సర్వ శక్తి సర్వాకారం సర్వేశ్వరం సర్వగం సర్వమేవతి” (యోగవాశిష్టము - 63 - 1)
(బ్రహ్మతత్వము సర్వకాలములందు సర్వ ప్రదేశములందు సర్వశక్తివంతమై వెలయుచున్నది. మఱియు, అది సర్వాకారము అయినది, సర్వైశ్యర్యము అయినది, అన్నింటిలోను వ్యాపించియున్నది. సర్వము తానే అయియున్నది).
(సర్వం సమాప్నోతి తతోపి సర్వః)
(సృష్టిలోనున్న ప్రతివస్తువులోనున్న తత్వమొకటే - అందియే బ్రహ్మతత్వము).
(తత్వమే అయినది బ్రహ్మ తత్వము (తత్ + త్వం) అనగా, ‘అది నీవు’ ఆ బ్రహ్మ నీవు - ఆ బ్రహ్మమే నీవు, నీవే ఆ బ్రహ్మవు, నీకు బ్రహ్మకు భేదములేదు - రెండూ - ఇద్దరూ - ఒకటే - ‘తత్వమసి’ = ఆ బ్రహ్మ నీవే అయి యున్నావు ఇది - ఇది మహావాక్యము - ఉపనిషత్తుల సారాంశము ఉపాసనచేసి బ్రహ్మమైనవాడు - పురుషుడు - “బ్రహ్మ విద్ బ్రహ్మైవ భవతి” అని ఒక్క మానవునకే వర్తించునదికాదు - సృష్టిలోనున్న సమస్త వస్తువులు బ్రహ్మలోనుండి పుట్టి, బ్రహ్మవలన పెరిగి, బ్రహ్మలో లీనమగుటచేత అవన్నియు బ్రహ్మరూపములే, బ్రహ్మమే - బ్రహ్మ శక్తి గలదే - బ్రహ్మ తత్వమే –
“హరిమయముగాని ద్రవ్యము పరమాణువు లేదు” (శ్రీమదాంధ్రమహాభాగవతము -)
“సచ్చత్యచ్చా భవత్”
(ఆత్మ వస్తువు, అనాత్మ వస్తువు తానే ఆయెను) అందుచేత సృష్టిలోనున్న ప్రతివస్తువు బ్రహ్మమే - అతని శక్తితోకూడినదే - అతనికి, అతనిశక్తికి తేడా లేదు, అతనే అతని శక్తి, అతని శక్తియే అతను).
“అధీత్య చతురో వేదాన్ ధర్మ శాస్త్రాణ్య నేకశః |
బ్రహ్మతత్వం నజానాతి దర్వీపాకరసం యథా “.
(“ఈ ఆత్మ - బ్రహ్మ - ప్రవచనము చేతగాని, మేధచేతగాని, మిక్కిలి వినికిలిచేతగాని పొందుటకు వీలుకానివాడు”, “గురువునాశ్రయించి అతనిద్వారా బ్రహ్మను తెలుసుకొనును -”; “నాలుగు శాస్త్రములను అధ్యయనము చేసి, ధర్మశాస్త్రములను చదివినవాడైనను దర్వీపాకరసమును తెలుసుకోలేనట్లు, బ్రహ్మతత్వమును తెలుసుకొనలేడు”).
యత్సర్వం సర్వగం వస్తు యత్తత్త్వం తద సౌస్థితః |
యదనుత్తమమ నిష్పందం, భాసకం తేజసామపి |
స్వానుభూత్యేకమానంచ యత్తత్వం తదసౌస్థితః |
యదేకం చాపునేకించ సాంజనశ్చ నిరంజనం |
యత్సర్వం చాప్య సర్వంచ యత్తత్త్వ, తదసౌస్థితః ||“. (వాసిష్టే)
(సమస్త శాస్త్రములలో ఏది సిద్ధాంతము చేయబడినదో - నిర్ణయించబడినదో -, ఏది అందరి హృదయములలోనున్నదో, ఏది అన్నియు తానే అయినదో, ఏది అన్నింటిలోను ప్రవేశించియున్నదో, (వీటి అన్నింటిలోనుండు తత్వమేదో - శక్తి ఏదో); దేనికంటె ఉత్తమమైనది లేదో; ప్రకాశించురూపముగల వాటిలో ప్రకాశింపచేయు వస్తువేదియో, స్వానుభూతియే ప్రమాణమైన దేదియో, ఉన్నదంతా తానొక్కటే అయినదేదియో, అనేకవస్తువులుఇగా అయినదేదో, అంజనము నిరంజనము (రెండును) తానే అయినదేదో, అధ్యాత్మధృష్టిలో అన్నియు తానే అయినదేదియో, ప్రాకృతదృష్టిలో అన్నియు తాను కానటువంటిదేదో - ఇన్ని విధములుగ నున్న ఒకటే అయిన తత్వమేదో అదియే నీవు - పరబ్రహ్మఆ తత్వము నీవే - బ్రహ్మతత్వము).
ఇతి యుక్తముత్పశ్యామః |
(బ్రహ్మ తత్వము రెండు విధములుగా నున్నది: - పరమార్థసత్తా అయిన పరబ్రహ్మ అనిర్వచనీయమైన ప్రపంచమని ఆరోపించబడినది. ఈ ప్రపంచమునకు అధిష్టానము బ్రహ్మ రెండు విధముల బ్రహ్మ తత్వమే - ఇట్లు చెప్పబడుచున్నది).
sarva śakti sarvākāraṃ sarvēśvaraṃ sarvagaṃ sarvamēvati” (yōgavāśiṣṭamu - 63 - 1)
(brahmatatvamu sarvakālamulaṃdu sarva pradēśamulaṃdu sarvaśaktivaṃtamai velayucunnadi. maṟiyu, adi sarvākāramu ayinadi, sarvaiśyaryamu ayinadi, anniṃṭilōnu vyāpiṃciyunnadi. sarvamu tānē ayiyunnadi).
(sarvaṃ samāpnōti tatōpi sarvaḥ)
(sṛṣṭilōnunna prativastuvulōnunna tatvamokaṭē - aṃdiyē brahmatatvamu).
(tatvamē ayinadi brahma tatvamu (tat + tvaṃ) anagā, ‘adi nīvu’ ā brahma nīvu - ā brahmamē nīvu, nīvē ā brahmavu, nīku brahmaku bhēdamulēdu - reṃḍū - iddarū - okaṭē - ‘tatvamasi’ = ā brahma nīvē ayi yunnāvu idi - idi mahāvākyamu - upaniṣattula sārāṃśamu upāsanacēsi brahmamainavāḍu - puruṣuḍu - “brahma vid brahmaiva bhavati” ani okka mānavunakē vartiṃcunadikādu - sṛṣṭilōnunna samasta vastuvulu brahmalōnuṃḍi puṭṭi, brahmavalana perigi, brahmalō līnamaguṭacēta avanniyu brahmarūpamulē, brahmamē - brahma śakti galadē - brahma tatvamē –
“harimayamugāni dravyamu paramāṇuvu lēdu” (śrīmadāṃdhramahābhāgavatamu -)
“saccatyaccā bhavat”
(ātma vastuvu, anātma vastuvu tānē āyenu) aṃducēta sṛṣṭilōnunna prativastuvu brahmamē - atani śaktitōkūḍinadē - ataniki, ataniśaktiki tēḍā lēdu, atanē atani śakti, atani śaktiyē atanu).
“adhītya caturō vēdān dharma śāstrāṇya nēkaśaḥ |
brahmatatvaṃ najānāti darvīpākarasaṃ yathā “.
(“ī ātma - brahma - pravacanamu cētagāni, mēdhacētagāni, mikkili vinikilicētagāni poṃduṭaku vīlukānivāḍu”, “guruvunāśrayiṃci atanidvārā brahmanu telusukonunu -”; “nālugu śāstramulanu adhyayanamu cēsi, dharmaśāstramulanu cadivinavāḍainanu darvīpākarasamunu telusukōlēnaṭlu, brahmatatvamunu telusukonalēḍu”).
yatsarvaṃ sarvagaṃ vastu yattattvaṃ tada sausthitaḥ |
yadanuttamama niṣpaṃdaṃ, bhāsakaṃ tējasāmapi |
svānubhūtyēkamānaṃca yattatvaṃ tadasausthitaḥ |
yadēkaṃ cāpunēkiṃca sāṃjanaśca niraṃjanaṃ |
yatsarvaṃ cāpya sarvaṃca yattattva, tadasausthitaḥ ||“. (vāsiṣṭē)
(samasta śāstramulalō ēdi siddhāṃtamu cēyabaḍinadō - nirṇayiṃcabaḍinadō -, ēdi aṃdari hṛdayamulalōnunnadō, ēdi anniyu tānē ayinadō, ēdi anniṃṭilōnu pravēśiṃciyunnadō, (vīṭi anniṃṭilōnuṃḍu tatvamēdō - śakti ēdō); dēnikaṃṭe uttamamainadi lēdō; prakāśiṃcurūpamugala vāṭilō prakāśiṃpacēyu vastuvēdiyō, svānubhūtiyē pramāṇamaina dēdiyō, unnadaṃtā tānokkaṭē ayinadēdiyō, anēkavastuvuluigā ayinadēdō, aṃjanamu niraṃjanamu (reṃḍunu) tānē ayinadēdō, adhyātmadhṛṣṭilō anniyu tānē ayinadēdiyō, prākṛtadṛṣṭilō anniyu tānu kānaṭuvaṃṭidēdō - inni vidhamuluga nunna okaṭē ayina tatvamēdō adiyē nīvu - parabrahmaā tatvamu nīvē - brahmatatvamu).
iti yuktamutpaśyāmaḥ |
(brahma tatvamu reṃḍu vidhamulugā nunnadi: - paramārthasattā ayina parabrahma anirvacanīyamaina prapaṃcamani ārōpiṃcabaḍinadi. ī prapaṃcamunaku adhiṣṭānamu brahma reṃḍu vidhamula brahma tatvamē - iṭlu ceppabaḍucunnadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.