē ēkaṃ bhiṃdēta". "bhinnā bhagava" ityuvāca putraḥ; punaḥpitā “kimitra paśya - sītyuktē -" nakiṃca na bhagavaḥ "ityāha - tatra pitā" aṇimānaṃ na paśya sī "tyuktaṃ" tathāca "nikiṃcina" śabdācchānya svabhāvādē pratīyatē".

  1. "āpa ēva sa sarjādau tāsu bīja maha sṛjat".

(moṭṭamodaṭa bhagavaṃtuḍu sṛṣṭi cēyabūni jalatatvamunu sṛjiṃcenu - dānilō tana bījamunuṃcenu -"Life thrives in water or liquid gas".)

"ammahātmuṃḍu līlārthaṃbai jagatsarjanaṃbu sēyutalaṃpuna brahmāḍaṃbu vinirbhēdhiṃci tanaku sukhaśayanaṃbu napēkṣiṃci, modala jalatatvaṃbu sṛjiyiṃce" - (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 10 - 268)

"tē. - - - ammahā puruṣavaruḍu

kārya kāraṇa rūpamai ghanatakekki

bhūri māyābhidāna vispurata śakti

vinutikekkina yaṭṭi yavidya yaṃdu

ka. puruṣākṛti nātmāṃśa

sphuraṇamu gala śakti nilipi puruṣōttamu ḍī

śvaruḍabhavuṃḍajuḍu nijō

dara saṃsthitaviśvamapuḍu daga buṭṭiṃcen". (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 5 - 199, 200).

  1. "bījamu pṛdhivī saṃgamuvalla tappa utpanna pariṇāmālu kānaṭṭe saṃskāra viśiṣṭamaina śukla śōṇita biṃduvulaṃdu saṃ yōga siddhi galigitēnēgāni spuriṃcadu".
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.