(దేని ప్రతిబింబము ఇంకొక చోట కనబడునో అది బింబము).
"అద్దము ఎదుట నిలబడినపుడు అద్దములో కనబడు మన చాయ (నీడ, బొమ్మ) మన ప్రతిబింబము, ఎదురుగా నిలుచుండి యున్న మనము బింబము“.
"పరబ్రహ్మము స్వసంవేద్యము. జీవేశ్వరులకు ఉపాస్య దేవత. ఆ నిర్గుణ బ్రహ్మమందు మాయావిద్యలు రెండున్నూ పుట్టెను. వివర్త రూపములయిన మాయ అవిద్యలు రెండున్నూ రెండు దర్పణములు (అద్దములు). ఆ దర్పణాలయందు బ్రహ్మం ప్రతిబింబించగా ఈశ్వరుడు అనిన్నీ, జీవుడు అనిన్నీ కలిగెను –
"సత్వ శుద్ధ్య శుద్ధిభ్యాం మాయా విద్యా ద్విధామతా ||
ఈ యర్ధమందు మాయా బింబ్వో వశీకృత్య తాం స్యాత్ సర్వజ్ఞ ఈశ్వరః |
అవిద్యావస్త్వన్యః తద్వై చిత్ర్యానేక థా |"
అయితే ముఖ్యమైన బ్రహ్మమునకే ఆకారం లేదు. బింబ ప్రతిబింబాలు ఎలాగయ్యెనంటే - నిరాకార నిరాభాసమైన బ్రహ్మ మందుమాయా అవిద్యలు మూర్తివంతాలు గావు - స్పురద్వాపమే ఘటమర సం యుక్తమైన నిరాలంబానకు ఘటాకాశము, మరాకాశము అని యేలాగు కలిగెనో అటువలనే వస్తువులలోను బింబ ప్రతిబింబమని నామధేయము కలిగెను - ఎక్కడెక్కడ యీ వసన స్ఫురించునో అక్కడక్కడ బ్రహ్మమధిష్టించి యుండును - కాబట్టి మాయ అవిద్యలను అధిష్టించియున్నదే ప్రతిబింబమనబడెను - కాబట్టి మాయ అవిద్యలను అధిష్టించియున్నదే ప్రతిబింబమనబడెను - బింబస్థానమైన బ్రహ్మమే ఉపమానబడెను - ప్రతిబింబమే, జీవ ఈశ్వరులనంబడెను - అని బింబప్రతిబింబ న్యాయము (బ్రహ్మ విద్యాసుధార్ణవము - 6)
జీవ పరమేశ్వర సాధారణం చైతన్య యాత్రం బింబం తస్యైవ బింబస్యా విద్యాత్మికాయాం మాయాయాం ప్రతిబింబమీశ్వర చైతన్యం అంతః కరణేషు ప్రతిబింబం జీవ చైతన్యం "కార్యోపాధి రయం జీవః కరణోపాధిరీశ్వరః" ఇతి శ్రుతేః. ఏ తన్మతే జలాశయగత శరావగత సూర్య ప్రతిబింబయోరివ జీవ పరమేశ్వరయోర్భేధః.
"నచరూప హీనస్య బ్రహ్మణస్య న ప్రతిబింబ సంభవః, రూపవత ఏవ తథాత్వ దర్శనాత్. న చ నీరూపస్య ద్రవ్యస్య ప్రతిబింబావ భావ నియమః. ఆత్మనః ద్రవ్యత్వా భావస్యోక్తత్వాత్ "ఏకథా బహుథా చైవ దృశ్యతే జల చంద్రవత్"
(బృహదారణ్యకోపనిషత్ - 12). (వేదాంత పరిభాషా)
(అజ్ఞుని దృష్టిలో బ్రహ్మము రెండు విధములుగా కల్పింపబడినది - సర్వజ్ఞు డగుటవలన 'జ్ఞః' అని చెప్పబడు ఈశ్వరుడు బింబము ; కించిజ్ఞుడు (కొంచెము తెలిసినవాడు) అయిన జీవుడు ప్రతిబింబము. బింబ ప్రతిబింబములను నీ రెండునూ మాయా కల్పితములు - సర్వ నియంతయైనను ఈ శ్వరుడు మాయా ఉపాధి లోనున్న వాడగుటచేత బింబమని చెప్పబడుచున్నాడు. అస్వతంత్రుడైన జీవుడు అవిద్య యను ఉపాధిలో నుండుటను బట్టి ప్రతిబింబమని చెప్పబడు చున్నాడు. ఇద్దరునూ అనాదులే - జన్మ లేని వారే. ఈశ్వరునికి జీవునికి భేదమునకిది కారణము).
(జీవునకు పరమేశ్వరునకు చైతన్యము సాధారణమే, ఒకటే, అదే బింబము. అవిద్యయును మాయ యందున్న ఈశ్వర చైతన్యము బింబము, అంతఃకరణమందుండు ఈశ్వర చైతన్యము ప్రతిబింబము, - "కారణమైన మాయ (లేక, ప్రకృతి) ఉపాధిగా కలవాడు ఈశ్వరుడు. కార్య వస్తువులు ఉపాధిగా గలవాడు జీవుడు" అని శ్రుతి చెప్పుచున్నది. ఈ మతములో జలాశయములో కనుపించు సూర్యుని ప్రతిబింబమువలె సూర్యునకు అందరి ప్రతిబింబమునకు గల భేదమే ఈశ్వరునకు జీవునకు కలదు).
ప్రతిబింబములు మిథ్యలు, వీటికి కారణమైన బింబము నిజమైనది, సత్యమైనది.
చిత్తము లేక మనస్సు పరమాత్మయొక్క వివర్తోపాదానము. దానినే ప్రతిబింబము లేక జీవుడని యందురు. ప్రతిబింబమనుటకు కారణము బింబ స్థానీయమగు ఆత్మను దర్పణ స్థానీయమగు తన బుద్ధియందు ప్రతిఫలింప చేసుకొని దానివలన చైతన్యమునుబొంది ఆత్మవలె వ్యవహరించుచున్న దగుటవలన ప్రతిబింబమను నామము అమరెను. పరమాత్మకు అతనివలన జనించిన వివర్త స్వరూపుడగు జీవునకును బింబ ప్రతిబింబ నాదృశము - పరమాత్మ బింబము, జీవుడు ప్రతిబింబస్వరూపుడు - దేహసంబంధమగు ముఖము బింబము, దానికి ఎదురుగనుండు అద్దమునందు గాన వచ్చునది ప్రతిబింబము. బింబము ప్రతిబింబముగ మారలేదు - ప్రతిబింబము నూతన వస్తువుకాదు. ఈ బింబ ప్రతిబింబ వ్యవహారములు మధ్యనున్న అద్దముననుసరించి కలిగినవి. అటులనే పరమాత్మ జీవాత్మగా మారలేదు. జీవాత్మ పరమాత్మ కాడు. మనస్సు అను అద్దమునందు ప్రతిఫలించుచున్నంతవరకు జీవాత్మ పరమాత్మలు భిన్నులని తెలియవలయును. వారి మధ్యనున్న అద్దము తీసివేసిన యడల బింబ ప్రతిబింబములను వ్యవహారముండదు. అప్పుడుండునది ఒక్క బింబమే. దర్పణ స్థానీయమగు మనస్సు (మాయ - శక్తి - విమర్శము, అవిద్య, ప్రకృతి, అజ్ఞానము, సంకల్పము) తొలగిన యడల జీవాత్మ పరమాత్మలను భేద వ్యవహారము సమసిపోయి అసలు వస్తువు వస్తుగా నుండును.
పరమాత్మ శక్తి స్వరూపమగు సంకల్పము శుద్ధ సత్వమనియు, మలిన సత్వ ప్రథానమనియు రెండు విధములు. ఈ రెండును అద్దమునకువలె నెదుటనున్న వస్తువులను ప్రతిబింబింపచేసుకొను స్వభావము గలవియై యున్నవి. అందు శుద్ధ సత్వమునందు ప్రతిబింబించిన ప్రతి బింబమును ఈశ్వరుడందురు. మలిన సత్వ ప్రధానమందు ప్రతిబింబించిన ప్రతి బింబమును జీవుడందురు. శుద్ధసత్వా వరణ కలిగిన వాడగుటవలన ఈశ్వరుడు సర్వజ్ఞ, సర్వశక్తి మత్వ సర్వాంతర్యామిత్వములు కలిగియున్న వాడాయెను. జీవుడు మలిన సత్వోపాధి ఆవరణావృతుడై సర్వజ్ఞత్యాదులు గోలుపోయి కించిజ్ఞుడాయెను. ఒక్క ఆకాశమే మేఘమునందు ప్రతిబింబించినపుడు మేఘాకాశమనియు, ఘటజలమందు ప్రతిబింబించినపుడు ఘటాకాశమనియు, వ్యవహరింపబడునట్లు ఒక్క ఆత్మయే, అనగా - పరమాత్మయే - మాయోపాధియందు ప్రతిఫలించునపుడు ఈశ్వరుడనియు, అవిద్యయందు ప్రతిఫలించునపుడు జీవుడనియు చెప్పబడును. మాయావిద్యలకు భేదములేదు. మాయ సమష్టి స్వరూపము, అవిద్య వ్యక్తి స్వరూపము - సర్వ జీవులవిద్యను సమిష్టిగ వ్యవహరించునపుడు మాయ యందురు. మాయోపాధిగలవాడు ఈశ్వరుడు. అవిద్యోపాధిగలవాడు జీవుడు. ఇరువురుగ తోచు జీవేశ్వరులు స్వతః భేదము లేనివారయ్యును, ఉపాధుల ననుసరించి భేదవ్యవహారము జరుగుచున్నది. ఈశ్వరుడు నిత్య జ్ఞానవంతుడు జీవుడు అనాదినుండి అజ్ఞానవంతుడు - వీరిద్దరకు వస్తుతః భేదములేదు.
(dēni pratibiṃbamu iṃkoka cōṭa kanabaḍunō adi biṃbamu).
"addamu eduṭa nilabaḍinapuḍu addamulō kanabaḍu mana cāya (nīḍa, bomma) mana pratibiṃbamu, edurugā nilucuṃḍi yunna manamu biṃbamu”.
"parabrahmamu svasaṃvēdyamu. jīvēśvarulaku upāsya dēvata. ā nirguṇa brahmamaṃdu māyāvidyalu reṃḍunnū puṭṭenu. vivarta rūpamulayina māya avidyalu reṃḍunnū reṃḍu darpaṇamulu (addamulu). ā darpaṇālayaṃdu brahmaṃ pratibiṃbiṃcagā īśvaruḍu aninnī, jīvuḍu aninnī kaligenu –
"satva śuddhya śuddhibhyāṃ māyā vidyā dvidhāmatā ||
ī yardhamaṃdu māyā biṃbvō vaśīkṛtya tāṃ syāt sarvajña īśvaraḥ |
avidyāvastvanyaḥ tadvai citryānēka thā |"
ayitē mukhyamaina brahmamunakē ākāraṃ lēdu. biṃba pratibiṃbālu elāgayyenaṃṭē - nirākāra nirābhāsamaina brahma maṃdumāyā avidyalu mūrtivaṃtālu gāvu - spuradvāpamē ghaṭamara saṃ yuktamaina nirālaṃbānaku ghaṭākāśamu, marākāśamu ani yēlāgu kaligenō aṭuvalanē vastuvulalōnu biṃba pratibiṃbamani nāmadhēyamu kaligenu - ekkaḍekkaḍa yī vasana sphuriṃcunō akkaḍakkaḍa brahmamadhiṣṭiṃci yuṃḍunu - kābaṭṭi māya avidyalanu adhiṣṭiṃciyunnadē pratibiṃbamanabaḍenu - kābaṭṭi māya avidyalanu adhiṣṭiṃciyunnadē pratibiṃbamanabaḍenu - biṃbasthānamaina brahmamē upamānabaḍenu - pratibiṃbamē, jīva īśvarulanaṃbaḍenu - ani biṃbapratibiṃba nyāyamu (brahma vidyāsudhārṇavamu - 6)
jīva paramēśvara sādhāraṇaṃ caitanya yātraṃ biṃbaṃ tasyaiva biṃbasyā vidyātmikāyāṃ māyāyāṃ pratibiṃbamīśvara caitanyaṃ aṃtaḥ karaṇēṣu pratibiṃbaṃ jīva caitanyaṃ "kāryōpādhi rayaṃ jīvaḥ karaṇōpādhirīśvaraḥ" iti śrutēḥ. ē tanmatē jalāśayagata śarāvagata sūrya pratibiṃbayōriva jīva paramēśvarayōrbhēdhaḥ.
"nacarūpa hīnasya brahmaṇasya na pratibiṃba saṃbhavaḥ, rūpavata ēva tathātva darśanāt. na ca nīrūpasya dravyasya pratibiṃbāva bhāva niyamaḥ. ātmanaḥ dravyatvā bhāvasyōktatvāt "ēkathā bahuthā caiva dṛśyatē jala caṃdravat"
(bṛhadāraṇyakōpaniṣat - 12). (vēdāṃta paribhāṣā)
(ajñuni dṛṣṭilō brahmamu reṃḍu vidhamulugā kalpiṃpabaḍinadi - sarvajñu ḍaguṭavalana 'jñaḥ' ani ceppabaḍu īśvaruḍu biṃbamu ; kiṃcijñuḍu (koṃcemu telisinavāḍu) ayina jīvuḍu pratibiṃbamu. biṃba pratibiṃbamulanu nī reṃḍunū māyā kalpitamulu - sarva niyaṃtayainanu ī śvaruḍu māyā upādhi lōnunna vāḍaguṭacēta biṃbamani ceppabaḍucunnāḍu. asvataṃtruḍaina jīvuḍu avidya yanu upādhilō nuṃḍuṭanu baṭṭi pratibiṃbamani ceppabaḍu cunnāḍu. iddarunū anādulē - janma lēni vārē. īśvaruniki jīvuniki bhēdamunakidi kāraṇamu).
(jīvunaku paramēśvarunaku caitanyamu sādhāraṇamē, okaṭē, adē biṃbamu. avidyayunu māya yaṃdunna īśvara caitanyamu biṃbamu, aṃtaḥkaraṇamaṃduṃḍu īśvara caitanyamu pratibiṃbamu, - "kāraṇamaina māya (lēka, prakṛti) upādhigā kalavāḍu īśvaruḍu. kārya vastuvulu upādhigā galavāḍu jīvuḍu" ani śruti ceppucunnadi. ī matamulō jalāśayamulō kanupiṃcu sūryuni pratibiṃbamuvale sūryunaku aṃdari pratibiṃbamunaku gala bhēdamē īśvarunaku jīvunaku kaladu).
pratibiṃbamulu mithyalu, vīṭiki kāraṇamaina biṃbamu nijamainadi, satyamainadi.
cittamu lēka manassu paramātmayokka vivartōpādānamu. dāninē pratibiṃbamu lēka jīvuḍani yaṃduru. pratibiṃbamanuṭaku kāraṇamu biṃba sthānīyamagu ātmanu darpaṇa sthānīyamagu tana buddhiyaṃdu pratiphaliṃpa cēsukoni dānivalana caitanyamunuboṃdi ātmavale vyavahariṃcucunna daguṭavalana pratibiṃbamanu nāmamu amarenu. paramātmaku atanivalana janiṃcina vivarta svarūpuḍagu jīvunakunu biṃba pratibiṃba nādṛśamu - paramātma biṃbamu, jīvuḍu pratibiṃbasvarūpuḍu - dēhasaṃbaṃdhamagu mukhamu biṃbamu, dāniki eduruganuṃḍu addamunaṃdu gāna vaccunadi pratibiṃbamu. biṃbamu pratibiṃbamuga māralēdu - pratibiṃbamu nūtana vastuvukādu. ī biṃba pratibiṃba vyavahāramulu madhyanunna addamunanusariṃci kaliginavi. aṭulanē paramātma jīvātmagā māralēdu. jīvātma paramātma kāḍu. manassu anu addamunaṃdu pratiphaliṃcucunnaṃtavaraku jīvātma paramātmalu bhinnulani teliyavalayunu. vāri madhyanunna addamu tīsivēsina yaḍala biṃba pratibiṃbamulanu vyavahāramuṃḍadu. appuḍuṃḍunadi okka biṃbamē. darpaṇa sthānīyamagu manassu (māya - śakti - vimarśamu, avidya, prakṛti, ajñānamu, saṃkalpamu) tolagina yaḍala jīvātma paramātmalanu bhēda vyavahāramu samasipōyi asalu vastuvu vastugā nuṃḍunu.
paramātma śakti svarūpamagu saṃkalpamu śuddha satvamaniyu, malina satva prathānamaniyu reṃḍu vidhamulu. ī reṃḍunu addamunakuvale neduṭanunna vastuvulanu pratibiṃbiṃpacēsukonu svabhāvamu galaviyai yunnavi. aṃdu śuddha satvamunaṃdu pratibiṃbiṃcina prati biṃbamunu īśvaruḍaṃduru. malina satva pradhānamaṃdu pratibiṃbiṃcina prati biṃbamunu jīvuḍaṃduru. śuddhasatvā varaṇa kaligina vāḍaguṭavalana īśvaruḍu sarvajña, sarvaśakti matva sarvāṃtaryāmitvamulu kaligiyunna vāḍāyenu. jīvuḍu malina satvōpādhi āvaraṇāvṛtuḍai sarvajñatyādulu gōlupōyi kiṃcijñuḍāyenu. okka ākāśamē mēghamunaṃdu pratibiṃbiṃcinapuḍu mēghākāśamaniyu, ghaṭajalamaṃdu pratibiṃbiṃcinapuḍu ghaṭākāśamaniyu, vyavahariṃpabaḍunaṭlu okka ātmayē, anagā - paramātmayē - māyōpādhiyaṃdu pratiphaliṃcunapuḍu īśvaruḍaniyu, avidyayaṃdu pratiphaliṃcunapuḍu jīvuḍaniyu ceppabaḍunu. māyāvidyalaku bhēdamulēdu. māya samaṣṭi svarūpamu, avidya vyakti svarūpamu - sarva jīvulavidyanu samiṣṭiga vyavahariṃcunapuḍu māya yaṃduru. māyōpādhigalavāḍu īśvaruḍu. avidyōpādhigalavāḍu jīvuḍu. iruvuruga tōcu jīvēśvarulu svataḥ bhēdamu lēnivārayyunu, upādhula nanusariṃci bhēdavyavahāramu jarugucunnadi. īśvaruḍu nitya jñānavaṃtuḍu jīvuḍu anādinuṃḍi ajñānavaṃtuḍu - vīriddaraku vastutaḥ bhēdamulēdu.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.