సర్వవ్యాపకమైన జ్ఞానము, లేక చిచ్ఛక్తి, భగవంతునియొక్క చైతన్య శక్తి, పరాశక్తి.లేక అపరాప్రకృతి
“అపరేయం ఇతస్త్వన్యాం ప్రకృతిం విద్ధిమే పరాం |
జీవభూతాం, మహాబాహో, య యేదం ధార్యతే జగత్ ||“. (శ్రీమద్భగవద్గీత - 7 - 5)
ఎనిమిది విధములగనున్న పరాశక్తికంటె వేఱైనది, పరాప్రకృతి, ప్రపంచమును (అపరాప్రకృతిని) చైతన్యవంతముగా చేయునది, ఈ జగత్తును చిచ్ఛక్తిగా ధరించునది. పై శ్లోకమునకు ఈ క్రిందివిధముగా వ్యాఖ్యానము చేయబడినది: -.
“ఇతో (అ)న్యాం ప్రకృతిం శుద్ధాం ప్రకృష్టాం చేతనాత్మకాం |
మమాత్మ భూతాం జానీహి పరాం క్షేత్రజ్ఞ లక్షణాం |
యయా క్షేత్రజ్ఞరూపిణ్యా సర్వస్యాంతః ప్రవిష్టయా |
జగజ్జడమిదం సర్వం ధార్యతే విశరావరం || (గీతాభావప్రకాశము - 7 - 35, 36)
(అపరాప్రకృతి కంటె వేరైనది, త్రిగుణములు కలిసియుండుటచేత అపరాప్రకృతివలె మలినము కానిది, శుద్ధమైనది, క్షేత్రజ్ఞ లక్షణములు కలదియు, భగవంతుడే తాను అయినదియు, క్షేత్రజ్ఞరూపము కలదగుటచేత అన్నింటిలోన ప్రవేశించి యుండి, స్వతః జడమైన(చైతన్యము లేని) ప్రపంచమును చైతన్యవంతముగా చేసి దానిని ధరించునది).
sarvavyāpakamaina jñānamu, lēka cicchakti, bhagavaṃtuniyokka caitanya śakti, parāśakti.lēka aparāprakṛti
“aparēyaṃ itastvanyāṃ prakṛtiṃ viddhimē parāṃ |
jīvabhūtāṃ, mahābāhō, ya yēdaṃ dhāryatē jagat ||“. (śrīmadbhagavadgīta - 7 - 5)
enimidi vidhamulaganunna parāśaktikaṃṭe vēṟainadi, parāprakṛti, prapaṃcamunu (aparāprakṛtini) caitanyavaṃtamugā cēyunadi, ī jagattunu cicchaktigā dhariṃcunadi. pai ślōkamunaku ī kriṃdividhamugā vyākhyānamu cēyabaḍinadi: -.
“itō (a)nyāṃ prakṛtiṃ śuddhāṃ prakṛṣṭāṃ cētanātmakāṃ |
mamātma bhūtāṃ jānīhi parāṃ kṣētrajña lakṣaṇāṃ |
yayā kṣētrajñarūpiṇyā sarvasyāṃtaḥ praviṣṭayā |
jagajjaḍamidaṃ sarvaṃ dhāryatē viśarāvaraṃ || (gītābhāvaprakāśamu - 7 - 35, 36)
(aparāprakṛti kaṃṭe vērainadi, triguṇamulu kalisiyuṃḍuṭacēta aparāprakṛtivale malinamu kānidi, śuddhamainadi, kṣētrajña lakṣaṇamulu kaladiyu, bhagavaṃtuḍē tānu ayinadiyu, kṣētrajñarūpamu kaladaguṭacēta anniṃṭilōna pravēśiṃci yuṃḍi, svataḥ jaḍamaina(caitanyamu lēni) prapaṃcamunu caitanyavaṃtamugā cēsi dānini dhariṃcunadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.