← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బిందువు biṃduvu

Original — తెలుగు
  1. చుక్క, నీటి బొట్టు.

  2. భ్రూమధ్యమము.

  3. హృదయమందుండు బుద్ధి బిందువు.

  4. అతి సూక్ష్మములగు ప్రాణవాయువు, మనసు వీటిలోనుండు బుద్ధియే బిందువని చెప్పబడుచున్నది. దీనిని జాగ్రదవస్థయందు బుద్ధియనియు, సుషుప్త్యవస్థయందు ఇంద్రియలయస్థానమగు జ్ఞానమనియు చెప్పుదురు.

  5. "ప్రాణిభిః ప్రతిదినం భుజ్యమానాన్నపానాది రసపరిణామో బిందుః.స ఏవ రేతః ఇతి చరమ ధాతుః ఇతి చ ఉచ్యతే. సర్వ ప్రాణినాం స ఏవ జీవనాధారః. వివేక పురుషో వృధా బిందు క్షయమకుర్వన్ మహతే శ్రేయసీ కల్పతే. సమ్యక్ సం రక్షితః బిందుః ప్రాణినాం ఓజః, తేజో, వీర్యం బలంచ ఆధత్తే. యేన బిందుః సం రక్షితః తస్య దేహో రోగజరాద్య నభి భూతః పుష్ట్యా కాంత్యా చ విరాజతే, తస్య ఇంద్రియాణి పటు తరాణి వశీకృతాని చ భవంతి, మనశ్చ శోక మోహాద్యనభి భూతం సదా ప్రసన్నం, ఏకాగ్రం, అంతర్ముఖం చ భవతి. దీపః తైలేనేవ పురుషో బిందునా ఓజస్వీ, తేజస్వీ బలిష్టశ్చ విరాజతే యో జితేంద్రియః, స్వప్నే అపి అస్ఖలిత బిందుః సః బలా రోగ్యాది మాన్ ప్రసన్నేంద్రియ మనః శుభ కర్మా ఆచరన్ క్రమేణ లబ్దాత్మ తత్వ జ్ఞానః సంసార భయాత్ విముచ్యతే యోగినః సిద్ధాశ్చ బిందు సం రక్షణ బలేనైవ ఖేచరీ ముద్రాద్య భ్యాసాదినా అణిమాది సిద్ధిం ఊర్థ్వ రేతస్త్వం శ్రైష్ట్యం చ భజంతి.

"బిందు క్షయ యేవ సర్వానర్థ నిదానం; యోషితః ఏవ బిందుక్షయ కారణం యధా గుణకాంక్షిణో మానవాః ఇక్షుదండం యంత్రేని పీడ్య, తద్రసం గృహీత్వా నిస్సారం ఇక్షుదండం దూరేక్షిపంతి, తధైవ రతి కాంక్షిణ్యో మహిలాః కామాతురం పురుషం స్వభుజాభ్యాం భృశం ఆ పీడ్య తదంగ నిస్సృతం వీర్యం గృహీత్వా క్షీణ వీర్యంతం దూరతః పరిత్యజంతి కామమోహితః పురుషః ప్రజ్ఞయా విహీనః కార్యాకార్య వివేక వికలః శ్రేయో మార్గాత్ చ్యవతే. సర్వదా స్త్రీషు సంగో ధర్మార్థ సకల పురుషార్థ నాశ నిదానమేవ" (విచారసాగరం)

(ప్రాణులు ప్రతిదినము తినుచున్న అన్నపానములు మొదలగువాటి రసమే బిందువుగామారును. అదియే రేతస్సు అని, చరమధాతువు అని చెప్పబడుచున్నది - (అన్నపానములు ధాతువులుగా మారగా మారగా వీటి అన్నింటియొక్క గుణముల శక్తి కలిగిన చివరి ధాతువు అని చెప్పబడుచున్నది (Concentrated Energy). సమస్త ప్రాణులకు అదియే జీవనాధారము - జీవించుటకాధారమైనది - జీవింపచేయు శక్తి కలది. వివేకవంతుడైన పురుషుడు - ఈ సంగతి తెలిసినవాడు - ఈ బిందువును అనవసరముగా వ్యయము చేయకుండుటచే గొప్ప శ్రేయస్సును పొందును - ఈ బిందువును (వ్యయము కాకుండునట్లు) రక్షించుకొనిన ప్రాణులకు అది జోజస్సు, తేజస్సు, బలము, వీర్యమును కలుగచేయును. ఇట్లు బిందువును వృథా వ్యయము కాకుండునట్లు రక్షించుకొనిన వాని దేహము, రోగము ముసలితనము మొదలగునవిలేక, పుష్టిగను, కాంతివంతముగ నుండును. (శరీరచాయ నిగనిగలాడుచు మెఱయుచుండును). అట్టివాని ఇంద్రియములు పటుత్వము కలిగియుండి తన స్వాధీనములో నుండును. అతని మనస్సు శోకమోహములు లేకుండుటవలన ఎల్లపుడు ప్రసన్నముగా నుండి (ఆనందముగా నుండి) ఏకాగ్ర్యము (ఒకే లక్ష్యమందుంచబడినది), అంతర్ముఖము (పైవిషయములందుకాక లోపల పరమాత్మయందు ధ్యానము) కలిగినదై యుండును - తైలమువలన దీపము వెలుగుచున్నట్లు బిందువువలన పురుషుడు ఓజస్సు కలవాడు, తేజస్సు కలవాడు బలముకలవాడు అగుచున్నాడు. ఇంద్రియ జయము కలవాడు స్వప్నమందైనను అస్ఖలిత బిందువైనవాడు - బిందు స్ఖలనము కానివాడు - బలము ఆరోగ్యము కలవాడున్నూ, ప్రసన్నమైన ఇంద్రియములు మనస్సు కలవాడున్నూ, అయి శుభ కర్మలను చేయుచు క్రమముగా ఆత్మతత్వ జ్ఞానము కలవాడై సంసార భయమునుండి (జనన మరణములనుండి) విముక్తుడగును. యోగులు, సిద్ధులు బిందువును వ్యయముచేయక సంరక్షించుటవలననే ఖేచరీ ముద్రను అభ్యసించుట మొదలగువాటిచేత అణిమాధ్యష్టసిద్ధులను, ఊర్థ్వ రేతస్త్వమును (రేతస్సును బీజమును క్రిందనుండి శిరస్సునకు వచ్చునట్లు చేయగలుగువాడు) శ్రేష్టులును అగుచున్నారు).

(ఈ బిందువును వ్యయపఱచి క్షీణింపచేయుట అన్ని అనర్థములకు కారణమగుచున్నది. ఈ బిందువు క్షీణించుటకు - వ్యయమగుటకు - స్త్రీలేకారణము. బెల్లము కావలసిన మనుజులు చెరుకు గడను యంత్రములో పెట్టి పీడించి దానిలోని రసమును తీసుకొని ఆ పిప్పి అయిన చెఱుకు గడను దూరముగా విసిరివేయునట్లు రతిని కోరు స్త్రీలు కామాతురుడైన పురుషుని వారి భుజములతో గాఢముగా సారమును (వీర్యమును)పిండివేసినట్లుగా ఆలింగనము చేసుకొని, ఆ పురుషుని నుండి స్ఖలనమైన వీర్యమును (బిందువును) తన శరీరములోనికి గ్రహించి, వీర్యము క్షీణించిన ఆ పురుషుని దూరముగా నుంచుదురు – కామము చేత స్త్రీయందు మోహము చెందిన పురుషుడు - తన ప్రజ్ఞను (వీర్యమును) ఇట్లు కోలుపోయి, కార్యాకార్య వివేకములేనివాడై శ్రేయోమార్గమునుండి క్రిందకు జారిపోయిన వాడగును (అధఃపతితుడగును). స్త్రీల సాంగత్యము ఎప్పుడూ ధర్మార్థములు మొదలగు అన్ని పురుషార్థముల నాశనమునకు నిదానమైనది). (చూడుము - 'ఆద్యమంత్రము'; 'సృష్టి'; 'ఓంకారము').

Transliteration
  1. cukka, nīṭi boṭṭu.

  2. bhrūmadhyamamu.

  3. hṛdayamaṃduṃḍu buddhi biṃduvu.

  4. ati sūkṣmamulagu prāṇavāyuvu, manasu vīṭilōnuṃḍu buddhiyē biṃduvani ceppabaḍucunnadi. dīnini jāgradavasthayaṃdu buddhiyaniyu, suṣuptyavasthayaṃdu iṃdriyalayasthānamagu jñānamaniyu ceppuduru.

  5. "prāṇibhiḥ pratidinaṃ bhujyamānānnapānādi rasapariṇāmō biṃduḥ.sa ēva rētaḥ iti carama dhātuḥ iti ca ucyatē. sarva prāṇināṃ sa ēva jīvanādhāraḥ. vivēka puruṣō vṛdhā biṃdu kṣayamakurvan mahatē śrēyasī kalpatē. samyak saṃ rakṣitaḥ biṃduḥ prāṇināṃ ōjaḥ, tējō, vīryaṃ balaṃca ādhattē. yēna biṃduḥ saṃ rakṣitaḥ tasya dēhō rōgajarādya nabhi bhūtaḥ puṣṭyā kāṃtyā ca virājatē, tasya iṃdriyāṇi paṭu tarāṇi vaśīkṛtāni ca bhavaṃti, manaśca śōka mōhādyanabhi bhūtaṃ sadā prasannaṃ, ēkāgraṃ, aṃtarmukhaṃ ca bhavati. dīpaḥ tailēnēva puruṣō biṃdunā ōjasvī, tējasvī baliṣṭaśca virājatē yō jitēṃdriyaḥ, svapnē api askhalita biṃduḥ saḥ balā rōgyādi mān prasannēṃdriya manaḥ śubha karmā ācaran kramēṇa labdātma tatva jñānaḥ saṃsāra bhayāt vimucyatē yōginaḥ siddhāśca biṃdu saṃ rakṣaṇa balēnaiva khēcarī mudrādya bhyāsādinā aṇimādi siddhiṃ ūrthva rētastvaṃ śraiṣṭyaṃ ca bhajaṃti.

"biṃdu kṣaya yēva sarvānartha nidānaṃ; yōṣitaḥ ēva biṃdukṣaya kāraṇaṃ yadhā guṇakāṃkṣiṇō mānavāḥ ikṣudaṃḍaṃ yaṃtrēni pīḍya, tadrasaṃ gṛhītvā nissāraṃ ikṣudaṃḍaṃ dūrēkṣipaṃti, tadhaiva rati kāṃkṣiṇyō mahilāḥ kāmāturaṃ puruṣaṃ svabhujābhyāṃ bhṛśaṃ ā pīḍya tadaṃga nissṛtaṃ vīryaṃ gṛhītvā kṣīṇa vīryaṃtaṃ dūrataḥ parityajaṃti kāmamōhitaḥ puruṣaḥ prajñayā vihīnaḥ kāryākārya vivēka vikalaḥ śrēyō mārgāt cyavatē. sarvadā strīṣu saṃgō dharmārtha sakala puruṣārtha nāśa nidānamēva" (vicārasāgaraṃ)

(prāṇulu pratidinamu tinucunna annapānamulu modalaguvāṭi rasamē biṃduvugāmārunu. adiyē rētassu ani, caramadhātuvu ani ceppabaḍucunnadi - (annapānamulu dhātuvulugā māragā māragā vīṭi anniṃṭiyokka guṇamula śakti kaligina civari dhātuvu ani ceppabaḍucunnadi (Concentrated Energy). samasta prāṇulaku adiyē jīvanādhāramu - jīviṃcuṭakādhāramainadi - jīviṃpacēyu śakti kaladi. vivēkavaṃtuḍaina puruṣuḍu - ī saṃgati telisinavāḍu - ī biṃduvunu anavasaramugā vyayamu cēyakuṃḍuṭacē goppa śrēyassunu poṃdunu - ī biṃduvunu (vyayamu kākuṃḍunaṭlu) rakṣiṃcukonina prāṇulaku adi jōjassu, tējassu, balamu, vīryamunu kalugacēyunu. iṭlu biṃduvunu vṛthā vyayamu kākuṃḍunaṭlu rakṣiṃcukonina vāni dēhamu, rōgamu musalitanamu modalagunavilēka, puṣṭiganu, kāṃtivaṃtamuga nuṃḍunu. (śarīracāya niganigalāḍucu meṟayucuṃḍunu). aṭṭivāni iṃdriyamulu paṭutvamu kaligiyuṃḍi tana svādhīnamulō nuṃḍunu. atani manassu śōkamōhamulu lēkuṃḍuṭavalana ellapuḍu prasannamugā nuṃḍi (ānaṃdamugā nuṃḍi) ēkāgryamu (okē lakṣyamaṃduṃcabaḍinadi), aṃtarmukhamu (paiviṣayamulaṃdukāka lōpala paramātmayaṃdu dhyānamu) kaliginadai yuṃḍunu - tailamuvalana dīpamu velugucunnaṭlu biṃduvuvalana puruṣuḍu ōjassu kalavāḍu, tējassu kalavāḍu balamukalavāḍu agucunnāḍu. iṃdriya jayamu kalavāḍu svapnamaṃdainanu askhalita biṃduvainavāḍu - biṃdu skhalanamu kānivāḍu - balamu ārōgyamu kalavāḍunnū, prasannamaina iṃdriyamulu manassu kalavāḍunnū, ayi śubha karmalanu cēyucu kramamugā ātmatatva jñānamu kalavāḍai saṃsāra bhayamunuṃḍi (janana maraṇamulanuṃḍi) vimuktuḍagunu. yōgulu, siddhulu biṃduvunu vyayamucēyaka saṃrakṣiṃcuṭavalananē khēcarī mudranu abhyasiṃcuṭa modalaguvāṭicēta aṇimādhyaṣṭasiddhulanu, ūrthva rētastvamunu (rētassunu bījamunu kriṃdanuṃḍi śirassunaku vaccunaṭlu cēyagaluguvāḍu) śrēṣṭulunu agucunnāru).

(ī biṃduvunu vyayapaṟaci kṣīṇiṃpacēyuṭa anni anarthamulaku kāraṇamagucunnadi. ī biṃduvu kṣīṇiṃcuṭaku - vyayamaguṭaku - strīlēkāraṇamu. bellamu kāvalasina manujulu ceruku gaḍanu yaṃtramulō peṭṭi pīḍiṃci dānilōni rasamunu tīsukoni ā pippi ayina ceṟuku gaḍanu dūramugā visirivēyunaṭlu ratini kōru strīlu kāmāturuḍaina puruṣuni vāri bhujamulatō gāḍhamugā sāramunu (vīryamunu)piṃḍivēsinaṭlugā āliṃganamu cēsukoni, ā puruṣuni nuṃḍi skhalanamaina vīryamunu (biṃduvunu) tana śarīramulōniki grahiṃci, vīryamu kṣīṇiṃcina ā puruṣuni dūramugā nuṃcuduru – kāmamu cēta strīyaṃdu mōhamu ceṃdina puruṣuḍu - tana prajñanu (vīryamunu) iṭlu kōlupōyi, kāryākārya vivēkamulēnivāḍai śrēyōmārgamunuṃḍi kriṃdaku jāripōyina vāḍagunu (adhaḥpatituḍagunu). strīla sāṃgatyamu eppuḍū dharmārthamulu modalagu anni puruṣārthamula nāśanamunaku nidānamainadi). (cūḍumu - 'ādyamaṃtramu'; 'sṛṣṭi'; 'ōṃkāramu').

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.