వటువు ముంజి త్రాడు మొదలగువాటిని ధరించి వేదము చదివి బ్రహ్మచర్యవ్రతమునందుండువాడు.
బ్రహ్మవిధ్యా యోగ్యః, బ్రహ్మచర్య వ్రత సంపన్నః.
(వేదము నభ్యసించుటకు యోగ్యుడు; తగినవాడు బ్రహ్మచర్యవ్రతములోనుండువాడు)
(“నేను ఎల్లపుడు అతనే (ఆ బ్రహ్మమే), అతనే ఆ బ్రహ్మమే నేను”: అని ఆ పరబ్రహ్మస్వరూపము తానే అని ఆ హంస మంత్రమును జపించుచు ఆ పరబ్రహ్మస్వరూపమును ధ్యానించుచు, బ్రహ్మధ్యానమందే మునిగియున్నవాడు - బ్రహ్మ నిష్టలో సిద్ధిని పొందుటకు కోరికగలవాడు, బ్రహ్మజ్ఞానము సంపాధించు ఆచారమందుండువాడు).
(బ్రహ్మచారి నాలుగు విధములు - గాయత్రీ బ్రహ్మచారీ ప్రజాపత్య బ్రహ్మచారి) వైదికబ్రహ్మచారీ, నైష్టిక బ్రహ్మచారి, వేదమును పూర్తిగా నేర్చుకొనువరకు బ్రహ్మచారిగానుండువాడు వైదిక బ్రహ్మచారి, ఋతుకాలమందు తన భార్యతో సంగమము చేయుచు పరస్త్రీ సంగమములేనివాడు ప్రాజాపత్య బ్రహ్మచారి.చనిపోవువఱకు గురువు సన్నిధిలోనే - గురుకులవాసములోనే నివసించువాడు నైష్టిక బ్రహ్మచారి - అనగా చనిపోవువరకు బ్రహ్మచారిగానే యుండుట అను నిష్ఠలో నుండువాడు).
vaṭuvu muṃji trāḍu modalaguvāṭini dhariṃci vēdamu cadivi brahmacaryavratamunaṃduṃḍuvāḍu.
brahmavidhyā yōgyaḥ, brahmacarya vrata saṃpannaḥ.
(vēdamu nabhyasiṃcuṭaku yōgyuḍu; taginavāḍu brahmacaryavratamulōnuṃḍuvāḍu)
(“nēnu ellapuḍu atanē (ā brahmamē), atanē ā brahmamē nēnu”: ani ā parabrahmasvarūpamu tānē ani ā haṃsa maṃtramunu japiṃcucu ā parabrahmasvarūpamunu dhyāniṃcucu, brahmadhyānamaṃdē munigiyunnavāḍu - brahma niṣṭalō siddhini poṃduṭaku kōrikagalavāḍu, brahmajñānamu saṃpādhiṃcu ācāramaṃduṃḍuvāḍu).
(brahmacāri nālugu vidhamulu - gāyatrī brahmacārī prajāpatya brahmacāri) vaidikabrahmacārī, naiṣṭika brahmacāri, vēdamunu pūrtigā nērcukonuvaraku brahmacārigānuṃḍuvāḍu vaidika brahmacāri, ṛtukālamaṃdu tana bhāryatō saṃgamamu cēyucu parastrī saṃgamamulēnivāḍu prājāpatya brahmacāri.canipōvuvaṟaku guruvu sannidhilōnē - gurukulavāsamulōnē nivasiṃcuvāḍu naiṣṭika brahmacāri - anagā canipōvuvaraku brahmacārigānē yuṃḍuṭa anu niṣṭhalō nuṃḍuvāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.